Homeఆంధ్రప్రదేశ్తెలుగు రాష్ట్రాలకు రైల్వే బిగ్‌ గుడ్‌న్యూస్‌.. ఏడు కొత్త అమృత్‌ భారత్‌ రైళ్లు

తెలుగు రాష్ట్రాలకు రైల్వే బిగ్‌ గుడ్‌న్యూస్‌.. ఏడు కొత్త అమృత్‌ భారత్‌ రైళ్లు

- Advertisement -


రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది.దేశవ్యాప్తంగా రైలు కనెక్టివిటీని మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ఏడు కొత్త అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది.సుదూర ప్రయాణికులకు తక్కువ ఛార్జీలతో మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే ఈ రైళ్ల ప్రధాన ఉద్దేశం.ఉత్తర, మధ్య, పశ్చిమ, దక్షిణ భారతదేశంలోని పలు కీలక నగరాలను కొత్త రైళ్లు అనుసంధానించనున్నాయి. వీటిలో తెలంగాణ మీదుగా నడిచే సర్వీసులు కూడా ఉన్నాయి.

ధన్‌బాద్‌-కోయంబత్తూరు అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్
22363/22364 రైలు నంబర్లతో ప్రతిపాదించిన ఈ సర్వీస్‌ జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ను తమిళనాడులోని కోయంబత్తూరుతో కలపనుంది.

    ప్రధాన స్టేషన్లు

    ధన్‌బాద్‌, గోమో, పరస్నాథ్‌, హజారీబాగ్‌ రోడ్‌, కోడెర్మా, గయా, అనుగ్రహ నారాయణ్‌ రోడ్‌, డెహ్రీ ఆన్‌ సోన్‌, ససారం, భభువా రోడ్‌, పండిట్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ్‌ జంక్షన్‌, మిర్జాపూర్‌, ప్రయాగ్‌రాజ్‌ ఛెవ్కీ, కట్నీ, జబల్‌పూర్‌, నర్సింగ్‌పూర్‌, ఇటార్సీ, నాగ్‌పూర్‌, చంద్రపూర్‌, బల్హార్షా. తెలంగాణలో సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం మీదుగా ఈ రైలు ప్రయాణించే అవకాశం ఉంది.అనంతరం విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుత్తణి, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్‌, తిరుప్పూర్‌ మీదుగా కోయంబత్తూరు చేరుతుంది.

    ప్రయాగ్‌రాజ్‌-లోకమాన్య తిలక్‌ టెర్మినస్‌ అమృత్‌ భారత్
    20436/20435 నంబర్లతో ప్రతిపాదించిన ఈ రైలు వారానికి ఒకసారి నడిచే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ను మహారాష్ట్రలోని ముంబైతో అనుసంధానించనుంది.ప్రధాన స్టేషన్లు: ప్రయాగ్‌రాజ్‌, సత్నా, జబల్‌పూర్‌, ఇటార్సీ, భుసావల్‌, కల్యాణ్‌ తదితర ప్రాంతాలు.

      ప్రయాగ్‌రాజ్‌-ఉధ్నా అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్
      20437/20438 నంబర్లతో ప్రతిపాదించిన ఈ వారపు సర్వీస్‌ ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాలను కలుపుతుంది.

        ప్రధాన స్టేషన్లు

        ప్రయాగ్‌రాజ్‌, ఫతేపూర్‌, గోవింద్‌పురి, ఇటావా, టుండ్లా, ఆగ్రా ఇద్‌గాహ్‌, బయానా, హిండౌన్‌ సిటీ, గంగాపూర్‌ సిటీ, సవాయి మాధోపూర్‌, కోటా, రామ్‌గంజ్‌ మండి, భవానీ మండి, రత్లాం, వడోదర, ఉధ్నా.

        సుబేదార్‌గంజ్‌-లోకమాన్య తిలక్‌ టెర్మినస్
        14121/14122 రైలు నంబర్లతో ప్రతిపాదించిన ఈ సర్వీస్‌కు కూడా రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఇది వారానికి ఒకసారి నడిచే అవకాశం ఉంది.

          ప్రయాగ్‌రాజ్‌ ప్రాంతాన్ని ముంబైతో అనుసంధానించే ఈ రైలు సుబేదార్‌గంజ్‌, ఫతేపూర్‌, గోవింద్‌పురి, బాందా, చిత్రకూట్‌ధామ్‌ కర్వీ, సత్నా, మైహర్‌, కట్నీ, జబల్‌పూర్‌, ఇటార్సీ, ఖాండ్వా, భుసావల్‌, నాసిక్‌ రోడ్‌, కల్యాణ్‌, థానే మీదుగా లోకమాన్య తిలక్‌ టెర్మినస్‌కు చేరుతుంది.

          గోరఖ్‌పూర్‌-ఢిల్లీ అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్
          తూర్పు ఉత్తరప్రదేశ్‌ నుంచి ఢిల్లీకి రైలు ప్రయాణాన్ని సులభతరం చేసేలా 15095/15096 నంబర్లతో గోరఖ్‌పూర్‌-ఢిల్లీ అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఆమోదం లభించింది.

            ఈ సర్వీస్‌ వారానికి ఒకసారి నడిచే అవకాశం ఉంది. ప్రధాన స్టేషన్లు: గోరఖ్‌పూర్‌, ఖలీలాబాద్‌, బస్తీ, గోండా, బుర్హ్వాల్‌, సీతాపూర్‌, బరేలీ, మొరాదాబాద్‌, ఘాజియాబాద్‌, ఢిల్లీ.

            1. గోరఖ్‌పూర్‌-బాంద్రా టెర్మినస్‌ అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్
              15085/15086 రైలు నంబర్లతో మరో వారపు అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు కూడా రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది.
            2. తూర్పు ఉత్తరప్రదేశ్‌ను ముంబైతో అనుసంధానించే ఈ రైలు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ మీదుగా ప్రయాణిస్తుంది.

            ప్రధాన స్టేషన్లు

            గోరఖ్‌పూర్‌, ఖలీలాబాద్‌, బస్తీ, గోండా, బాద్షాహ్‌నగర్‌, ఐష్‌బాగ్‌, కాన్పూర్‌ సెంట్రల్‌, టుండ్లా, ఆగ్రా ఫోర్ట్‌, బయానా, గంగాపూర్‌ సిటీ, కోటా, భవానీ మండి, షామ్‌గఢ్‌, రత్లాం, వడోదర, సూరత్‌, వల్సాద్‌, వాపి, పాల్ఘర్‌, బోరివలి, బాంద్రా టెర్మినస్‌.

            చర్లపల్లి-గోరఖ్‌పూర్‌ అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్
            తెలంగాణ ప్రయాణికులకు ఈ రైలు ప్రత్యేకంగా ఉపయోగపడనుంది.

              22075/22076 నంబర్లతో ప్రతిపాదించిన చర్లపల్లి-గోరఖ్‌పూర్‌ అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలను అనుసంధానించనుంది.

              తెలంగాణలో ప్రధాన స్టేషన్లు

              ఈ రైలు చర్లపల్లి, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల మీదుగా ప్రయాణించేలా ప్రతిపాదించారు.

              ఆ తర్వాత బల్హార్షా, చంద్రపూర్‌, నాగ్‌పూర్‌, బేతుల్‌, ఇటార్సీ, భోపాల్‌, బీనా, ఝాన్సీ, ఓరై, కాన్పూర్‌ సెంట్రల్‌, ఐష్‌బాగ్‌, లక్నో సిటీ, గోమతీనగర్‌, బారాబంకి, గోండా మీదుగా గోరఖ్‌పూర్‌ చేరుతుంది.

              అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రత్యేకతలు ఏంటి?
              సుదూర ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, ఆధునిక ఫీచర్లు, అందుబాటు ధరల్లో ప్రయాణ సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రవేశపెట్టారు.తాజాగా ప్రతిపాదించిన ఏడు రైళ్లు అందుబాటులోకి వస్తే దేశంలోని పలు ప్రాంతాల మధ్య రైలు కనెక్టివిటీ మరింత మెరుగుపడే అవకాశం ఉంది.ముఖ్యంగా తెలంగాణ నుంచి ఉత్తర, దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాలకు ప్రయాణించే వారికి చర్లపల్లి-గోరఖ్‌పూర్‌, ధన్‌బాద్‌-కోయంబత్తూరు మార్గాలు మరింత ఉపయోగకరంగా మారనున్నాయి.

              RELATED ARTICLES
              - Advertisment -spot_img
              -Advertisement-

              తాజా వార్తలు