Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపెనుకొండ డీఎస్పీగా శివప్రసాద్ బాధ్యతల స్వీకరణ..

పెనుకొండ డీఎస్పీగా శివప్రసాద్ బాధ్యతల స్వీకరణ..

- Advertisement -

విశాలాంధ్ర – పెనుకొండ: పెనుకొండ డీఎస్పీగా శివప్రసాద్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. బదిలీపై ఆయన పెనుకొండకు వచ్చారు. గతంలో అనంతపురం మహిళా విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వహించిన ఆయన, తాజాగా పెనుకొండ డివిజన్‌ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం డీఎస్పీ శివప్రసాద్ మాట్లాడుతూ, డివిజన్‌ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా శాంతిభద్రతలను కాపాడేందుకు కృషి చేస్తానన్నారు. అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బందితో సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని తెలిపారు. పోలీసు శాఖ ప్రతిష్ఠను మరింత పెంచడంతో పాటు, పెనుకొండ డివిజన్‌ను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు