Homeజిల్లాలుశ్రీ సత్యసాయివ్యవసాయ రంగానికి చేసిన సేవలు అనన్యమైనవి..

వ్యవసాయ రంగానికి చేసిన సేవలు అనన్యమైనవి..

- Advertisement -

వ్యవసాయ శాఖ అధికారులు
విశాలాంధ్ర ధర్మవరం;; వ్యవసాయ రంగంలో రైతులకు చేసిన సేవలు బదిలీ అయిన సమయంలో తీపి గుర్తులుగా మారుతాయని వ్యవసాయ సంచాలకులు లక్ష్మణ్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్జీవో హోమ్ లో హిందూపురానికి బదిలీపై వెళ్లిన ఏడిఏ కృష్ణయ్యను, ధర్మవరం డివిజన్ నుండి బదిలీపై వెళ్లిన వ్యవసాయ అధికారులు కృష్ణకుమారి రమాదేవి ఉదయ్ కుమార్ లను స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు సిబ్బంది ఘనంగా సన్మానించారు. కృష్ణయ్య వ్యవసాయ రంగానికి చేసిన సేవలను వారు కొనియాడారు. వారి సేవలు స్ఫూర్తిదాయకమని తెలిపారు. ధర్మవరం వ్యవసాయ డివిజన్ ఎరువు పురుగుల మందుల డీలర్లు తమ వందనాలలో పనిచేసిన వ్యవసాయ శాఖ అధికారులతో తమ అనుబంధాన్ని పంచుకొని కొత్త ప్రదేశంలో మంచి జరగాలని వారు శుభాకాంక్షలు తెలియజేశారు. సహాయ వ్యవసాయ సంచాలకులు లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ కృష్ణయ్య సారు వ్యవసాయ రంగంలో ఎనలేని కృషి చేసి రైతుల వద్ద మంచి గుర్తింపు పొందడం నిజంగా అదృష్టం అన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం డివిజన్ వ్యవసాయ అధికారులు ,ఏవోలు, విహెచ్ఎలు, వి ఎస్ ఏ లు, వి ఏ ఏ లు, ఎంపీఈవోలు, డివిజన్ కార్యాలయ సిబ్బంది, ఎరువు దుకాణ డీలర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు