శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం కమిటీ
విశాలాంధ్ర ధర్మవరం:: పేద ప్రజలకు ఉచితంగా వైద్య చికిత్సలు అందించడమే మా లక్ష్యము అని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం కమిటీ వారు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయ ఆవరణములో ఈ నెల 24వ తేదీ ఆదివారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరంలో ఉచిత వైద్య చికిత్సలతో పాటు నెలకు సరిపడా మందులను కూడా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు వేల్పుల వెంకటమ్మ, కీర్తిశేషులు వేల్పుల భూషప్ప జ్ఞాపకార్థం వీరి కుమారులు వేల్పుల వెంకటేశు అండ్ సన్స్ వారు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ శిబిరంలో వైద్య చికిత్సలను డాక్టర్ వివేక్ కుళ్లాయప్ప, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ సాయి స్వరూప్, డాక్టర్ సతీష్ కుమార్, డాక్టర్ జైదీపు నేత వ్యవహరించడం జరుగుతుందన్నారు. కావున ఈ అవకాశాన్ని పట్టణము, గ్రామీణ ప్రాంతాలలోని పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యమును పదిలంగా ఉంచుకోవాలని తెలిపారు.
పేద ప్రజలకు ఉచిత వైద్య చికిత్సలు అందించడమే మా లక్ష్యం..
పెండింగ్ లో ఉన్న మెస్ చార్జీలను వెంటనే విడుదల చేయాలి..
ఏపీ ఎస్ ఎఫ్- శ్రీ సత్య సాయి జిల్లా ప్రధాన కార్యదర్శి బండి శివ గౌడ్
విశాలాంధ్ర ధర్మవరం:: పెండింగ్ లో ఉన్న మిస్ చార్జీలను వెంటనే విడుదల చేయాలని ఏపీఎస్ఎఫ్ శ్రీ సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి బండి శివ గౌడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని విద్యార్థులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న మెస్ ఛార్జీలు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వము లోని ఎస్సీ, బీసీ ,ఎస్టీ, మైనారిటీ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు గత ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న మెస్సు కాస్ట్ చార్జీలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. హాస్టల్లో 2,733 లలో 13,695 విద్యార్థులు ఉన్నారని, విద్యా సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు పూర్తికావస్తున్న నేటి ఎన్డీఏ ప్రభుత్వం కదలిక లేకపోవడం దారుడు మన్నారు. నిత్యావసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటాయని ఇటువంటి నేపథ్యంలో నెల నెల ప్రభుత్వం నుంచి రావాల్సిన బెస్ట్ బిల్లులు విడుదల కాకపోవడంతో అప్పులు చేసి హాస్టల్లో నిర్వహించడం వార్డులకు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం పెండింగ్లో ఉన్న మూడు నెలల బిల్లులు కూడా విడుదల చేయాలని, చలికాలంలో ప్రతి విద్యార్థికి బెడ్ సీట్లు, మూడు జతల యూనిఫార్మ్ ,ప్లేట్లు పెట్టెలు ,బకెట్లు, మగ్గులు అందించాలని తెలిపారు. హాస్టల్ ల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని తెలిపారు. పదవ తరగతి ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు తల్లికి వందనమును వెంటనే అమలు చేయాలని వారు తెలిపారు. ఈ డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుకృత్, పట్టణ అధ్యక్ష, కార్యదర్శి దినేష్ స్వామి, కార్తీక్ తో పాటు పవన్ తదితరులు పాల్గొన్నారు.
రోగులకు చేసే సేవ దైవ సేవతో సమానం
కన్వీనర్
విశాలాంధ్ర ధర్మవరం : రోగులకు చేసే సేవ దైవ సేవతో సమానమని కన్వీనర్ నామ ప్రసాద్, కాకి చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు సహాయకులకు 360 మందికి ఆసుపత్రి వైద్యులు నర్సులు చేతులమీదుగా పంపిణీ చేశామని,అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా స్వీట్లు కూడా పంపిణీ చేయడం జరిగిందన్నారు. పుట్టపర్తి బాబా ఆశీస్సుల మేరకు, సేవాదాత సేవా సమితి తరపున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. దాతల సహాయ సహకారములతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఆసక్తిగల దాతలు సెల్ నెంబర్ 9966047044 కు గాని 903044065కు గాని సంప్రదించాలని తెలిపారు. అనంతరం ఆసుపత్రి సూపర్డెంట్ మాధవి మాట్లాడుతూ శ్రీ సత్య సాయి సేవ సమితి వారు చేస్తున్న సేవలు ఎంతోమందికి స్ఫూర్తినిస్తాయని, తదుపరి వారికి ఆసుపత్రి సిబ్బంది, రోగుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 27 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.
తలగాసిపల్లి సమీపంలోని రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ
విశాలాంధ్ర -అనంతపురం : గార్లదిన్నె మండలం తలగాసిపల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ పి.జగదీష్ Iూూ గారు పరిశీలించారు. ఈ ప్రమాద ఘటనలో మొత్తం నలుగురు చనిపోయారు. కూలి పనుల కోసం వెళ్లి తిరుగు ప్రయాణంలో కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి ఎస్పీ చేరుకొని అక్కడ ఘటన జరిగిన తీరును మరియు అందుకు కారణాలను నిశితంగా పరిశీలించారు. జిల్లా ఎస్పీతో పాటు అనంతపురం రూరల్ డి.ఎస్.పి టి.వెంకటేశులు మరియు ఇతర పోలీసు అధికారులు వెళ్లారు
వైసీపీకి మరో భారీ షాక్… పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి వెంకటరమణ రాజీనామా
వైసీపీకి షాకిచ్చిన ఎమ్మెల్సీ వెంకటరమణ
రాజీనామా లేఖను మండలి ఛైర్మన్ కు పంపిన వెంకటరమణ
ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన పలువురు నేతలు
వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను శాసనమండలి ఛైర్మన్ కు పంపించారు. ఆయన కూటమి పార్టీల్లోకి వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. భవిష్యత్ కార్యాచరణపై తన అనుచరులతో ఆయన చర్చిస్తున్నట్టు సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.ఇప్పటికే వైసీపీకి పలువురు రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు రాజీనామాలు చేశారు. తాజాగా వెంకటరమణ రాజీనామాతో ఆ పార్టీ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. మరికొందరు నేతలు కూడా వైసీపీకి రాజీనామా చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. ఇదే జరిగితే వైసీపీ పరిస్థితి మరింత ఘోరంగా తయారయ్యే అవకాశం ఉంది.
భారీ మెజార్టీతో ప్రియాంకా గాంధీ ఘన విజయం
రాహుల్ రికార్డ్ బ్రేక్
మూడు లక్షల పైచిలుకు మెజార్టీతో ప్రియాంక విజయం
రెండో స్థానంలో సిపిఐ అభ్యర్ధి
మూడో ప్లేస్ లో నిలిచిన బిజెపి నవ్య హరిదాస్
వయనాడ్: కేరళలోని వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో సరికొత్త రికార్డు నమోదు అయ్యింది. కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ అత్యధిక మెజారిటీతో విజయాన్ని నమోదు చేయనున్నారు. ఈ ఏడాది ఆ స్థానం నుంచి ఆమె సోదరుడు రాహుల్ గాంధీ సుమారు 3.65 లక్షల ఓట్ల తేడాతో నెగ్గారు. అయితే రాహుల్ గాంధీ రాజీనామాతో ఆ స్థానం నుంచి ప్రియాంకా గాంధీ పోటీ చేశారు. ఉప ఎన్నికలో ప్రియాంకా గాంధీ హుల్ మెజారిటీని దాటేశారు. తాజా సమాచారం ప్రకారం .. ప్రియాంకా గాంధీ 3,82,517 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.. మొత్తం ప్రియాంకాకు 5.78 లక్షల ఓట్లు పోలయ్యాయి. రెండవ స్థానంలో కమ్యూనిస్టు అభ్యర్థి సత్యన్ మోకరి్కి 1.95 లక్షల ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ లక్ష ఓట్లతో మూడవ స్థానంలో నిలిచారు. రాహుల్ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ స్థానం నుంచి తన సభ్యత్వాన్ని నిలుపుకుంటూ వయనాడ్ స్థానానికి రాజీనామా చేశారు. అందుకే రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ ఇక్కడ జరుగుతున్న ఉపఎన్నికలో మొదటిసారి పోటీ చేశారు. మొదటిసారి పోటీ చేసినా ఆమె ఘన విజయం సాధించారు.
కర్నూలుకు హైకోర్టు బెంచ్ రావడం హర్షనీయం
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఆమోదం తెలుపడం హర్షనీయమని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు కోడిగుడ్ల ఏసేపు తెలిపారు. శనివారం మండల కేంద్రమైన పెద్దకడబూరులో ఆయన మాట్లాడుతూ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రసంగంలో అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి జరగాలని ఉత్తరాంధ్రలో విశాఖ, రాయలసీమలో కర్నూలు అభివృద్ధి కావాలన్నారు. గతంలో రాజధాని పేరుతో వైసీపీ మూడు ముక్కలాట ఆడారని ఆరోపించారు. చంద్రబాబు సాధ్యమైనంత త్వరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ పూర్తి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాళ్ల సీమలా ఉండే రాయలసీమకు నీళ్లు అందించారని, లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కర్నూలులోనే ఉంటున్నాయని గుర్తు చేశారు.
పారిశుద్ధ్య కార్మికులకు పరకలు కూడా ఇవ్వలేని దుస్థితిలో నగర పాలక సంస్థ సిగ్గుచేటు
ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ గౌడ్
విశాలాంధ్ర- అనంతపురం : అనంతపురము నగర పాలక సంస్థ పారశుద్ధ్య కార్మికులకు పనిముట్లు వెంటనే ఇవ్వాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ ) ఆధ్వర్యంలో శనివారం పాతవూరు గాంధీ బజార్ నందు చెట్ల కొమ్మలతో రోడ్లు ఊడ్చి నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ ) జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ గౌడ్ మాట్లాడుతూ… నగర పాలక సంస్థలో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతూ చేయని పనులకు కూడా లక్షల రుపాయలు బిల్లులు చేసుకుంటున్నారన్నారు. ప్రజలు రోగ్యాలు పాలవకుండా నగరాన్ని శుభ్రంగా ఉంచుతున్న కార్మికులకు సంబంధించిన పనిముట్లు తెప్పించడానికి మాత్రం అధికారులు,పాలక వర్గం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. దీర్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకోని కార్మికుల సమస్యలు పట్టించుకోకపోయినా కార్మికులు నిరంతరం ప్రజా సేవలో ఉన్నారన్నారు. కానీ పనిమూట్లు కూడా ఇవ్వకుంటే కార్మికులు ఏ విధంగా పనిచేయాలన్నారు. నగర జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్య లేకపోయినా పనిభారం ఎక్కువ ఉన్నప్పటికి కార్మికులు నిత్యం పనిలో ఉన్నారన్నారు. నెలల తరబడి కనీసం పరకలు కూడా ఇవ్వని నగర పాలక సంస్థ ఇప్పటికైనా మొద్దునిద్ర నుండి మేల్కొని కార్మికులకు పనిముట్లు వెంటనే ఇవ్వాలన్నారు. లేని పక్షంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గా ఆందోళనలు ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చిరంజీవి,సమితి సభ్యులు నాగేంద్ర బాబు,తిరుమలయ్య,దేవమ్మ,ఎర్రప్ప,నాయకులు మాధవయ్య,రామాంజి,కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.
2 లక్షలకు పైగా మెజార్టీలో ప్రియాంకాగాంధీ
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. కేరళలోని వయనాడ్ పార్లమెంటు స్థానానికి జరిగిన ఉపఎన్నికలో ఆమె పోటీ చేశారు. ఎన్నికల ఫలితాల్లో ఆమె జోరు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆమె 2 లక్షలకు పైగా మెజార్టీతో కొనసాగుతున్నారు. ఈ ఎన్నికలో ప్రియాంకపై బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్, సీపీఐ అభ్యర్థి సత్య మొకేరి పోటీలో ఉన్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో వయనాడ్ స్థానం నుంచి రాహుల్ గాంధీ 4.3 లక్షల మెజార్టీతో గెలుపొందారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రాహుల్ 3.6 లక్షల మెజార్టీతో విజయం సాధించారు. అయితే యూపీలోని రాయ్ బరేలీ స్థానం నుంచి కూడా గెలుపొందిన రాహుల్… వయనాడ్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉపఎన్నిక జరిగింది. ఈ స్థానంలో ప్రియాంక బరిలోకి దిగారు. నవంబర్ 13న ఈ స్థానంలో పోలింగ్ జరిగింది.
ఫిర్యాదులపై కఠినంగా వ్యవహరించాలి: పవన్ కల్యాణ్
డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ తనకు వస్తున్న వివిధ ఫిర్యాదులపై ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, దేవాదాయ శాఖ పరిధిలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలతో పాటు ప్రైవేటు భూముల ఆక్రమణలపై అనేక ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులపై అన్ని జిల్లాల కలెక్టర్లు మరియు కాకినాడ పోలీసులు తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదులపై కఠినంగా వ్యవహరించాలని పవన్ సూచించారు. ఫిర్యాదులపై ప్రాధాన్యతను ఇస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని చెప్పారు. ఈ సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరించడానికి తమ ప్రభుత్వం ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం చేయడం, రాష్ట్ర వనరులను రక్షించడంలో, నేరస్థులను బాధ్యులను చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ కల్యాణ్ రాసుకొచ్చారు.