Monday, December 9, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆర్టీసీ ధర్మవరం డిపో ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులుగా తిరుమలేష్ ఎంపిక

ఆర్టీసీ ధర్మవరం డిపో ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులుగా తిరుమలేష్ ఎంపిక

విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం ఆర్టీసీ డిపో ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షునిగా తిరుమలేష్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఈ ఎంపిక ఆర్టీసీ డిపో ఆవరణంలో రీజినల్ ఉపాధ్యక్షులు నరసింహులు, జిల్లా అధ్యక్షుడు నాగార్జున రెడ్డి, సీనియర్ నాయకులు శ్రీరాములు సమక్షంలో నిర్వహించారు. తదుపరి ఏకగ్రీవంగా ఎంపికైన అధ్యక్షుడు తిరుమలేష్ కు రీజినల్ ఉపాధ్యక్షులు నరసింహులు, జిల్లా అధ్యక్షులు నాగార్జున రెడ్డి, డిపో కార్యదర్శి ముస్తఫా, డిపో చైర్మన్ సుమో సీన, సిడిసి మల్లికార్జున,గ్యారేజ్ సహకార దర్శి భాస్కర్ తో పాటు అందరూ శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు