-తహశీల్దార్ పి.విజయకుమారి
విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : లబ్ధిదారులకు మెరుగైన అందించేందుకు కూటమి ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపడుతోందని తహశీల్దార్ పి.విజయకుమారి అన్నారు. లబ్ధిదారులకు
ప్రభుత్వం చౌక ధరల దుకాణాల్లో బియ్యం, చక్కెర, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం పేదలకు స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేస్తోందన్నారు. ఈసందర్భంగా సోమవారం సీఎస్డీటీ జ్యోతి రాప్తాడు రేషన్ డీలర్ వరికూటి రవి, అలివేలమ్మ దుకాణంలో సర్పంచ్ సాకే తిరుపాలుతో కలిసి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. రేషన్ సరఫరాలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు, ప్రజలకు మరింత సౌకర్యవంతంగా రేషన్ సరుకులు అందించేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం పాత బియ్యం కార్డుల స్థానంలో ఈ స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేసిందన్నారు. సర్పంచ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఎండియు వ్యవస్థను రద్దు చేసి, చౌక ధరల దుకాణాల్లో సరుకులు తీసుకునే విధానాన్ని తిరిగి ప్రారంభించిందన్నారు. డీలర్ నరేంద్ర, ఫీల్డ్ అసిస్టెంట్ తలారి శివ తదితరులు ఉన్నారు.


