Tuesday, December 10, 2024
Homeజిల్లాలురాష్ట్రంలో కుల గణనను తక్షణమే చేపట్టాలి

రాష్ట్రంలో కుల గణనను తక్షణమే చేపట్టాలి

సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జగదీష్

విశాలాంధ్ర -అనంతపురం : ఆంధ్ర రాష్ట్రంలో కుల గణనను తక్షణమే చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జగదీష్ పేర్కొన్నారు. సోమవారం సిపిఐ జిల్లా ఆఫీసులో పార్టీ జిల్లా కార్యదర్శి జాఫర్ అధ్యక్షతన జిల్లా పార్టీ కార్యదర్శివర్గ సమావేశం జరిగింది. ఇందులో సహయ కార్యదర్శులు నారాయణ స్వామి, మల్లికార్జున జిల్లా నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు జగదీష్ మాట్లాడుతూ… రాష్ట్రంలో కుల గణన చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ, బీహార్ తదితర రాష్ట్రాలలో కుల గణన ప్రారంభమయినదని అని పేర్కొన్నారు. 2027 లో దేశవ్యాపితంగా పార్లమెంటు, ఆసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతున్న క్రమంలో కుల గణన చేపడితే దళితులకు, వెనకబడిన వర్గాలకు ఎక్కడెక్కడ ఏఏ స్థానాలలోః, ఎన్ని నియోజకవర్గాలు రిజర్వేషను చేయాలో స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. ఆయా కులాల ప్రజలకు ఏఏ ప్రభుత్వ పథకాలు అందించాలనే విషయం పాలకులకు తెలియ వస్తుందన్నారు. వీటితో పాటు కులాల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల సంఖ్యను పెంచడం లేదా తక్కువ జనాభా ఉంటే తగ్గించడం లాంటి విషయాలలో కూడా రాజకీయ పార్టీలకు అవగాహణ వస్తుందని జగదీష్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రజలందరికి సమగ్ర, సమాన అవకాశాలు కల్పించబడతాయన్నారు. అభివృద్ధి ఫలాలను కులాల జనా బా ఆధారంగా పంపిణి చేయడానికి ప్రభుత్వానికి సృస్టత వస్తుందన్నారు. కుల గణన చేపట్టడానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి బి .సి , దళిత , మైనార్టీ కుల సంఘాలను కలుపుకొని సదస్సులు, రౌండ్ టేబుల్ మీటింగులు జరపాలని పార్టీ శ్రేణులకు జగదీష్ సూచనలు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు