-ఏడీఏ జీఎం అల్తాఫ్ ఖాన్
విశాలాంధ్ర-రాప్తాడు : ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు సాగు చేసిన పంటలకు ఈ-పంట యాప్ లో నమోదు చేసుకుంటేనే ప్రభుత్వ పథకాల లబ్దిని పొందవచ్చని వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జీఎం అల్తాఫ్ ఖాన్ అన్నారు. గంగులకుంట గ్రామంలోని ఈ-పంట నమోదు చేసిన పంట పొలాలను ఆయన బుధవారం మండల వ్యవసాయ శాఖ అధికారి కృష్ణచైతన్య, వీహెచ్ఏ గిరి, రైతులతో కలిసి పరిశీలించారు. రబీ 2025-26 సీజన్ కి సంబంధించి పంటసాగు చేసిన ప్రతి రైతు కూడా పంట నమోదును ఈ నెల 20 చివరి తేదీలోపు చేసుకోవాలన్నారు. అని తెలిపారు. మండలంలోని ప్రతి రైతు కూడా రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య (ఏపీఎఫ్ఆర్) నమోదు సంబంధిత రైతు సేవా కేంద్రాల్లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం రైతుల కోసం ఏపీఏఐఎంఎస్ 2.0 అనే యాప్ లో వ్యవసాయానికి సంబంధించి అన్ని సూచనలు సలహాలు ఉంటాయని కావున రైతులందరూ ఈ యాప్ ను వినియోగించుకోవాలన్నారు. తెలిపారు.ఈ యాప్ లో ఉబెరైజేషన్ ద్వారా వ్యవసాయ పనిముట్లు, డ్రోన్ సర్వీస్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు.


