- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం;; విజయవాడలో డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ హస్తకళా కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన జనసేన పార్టీ నాయకులు అరిగెల భాస్కర్ విజయవాడకు వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మీ హయాంలో హస్తకళ అభివృద్ధికి చేరుకునేలా తగిన చర్యలు గైకొనాలని వారు విజ్ఞప్తి చేశారు.అనంతరం డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ హస్తకళా కార్పొరేషన్ అభివృద్ధికి అందరి సహాయ సహకారాలు సూచనలు తీసుకొని అభివృద్ధి బాటలో నడుస్తానని తెలిపారు.


