Wednesday, January 8, 2025
Home Blog Page 106

మనోబంధు సేవలను విస్తరిస్తాం.. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ

విశాలాంధ్ర -ధర్మవరం : మనోబంధు ఫౌండేషన్ సంస్థను ఇండియన్ రెడ్ క్రాస్ ద్వారా విస్తరించడం విస్తరించడం జరుగుతుందని డాక్టర్ సత్య నిర్ధారణ, డాక్టర్ నరసింహులు, శ్రీ సత్య సాయి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ పోలా ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో స్వచ్ఛంద సంస్థలతో సమావేశములో కార్యాచరణ ప్రణాళిక పై చర్చలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మనోబంధు సేవలను విస్తరించడానికి కార్యక్రమ ప్రణాళికలను సంసిద్ధం చేస్తున్నట్లు వారి తెలిపారు. మానసిక బాధితుల పునరావాసం కల్పించడానికి ఏపీలోని అన్ని జిల్లాలలోనూ స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములు చేయడానికి మనోబంధు ఫౌండేషన్ కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షతన సత్య నిర్ధారణ నిర్వహించారు. తదుపరి వివిధ స్వచ్ఛంద సంస్థలతో ముఖాముఖిని కూడా నిర్వహించడం జరిగిందని తెలిపారు. రహదారి మానసిక బాధితులకు పునరావాస కార్యక్రమాలు నిర్వహించేలా ఉత్తేజాన్ని కలిగించడం జరిగిందని తెలిపారు. డిసెంబర్ మూడవ తేదీన ధర్మవరంలోని పోలా ఫంక్షన్ హాల్లో విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా మనోబంధు కవిత శీర్షికను ఏర్పాటు చేశామని తెలిపారు. అదేవిధంగా మనో బంధు కన్వీనర్ గా వీరే శ్రీరాములు ఎంపిక కావడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే, పరిష్కార దిశలో అందరూ నడవాలని తెలిపారు. తదుపరి గుంతకల్ నుండి రాధా మహిళా మండలి తులసి భాయ్ కూడా మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అన్న దృక్పథంతో అందరూ వెళ్లాలని తెలిపారు. అనంతపురం పాస్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు రామప్ప మాట్లాడుతూ ఈనెల 14వ తేదీ రాయచోటి లో జరిగే స్వచ్ఛందల సంస్థల సమావేశంలో మరింత చర్చించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అదేవిధంగా జాతీయస్థాయిలో వీటిని పరిచయం చేయడానికి కడప నగరంలో డిసెంబర్ 8వ తేదీన సామాజిక చైతన్య సంస్థ వారిచే ప్రజాసంఘాల స్వచ్ఛంద సంస్థల నేషనల్ వర్క్ షాప్ లో తెలియజేస్తామని తెలిపారు. అనంతరం కరపత్రాలను విడుదల చేశారు.మానసిక బాధితుల యొక్క సమాచారం ఎవరికైనా తెలిసి ఉంటే శ్రీరాములు సెల్ నెంబర్ 73308004832 తెలాపాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజు, తులసి బాయ్, రామప్ప, రోటరీ క్లబ్ నరేందర్ రెడ్డి, జయసింహ, వేణుగోపాల్, రమేష్, జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నియోజకవర్గంలో 70 దరఖాస్తులు. తాసిల్దార్ సురేష్ బాబు

విశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరం నియోజకవర్గంలో ధర్మవరం రూరల్, అర్బన్, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాలలో ఓటర్ నమోదు కార్యక్రమంలో 70 దరఖాస్తులు రావడం జరిగిందని ధర్మవరం ఎమ్మార్వో (ఎఫ్ఎసి) సురేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్డిఓ మహేష్ ఆదేశాల మేరకు రెండవ రోజు ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇందులో రెండవ రోజున నియోజకవర్గంలో ఫారం -6 లో 43, ఫారం-7 లో 11, ఫారం-8 లో 16 వెరసి 70 దరఖాస్తులు రావడం జరిగిందని తెలిపారు. ఈ ప్రత్యేక నమోదు కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిందని తెలిపారు. తదుపరి ఎమ్మార్వో సురేష్ బాబు వివిధ పోలింగ్ నమోదు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బందికి తగిన సూచనలను తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈడిటి ఈశ్వరయ్య, ఎన్నికల సీనియర్ అసిస్టెంట్ రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్120వ జయంతి వేడుకలు……

విశాలాంధ్ర- పామిడి (అనంతపురం జిల్లా) : పామిడి పట్టణం నందు మౌలానా అబుల్ కలాం ఆజాద్ 120వ జయంతిని సోమవారం సిపిఐ పార్టీ సీనియర్ నాయకుడు కె.రహీం ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి మొదటి విద్యా మంత్రిగా పనిచేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గౌరవార్థం ఈ దినోత్సవాన్ని జరుపుతున్నామన్నారు. ఆయన 1888 నవంబర్ 11న అఫ్ఘానిస్తాన్లోని మక్కాలో జన్మించారు. భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్సీ)కు అతి పిన్న వయస్కుడైన ఆజాద్ అధ్యక్షుడుగా గుర్తింపు పొందారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ దూరదృష్టి కారణంగానే దేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఏర్పడి, ఉన్నత విద్యకు అత్యున్నత మార్గం ఏర్పడింది. ఆజాద్ దేశంలో ఉన్నత విద్యకు ఊపిరిపోసిన మహనీయునిగా అభివర్ణించారు.దేశ స్వాతంత్య్ర సముపార్జన, దేశ నిర్మాణంలో ఆజాద్ సహకారం అపారమైనదని చెబుతుంటారు. అతనిని స్వతంత్ర భారతదేశ ప్రధాన వాస్తుశిల్పిగానూ అభివర్ణిస్తుంటారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో విద్యా రంగంలో ఆయన చేసిన కృషిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని దేశమంతటా జరుపుకుంటారు. 1920లో ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో జామియా మిలియా ఇస్లామియా స్థాపనకు ఏర్పడిన కమిటీలో ఆజాద్ కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత 19345 యూనివర్సిటీ క్యాంపస్ లను న్యూఢిల్లీకి మార్చడంలో ప్రముఖ పాత్ర పోషించారని తెలిపారు. ఈ కార్యక్రమంలోకె.రహీం, బి కే రహీం,తేల్ బాషా, డాబాబాబా,షేక్షా,వళి, రజక్,ఆర్మీ రఫీ, అల్లా,బషీర్, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు

రైతాంగం సమస్యలు పై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి ….

– చోడవరం తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసిన ఏ.పి.రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు …

– నకిలీ పురుగు మందులు, ఎరువులు దుకాణదారులు పై తక్షణమే చర్యలు తీసుకోవాలి…

– పెట్టుబడి సహాయం, సాగునీటి వనరులు అభివృద్ధి పరచి, అన్నదాతను అన్ని విధాలా ఆదుకోవాలి …

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.11.11.2024ది. అపరిష్కృతంగా ఉన్న రైతాంగం సమస్యలపై తక్షణమే స్పందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, చోడవరం తహసీల్దార్ పి.రామారావుకు సోమవారం ఏ.పి.రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు సోమవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ ఆదేశాలు మేరకు పరిష్కారానికి నోచుకోని రైతాంగం సమస్యలను మండల స్థాయి అధికారులు ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ప్రైవేటు దుకాణాల్లో అధిక ధరలకు అమ్ముతున్నారని, వీరివలన పంటలు నష్టంతో బాటు, పెట్టుబడులు ఎక్కువై రైతన్నలు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారని తెలిపారు. ప్రైవేటు ఎరువులు, పురుగు మందులు దుకాణాలపై అధికారులు తనిఖీలు కరువయ్యాయని, దీంతో ఎరువులు దుకాణదారులు ఆగడాలు ఎక్కువయ్యాయని తెలిపారు. నకిఃలీలః పై ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు. రైతాంగం పై సవతి తల్లి ప్రేమ చూపుతున్న కూటమి ప్రభుత్వం అధికారం రాక ముందు ఒక మాట, అందలమెక్కాక ఒక మాట ఆడుతూ రైతు కుటుంబాల జీవితాలతో ఆడుకుంటున్నారని అన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ పెట్టుబడులు ఎక్కువై రైతాంగం నానా ఇబ్బందుల్లో వున్నను, నేటికీ ప్రభుత్వ సహాయం అందక దిక్కుతోచని స్థితిలో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది అని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు సుజల స్రవంతి పూర్తి చేసి అభివృద్ధి చర్యలు చేపట్టాలన్నారు. సాగునీటి చెరువులు క్రింద లక్షలు ఎకరాలు సారవంతమైన భూములుండగా, సాగు నీరందక వర్షాధారంగా మాత్రమే పంటలు పండి0చాల్సి వస్తోందన్నారు. ఉత్తరాంధ్ర లో ఎన్ని సాగునీటి వనరులు వున్నప్పటికీ వాటి అభివృద్ది పై పాలకులు, ప్రభుత్వ అధికారులు తగిన శ్రద్ద చూపకపోవడంతో ఖరీఫ్ లో పంటలు ఎండిపోతున్నాయి అన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ప్రధాన చెరువులు, గెడ్డ వాగులు తదితర సాగునీటి వనరులను అభివృద్ది చేస్తే రెండు పంటలు పండి సస్య శ్యామలం అవుతాయని తెలిపారు. అధికార కూటమి ప్రభుత్వం పెద్దలు, పాలకులు, ఇరిగేషన్ అధికారులు తక్షణమే ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులు అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. రైతాంగం సమస్యలు పై స్పందించని ప్రభుత్వానికి అన్నదాతల ఆక్రోశానికి బలి కాక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం సభ్యులు, వ్య.కా.సం. సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అసెంబ్లీ సమావేశాలు బుధవారానికి వాయిదా

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు వాయిదా పడ్డాయి. బుధవారానికి తిరిగి ప్రారంభమవుతాయి. రేపు ఏపీ అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. బుధవారం సమావేశమై బడ్జెట్ పై చర్చించనున్నారు. రేపు ఉదయం పదకొండు గంటలకు ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. అదే సమయంలో రేపు మధ్యాహ్నం కూటమి శాసనసభ పక్ష సమావేశం జరుగుతుంది. మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే కూటమి పార్టీల శాసనసభ సభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. అందరూ విధిగా హాజరు కావాలని పార్టీ నుంచి ఆదేశాలను జారీచేశారు.

వైసీపీ ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ భేటీ

ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు వైఎస్సార్‌సీపీ దూరంగా ఉంది. సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంపై నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఒకవైపు సమావేశాలు జరుగుతుండగానే.. ఎమ్మెల్యేలతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు.సభలో కూటమి తర్వాత ఎక్కువ ఓటు షేరింగ్‌ ఉన్న వైఎస్సార్‌సీపీని లేఖ రాసినప్పటికీ స్పీకర్‌ ప్రతిపక్షంగా గుర్తించకపోవడం, గత సమావేశాల్లో మాట్లాడేందుకు మైక్‌ ఇవ్వకపోవడంతో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను బాయ్‌కాట్‌ చేసింది వైఎస్సార్‌సీపీ.ఇక నుంచి మీడియా ఎదుటే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. రానున్న రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై ఎమ్మెల్యేలతో జగన్ చర్చిస్తున్నారు.

43 వేల కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టిన అచ్చెన్నాయుడు

ఆరుగాలం ఇంటిల్లిపాది శ్రమించి ఈ ప్రపంచానికి అన్నం పెడుతున్న రైతన్నకు మనసావాచా కర్మణా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నా అంటూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో పేర్కొన్నారు. రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టి మంత్రి మాట్లాడారు. ముందుగా రైతులపై ప్రముఖ కవి గుర్రం జాషువా రాసిన..

వాని రెక్కల కష్టంబు లేని నాడు
సస్య రమ పండి పులకింప సంశయించు
వాడు చెమటోడ్చి ప్రపంచమునకు
భోజనము పెట్టువానికి భుక్తి లేదు..ు
అన్న కవితను మంత్రి చదివి వినిపించారు.

రైతులకు ఈ పరిస్థితి మారాలని, రైతే రాజు కావాలని నిరంతరం ఆలోచించే, అందుకోసం నిరంతరం ప్రయత్నించే వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అచ్చెన్నాయుడు చెప్పారు. అయితే, గత ప్రభుత్వం మాత్రం రాష్ట్రానికి వెన్నెముక వంటి వ్యవసాయాన్ని గాలికి వదిలేసిందన్నారు. రాష్ట్ర జనాభాలో 62 శాతం వ్యవసాయ అనుబంధ రంగాలపైనే ఆధారపడిందని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి, రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా వ్యవసాయ బడ్జెట్ లో పకృతి వ్యవసాయానికి, సాంకేతికతకు ప్రాధాన్యం కల్పించామని చెప్పారు. రిమోట్ సెన్సింగ్ సాంకేతికత ఉపయోగించి భూసార పరీక్షలు చేపట్టనున్నామని మంత్రి వివరించారు. ప్రాథమిక పరపతి సంఘాల ద్వారా రాయితీపై ఎరువుల పంపిణీ చేపట్టామని మంత్రి పేర్కొన్నారు.

కేటాయింపులు..
అన్నదాత సుఖీభవ – రూ.4,500 కోట్లు
ప్రకృతి వ్యవసాయం – రూ.422.96 కోట్లు
భూసార పరీక్షలకు – రూ.38.88 కోట్లు
పంటల బీమా – రూ.1,023 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణ – రూ.187.68 కోట్లు
రాయితీ విత్తనాలకు – రూ.240 కోట్లు
ఎరువుల సరఫరా – రూ.40 కోట్లు
పొలం పిలుస్తోంది – రూ.11.31 కోట్లు
డిజిటల్‌ వ్యవసాయం – రూ.44.77 కోట్లు
వడ్డీ లేని రుణాలకు – రూ.628 కోట్లు
రైతు సేవా కేంద్రాలకు – రూ.26.92 కోట్లు
ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్స్‌ – రూ.44.03 కోట్లు

లెబనాన్‌లో సమాధుల కింద హిజ్బుల్లా భారీ సొరంగం.. గుర్తించిన ఇజ్రాయెల్..

లెబనాన్‌లో సమాధుల కింద ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా నిర్మించిన భారీ సొరంగాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ (ఐడీఎఫ్) గుర్తించింది. ఇందుకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. కిలోమీటర్‌కు పైగా పొడవున్న ఈ సొరంగం సరిహద్దు నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. సొరంగ నిర్మాణం కోసం దాదాపు 4,500 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌ను ఉపయోగించి ఉంటారని ఐడీఎఫ్ అంచనా వేసింది.ఈ వీడియోను షేర్ చేసిన ఇజ్రాయెల్ ఆర్మీ.. ఇలాంటి ఎన్నో టన్నెళ్లను ధ్వంసం చేసినట్టు పేర్కొంది. ఈ సొరంగంలో కమాండ్ కంట్రోల్ రూములు, తుపాకులు, రాకెట్ లాంచర్లు, స్లీపింగ్ క్వార్టర్లు, డజన్ల కొద్దీ ఆయుధాలు, ఇతర సామగ్రి ఉన్నట్టు తెలిపింది. దక్షిణ లెబనాన్‌లోని గ్రామాల్లో హిజ్బుల్లా ఇలాంటి సొరంగాలను నిర్మించినట్టు వివరించింది. మరోవైపు, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 3,186 మంది ప్రాణాలు కోల్పోయారు. 14,078 మంది గాయపడ్డారు. శనివారం ఒక్క రోజే 53 మంది మరణించారు.

ఏపీలో పలు చోట్ల మూడు రోజులపాటు భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, దక్షిణ కోస్తాలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ అప్రమత్తం చేశారు. నైరుతి బంగాళాఖాతం మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని, దీని ప్రభావంతో మంగళ, బుధ, గురువారాల్లో వానలు పడతాయని చెప్పారు. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి మంగళవారం లోగా అల్పపీడనంగా రూపాంతరం చెందే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గుర్తించింది. తర్వాత రెండు రోజుల్లో పశ్చిమ దిశగా కదులుతుందని, తమిళనాడు లేదా శ్రీలంక తీరాల వైపు పయనించే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాగా, నిన్న ఏపీలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడ్డాయి.

శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల కేశవ్‌

ఏపీ ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ 2024-25ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ కాపీస్‌లోని పద్దులను చదివి వినిపిస్తున్నారు. అంతకుముందు ఆయన గత ప్రభుత్వ తప్పిదాలపై విమర్శలు చేశారు.రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉన్నదన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సి ఉంది. గత ప్రభుత్వ పాలనను ప్రజలు పాతరేశారు. 93శాతం ప్రజల ఆమోదాన్ని కూటమి ప్రభుత్వం పొందగలిగిందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం రాబోయే 25 ఏళ్ల ఆదాయాన్ని తగ్గించిందని విమర్శించారు.

అలాగే పరిమితికి మించిన అప్పులు చేసి.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని ఆరోపించారు. లోపభూయిష్టమైన విధానాలను అనుసరించి.. అభివృద్ధిని కుంటుపడేలా చేసిందన్నారు. శాశ్వత రాజధాని లేకుండా రాష్ట్ర విభజన జరిగిందని రాష్ట్రాన్ని పునర్మిర్మాణ దిశగా నడిపించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుందని, గత ప్రభుత్వం నీటి పారుదల రంగాన్ని పూర్తిగా విస్మరించిందని గత ప్రభుత్వం పోలవరం నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లలేదన్నారు. కాగా, నీటి పారుదల, సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్‌ను ఆర్థిక శాఖ రూపొందించినట్లు స్పష్టం అవుతుంది.

బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం అంచనా రూ. 2,35,916.99 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ. 32,712.84 కోట్లుగా పేర్కొన్నారు. రెవెన్యూ లోటు రూ. 34,743.38 కోట్లు, ద్రవ్య లోటు రూ. 68,742.65 కోట్లుగా పయ్యావుల తన బడ్జెట్‌ ప్రసంగం ద్వారా వెల్లడించారు. బడ్జెట్‌లో వివిధ కీలక రంగాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు.ఏపీ 2024 ఉ 25 వార్షిక బడ్జెట్ రూ. 2.94 లక్షల కోట్లు.
ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నాలుగు నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన పయ్యావుల కేశవ్.
.రెవెన్యూ వ్యయం అంచనా రూ. 2.34లక్షల కోట్లు.
.మూలధనం వ్యయం అంచనా రూ. 32,712 కోట్లు.
.రెవెన్యూ లోటు రూ. 34,743 కోట్లు.
.ద్రవ్య లోటు రూ. 68,743 కోట్లు.
.జీఎస్డీపీలో రెవెన్యూ లోటు అంచనా 4.19శాతం.
.జీఎస్డీపీలో ద్రవ్యలోటు అంచనా 2.12 శాతం.
.వ్యవసాయ బడ్జెట్ రూ. 43,402.33 కోట్లు.
.వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ. 11,885 కోట్లు.
.ఉన్నత విద్యకు రూ. 2,326 కోట్లు కేటాయింపు.
.ఆరోగ్య రంగానికి రూ. 18,421 కోట్లు కేటాయింపు.
.పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 16,739 కోట్లు కేటాయింపు.
.పట్టణాభివృద్ధికి రూ.11,490 కోట్లు కేటాయింపు.
.గృహ నిర్మాణ రంగానికి రూ. 4,012 కోట్లు కేటాయింపు.
.జలవనరులు రూ. 16,705 కోట్లు.
.పరిశ్రమలు, వాణిజ్యం రూ.3,127 కోట్లు.
.ఇంధన రంగానికి రూ. 8,207 కోట్లు.
.ఎస్సీ కాంపొనెంట్ కు రూ. 18,497 కో్ట్లు.
.ఎస్టీ కాంపోనెంట్ కు రూ. 7,557 కోట్లు.
.బీసీ కాంపొనెంట్ కు రూ. 39,007 కోట్లు.
.అత్యల్ప వర్గాల సంక్షేమానికి రూ. 4,376 కోట్లు.
.ఉచిత సిలిండర్ పంపిణీకి రూ. 895 కోట్లు.
.మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమం రూ. 4,285 కోట్లు.
.నైపుణ్యాభివృద్ధికి రూ. 1,215 కోట్లు.
.పాఠశాల విద్యకు రూ. 29,090 కోట్లు
.ఉన్నత విద్యకు రూ. 2,326 కోట్లు.