Homeజాతీయంచివరి నిమిషంలో బ్యాంకుల సమ్మె వాయిదా.. యథావిధిగా కార్యకలాపాలు

చివరి నిమిషంలో బ్యాంకుల సమ్మె వాయిదా.. యథావిధిగా కార్యకలాపాలు

- Advertisement -

దేశవ్యాప్తంగా సోమవారం నుంచి మూడు రోజుల పాటు జరగాల్సిన బ్యాంకు ఉద్యోగుల సమ్మె చివరి నిమిషంలో వాయిదా పడింది. దీంతో వినియోగదారులకు పెద్ద ఊరట లభించింది. ఆదివారం రాత్రి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) జరిపిన చర్చలు సఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులన్నీ యథావిధిగా పనిచేస్తాయని యూనియన్ ప్రకటించింది.వారానికి ఐదు రోజుల పని దినాల డిమాండ్‌పై చర్చించేందుకు వెంటనే ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడానికి ఐబీఏ అంగీకరించింది. ప్రస్తుతం నెలకు రెండు, నాలుగో శనివారాలు మాత్రమే బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. కొత్త కమిటీ అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలించి, ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొంటుందని యూఎఫ్‌బీయూ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో పాటు ఇతర పెండింగ్ అంశాలపై కూడా చర్చలు జరపనున్నట్లు వెల్లడించింది.

అక్టోబర్ 2న ‘నో యూపీఐ డే‘
ఇదిలావుండగా, మొబైల్ రిటైలర్లు మరో నిరసనకు సిద్ధమవుతున్నారు. రూ.2,000కు మించిన మర్చంట్ యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఛార్జీ (ఎండీఆర్) విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ (ఏఐఎంఆర్‌ఏ) అక్టోబర్ 2న ‘నో యూపీఐ డే్ణకు పిలుపునిచ్చింది. ఆ రోజు మొబైల్ దుకాణాల్లో యూపీఐ చెల్లింపులు స్వీకరించకుండా క్యూఆర్ కోడ్‌లపై నల్ల వస్త్రం కప్పి నిరసన తెలుపుతామని పేర్కొంది.

ఈ కొత్త ఛార్జీల వల్ల చిన్న రిటైలర్లపై నెలకు రూ.2,000 నుంచి రూ.12,000 వరకు భారం పడుతుందని ఏఐఎంఆర్‌ఏ ఆరోపించింది. అయితే, ఈ నిరసనలో తాము పాలుపంచుకోవడం లేదని అఖిల భారత వర్తక సమాఖ్య (సీఏఐటీ) స్పష్టం చేసింది. బ్యాంకు సమ్మె వాయిదా సానుకూల పరిణామం కాగా, యూపీఐ ఛార్జీల వ్యవహారం వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు