విశాలాంధ్ర , కళ్యాణదుర్గం.. స్వర్గీయ నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించి బీసీలకు పెద్దపీట వేశారని , రాయలసీమలో అధిక శాతం ఉన్న కురుబలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. భక్త కనకదాస 538వ జయంతి సందర్భంగా కళ్యాణదుర్గంలో శనివారం జరిగిన వేడుకల్లో పాల్గొన్న లోకేష్ కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ భైరవానితిప్ప ప్రాజెక్టును పూర్తిచేసేది టీడీపీనేనని, కురుబ పూజారులకు గౌరవ వేతనాలు అందజేస్తామని, కురుబల కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తామని తెలిపారు. టీడీపీ వల్లే బీసీలకు రాజకీయ స్వేచ్ఛా లభించిందన్నారు. ఆర్‌డీటీ లైసెన్సు పునరుద్ధరణను కేంద్రంతో మాట్లాడి సాధించామని, అనంతపురం జిల్లాకు తాము రుణపడి ఉన్నామని చెప్పారు. కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడం తనకు గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ మంత్రి సవిత, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీలు పార్థసారధి, బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు, గుమ్మనూరు జయరాం, దగ్గుబాటి ప్రసాద్, ఎంఎస్ రాజు, పల్లె సింధూర రెడ్డి, బండారు శ్రావణి, కురుబ కార్పోరేషన్ ఛైర్మన్ దేవేంద్ర, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ తోనే బీసీ లకు పెద్దపీట.. భక్త కనకదాస జయంతి సభలో నారా లోకేష్
- Advertisement -
RELATED ARTICLES


