నూతన ఆవిష్కరణల్లో జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయికి వెళ్ళాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర -అనంతపురం : విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంచాలని, వారిలో శాస్త్రీయ విధానంలో ఆలోచన శక్తిని, నూతన ఆవిష్కరణలు చేసే సామర్థ్యాలను పెంపొందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి ఆదేశించారు. గురువారం అనంతపురం నగరంలోని శారద నగర్ లో ఉన్న జిల్లా సైన్స్ మ్యూజియంలో సమగ్ర శిక్ష మరియు విద్యాశాఖ ఆధ్వర్యంలో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ను ఏర్పాటు చేయడం జరగగా, జిల్లాలో 21 ల్యాబ్ లను మంజూరు చేయగా, అందులో 19 ల్యాబ్స్ ప్రస్తుతం పని చేయడం జరుగుతుండగా, వాటిలో 18 ప్రభుత్వ పాఠశాలల్లో, ఒక ప్రైవేట్ పాఠశాలలో ల్యాబ్స్ నడుస్తున్నాయన్నారు. నిబంధనల ప్రకారం ఆయా పాఠశాలల అటల్ టింకరింగ్ ల్యాబ్స్ నోడల్ అధికారులకు వర్క్ షాప్ నిర్వహించాలని, వారికి ప్రాథమిక శిక్షణ ఇవ్వాలని, శిక్షణ తీసుకున్న వారు వారి పాఠశాలలో మరొకరికి శిక్షణ ఇవ్వాలని, శిక్షణకు సంబంధించి షెడ్యూల్ సిద్ధం చేయాలని, నోడల్ టీచర్లతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలన్నారు. అన్ని పాఠశాలల్లో ల్యాబ్స్ కార్యకలాపాలను నిత్యం కొనసాగించాలని ఆదేశించారు. విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని కలిగించి వారిలో సైన్స్ దృక్పథాన్ని ఏర్పాటు చేయాలని, వారికి సైన్స్ ల్యాబ్ ని అందుబాటులో ఉంచాలన్నారు.
ఈ సమావేశంలో డీఈవో ప్రసాద్ బాబు, సమగ్ర శిక్ష ఏపీసి నాగరాజు, సైన్స్ ఆఫీసర్ బాలమురళీకృష్ణ, డిపిఎం నాగరాజు, ఆయా కళాశాలల హెడ్ మాస్టర్లు, ప్రిన్సిపాల్స్, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంచాలి
తపాలా ఆఫీసులో ఖాతాల కొరకు ప్రత్యేక శిబిరాలు
ఆర్ఎస్ పోస్ట్మాస్టర్ రహీమున్నిసా
విశాలాంధ్ర ధర్మవరం : తపాలా ఆపీసులో ఖాతాల కొరకు ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నామని ఆర్ఎస్ పోస్ట్మాస్టర్ ఎస్ రహీ మున్నీసా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను పొందుటకు ప్రజలకు సహకారం అందించుటలో తపాలా శాఖ ఎల్లవేళలా ముందుంటుందని తెలిపారు. సంక్షేమ పథకాల నిమిత్తమై తపాలా పీసులో కానీ లేదా బ్యాంకులో కానీ ఖాతాలకు ఎన్ పిసిఐ అనుసంధానం చేసి ఉండవలెనని తెలిపారు. ఇందు నిమిత్తమై తపాలా విచారణ సూపర్డెంట్ ఆదేశాను ప్రకారం కొత్తపేటలో గల ధర్మవరం ఆర్ఎస్.సబ్ పోస్ట్ ఆఫీస్ నందు ప్రత్యేక శిబిరాలను ఈనెల 22వ తేదీ నుండి 30 వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా ప్రజలకు తపాలా సిబ్బంది అందుబాటులో ఉండి సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
విద్యుత్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
దరఖాస్తు చేసుకున్న రైతులకు ట్రాన్స్ఫార్మర్లు, వైర్లు అందించేందుకు అధికారులు కృషి చేయాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర- అనంతపురం : విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని, దరఖాస్తు చేసుకున్న రైతులకు ట్రాన్స్ఫార్మర్లు, వైర్లు అందించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి పేర్కొన్నారు. అనంతపురం రేడియో స్టేషన్ లో గురువారం ఉదయం 7:45 గంటల నుంచి 8:15 గంటల వరకు ఆకాశవాణి ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని విద్యుత్ సమస్యల అంశంపై విద్యుత్ శాఖ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి రైతులకు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న రైతు సోదరులకు ట్రాన్స్ఫార్మర్లు, వైర్లు త్వరితగతిన అందించేందుకు జిల్లా అధికారులు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల రైతుల, ప్రజల నుండి 19 ఫోన్ కాల్స్ స్వీకరించి వారి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా చూడాలని, ఏ రైతు విద్యుత్తు సమస్య వలన పంట నష్టం జరగకుండా అధికారులంతా కలిసికట్టుగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ విద్యుత్ శాఖ అధికారులకు పలు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ బి.విన్నూత్న, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామకృష్ణ, ఏఈ భాను ప్రకాష్, జేఈ ముని రాజా, డైరెక్టర్ ఆకాశవాణి అనంతపురం నాగేశ్వరరావు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.
అభ్యుదయ కాలనీ 100 కుటుంబాలు సిపిఐ లో చేరిక
కాలనీ సమస్యలపై దృష్టి సారిస్తాం సిపిఐ జిల్లా కార్యదర్శి సి. జాఫర్
విశాలాంధ్ర – అనంతపురం : అభ్యుదయ కాలనీ సమస్యలపై దృష్టి సారిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి సి. జాఫర్ పేర్కొన్నారు. నీలం రాజశేఖర్ రెడ్డి భవనం సిపిఐ జిల్లా కార్యాలయం నందు గురువారం సిపిఎం అభ్యుదయ కాలనీ 100 కుటుంబాలు సిపిఐ నగర్ సమితి ఆధ్వర్యంలో భారత్ కమ్యునిస్ట్ పార్టీ (సీపీఐ) చేరిక కండువా వేసి సిపిఐ జిల్లా కార్యదర్శి సీ.జాఫర్ ఆహ్వానించారు. ఈ సమావేశంలో సిపిఐ నగర సహా కార్యదర్శి రమణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి సీ.జాఫర్ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణ స్వామి, నగర కార్యదర్శి శ్రీరాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలు, కష్టజీవులు, కర్షకులు, కార్మికుల పార్టీ సిపిఐ అని, సుదీర్ఘ పోరాటాలు, త్యాగాలతో నిర్మితమైన ఎర్ర జెండా పార్టీకి ఎదురులేదని, మరో వందేళ్లైనా చెక్కు చెదరకుండా అజేయంగా నిలుస్తుందని, నిరంతరం సమరశీల పోరాటాలు సాగిస్తున్న సిపిఐ ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో పరిమితమైన పార్టీ కాదని స్పష్టం చేశారు. పార్టీ పటిష్ఠతకోసం శక్తివంచన లేకుండా క్రమశిక్షణతో కృషి చేస్తామన్నారు. పీడిత ప్రజల సమస్యల పరిష్కారం కోసం సిపిఐ పార్టీ ఎప్పుడు ముందుంటుందన్నారు. నగరంలో అనేక కమ్యూనిస్టు పార్టీ కాలనీ నిర్మాణంలో కమ్యూనిస్టు పార్టీ నాయకుల కృషి ఎంతో ఉందన్నారు. దౌర్జన్యపరులకు భు దళారులకు, కబ్జాదారులకు సిపిఐ పార్టీ పోరాటాలు ఎప్పుడు ముందుంటుందని రాబోయే కాలంలో అభ్యుదయ కాలనీ సమస్యలు పరిష్కరించే వైపుగా దృష్టి పెడతామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు లింగమయ్య సహాయ కార్యదర్శులు రమణయ్య అలిపిర, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సంతోష్ కుమార్, ఇన్సఫ్ నగర అధ్యక్షుడు చాంద్ బాషా, నగర కార్యవర్గ సభ్యులు మున్నా, నవ యుగ శాఖకాలనీ రాజు,నాగప్ప అభ్యుదయ కాలనీ శాఖ కార్యదర్శి లక్ష్మీనారాయణ, నాగభూషణం, పద్మ తదితరులు పాల్గొన్నారు..
ప్రపంచ ప్రిమెచ్యూరిటీ దినోత్సవం
విశాలాంధ్ర -అనంతపురం : ప్రపంచ ప్రీమెచ్యూరిటీ వారం సందర్భం గా ముఖ్య అతిథి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈబీదేవి పాల్గొన్నారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ… నెలలు నిండా కుండా పుట్టిన పిల్లలకు ఎలాంటి జాగ్రతలు తీసుకోవాలి అని వివరించారు. పుష్పగిరి కంటి ఆసుపత్రి కి సంబంధించి సూర్యప్రకాష్ సీఈఓ ,ఒపీతోమెట్రిస్ట్ హెడ్ బాలకృష్ణ ప్రేమెటురిటి ఉన్న పిల్లల్లో ఎలాంటి కంటి పరీక్షలు చేయించు కోవాలి అని వివరించారు . అనంతరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి త్వరిత చికిత్స కేంద్రము నందు రాష్ట్రీయ బాల స్వస్థ ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా కార్యక్రమ జిల్లా పర్యవేక్షణ అధికారి డాక్టర్ నారాయణస్వామి ఆధ్వర్యంలో పుష్పగిరి కంటి ఆసుత్రి కడప వారి సహకారంతో బరువు తక్కువగా పుట్టిన, నెలలు నిండక ముందే పుట్టిన పిల్లలు, మరియు గుండె లోపం, రక్తహీనత ఇతర వ్యాధులతో బాధపడుతున్న పిల్లలను సమీకరించి వారికి కంటి రెటీనా పరీక్షలను ఃరెడ్ కామ్ః అనే పరికరంతో స్క్రీన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 21 మంది పిల్లలను పరీక్షించగా ,అందులో 10 మంది పిల్లలకు సమస్య ఉన్నట్టు గుర్తించారు. వీరిని మరల రెండు వారాల తర్వాత పరీక్షించి రెటీనా మెచ్యూరిటీ పొందకపోతే వీరికి ఉచితంగా చికిత్స చేయించబడును. ఈ కార్యక్రమం డాక్టర్ మానస , డాక్టర్ దివ్య ,చిన్న పిల్లల వైద్య నిపణురాలు డా. శ్రీవిద్య, కంటి పరీక్షా నిపుణురాలు జ్ఞాన ప్రసన్న, మేనేజర్ రజిత, స్టాఫ్ నర్సు మౌనిక , సోషల్ వర్కర్ రాజేశ్వరి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు .
శానిటేషన్ వర్కర్లకు నాలుగు నెలల వేతనాలు తక్షణమే విడుదల చేయండి
మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మాణిక్యరావు కు ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి జే.రాజారెడ్డి వినతులు
విశాలాంధ్ర – అనంతపురం : అనంతపురం ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ లో, మెడికల్ కళాశాలలో పనిచేసే శానిటేషన్ వర్కర్ల కు పెండింగ్ లొ ఉన్న 4నెలల వేతనాలు తక్షణమే విడుదల చేయాలని హాస్పిటల్ సూపర్డెంట్ కె.ఎస్. ఎస్. వెంకటేశ్వరరావు ,మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ మాణిక్యరావు కి ఏపీ మెడికల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి జే.రాజారెడ్డి ఆధ్వర్యంలో గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వాసుపత్రి, మెడికల్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ సిబ్బంది ప్రతిరోజు రోగుల మధ్య తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తూ ఉంటారన్నారు. ఇటువంటి కార్మికులకు జీతాలను పెండింగ్లో పెట్టడం సిగ్గుచేటు అన్నారు. బకాయి వేతనాలు చెల్లించకుంటే ఆందోళన చేయాల్సివస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర అధ్యక్ష కార్యదర్శులు జి.చిరంజీవి,వికే కృష్ణుడు, ఏపీ మెడికల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి మనోహర్,జిల్లా నాయకులు వెంకటేష్,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
చక్కటి కంటిచూపుతోనే మెరుగైన విద్య లభిస్తుంది..
కంటి వైద్య నిపుణులు, రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి డాక్టర్ ఎస్. నరసింహులు
విశాలాంధ్ర ధర్మవరం;; చక్కటి కంటిచూపుతోనే మెరుగైన విద్య లభిస్తుందని కంటి వైద్య నిపుణులు రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి డాక్టర్ ఎస్. నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని జీవనజ్యోతి ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు గల విద్యార్థులకు”జాతీయ హ్రస్వ దృష్టి వారోత్సవాలు” ముగింపు కార్యక్రమంను పురస్కరించుకొని కంటి చూపు సమస్యలు వాటి పరిష్కారం పై పలు విషయాలను పాఠశాల ప్రార్థన సమయంలో తెలియజేశారు. అదేవిధంగా కంటిని ఎలా కాపాడుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కంటికి భద్రత ఎలా ఇవ్వాలి అన్న విషయాన్ని విశదీకరించారు. అనంతరం డాక్టర్ నరసింహులు మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులందరికీ కంటి చూపు సక్రమంగా ఉంటే చక్కటి విద్య లభిస్తుందని, అప్పుడే ఉత్తమ పరీక్ష ఫలితాలు లభించే అవకాశం ఉన్నాయని తెలిపారు. ప్రతి తరగతి లోని ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల యొక్క కంటి చూపు పై శ్రద్ధను కనపరచాలన్నారు. ఇందుకు తల్లిదండ్రులు కూడా సమిష్టిగా తమ పిల్లల పట్ల తప్పనిసరిగా శ్రద్ధను చూపాలని తెలిపారు. తదుపరి విద్యార్థుల యొక్క దృష్టి లోపాలను గుర్తించి కంటి డాక్టర్ సలహాతో వైద్య చికిత్సలు చేయించి కంటి అద్దాలను ఉపయోగించాలని తెలిపారు. నా కూతురు అయిన మధు బిందు, పూర్వ విద్యార్థి చంద్రశేఖర్ రెడ్డి తాము చదువుకున్న జీవన్ జ్యోతి లో ఈ కార్యక్రమం నిర్వహించడం నిజంగా అభినందించదగ్గ విషయమని వారు తెలిపారు. చదువులో బాగా రాణించాలి అంటే చక్కటి కంటిచూపు ఎంతో అవసరమని, టీవీ, సెల్ ఫోన్ లకు పూర్తిగా దూరంగా ఉండాలని తెలిపారు. ఇవి అలవాటు పడితే చదువులో కూడా వెనుక పడే అవకాశం ఉందని తెలిపారు. విద్యార్థులు ఎవరైనా కంటికి దగ్గరగా పెట్టుకుని చదువుతూ ఉంటే దృష్టిలోపముగా గుర్తించవలెనని తెలిపారు. అదేవిధంగా తరగతి గదిలో నల్ల బోర్డు పై రాసిన అక్షరాలు కనపడని వారు కూడా దృష్టిలోపం ఉన్న వారిగా గుర్తించాలని తెలిపారు. కంటి చూపు పట్టిక ద్వారా కూడా కంటి దోషమును గుర్తించవచ్చునని తెలిపారు. అనంతరం పాఠశాల లోని 170 మంది విద్యార్థిని విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలను నిర్వహించి వారి వారి యొక్క దృష్టిలోపమును తెలియజేయడం జరిగిందన్నారు. అనంతరం కరపత్రాలను విడుదల చేశారు. చిన్నారులకు ఆట వస్తువులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ సుజాత, కర్రీస్పాండెంట్ రెన్సి, పూర్వపు విద్యార్థి, ఎంటోడు ఫార్మా సిటికల్ లిమిటెడ్ మెడికల్ రిప్రజెంటేటివ్ చంద్రశేఖర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, బోధ నేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు..
గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి
విశాలాంధ్ర ధర్మవరం : గ్రంథాలయ వారోత్సవాలు ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు వైభవంగా నిర్వహించుకోవడం జరిగిందని గ్రంథాలయ అధికారిని సౌభాగ్యవతి అంజలి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన గ్రంథాలయ శాఖలో చివరి రోజు బుధవారం వివిధ పోటీలలో పాల్గొని విజేతలైన వారందరికీ బహుమతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యువర్స్ ఫౌండేషన్ బండ్లపల్లి రంగనాథ్, ఎల్ఐసి నాగరాజ్, హెడ్మాస్టర్ కవిత, కలవల శ్రీరామ్ పాల్గొన్నారు. అనంతరం అంజలి సౌభాగ్యవతి, ముఖ్య అతిథులు మాట్లాడుతూ గ్రంథాలయమును వయస్సుతో నిమిత్తం లేకుండా అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. చదువుతోపాటు నిరుద్యోగులకు కావలసిన అన్ని స్టడీ మెటీరియల్ కూడా లభ్యమవుతాయని తెలిపారు. అంతేకాకుండా గ్రంథాలయ సభ్యత్వమును ఉచితంగా పొందే అవకాశం ఉందని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులతో పాటు నిరుద్యోగులు కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ వారోత్సవాలకు సహకరించిన వారందరికీ పేరుపేరునా వారు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది శివమ్మ, రమణ నాయక్, గంగాధర్ లతోపాటు అధిక సంఖ్యలో పాఠకులు పాల్గొన్నారు.
జాతీయ వాలీబాల్ స్థాయికి ఎంపికైన మున్సిపల్ విద్యార్థులు… హెడ్మాస్టర్ పద్మజ
విశాలాంధ్ర ధర్మవరం : జాతీయ వాలీబాల్ స్థాయి పోటీలకు పట్టణంలోని కొత్తపేటలో గల ఎస్పీసీఎస్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపిక కావడం జరిగిందని హెడ్మాస్టర్ పద్మజ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా పీలేరులో జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీయందు మా విద్యార్థులు ప్రతిభను ఘనపరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. జాతీయస్థాయి వాలీబాల్ పోటీలలో ఎస్. చరణ్ కుమార్ యు. పుష్పాంజయ్ ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. ఎంపికైన ఈ విద్యార్థులు డిసెంబర్ 6 నుండి 8 వరకు జరుగు పంజాబ్ రాష్ట్రంలోని లుధియానాలో జరిగే జాతీయస్థాయి వాలీబాల్ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం హెడ్మాస్టర్ తో పాటు, ఎంఈఓ రాజేశ్వరి దేవి,టీచర్ ఆదినారాయణ, భాస్కర్, పీఈటి పద్మాబాయి,ఉపాధ్యాయ బృందం, బోధ నేతర బృందం, పాఠశాల విద్యార్థులు,తల్లిదండ్రులు, పాఠశాల కమిటీ అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.