Homeజాతీయంఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది చలి తీవ్రత తక్కువే : వాతావరణశాఖ

ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది చలి తీవ్రత తక్కువే : వాతావరణశాఖ

- Advertisement -

ఎల్‌నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది శీతాకాలంలో చలి తీవ్రత సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
వర్షాకాలం ముగియడంతో అక్టోబర్‌ 1 నుంచి శీతాకాల సీజన్‌ ప్రారంభమైనట్లు పేర్కొంటూ.. తాజాగా శీతాకాల ఔట్‌లుక్‌ను విడుదల చేసింది.
అక్టోబర్‌లో దేశవ్యాప్తంగా గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయితో పోలిస్తే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.
దీంతో నెల ప్రారంభంలోనే చలి ప్రభావం పెద్దగా కనిపించకపోవచ్చని తెలిపింది.ఎల్‌నినో పరిస్థితుల ప్రభావం శీతాకాల వాతావరణంపై కూడా ఉంటుందని పేర్కొంది. అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు కొనసాగే సీజన్‌లో దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశముందని Iవీణ వెల్లడించింది.

ఈ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 18 శాతం వర్షపాతం లోటు
ముఖ్యంగా అక్టోబర్‌లో దేశవ్యాప్తంగా వర్షాలు సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉండొచ్చని తెలిపింది.తెలంగాణలోనూ వర్షపాతం లోటు కొనసాగుతున్నట్లు వాతావరణశాఖ పేర్కొంది.ఈ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 18 శాతం వర్షపాతం లోటు నమోదైనట్లు వెల్లడించింది.రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈ లోటు మరింత ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది.అత్యధిక వర్షపాతం లోటు నమోదైన జిల్లాల జాబితాలో నల్గొండ, నిర్మల్‌, జోగులాంబ గద్వాల, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి ఉన్నాయని Iవీణ పేర్కొంది.దీంతో రానున్న శీతాకాల సీజన్‌లో ఉష్ణోగ్రతలు, వర్షపాతం పరిస్థితుల్లో ప్రాంతాలవారీగా మార్పులు కనిపించే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు