బిలియనీర్ పారిశ్రామికవేత్త గౌతం అదానీకి ఇది షాకింగ్ న్యూసే. సోలార్ పవర్ కాంట్రాక్ట్‌ల కోసం ఆంధ్రప్రదేశ్, ఒడిశా సహా ఇతర రాష్ట్రాల అత్యున్నత స్థాయి వ్యక్తులకు దాదాపు రూ. 2,200 కోట్ల లంచం ఇచ్చినట్టు అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ సహా ఇతరులపై అమెరికాలో అభియోగాలు నమోదైన వేళ సెక్యూరిటీస్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) రంగంలోకి దిగింది. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ నుంచి గ్రాండ్ జ్యూరీ ఆదేశాలను అదానీ గ్రూప్ ఉల్లంఘించిందో, లేదో తెలుసుకునేందుకు సెబీ ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. అలాగే, షేర్ల ధరలను ప్రభావితం చేయగలిగే సమాచారాన్ని తప్పనిసరిగా వెల్లడించాలన్న నిబంధనలను అదానీ గ్రూప్ ఉల్లంఘించిందా? అన్న కోణంలో విచారిస్తున్నట్టు తెలిసింది. లంచం ఆరోపణలపై అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ దర్యాప్తు సమాచారాన్ని సమగ్రంగా వెల్లడించడంలో అదానీ గ్రీన్ ఎనర్జీ విఫలమైందా? అన్న విషయాన్ని తెలుసుకోవాలని స్టాక్ ఎక్స్‌చేంజ్ అధికారాలను సెబీ కోరినట్టు సమాచారం.
అసెంబ్లీలో ఆర్ధిక కమిటీల ఎన్నిక ..
ఎన్నికైన సభ్యుల పేర్లను శాసనసభలో ప్రకటించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఫైనాన్షియల్ కమిటీల్లో భాగంగా శాసనసభ ప్రజాపద్ధుల కమిటీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ), శాసనసభ అంచనాల కమిటీ (ఎస్టిమేట్స్ కమిటీ) మరియు ప్రభుత్వ సంస్థల కమిటీ (పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ) లకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను శాసన సభ నుండి సభ్యులను ఎన్నుకున్నారు. రాష్ట్ర శాసనసభ కమిటీ హాల్‌లో శుక్రవారం జరిగిన ఎన్నికల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ సహా కూటమి ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైసీపీ ఓటింగ్‌ను బహిష్కరించింది. అసెంబ్లీ సంప్రదాయకంగా ప్రతిపక్ష పార్టీకి పీఏసీ చైర్మన్ పదవి అప్పగిస్తారన్న భావనతో వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తొలుత నామినేషన్ దాఖలు చేశారు. అయితే శాసనసభలో వైసీపీ ప్రతిపక్ష హోదా లేకపోవడంతో సభ్యుల గెలుపుకు అవసరమైన బలం లేకపోవడంతో కూటమి ఎమ్మెల్యేలు పోటీకి బరిలో దిగారు. కమిటీల్లో సభ్యుడుగా ఎన్నిక అవ్వాలంటే 20 ఓట్లు రావాలి. కానీ వైసీపీకి శాసనసభలో 11 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో నామినేషన్ దాఖలు చేసినప్పటికీ ఓటింగ్‌కు వైసీపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. కాగా, ఓట్ల లెక్కింపు కార్యక్రమం పూర్తయిన తర్వాత కమిటీల వారీగా ఎన్నికైన సభ్యుల పేర్లను శాసనసభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు.
ప్రజా పద్దుల కమిటీ సభ్యులుగా ఆనంద బాబు నక్కా, ఆరిమిల్లి రాధాకృష్ణ, అశోక్ రెడ్డి ముతుముల, బూర్ల రామాంజనేయులు, బి. జయనాగేశ్వర్ రెడ్డి, కొల్లా లలిత కుమారి, శ్రీ రాజగోపాల్ శ్రీరామ్, శ్రీ రామాంజనేయులు పులపర్తి, విష్ణుకుమార్ రాజు పెన్మెత్స ఎంపికైనట్లు ప్రకటించారు.
అంచనాల కమిటీ సభ్యులుగా అఖిల్ ప్రియ భూమా, బండారు సత్యానంద రావు, జయకృష్ణ నిమ్మక, జోగేశ్వరరావు వేగుళ్ల, కందుల నారాయణరెడ్డి, మద్దిపాటి వెంకటరాజు, పార్థసారథి వాల్మీకి, పసిం సునీల్ కుమార్, ఏలూరి సాంబశివరావు ఎంపికైనట్లు ప్రకటించారు.
ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ సభ్యులుగా అయితా బత్తుల ఆనందరావు, ఈశ్వర్ రావు నడికుడిటి, గిడ్డి సత్యనారాయణ, గౌతు శిరీష, కూన రవికుమార్, కుమార్ రాజా వర్ల, ఆర్ వి ఎస్ కే కే రంగారావు (బేబీ నాయన), తెనాలి శ్రావణ్ కుమార్, వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఎంపికైనట్లు ప్రకటించారు.
ఝార్ఖండ్ లో ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య హోరాహోరీ
ఆధిక్యంలో మెజారిటీ మార్కు దాటేసిన ఇండియా కూటమి
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి వెనుకంజ
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. క్షణానికోసారి ట్రెండ్స్ మారుతుండడంతో ఎన్డీయే, ఇండియా కూటమి నేతల్లో టెన్షన్ నెలకొంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైన కౌంటింగ్.. పది గంటల వరకు ఇరు కూటముల మధ్య ఆధిక్యం మారుతూ వచ్చింది. కాసేపు ఎన్డీయే కూటమి లీడ్ లో ఉండగా, మరికాసేపు ఇండియా కూటమి లీడ్ లోకి దూసుకొచ్చింది. పదిన్నరకు ప్రస్తుత ముఖ్యమంత్రి, జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి ఆధిక్యంలో మెజారిటీ మార్క్ దాటేసింది. మొత్తం 81 స్థానాలున్న ఝార్ఖండ్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 41 సీట్ల (మ్యాజిక్ ఫిగర్) లో గెలవాల్సి ఉండగా.. ఇండియా కూటమికి చెందిన అభ్యర్థులు ప్రస్తుతం 51 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఓ దశలో 39 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగిన ఎన్డీయే కూటమి తాజాగా 28 స్థానాలకు పడిపోయింది. అయితే, ఇంకా కౌంటింగ్ చాలా వుంది కాబట్టి, ట్రెండ్ మారే అవకాశం ఉందని, తమ కూటమే గెలుస్తుందని ఎన్డీయే నేతలు ఆశాభావంతో ఉన్నారు.
26 న కలెక్టరేట్ ముందు జరుగు ధర్నాను జయప్రదం చేయండి
విద్యత్ ఉద్యోగుల కళాభారతిలో జరుగుతున్న అవినీతి పై విజిలెన్స్ విచారణ చేపట్టాలి
విశాలాంధ్ర- అనంతపురం : విద్యుత్ కళాభారతిలో 12 సంవత్సరాలుగా అవినీతికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి డిమాండ్ చేశారు.
ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్ అధ్యక్షతన జిల్లా ఆఫీస్ బేరర్స్ మరియు ముఖ్య నాయకుల సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ… విద్యుత్ ఉద్యోగుల కళాభారతి లో జరిగే అవినీతిపై విజిలెన్స్ అధికారులు విచారణ జరపాలన్నారు,దాదాపుగా 12 సంవత్సరాలు నుండి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారన్నారు. ఓపెన్ టెండర్లు ద్వారా దాదాపుగా సుమారుగా 70 లక్షల నుండి 80 లక్షల వరకు డిపాజిట్ అవుతున్నాయి,ఆ డబ్బులు ఎక్కడ అనే అయోమయంలో ఉద్యోగులున్నారన్నారు. విద్యుత్ కళాభారతిలో అవినీత ఆక్రమాల పైన అధికారుల నిర్లక్ష్యం పైన నిరసిస్తూ భవిష్యత్తులో విద్యుత్ ఉద్యోగుల కళాభారతిని కాపాడుకునేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని ఏఐటీయూసీ గా హెచ్చరించారు.
అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక,రైతు,ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక,రైతు సంఘాల పిలుపులో భాగంగా నవంబర్ 26 న అనంతపురము కలెక్టరేట్ ముందు జరుగు ధర్నాను జయప్రదం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ చట్టాలను తుంగలోతొక్కి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిందన్నారు. కార్పొరేట్లకు అనుకూలంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి 44 కార్మిక చట్టాలను కొనసాగించాలన్నారు. కనీస వేతనాలు 26 వేలుకు పెంచుతున్నామని కేంద్రం ప్రకటించినా అమలుకుమాత్రం నోచుకోవడం లేదన్నారు. అసంఘటిత రంగ కార్మికులు అయిన ఆటో,హమాలీ,వీధి వ్యాపారస్తులకు సంక్షేమ బోర్డు ఏర్పాటుచేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయకుండా నిలుపుదల చేసే భాధ్యత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. రైతుల నల్ల చట్టాలను రద్దు చేయాలని 13 నెలలు పాటు దేశ రాజధాని డిల్లీలో ఉద్యమం నిర్వహించి 750 మంది రైతులు ప్రాణత్యాగం చేసిన ఓక్క రైతుకు కూడా పారితోషికంగా ఓక్క రుపాయ కూడా ఇవ్వలేదన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం వలన ప్రతి ఏడాది రైతులు 3 లక్షల కోట్లు నష్టపోతున్నారన్నారు. రైతులకు పంట రుణాలు రద్దు చేయని కేంద్ర ప్రభుత్వం గడిచిన 10 సం,,ల్లో కార్పొరేట్ కంపెనీలకు 19 లక్షల కోట్లు రద్దు చేయడం దుర్మార్గమన్నారు, నవంబర్ 26 న కలెక్టరేట్ల ముందు జరుగు ధర్నాను జయప్రదం చేయాలని పిలిపునిచ్చారు,
ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణుడు,జిల్లా ఉపాధ్యక్షులు నాగవేణి,శ్రీనివాసులు,జిల్లా కార్యదర్శులు చిరంజీవి,రాజు,ఇబ్రహీం,ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున,మధ్యాహ్న భోజన పథకం యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ సి ఎం భాషా తదితరులు పాల్గొన్నారు.
గర్భిణీలు ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా శ్రద్ధ తీసుకోవాలి.. డాక్టర్ ప్రియాంక, చిన్నప్ప
విశాలాంధ్ర ధర్మవరం : గర్భిణీలు తమ ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా శ్రద్ధ తీసుకోవాలని డాక్టర్ ప్రియాంక, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు చిన్నప్ప, కార్యదర్శి మంజునాథ్, ఉపాధ్యక్షుడు వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని కొత్తపేటలో గల పట్టణ ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీని వైద్యులు, సిస్టర్ల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రియాంక అధ్యక్షులు చిన్నప్ప కార్యదర్శి మంజునాథ్ మాట్లాడుతూ ప్రతి మహిళ గర్భిణీగా ఉన్నప్పుడు నెలవారీగా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు, టీకాలు పొందాలన్నారు. అదేవిధంగా కుటుంబ సభ్యులు అందరూ కూడా గర్భిణీ స్త్రీలకు అన్ని సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. పౌష్టిక ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. తదుపరి ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవం పొందాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా వర్తిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి విరాళం అందించిన వరప్రసాద్ కు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు రామకృష్ణ, గట్టు వెంకటేష్, జింక చిన్నప్ప, ఆసుపత్రి సిబ్బంది, గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి అక్రమార్కులపై చర్యలు తథ్యం..పవన్ కల్యాణ్
ఉపాధి హామీ పథకం పనులను గత ప్రభుత్వం అస్తవ్యస్తం చేసిందని, ఆ నిధులను పెద్ద మొత్తంలో దారి మళ్లించారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. జాబ్ కార్డుల జారీలో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవకతవకలు, నిర్లక్ష్య ధోరణిపై శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. పలు ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి పవన్ సమాధానం ఇచ్చారు. ఉపాధి పథకం అనేది డిమాండ్ ఆధారిత పథకమన్నారు. నైపుణ్యం లేని మ్యానువల్ పనిని చేయడానికి కూలీనాలీ జనానికి 100 రోజలు పని కల్పిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో ఈ పనులు చేపడుతున్నామని అన్నారు. ఎన్ఆర్ఈజీఎస్‌లో కొత్తగా పని కోసం నమోదు చేసుకున్న వారికి జాబ్ కార్డులు ఇస్తున్నామని, 100 రోజులు పని కల్పించని స్థితిలో 15 రోజులు వేతనం పరిహారం చెల్లిస్తున్నామన్నారు. జాబ్ కార్డుల జారీలో జరిగిన అవకతవకలపై తప్పని సరిగా చర్యలు తీసుకుంటామన్నారు.
అక్రమార్కులపై చర్యలు తప్పవు..
అసెంబ్లీలో సభ్యలు చెప్పిన విషయాలను నోట్ చేసుకున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. 4500 కోట్ల రూపాయలు వేజ్, మెటీరియల్ కాంపౌండ్‌తో నిధులు వచ్చాయన్నారు. జగన్ ప్రభుత్వం ₹13వేల కోట్లు దారి మళ్లించిందని.. ఈ అంశంపై లోతైన విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ పనులను ఉపాధిహామీతో అనుసంధానం చేస్తామన్నారు. కాలువల్లో తూడు తొలగింపు పనులను డిస్ట్రిబూటర్ కమిటీలు చేపడుతాయని, కానీ తూడు తొలగింపు పనులు అత్యవసరమైతే స్థానిక ఎమ్మెల్యే కోరితే ఆ పనులు చేపట్టవచ్చన్నారు. ఇక శ్మాశాన వాటికల్లో పనులను ఉపాధిహామీతో అనుసంధానం చేస్తామన్నారు. పాఠశాలల కాంపౌండ్ వాల్ నిర్మాణాల తర్వాత శ్మశాన వాటికలకూ ప్రహరీ గోడలు నిర్మించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. ఉపాధి హామీ కూలీలకు మౌలిక సదుపాయాల కల్పనకు కట్టుబడి ఉన్నామని, తాగునీరు, వైద్యం తప్పనిసరిగా ఏర్పాటు చేస్తామన్నారు.
పేదలకు చీరలు,దుప్పట్లు పంపిణీ
డాక్టర్ అక్కేన శ్రీరామ్మూర్తి
విశాలాంధ్ర – విజయనగరం అర్బన్ : భగవాన్ శ్రీ సత్య సాయి 99 జయంతిని పురస్కరించుకొని శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చైర్మన్,డాక్టర్ అక్కేన శ్రీరామ్మూర్తి ఈ రోజు నిరుపేదలైన 300 మందికి చీరలు,దుప్పట్లు, బియ్యం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్య సాయి జయంతి సందర్భంగా ప్రతి ఏడాది శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నిరుపేదలైన రోగులకు ఉచితంగా శస్త్ర చికిత్సలు,లాప్రోస్కోపి చికిత్సలు చేసి ఉచితంగా మందులు అందజేయడం జరుగుతుందని తెలిపారు.ప్రతి ఏడది వలె ఈ ఏడాది కూడా సత్యసాయి 99వ జయంతిని పురస్కరించుకొని 99 రోజులపాటు 99 మంది నిరుపేద రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆయన జయంతి రోజున నిరుపేదలకు చీరలు,దుప్పట్లు, బియ్యాన్ని అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీరామమూర్తి సతీమణి అక్కేన లక్ష్మి, ఆయన కోడలు డాక్టర్ మాధురి, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.
గౌతమ్ అదానికి బినామీ నరేంద్ర మోడీ అవినీతికి పాల్పడిన లంచం తీసుకున్న నేరస్తులే….
సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సి. జాఫర్
విశాలాంధ్ర అనంతపురం : గౌతమ్ అదానికి బినామీ నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నాడని, అవినీతికి పాల్పడిన లంచం తీసుకున్న వాళ్లు నేరస్తులే అని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సి. జాఫర్ పేర్కొన్నారు. సోలార్ విద్యుత్ కోసం ముడుపులు చెల్లించిన గౌతమ్ ఆదానిని అరెస్ట్ చేయాలని శుక్రవారం స్థానిక టవర్ క్లాక్ వద్ద ఆదాని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి సి. జాఫర్, సహాయ కార్యదర్శి పి. నారాయణస్వామి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, ఏ ఐ టి యు సి, జిల్లా ప్రధాన కార్యదర్శి జె. రాజారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో అనంతపురం జిల్లా మొట్టమొదటిసారిగా అదాని అవినీతిపై నిరసన కార్యక్రమాలు చేపడుతూ గౌతమ్ ఆదాన్ని దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులు అడ్డుకుంటుండగానే ఆదాని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి సి. జాఫర్ మాట్లాడుతూ…. సౌర విద్యుత్ ప్రాజెక్టు పేరుతో అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 6,300 కోట్లు ,అమెరికాలోని బ్యాంకులు, అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి 1,500 కోట్లు పెట్టుబడి సేకరించిందన్నారు. అమెరికాలో పెట్టుబడులు సేకరించిన కంపెనీలో ఆ దేశంలోని ఫారిన్ కరెప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఈ చట్టం ప్రకారం ఏ దేశంలో లంచమిచ్చినా నేరం అవుతుందన్నారు. భారతదేశంలో కేంద్ర పాలిత ప్రాంతంతోపాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా, ఛత్తీస్గడ్,ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య మంత్రులకు లంచాలు ఇచ్చినట్టు అమెరికా న్యూయార్క్ కోర్టులో కేసు నమోదు చేసి అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయిందన్నారు . గౌతమ్ అదాని స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు 2021 ఆగస్టు, ఏడో తేదీన కలిసి 1,750 కోట్లు ముడుపులు ముట్టినట్లు నిర్ధారణ అయిందన్నారు. 2016లో ఆదాని సంస్థ 20 మెగావాట్లు ఉండగా, 2018లో 2000 మాగావాట్లు, 2025 నాటికి 25 వేల మెగావాట్లు విస్తరింప చేస్తున్నట్లు ఆయన ప్రకటించడం జరిగిందన్నారు. ఆర్థికపరమైన అరాచకాల్లో షేర్లను పెంచడం జరిగిందన్నారు. ఈ అవినీతిపై అమెరికా న్యూయార్క్ కోర్టు కేసు పెట్టడం జరిగిందన్నారు. అతనితోపాటు తమ్ముని కుమారుని పైన మొత్తం ఎనిమిది మంది పైన కేసు నమోదు చేశారన్నారు. రెండు లక్షల ,24 వేల కోట్ల రూపాయలు షేర్లు విలువ పడిపోయిందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం పరువు ప్రతిష్టను మంటగలిపిన అధానీని అరెస్ట్ చేయాలన్నారు. ఈ విషయంపై నరేంద్ర మోడీ నైతిక బాధ్యత వహించాలన్నారు. ఈ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి. ప్రభుత్వాలు నేర సామ్రాజ్యాన్ని అరికట్టే ప్రయత్నం చేయడం లేదన్నారు. అందులో భాగంగా దాని దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగిందన్నారు. గౌతమ్ ఆదాయాన్ని అరెస్ట్ చేయాలని కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శిలు రమణయ్య, అలిపిర, పెద్ద ఎత్తున కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
డిసెంబర్ 1న సాహితీవేత్తలకు పోటీలు
జిల్లా రచయిత సంఘం సభ్యులు జయసింహ, సత్య నిర్ధారన్
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని బత్తలపల్లి రోడ్డు పోలా ఫంక్షన్ హాలు నందు శ్రీ సత్య సాయి జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు జాబిలి చాంద్ బాషా ఆదేశాను ప్రకారం ఈనెల 1వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు జిల్లా రచయితల సంఘము, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, యువర్ ఫౌండేషన్, ధర్మాంబా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం, సోమల రాజు ఫౌండేషన్-బెంగళూరు, మెహర్ బాబా సెంటర్, వృద్ధుల వైద్యాశ్రమం-ధర్మవరం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా రచయిత సంఘం సభ్యులు జయసింహ, సత్య నిర్ధారన్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ డిసెంబర్ మూడవ తేదీ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం పురస్కరించుకొని సాహితీవేత్తల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. మనో బంధు, గౌతమ బుద్ధ హరిత వికాస వృద్ధుల విడదీ, పర్యాటక కేంద్రం, స్వచ్ఛంద సంస్థల సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వృద్ధాప్యము, చేనేత అంశములపై కవితతో పాటు గేయం వ్యాస ప్రక్రియలలో పోటీలు ఉంటాయని తెలిపారు. రాయలసీమ జిల్లాల నుండి ఆసక్తి గల సాహితీవేత్తలు పాల్గొనవచ్చునని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ (వాట్సాప్ నెంబర్) 9494018465 కు సంప్రదించాలని తెలిపారు.
ఆర్టీసీ ధర్మవరం డిపో ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులుగా తిరుమలేష్ ఎంపిక
విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం ఆర్టీసీ డిపో ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షునిగా తిరుమలేష్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఈ ఎంపిక ఆర్టీసీ డిపో ఆవరణంలో రీజినల్ ఉపాధ్యక్షులు నరసింహులు, జిల్లా అధ్యక్షుడు నాగార్జున రెడ్డి, సీనియర్ నాయకులు శ్రీరాములు సమక్షంలో నిర్వహించారు. తదుపరి ఏకగ్రీవంగా ఎంపికైన అధ్యక్షుడు తిరుమలేష్ కు రీజినల్ ఉపాధ్యక్షులు నరసింహులు, జిల్లా అధ్యక్షులు నాగార్జున రెడ్డి, డిపో కార్యదర్శి ముస్తఫా, డిపో చైర్మన్ సుమో సీన, సిడిసి మల్లికార్జున,గ్యారేజ్ సహకార దర్శి భాస్కర్ తో పాటు అందరూ శుభాకాంక్షలు తెలియజేశారు.