విశాలాంధ్ర , కళ్యాణదుర్గం.. కళ్యాణదుర్గం పర్యటనకు వచ్చిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు ఏఐఎస్ఎఫ్ నేతలు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు హనుమంతరాయుడు, నియోజకవర్గ కోశాధికారి పవన్ కుమార్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయాలని, యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం జీవో నెం.77ను రద్దు చేయాలని, ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ పిపిపి విధానాన్ని ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించి మెస్, కాస్మోటిక్ ఛార్జీలను పెంచాలని కోరారు. విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు విజ్ఞప్తి చేశారు.
విద్యార్థుల సమస్యలపై నారా లోకేష్ కి ఏఐఎస్ఎఫ్ వినతి..
- Advertisement -
RELATED ARTICLES


