Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లాకేఎల్ వ్యవసాయ విద్యార్థులకు హైపర్‌ప్యూర్, బ్లింకిట్‌లో ఉద్యోగాలు

కేఎల్ వ్యవసాయ విద్యార్థులకు హైపర్‌ప్యూర్, బ్లింకిట్‌లో ఉద్యోగాలు

- Advertisement -

విశాలాంధ్ర -విజయవాడ (వన్ టౌన్): కేఎల్ యూనివర్సిటీ కేఎల్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ 2023 బ్యాచ్ విద్యార్థులకు హైపర్‌ప్యూర్ బై జొమాటో, బ్లింకిట్ సంస్థల్లో ఉద్యోగాలు లభించాయి. క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో 60 మంది దరఖాస్తు చేసుకోగా, 33 మంది తదుపరి దశలకు ఎంపికయ్యారు. టెక్నికల్, హెచ్‌ఆర్ ఇంటర్వ్యూల అనంతరం అబ్దుల్ వసీమ్, వై. భార్గవ్ కుమార్, ఎస్.కె. ఆసిఫ్ అలీ, బి.ఎస్.ఎస్. ప్రణవ్, బి. గురువయ్య, బి. హర్షల్, ఎస్. లేఖనా రెడ్డి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరికి ఏడాదికి రూ.4 లక్షల వేతన ప్యాకేజీ లభించనుంది. ప్లేస్‌మెంట్ ఇన్‌చార్జిలు డాక్టర్ కె. రంజిత్, డాక్టర్ వినయ్ కుమార్, వ్యవసాయ డైరెక్టర్ డాక్టర్ రత్న ప్రసాద్, విభాగాధిపతి డాక్టర్ బాలకృష్ణ విద్యార్థులను అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు