విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : బీసీ వర్గాల హక్కుల సాధన లక్ష్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన “బీసీ గళం” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను బుధవారం ఉరవకొండలో ఆవిష్కరించారు. నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు కడుమలకుంట సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గోకుల పుల్లయ్య, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, ఈ నెల 26న అనంతపురంలోని లలిత కళా పరిషత్‌లో జరగనున్న “బీసీ గళం” సభను ప్రాంతీయంగా కీలక రాజకీయ వేదికగా అభివర్ణించారు. రాయలసీమ జిల్లాల నుంచి బీసీ వర్గాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నట్లు తెలిపారు.
సభ విజయవంతం కోసం మండలాల వారీగా ప్రచారం, అవగాహన సమావేశాలు, గ్రామస్థాయి చర్చలు ఇప్పటికే వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు. బీసీల సమస్యలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నాయకులు గ్రామాల వారీగా పర్యటనలు నిర్వహిస్తున్నారని వివరించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని ఆరోపిస్తూ, ఉద్యోగాలు, విద్య, ఆర్థికాభివృద్ధి, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాల్లో అన్యాయం జరుగుతోందని విమర్శించారు. ఈ నేపథ్యంలో బీసీ వర్గాల గళాన్ని బలంగా వినిపించి, హక్కుల సాధనకు ఒత్తిడి తీసుకురావడమే ఈ సభ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.
నియోజకవర్గం నుంచి భారీగా పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి బీసీ నాయకులు పాల్గొన్నారు.
‘బీసీ గళం’ సభ పోస్టర్ల ఆవిష్కరణ
- Advertisement -


