Thursday, December 5, 2024
Homeజిల్లాలుక్రీడలను ప్రోత్సహిస్తున్న సంద రాఘవ అభినందనీయులు

క్రీడలను ప్రోత్సహిస్తున్న సంద రాఘవ అభినందనీయులు

-ఐదవ రోజు సాగిన క్రికెట్ పోటీలు
-ముఖ్యఅతిథిగా హాజరైన వన్టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్

విశాలాంధ్ర ధర్మవరం : ఎంతోమందిలో క్రీడా నైపుణ్యమున్నప్పటికీ సరైన ప్రోత్సాహం లేక ఇబ్బంది పడుతున్న క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రముఖ చేనేత నాయకులు సంద రాఘవ ముందుకు రావడం అభినందనీయమని ఒకటవ పట్టణ సీఐ నాగేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నీలో భాగంగా 5 వ రోజు సిఐ నాగేంద్ర ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. పోటీల్లో రెండు జట్ల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగింది. మొదటిసారి విశ్వనాథ్ వర్సెస్ ఎస్ ఎల్ వి జట్ల మధ్య పోటీలు నిర్వహించగా ఇందులో ఎస్ఎల్వి జట్టు కు విజయం వరించింది. అనంతరం ఛాలెంజర్ వర్సెస్ నాయక్ జట్ల మధ్య పోటీ నిర్వహించగా నాయక్ జట్టు ఘన విజయం సాధించింది. మూడోసారి అర్జున్ టైటాన్స్ వర్సెస్ సోమందేపల్లి పోటీ నిర్వహించగా సోమండేపల్లి జట్టు విజయాన్ని సాధించింది. అనంతరం దంపెట్ల, అగ్రహారం జట్ల తలపడగా అగ్రహారం జట్టు విజయాన్ని అందుకుంది. ఐదవ సారి జరిగిన క్రికెట్ పోటీలో మేడాపురం వర్సెస్ కనగానపల్లి జట్ల మధ్య పోటీ నిర్వహించగా మేడాపురం జట్టు విజయాన్ని అందుకుంది. చివరిగా ఎర్రోనిపల్లి వెర్సెస్ వెంకటన్న లయన్స్ మధ్య పోటీ జరగగా వెంకటన్న లయన్స్ కు విజయం వరించింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ప్రముఖ చేనేత నాయకులు సంద రాఘవ, నిర్వాహకులు జింకా పురుషోత్తం, శ్యాంసుందర్, అఖిల్, జావేద్, భరత్, సాయినాథ్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు