Tuesday, January 7, 2025
Home Blog Page 101

ప్రజా సమస్యల పరిష్కారానికై చోడవరంలో ప్రజా పోరు క్యాంపియన్ …

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా ) : ప్రజా సమస్యలు పరిష్కారానికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం అనకాపల్లి జిల్లా చోడవరంలో క్యాంపెయిన్ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ చార్జీలు ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో 20 వేలు కోట్ల రూపాయలు భారాన్ని ప్రజల పైన వేయడాన్ని సిపిఎం మండల నాయకులు ఎస్ వి నాయుడు ఖండిస్తున్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ట్రూ ఆఫ్ చార్జీలు పద్ధతిని స్టార్ మీటర్లు బిగించే ప్రయత్నాలు రద్దు చేయాలని డిమాండ్ చేసారు. వ్యవసాయ మోటార్లకు స్టార్ మీటర్లు బిగించడాన్ని, నిత్యవసర ధరలు తగ్గించాలని, విశాఖ ఉక్కు ప్రైవేటుకరణకు వ్యతిరేకిస్తూ …, రోజురోజుకు కాయగూరలు నిత్యవసర వస్తువులు వంట నూనెల ధరల పెంచడం వలన ప్రజలు ఏ వస్తువులు కొనలేకపోతున్నారన్నారు. కూటమి ప్రభుత్వ0 అధికార0 లోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, మెగా డీఎస్సీ, గ్రూప్1, గ్రూప్2 కోసం యువత ఎదురుచూస్తున్నారు. కానీ ప్రభుత్వం అధికార0 లోకి వచ్చిన తర్వాత ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమైంది అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ధరలు నిరుద్యోగం మహిళలు పిల్లలు దళితులపై అత్యాచారాలు జమిలి ఎన్నికలు విశాఖ ఉక్కు ప్రైవేటుకరణ వ్యతిరేకంగా నవంబర్8 నుంచి 14 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పోరు పేరుతో ఇంటింటా ప్రచార కార్యక్రమం చోరవరం మండలంలో వెంకన్నపాలెం దుడ్డుపాలెం నరసయ్య పేట కోట వీధి శివాలయం వీధి కరపత్రాలు ఇచ్చి ప్రచారం చేయడం జరిగింది . ఈ సమస్యలన్నీ పరిష్కారం కోసం నవంబర్ 14వ తేదీన చోడవరం ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ధర్నాను జయప్రదం చేయవలసిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసారు.

ఆధ్యాత్మికతతోనే మనశ్శాంతి లభిస్తుంది.. పిరమిడ్ నిర్వాహకులు

విశాలాంధ్ర ధర్మవరం : ఆధ్యాత్మిక తోనే మనశ్శాంతి లభిస్తుందని పిరమిడ్ ఆధ్యాత్మిక జ్ఞాన మందిరం సొసైటీ వారు తెలిపారు. ఈ సందర్భంగా గురువు సుభాష్ పత్రీజీ జన్మదినం సందర్భంగా వారు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణములోని ఆరు పిరమిడ్ కేంద్రాలలో గల వెయ్యి మంది ధ్యానులు పట్టణంలోని పలు కూడలిలో శాఖాహార ర్యాలీని నిర్వహించారు. అనంతరం సొసైటీ వారు మాట్లాడుతూ సుభాష్ పత్రీజీ వేణి 1947లో జన్మించారని, 30 సంవత్సరాలు ధ్యాన ప్రచారం చేసి లక్షల మందికి ధ్యాన రూపంలో ముక్తిని కలిగించారని తెలిపారు. భారతదేశంలో పాటు దాదాపు 40 దేశాలలో గ్రామ, గ్రామాన వీరి పిరమిడ్ కేంద్రాలు కలవని తెలిపారు. గురువు సుభాష్ పత్రీజీ యొక్క సందేశాలు ఎంతో భక్తి భావనతో కూడుకున్నవని, వయసుతో నిమిత్తం లేకుండా నేడు పిరమిడ్ కేంద్రాలలో తమ భక్తిని చాటుకుంటున్నారని తెలిపారు. అనంతరం 1500 మందికి భోజన పంపిణీ నిర్వహించారు. ఈ వేడుకల్లో వెయ్యి మంది ధ్యానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

దాడులు నిర్వహించిన ఎక్సైజ్ పోలీసులు

విశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి, తాడిమర్రి మండలాలలో ఆకస్మికంగా దాడులు నిర్వహించడం జరిగిందని ఎక్సైజ్ సీఐ చంద్రమణి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రం మద్యం, బెల్ట్ షాపులు, నాటు సారాయి విక్రయించరాదని తెలిపారు. బత్తలపల్లి మండలం, తాడిమర్రి మండలాలలోని జిల్లా కొండయ్య పల్లెలో ఒక ముద్దాయిని అరెస్టు చేయడం జరిగిందని అతని వద్ద 20 ఆంధ్రా బాటిల్స్ ను, అదేవిధంగా రామాపురం బస్టాప్ వద్ద ఒక ముద్దాయిని అరెస్టు చేసి వారి వద్ద నుండి రెండు లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. అనంతరం వారి ఇరువురి మీద కేసు నమోదు చేసి రిమాండ్కు పంపడం జరిగిందని తెలిపారు. ఈసారి దాడులలో ఎస్సై నాగరాజు, చాంద్ బాషా, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు

ఆలయ ఈవో వెంకటేశులు
విశాలాంధ్ర ధర్మవరంబీబీ పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ఈనెల 15వ తేదీ శుక్రవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో వెంకటేశులు, అన్నమయ్య సేవామండలి కమిటీ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సేవాకర్తలుగా కీర్తిశేషులు రామయ్య భార్య లక్ష్మమ్మ వారి కుటుంబ సభ్యులు, వసుధాంజలి, గుండాల చంద్రశేఖర్, కుమారులు హర్షవర్ధన్, సాయి, దీప్తి సాయిలు వ్యవహరిస్తారని తెలిపారు. అదేవిధంగా ఇదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమం సేవాదాతలుగా రామకృష్ణమ్మ, శ్రీరామిరెడ్డి ,లక్ష్మీదేవి, గంగిరెడ్డి, కుమారులు హేమకుమార్ రెడ్డి, శ్యామల, కరుణాకర్ రెడ్డి ,సవిత, హరీష్ రెడ్డి, హనీష్ రెడ్డి, గ్రీష్మారెడ్డి లతోపాటు ఆలయ భక్తాదుల సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున భక్తాదులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కళ్యాణ మహోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని వారు తెలిపారు.

నూతన ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు

విశాలాంధ్ర, ఉరవకొండ ( అనంతపురం జిల్లా) : ఉరవకొండ ఎస్సైగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన జనార్ధన్ నాయుడును బుధవారం టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షులు వరప్రసాద్, అంబేద్కర్ నగర్ యూత్ నాయకులు రవివర్మ, ఓబులేసు, లక్ష్మీనారాయణ,వడ్డే గోవిందు స్థానిక పోలీస్ స్టేషన్లో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉరవకొండ మండలంలో శాంతి భద్రతలను పరిరక్షించాలని కోరారు.

రాష్ట్ర బడ్జెట్ లో చేసిన కేటాయింపులు అంకెల గారడీ

చేతి వృత్తి దారుల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామాంజనేయులు

విశాలాంధ్ర అనంతపురం : బి సి, ఎస్ సి, ఎస్ టి, మైనార్టీ సంక్షేమం పేరుతో రాష్ట్ర బడ్జెట్ లో చేసిన కేటాయిపులు అంకెల గారడీ మాత్రమేనని చేతి వృత్తి దారుల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామాంజనేయులు పేర్కొన్నారు. స్థానిక నీలం రాజశేఖర్ రెడ్డి భవన్ లో బుధవారం చేతి వృత్తి దారుల సమాఖ్య ఎపి రాష్ట్ర అధ్యక్షులు జింకా చలపతి, రాష్ట్ర కార్యనిర్వాహాక అధ్యక్షులు సి. లింగమయ్య, గొర్రెల మేకల పెంపకం దార్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట్ల పోతులయ్య లతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామాంజనేయులు మాట్లాడుతూ…. రాష్ట్ర ప్రభుత్వం తరుపున ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2,94,000లక్షల కోట్ల అంచనా తో 2,41,000లక్షల అంచనా వ్యయం తో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో బి సి లకు 39,007కోట్లు, ఎస్ సి లకు 18,497కోట్లు, ఎస్ టి లకు 7,557కోట్లు, మైనార్టీ లకు 4, 376కోట్లు మొత్తం: 69,437కోట్లు బడ్జెట్ లో 3.47%మాత్రమే రాష్ట్ర జనాభా లో 30% వున్న ఈ సామాజిక వర్గాల సంక్షేమము కోసం దేనికి కేటాయిస్తున్నట్లు స్పష్టంగా తెలియజేయలేదు అన్నారు. .జనాభా ప్రాతిపదిక పై వృత్తి దారులకు ఏవిధంగా ఖర్చు చేస్తారో కూడా పొందపరచలేదన్నారు. మా ప్రభుత్వం వెనుక బడిన, దళిత, గిరిజన, మైనార్టీ లకు పెద్ద పీఠ వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న వాగ్దానాలకు, ఆచరణకు ఎంతో తేడా ఉంది అన్నారు. ఈ సామాజిక వర్గ చేతి వృత్తి దారులను అంకెలతో మభ్య పెట్టి మోసగించడం తప్ప మరొకటి కాదని విమర్శించారు. ఈ సమావేశం లో చేతి వృత్తి దారుల సమాఖ్య అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి సివి హరికృష్ణ, రజక సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షులు సి. నాగప్ప, నగర నాయకులు గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా)

ఉరవకొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏపీఎస్ఎస్ డిసి ఆధ్వర్యంలో బుధవారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్  అశ్రఫ్ అలీ, మాట్లాడుతూ  జాబ్ మేళా కార్యక్రమంలో  టాటా క్యాపిటల్, నవభారత్ ఫర్టిలైజర్స్, యంగ్ ఇండియా, క్రెడిట్ ఆక్సస్, ఎల్ ఐఎఫ్ఎల్ కంపెనీలు పాల్గొన్నట్లు తెలిపారు. ఇంటర్, ఐటిఐ పీజీ చదువుకున్న 45 మంది విద్యార్థులు ఇంటర్వ్యూలకు హాజరు కాగా 29 మందిని ఉద్యోగ అవకాశాలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, సీడప్ చైర్మన్ దీపక్ రెడ్డి ఆదేశాలు మేరకు ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల త్రిబుల్ ఈ శాఖాధిపతి సురేష్ బాబు, ఆలీ యాప్ హుస్సేన్, ఏపీఎస్ఎస్ డిసి కోఆర్డినేటర్ జయలక్ష్మి,అనిల్ తదితరులు పాల్గొన్నారు.

చలిసింగం రహదారికి కృషి ….

– రాజధాని అమరావతిలో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కలసిన జనసేన పార్టీ చోడవరం నియోజకవర్గం ఇంచార్జి పివిఎస్ఎన్ రాజు
చోడవరం నియోజక వర్గంలోని చలిసింగం గిరిజన గ్రామానికి తక్షణమే రోడ్డు ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందుచేత.
సానుకూలం గా స్పందించిన పవన్ కళ్యాణ్
విశాలాంధ్ర – చోడవరం అనకాపల్లి జిల్లా : రాజధాని అమరావతిలో అసెంబ్లీ వద్ద ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ను జనసేన పార్టీ చోడవరం నియోజకవర్గం ఇంచార్జి పివిఎస్ఎన్ రాజు బుధవారం కలిశారు. చోడవరం నియోజకవర్గంలోని రావికమతం మండలంలో కొండపైన ఉన్న గిరిజన గ్రామమైన చలిసింగంకు తక్షణమే రోడ్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, దశాబ్దాలుగా ఆపరిష్కృతం గా ఉండి , ప్రతీ ఎన్నికల్లోనూ రాజకీయ నాయకులు ఇస్తున్న నెరవేరని హామీగానే ఉండిపోతున్న ఈ సమస్య గూర్చి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ వారికి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా పలు విషయాలను వారి దృష్టికి తీసుకు వచ్చారు. చలిసింగం గ్రామం నందు సుమారు 450 మంది నివాసితులు ఉన్నారని , సరైన రహదారి లేకపోవడం వలన వినాశకరమైన పరిణామాలు తరచూ సంభవిస్తున్నాయని , ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, వృద్ధులు మరియు పిల్లలు వైద్య చికిత్స పొందడంలో జాప్యం కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని ,గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉన్నప్పటికీ సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఉపాధ్యాయులు సక్రమంగా హాజరుకాకపోవడంతో విద్యాపరంగా వీరికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది అని తెలియచేసారు.
చాలా అత్య అవసరమైన ఈ రహదారిని ఏర్పాటు చేయడానికి, పంచాయతీ రాజ్ శాఖ నుండి ఆర్థిక మంజూరుతో పాటు అటవీ శాఖ నుండి అనుమతులు అవసరం కావున వాటి మంజూరు కొరకు అభ్యర్దించుట జరిగింది.
ఈ విషయంలో చలిసింగం గిరిజన ప్రజానీకం పవన్ కళ్యాణ్ పై ఎంతో నమ్మకం పెట్టుకొని ఉంది అని వారికి తెలియచేయడం జరిగింది. ఈ సమస్యపై సానుకూలంగా స్పందించిన పవన్ కళ్యాణ్ రహదారి నిర్మాణం కోసం అవసరమయిన చర్యలు తప్పక తీసుకొంటామని తెలియచేసారు.

మందకృష్ణ మాదిగ ఆత్మీయ సభను విజయవంతం చేయండి

మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు యల్లప్ప గారి గంగాధర్
విశాలాంధ్ర అనంతపురం: ఈ నెల( నవంబర్ )16 వ తేదీన అనంతపురం పట్టణంలో
లలిత కళ పరిషత్ నందు మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ ఉమ్మడి జిల్లాల మాదిగ ల ఆత్మీయ సదస్సును జయప్రదం చేయాలని మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు యల్లప్ప గారి గంగాధర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎస్సీ లలో ఉన్న59 కులాలకు సమన్యాయం జరగాలని గత 30 సంవత్సరాలుగా అనేక రకాల ఉద్యమాల ద్వారా నిబద్ధత ,నిజాయితీతో శ్రీ మంద కృష్ణ మాదిగ పోరాటం చేయడం వల్ల ఇటీవల ఆగస్టు ఒకటో తేదీన భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు అక్కడి పరిస్థితులు డిమాండ్ ను బట్టి సామాజిక న్యాయం దృక్పథంతో ఎస్సీ వర్గీకరణను అమలు చేసుకోవచ్చని తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు. తీర్పు వచ్చిన సందర్భంగా మొదటిసారిగా మాన్య మందకృష్ణ మాదిగ అనంతపురం ఉమ్మడి జిల్లా పర్యటనకు వస్తున్నారన్నారు. ఆత్మీయ సమ్మేళన సదస్సుకు తరలివచ్చి మాదిగల ఐకమత్యాన్ని , చైతన్యాన్ని సమాజానికి చాటాలని కోరారు.

రూ 30 లక్షలు డ్వాక్రా మహిళల సొమ్ము స్వాహా….

   - వెలుగు సిబ్బంది, గోవాడ బ్యాంకు అధికారులు కుమ్మక్కై స్వాహా చేశారని  ఆరోపణలు ... 

    -  చోడవరం పోలీసులకు ఫిర్యాదు 

విశాలాంద్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా ) : తే. 13.11.2024 ది. మండలములోని సింహాద్రిపురం, సబ్బవరపు వారి కల్లాలు, తదితర గ్రామాల్లో డ్వాక్రా మహిళా సభ్యులను మోసగించి వెలుగు వి ఓ ఏ వరలక్ష్మి , సీసీ తాతబాబు బ్యాంక్ అధికారుల సహాయంతో సుమారు రూ 30 లక్షలు వరకు స్వాహా చేశారు. డ్వాక్రా సిఎ, సీసీ గోవాడ బ్యాంకు అధికారుల సహకారంతో స్వాహా చేశారని పలు డ్వాక్రా సంఘాల సభ్యులు చోడవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని సంఘాలు రుణాలు పక్క దారి, మరి కొందరు సభ్యులకు తెలియకుండానే రుణాలు తో లక్షలాది రూపాయలు స్వాహా చేశారు. విచారణ చేపట్టి దోషులపై చర్యలు తీసుకోవాలని లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని ఆ డ్వాక్రా సంఘాల నాయకులు హెచ్చరించారు. భార్య డబ్బులు భర్తకు కూడా ఇవ్వని బ్యాంకు సిబ్బంది డ్వాక్రా మహిళల సొమ్ము వారు లేకుండా ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఆ డ్వాక్రా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. విచారణ చేపడుతున్న అనకాపల్లి డివో, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.