వారం రోజులపాటు కురుస్తాయన్న వాతావరణశాఖ
పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ
తమిళనాడు రాజధాని చెన్నై సహా పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. కుండపోత వానల కారణంగా మయిలదుథురై, కరైకల్, పుదుచ్చేరిలలో స్కూళ్లు, విద్యాసంస్థలు మూతపడగా, కడలూర్, అయిలూర్, పెరంబలూర్ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో తీరప్రాంతాలైన చెన్నై, చెంగల్పట్టు, తిరువల్లూరు, కాంచీపురం, రాణిపేట్, కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, టెంకాశి, రామనాథపురం, విరుధునగర్, మదురై జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని 15కు పైగా జిల్లాల్లో ఈ వారమంతా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. వచ్చే రెండు రోజుల్లో చెన్నైలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది.
అల్పపీడన ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు.. విద్యా సంస్థలకు సెలవు
ఎలాన్ మస్క్‌కు కీలక పదవి ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్
ఇటీవలే ముగిసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపు కోసం అన్ని విధాలా కృషి చేసిన ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు కీలక పదవి ఖాయమైంది. అమెరికా ాడిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీః విభాగానికి ఎలాన్ మస్క్ నాయకత్వం వహిస్తారని అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వివేక్ రామస్వామితో కలిసి ఎలాన్ మస్క్ ఈ విభాగం బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు. అద్భుతమైన ఈ ఇద్దరు అమెరికన్లు కలిసి మా ప్రభుత్వంలో బ్యూరోక్రసీకి మార్గం చూపుతారు. ాసేవ్ అమెరికా్ణ ఉద్యమానికి ముఖ్యమైన ఉద్యోగులపై అదనపు నిబంధనల భారం సడలింపు, వృథా వ్యయాల తగ్గింపు, ఫెడరల్ ఏజెన్సీల పునర్నిర్మాణం వంటి మార్పులు చేపడతారు్ణ్ణ అని ట్రంప్ వెల్లడించారు. కాగా గతవారం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారీస్‌పై రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేసిన డొనాల్డ్ ట్రంప్ ఘనవిజయం సాధించారు. ట్రంప్ కోసం మస్క్ చాలా కష్టపడ్డారు. భారీగా విరాళాలు అందించడమే కాకుండా ట్రంప్‌తో కలిసి ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు.
ఫలితాలు వెలువడిన తర్వాత ావిక్టరీ స్పీచ్్ణలో ఎలాన్ మస్క్‌పై ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. అద్భుతమైన వ్యక్తి, మేధావి అని అభివర్ణించారు. ాామనకో కొత్త నక్షత్రం ఉంది. ఆ నక్షత్రమే ఎలాన్ మస్క్్ణ్ణ అని అన్నారు. రెండు వారాలపాటు విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారని గుర్తుచేశారు. తనతో కలిసి ఆయన ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియాలో ప్రచారం నిర్వహించారని గుర్తుచేశారు.
ఆర్‌జీవీకి నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్‌కు ఒంగోలు పోలీసులు
వ్యక్తిగతంగా ఆ నోటీసులు ఆర్‌జీవికి ఇచ్చేందుకు హైదరాబాద్‌కు ఒంగోలు పోలీసులు
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చేందుకు ఒంగోలు పోలీసులు మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు బయల్దేరారు. ఎస్ఐ శివరామయ్య ఆధ్వర్యంలోని బృందం ఇవాళ ఆయనకు నోటీసులు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ఒంగోలు గ్రామీణ సీఐ ఎన్. శ్రీకాంత్ ధ్రువీకరించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్స్ సమయంలో ఆర్‌జీవీ.. అప్పటి ప్రతి పక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు జనసేనాని పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా విచారణకు హాజరు కావాలని ఆయనకు నోటీసులు రెడీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఒంగోలు పోలీసులు వ్యక్తిగతంగా ఆర్‌జీవీకి నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్ రావడం జరుగుతోంది.
అమెరికా అధ్యక్షుడు బైడెన్ కంటతడి..
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కంటతడి పెట్టాడు. సైన్యంలో సేవలందిస్తూ అమరులైన సోల్జర్లను తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంగళవారం వెటరన్స్ డే సర్వీస్ కార్యక్రమంలో ప్రెసిడెంట్ బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ పాల్గొన్నారు. అమరుల సేవలను గుర్తు చేసుకుంటూ ాగాడ్ బ్లెస్ అమెరికా పాట ఆలపిస్తూ బైడెన్ కంటతడి పెట్టడం, ఆ తర్వాత కన్నీళ్లను తుడుచుకోవడం వీడియోలో కనిపించింది. అనంతరం బైడెన్ మాట్లాడుతూ.. కమాండర్ ఇన్ చీఫ్ గా తాను ఇక్కడ నిలబడడం ఇదే చివరిసారని అన్నారు. జీవితంలో తనకు దక్కిన గొప్ప గౌరవం ఇదేనని చెప్పారు. తన కుమారుడు బ్యూ బైడెన్ కూడా ఇరాక్ లో ఏడాది పాటు పనిచేశాడని చెప్పారు. కాగా, బైడెన్ కుమారుడు బ్యూ బైడెన్ 2015 లో గ్లియోబ్లాస్టోమా వ్యాధి కారణంగా చనిపోయాడు.
బ్యాంకు మరింత అభివృద్ధి చెందాలి
అనంత ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ
విశాలాంధ్ర -అనంతపురం : ది గుత్తి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మరింత అభివృద్ధి చెందాలని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. సోమవారం అనంతపురం నగరంలోని విద్యుత్ నగర్ సర్కిల్లో ఉన్న యస్.జె. టవర్స్ మొదటి అంతస్తులో ది గుత్తి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ నాల్గవ శాఖని ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ బ్యాంకు ద్వారా పేద ప్రజలకు మంచి సేవలు అందించాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమిరిటీస్ విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ మరియు మాజీ ఎమ్మెల్యే మానం ఆంజనేయులు, ది గుత్తి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ అధ్యక్షులు షేక్ అబ్దుల్ జిలాని, డిసిఓ అరుణకుమారి, న్యాఫ్కబ్ డైరెక్టర్ సిహెచ్ రాఘవేంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.
ఏపీ యుటిఎఫ్ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులుగా శెట్టిపి జయ చంద్రారెడ్డి వరుసగా మూడోసారి ఎన్నిక
విశాలాంధ్ర ధర్మవరం : ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్( ఏపీ యుటిఎఫ్), శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులుగా ధర్మవరం పట్టణానికి చెందిన శెట్టిపి జయచంద్రారెడ్డి ఎన్నికయ్యారు. ఆదివారం రోజున కదిరి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత ఉన్నత పాఠశాల నందు జరిగిన సత్యసాయి జిల్లా స్వర్ణోత్సవ మహాసభల నందు వరుసగా మూడవసారి (03) ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. జయచంద్రా రెడ్డి గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లా యుటిఎఫ్ అధ్యక్షులుగా రెండుమార్లు మరియు ఉమ్మడి అనంతపురం జిల్లా ఫ్యాప్టో చైర్మన్ గా కొనసాగారు.
ఈ సందర్భంగా జయచంద్రా రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలపై రాజీలేని పోరాటం యుటిఎఫ్ కొనసాగిస్తుందని తెలిపారు. ప్రభుత్వం అపరిస్కృతమైన ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలియజేశారు…. తన ఎన్నికకు ఏకగ్రీవంగా సహకరించిన జిల్లా వ్యాప్త యూటీఎఫ్ నాయకులకు, కార్యకర్తలకు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేశారు.. ఈయన ఎంపిక పట్ల ధర్మవరం జోన్ యుటిఎఫ్ నాయకులు రామకృష్ణ నాయక్, ఆంజనేయులు, లక్ష్మయ్య, హరికృష్ణ, సాయి గణేష్ , న.రామాంజనేయులు, అమర్ నారాయణరెడ్డి, మేరీ వర కుమారి ,లతా దేవి గోపాల్ రెడ్డి, శివయ్య, సకల చంద్ర శేఖర్, సురేష్, జనార్ధన్ బాబు, మల్లేష్, బిల్లే రామాంజనేయులు, రాంప్రసాద్, హరి శంకర్, తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
గ్రామాలలో నిర్వహించే గ్రామ సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోండి..
తాసిల్దార్ (ఎఫ్ ఎ సి) సురేష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం : జిల్లా కలెక్టర్ చేతన్, ఆర్డీవో మహేష్ ఆదేశాల మేరకు మండలములోని వివిధ పంచాయతీలలో గ్రామ సభలను నిర్వహిస్తున్నట్లు తాసిల్దార్ (ఎఫ్ ఎ సి) సురేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 12వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ప్రజా సమస్యల పరిష్కారిక వేదిక లో భాగంగా ఈ గ్రామ సభలను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఆయా గ్రామసభలలో సంబంధిత అధికారులు ఉంటారని, ప్రజలు తమ యొక్క సమస్యలను ఏవైనా సరే తెలుపుకునే అవకాశం తో పాటు దరఖాస్తును ఇస్తూ తమ ద్వారా రసీదును కూడా పొందవచ్చునని, అనంతరం ఆన్లైన్లో నమోదు చేసి, విచారణ తర్వాత షెడ్యూల్ తేదీ ప్రకారం పరిష్కరించబడునని తెలిపారు. ఇప్పటికే గ్రామాలలో గ్రామ సభల యొక్క వివరాలను సంబంధిత సచివాలయం, వీఆర్వోల ద్వారా తెలియపరచడం జరిగిందని తెలిపారు. ఈనెల 12న దర్శనమల, 13న నేలకోట, 14న మల్లా కాలువ, 15న ఏలుకుంట్ల, బుడ్డారెడ్డిపల్లి, 19న రావుల చెరువు, 20న తుమ్మల, సుబ్బారావు పేట, 21న పోతుల నాగేపల్లి, 22న గోట్లూరు, 26న చిగీచెర్ల, 27న రేగాటిపల్లి ,28న కునుతురు, 29న ధర్మవరంలో ఉంటుందని తెలిపారు.
క్రీడలను ప్రోత్సహిస్తున్న సంద రాఘవ అభినందనీయులు
-ఐదవ రోజు సాగిన క్రికెట్ పోటీలు
-ముఖ్యఅతిథిగా హాజరైన వన్టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం : ఎంతోమందిలో క్రీడా నైపుణ్యమున్నప్పటికీ సరైన ప్రోత్సాహం లేక ఇబ్బంది పడుతున్న క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రముఖ చేనేత నాయకులు సంద రాఘవ ముందుకు రావడం అభినందనీయమని ఒకటవ పట్టణ సీఐ నాగేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నీలో భాగంగా 5 వ రోజు సిఐ నాగేంద్ర ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. పోటీల్లో రెండు జట్ల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగింది. మొదటిసారి విశ్వనాథ్ వర్సెస్ ఎస్ ఎల్ వి జట్ల మధ్య పోటీలు నిర్వహించగా ఇందులో ఎస్ఎల్వి జట్టు కు విజయం వరించింది. అనంతరం ఛాలెంజర్ వర్సెస్ నాయక్ జట్ల మధ్య పోటీ నిర్వహించగా నాయక్ జట్టు ఘన విజయం సాధించింది. మూడోసారి అర్జున్ టైటాన్స్ వర్సెస్ సోమందేపల్లి పోటీ నిర్వహించగా సోమండేపల్లి జట్టు విజయాన్ని సాధించింది. అనంతరం దంపెట్ల, అగ్రహారం జట్ల తలపడగా అగ్రహారం జట్టు విజయాన్ని అందుకుంది. ఐదవ సారి జరిగిన క్రికెట్ పోటీలో మేడాపురం వర్సెస్ కనగానపల్లి జట్ల మధ్య పోటీ నిర్వహించగా మేడాపురం జట్టు విజయాన్ని అందుకుంది. చివరిగా ఎర్రోనిపల్లి వెర్సెస్ వెంకటన్న లయన్స్ మధ్య పోటీ జరగగా వెంకటన్న లయన్స్ కు విజయం వరించింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ప్రముఖ చేనేత నాయకులు సంద రాఘవ, నిర్వాహకులు జింకా పురుషోత్తం, శ్యాంసుందర్, అఖిల్, జావేద్, భరత్, సాయినాథ్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో కుల గణనను తక్షణమే చేపట్టాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జగదీష్
విశాలాంధ్ర -అనంతపురం : ఆంధ్ర రాష్ట్రంలో కుల గణనను తక్షణమే చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జగదీష్ పేర్కొన్నారు. సోమవారం సిపిఐ జిల్లా ఆఫీసులో పార్టీ జిల్లా కార్యదర్శి జాఫర్ అధ్యక్షతన జిల్లా పార్టీ కార్యదర్శివర్గ సమావేశం జరిగింది. ఇందులో సహయ కార్యదర్శులు నారాయణ స్వామి, మల్లికార్జున జిల్లా నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు జగదీష్ మాట్లాడుతూ… రాష్ట్రంలో కుల గణన చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ, బీహార్ తదితర రాష్ట్రాలలో కుల గణన ప్రారంభమయినదని అని పేర్కొన్నారు. 2027 లో దేశవ్యాపితంగా పార్లమెంటు, ఆసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతున్న క్రమంలో కుల గణన చేపడితే దళితులకు, వెనకబడిన వర్గాలకు ఎక్కడెక్కడ ఏఏ స్థానాలలోః, ఎన్ని నియోజకవర్గాలు రిజర్వేషను చేయాలో స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. ఆయా కులాల ప్రజలకు ఏఏ ప్రభుత్వ పథకాలు అందించాలనే విషయం పాలకులకు తెలియ వస్తుందన్నారు. వీటితో పాటు కులాల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల సంఖ్యను పెంచడం లేదా తక్కువ జనాభా ఉంటే తగ్గించడం లాంటి విషయాలలో కూడా రాజకీయ పార్టీలకు అవగాహణ వస్తుందని జగదీష్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రజలందరికి సమగ్ర, సమాన అవకాశాలు కల్పించబడతాయన్నారు. అభివృద్ధి ఫలాలను కులాల జనా బా ఆధారంగా పంపిణి చేయడానికి ప్రభుత్వానికి సృస్టత వస్తుందన్నారు. కుల గణన చేపట్టడానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి బి .సి , దళిత , మైనార్టీ కుల సంఘాలను కలుపుకొని సదస్సులు, రౌండ్ టేబుల్ మీటింగులు జరపాలని పార్టీ శ్రేణులకు జగదీష్ సూచనలు చేశారు.
పేకాట స్థావరంపై పోలీసులు దాడు లు
10మంది అరెస్ట్–రూ.59, 100 నగదు స్వాధీనం… వన్ టౌన్ సిఐ నాగేంద్రప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం:: రాబడిన సమాచారం మేరకు, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో దుర్గమ్మ గుడి వెనక భాగాన పేకాట ఆడుతున్న స్థావరంపై వన్టౌన్ సిఐ నాగేంద్రప్రసాద్ తన సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పదిమందిని అరెస్టు చేసి, రూ.59,100 లా నాగదును స్వాధీనం చేసుకొని, జూదరులపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం కోర్టుకు తరలించినట్లు సిఐ తెలిపారు.