పి. 4 మార్గదర్శి బంగారు కుటుంబమును ప్రారంభించిన బిజెపి పట్టణ అధ్యక్షుడు జిల్లా చంద్రశేఖర్
విశాలాంధ్ర ధర్మవరం;; ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాన్ని పట్టణంలోని 39 వ వార్డు సచివాలయంలో బిజెపి పట్టణ అధ్యక్షులు జింక చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పి 4 అంటే అట్టడుగున ఉన్న 20 శాతం మందికి ప్రభుత్వం నుంచే కాకుండా ఎటువంటి మేలు జరుగుతుంది అన్న విషయాన్ని తెలియజేయడమే మా లక్ష్యము అని వారు తెలిపారు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారులకు చేకూరే విధంగా అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల కోసం పీపుల్స్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ భాగస్వామ్యంగా తొలి దశలో 20 లక్షల మందికి రబ్ధి చేకూర్చే విధంగా ప్రణాళికను రూపొందించడం జరిగిందన్నారు. అదేవిధంగా ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదిగిన వారు కింది స్థాయిలో ఉన్న కుటుంబాలను దత్తత తీసుకొని విధంగా రూపొందించి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగిందన్నారు. సహాయం చేసే వారిని మార్గదర్శక లబ్ధి పొందే వారిని బంగారు కుటుంబంగా వ్యవహరించడం జరుగుతుందన్నారు. అందుకే ఇద్దరి మధ్య ప్రభుత్వం సంధానకర్తగా ఉంటుందని తెలిపారు. మన ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని చూపించడం జరిగిందన్నారు.దారిద్య రేఖ దిగువ ఉన్నవారికి ఎలాగైతే ధనికులు సహాయపడాలో అన్న వాటిని వారి వివరించారు. ఇందులో భాగంగా 39 వ వార్డులో చేనేత కుటుంబానికి చెందిన కీర్తిశేషులు గణేష్ భార్య లక్ష్మి కుమారుడు మంజునాథ్ వారి కుటుంబాన్ని బిజెపి పట్టణ అధ్యక్షుడు జింక చంద్రశేఖర్ దత్తత తీసుకొని కుటుంబానికి లక్ష్మీ నరసింహ సిల్క్ సారీస్ బండారు నాగరాజు పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని, బిజెపి నాయకులు గిర్రాజు నగేష్ వంట సరుకులను ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది దాతలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు విశ్వనాథ్, బాలు, దామోదర్, రామకృష్ణ, భాస్కర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పి 4తో పేదలకు మేలు
- Advertisement -
RELATED ARTICLES


