ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఇకపై ప్రతి శనివారం సెలవు ఉంటుందంటూ సోషల్ మీడియాలో ఓ గెజిట్ నోటిఫికేషన్ వైరల్ అవుతోంది.
అయితే ఈ పత్రం నకిలీదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం (DFS) ఇలాంటి ఎలాంటి నోటిఫికేషన్‌ను జారీ చేయలేదని తెలిపింది.
వైరల్ గెజిట్ నకిలీదే..
‘ఎక్స్’ వేదికగా పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఈ వైరల్ సమాచారంపై స్పందించింది. ఎస్‌బీఐతో పాటు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రతి శనివారం సెలవు ప్రకటించినట్లు పేర్కొంటున్న గెజిట్ నోటిఫికేషన్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే అందులోని సమాచారం వాస్తవం కాదని పీఐబీ వెల్లడించింది.
బ్యాంకులకు ప్రతి శనివారం సెలవా? వైరల్ గెజిట్‌పై కేంద్రం కీలక క్లారిటీ
- Advertisement -


