Wednesday, February 5, 2025
Home Blog Page 132

గుండె జబ్బుల పై అప్రమత్తంగా ఉండాలి

ప్రభుత్వ వైద్య సేవలతో పాటు ఉచిత వైద్య శిబిరాలు కూడా అవసరం

ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్
విశాలాంధ్ర ధర్మవరం : ప్రస్తుత సమాజంలో గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయని వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ తెలిపారు. 25వ వార్డ్ ఇంచార్జ్ భీమినేని ప్రసాద్ నాయుడు ఆధ్వర్యంలో తన అవ్వ భీమినేని నారమ్మ జ్ఞాపకార్థం ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎర్రగుంట సర్కిల్ వద్ద ఉన్న శిశు సంక్షేమ కార్యాలయంలో కిమ్స్ సవేరా సహకారంతో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాన్ని పరిటాల శ్రీరామ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం డిఎస్పి శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలకు ఉచితంగా గుండె పరీక్షలుచేయడంతో పాటు మందులు కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలోమనిషి జీవితం యాంత్రికంగా మారుతోందని,మానసిక ఒత్తిడి కూడా బాగా పెరిగిందన్నారు. అందుకేగుండె నొప్పితో మరణాలు కూడా సంభవిస్తున్నాయని అన్నారు. గుండె జబ్బులను ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇందుకు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ వైద్య సేవలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రముఖుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం చాలా అవసరం అన్నారు. ప్రజలు తమ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్, వైద్యులతో పాటు టిడిపి నాయకులు ,కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఘనంగా 107 వ ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి

విశాలాంధ్ర ధర్మవరం : ఇందిరా గాంధీ 107 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నట్లు గ్రంథాలయ అధికారిని సౌభాగ్యవతి అంజలి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన గ్రంథాలయ శాఖలో ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు గ్రంధాలయ వారోత్సవాల కార్యక్రమాన్ని వారు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 6వరోజు గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రదీప్ హాజరు కావడం జరిగింది. తొలుత ఇందిరాగాంధీ చిత్రపటానికి అంజలి సౌభాగ్యవతి తో పాటు గ్రంథాలయ సిబ్బంది ముఖ్య అతిథి నాగమణి ఉపాధ్యాయురాలు పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం అంజలి సౌభాగ్యవతి మాట్లాడుతూ ఇందిరాగాంధీ చేసిన సేవలను వారు కొనియాడారు. అదేవిధంగా దిశా చట్టంపై అవగాహనను, మహిళ సాధికారతపై అవగాహనను కల్పించారు. మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా దేశానికి ఎనలేని సేవలను చేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది శివమ్మ, రమణ నాయక్, గంగాధర్ లతోపాటు రాజారెడ్డి, డాక్టర్ శ్రీనివాసులు, విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.

జాతీయ స్థాయి హాకి పోటీలకు చిగిచర్ల పాఠశాల విద్యార్థి

విశాలాంధ్ర ధర్మవరం:: మండల పరిధిలోని చిగిచేర్ల ఉన్నత పాఠశాలలో 10 వతరగతి చదువుతున్న యామిని జాతీయ సాయి హాకీ పోటీలకు ఎంపిక కావడం జరిగిందని పాఠశాల హెడ్మాస్టర్ తిమ్మారెడ్డి, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ప్రతాపరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవంబర్ 3 నుంచి 5 వరకూ నెల్లూరు లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, ఉమ్మడి అంతఃపురం జిల్లా జట్టు ద్వితీయ స్థానం సాదించడం లో కీలక పాత్ర పోషించి, రైట్ ఇన్ లో ఆడి టాప్ గొల్ స్కోరర్ గా నిలిచి రాష్ట్ర సెలెటర్ల దృష్టిని ఆకర్షించి అండర్ 17 ఆంధ్రప్రదేశ్ హాకీ జట్టు కు జాతీయ స్థాయి హాకీ పోటీలలో ప్రాతినిధ్యం వహించే అవకాశం పొందడం జరిగిందన్నారు. జాతీయ స్థాయి పోటీలు నవంబర్ 22 నుంచి 27 వరకు హర్యానాలో జరుగుతాయి అని తెలిపారు. యామిని 6 వ తరగతి నుంచే ప్రతిరోజూ హాకీ సాధన చేస్తూ హాకీ లో అన్ని మెలుకువలు నేర్చుకొని, గత సంవత్సరం కూడా అండర్ 14 స్కూల్ గేమ్స్ హాకీ పోటీలలో కూడా జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం వహించిందన్నారు.
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక ఐన యామిని ని పాఠశాల హెడ్ మాస్టర్ , ఫిజికల్ డైరెక్టర్, ఉపాధ్యాయులు,గ్రామస్తులు, తల్లిదండ్రులు, పాఠశాల కమిటీ వారు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

విగ్రహ పోతా కార్యక్రమాన్ని విజయవంతం చేయండి..

గురు స్వామి పి.జె. విజయ్ కుమార్.

విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని కేశవ నగర్ లో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణమున విగ్రహ పోతా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఇందుకుగాను పంచలోహమునకు బంగారు వెండి నగదు భక్తాదుల నుండి విరాళాల రూపంలో ఇవ్వాలని గురుస్వామి పి.జె.విజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కీర్తిశేషులు కలవల నాగరాజు ఆశీస్సులతో, వారు బ్రతికున్నప్పుడు ఈ ఆలయ నిర్మాణమునకు ఎనలేని సేవలను చేయడం జరిగిందని తెలిపారు. ఈ నూతన అయ్యప్ప స్వామి నిర్మాణం జరుగుతోందని, అయ్యప్ప భక్తుల సహాయ సహకారాలు ఎంతో అవసరమని వారు తెలిపారు. అయ్యప్ప స్వాముల భక్తాదుల కళ్ళ ఎదుట బంగారము వెండి కరిగించి స్వామివారి విగ్రహములో వేయదురని తెలిపారు. ఇటువంటి అవకాశమును భక్తాదులు సద్వినియోగం చేసుకొని, అయ్యప్ప ఆశీస్సులు పొందాలని వారు తెలిపారు. విరాళాలు ఇవ్వదలచిన వారు గురుస్వామి విజయ్ కుమార్ ని కలవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు గురుస్వామి విజయకుమార్ సెల్ నెంబర్ 9395355427 కు సంప్రదించాలని తెలిపారు.

పోక్సో కేసులో ముద్దాయికి 20 సంవత్సరాల జైలు శిక్ష, 20000/- జరిమానా

విశాలాంధ్ర బ్యూరో నెల్లూరు: గుడ్ ట్రయల్ మానిటరింగ్ వ్యవస్థను బలోపేతం చేసి ముద్దాయిలకి కఠిన శిక్షలు పడేలా చేస్తున్న యస్పి జి కృష్ణకాంత్. కొడవలూరు మండల పరిధిలోని మిక్లింపేట లో జరిగిన పోక్సో కేసులో ముద్దాయికి20 సంవత్సరాల జైలు శిక్ష,20000/- జరిమానా విధించిన పోక్సో కోర్టు జడ్జి , .
మహిళలు, చిన్నారుల పై అత్యాచారం, వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించిన యస్పి. జిల్లా యస్పి ఆదేశాల మేరకు, ముద్దాయిలకి కఠిన శిక్షలు పడేలా చేస్తున్న నెల్లూరు పోలీసులు.బాధితులకు, ఫిర్యాదుదారులకు ఖచ్చి
తమైన న్యాయం జరిగేలా సాక్ష్యాధారాలను సేకరించి, నేర నిరూపణ చేస్తున్న జిల్లా పోలీసులు జిల్లా పోలీసుల విశేష కృషి వల్ల ఇప్పటికే చాలా కేసులలో నేరస్థులకు శిక్షలు పడుతున్న వైనం2020ఫిబ్రవరి 20న కొడవలూరు మండలములోని మిక్లింపేట గ్రామానికి చెందిన ఉప్పు రవికుమార్ అనే వ్యక్తి, అదే గ్రామములో వారి ఇంటి ప్రక్కన కాపురము ఉంటున్న 4 సంవత్సరాల పాపను ఆడించు కొంటూ,తన ఇంటిలోనికి తీసుకొని వెళ్లి మైనర్ బాలికపై అత్యాచారం చేసాడు.బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొడవలూరు స్టేషన్ నందు కేసు నమోదు చేయడమైనది. కేసు వివరాలు:జతీ.చీశీ.19/2020 ఖ/ం 376 Aదీ,366-A Iూజ, ూవష 6 తీ/ష 5 (ఎ) శీట ూూజూ Aష్‌-2012 శీట ఖశీసaఙaశ్రీబతీ ూూలి
తగిన సాక్ష్యాలనుపొందుబరచ
గా ప్రాసిక్యూషన్ వారు నేరం రుజువుచేయడంతో మంగళవారం సాయంత్రం పోక్సో కోర్టు వారు ముద్దాయికి 20 సంవత్సరాల జైలు శిక్ష, 20000/-జరిమానా విధించడం జరిగింది.ఈ కేసును అప్పటి నెల్లూరు రూరల్ డిఎస్పీ రాఘవరెడ్డిదర్యాప్తుచేసి చార్జ్ షీట్ దాఖలు చేసినారు. తదుపరిప్రస్తుతఎస్ఐపిశ్రీనివాసులురెడ్డిసాక్ష్యాలనుపొందుబరిచారు.ముద్దాయి పేరుఉప్పు రవికుమార్(20) తండ్రి లేట్ రాఘవులు,మిక్లిం పేటగ్రామం, కొడవలూరు మండలం. ఉంటున్నారు. సదరు కేసును
జిల్లా పోక్సో కోర్టుజడ్జిసిరిపిరెడ్డి సుమవిచారణ పూర్తి చేసి నేడు ముద్దాయికి 20 సంవత్సరాల జైలు శిక్ష, 20,000/- జరిమానా విధించారు.పై కేసులను వాదిం
చడంలో ప్రతిభ కనపరిచిన స్పెషల్ పిపి డి.శైలజ రెడ్డిని, కేసు విచారణ, సాక్ష్యాలు పొందుబరచడంలో ప్రతిభ కనపరిచిన విచారణ అధికారి డిఎస్పి రాఘవరెడ్డిని,మాని
టరింగ్, పోక్సో కోర్ట్ లైజన్ ఆఫీసర్,భాస్కర్ రావు, సాక్షులను కోర్టులోహాజరుప
రచి ప్రొసక్యూషన్ కుసహక
రించినకానిస్టేబుల్ వెంక
టేశ్వర్లు కొడవలూరు పోలీస్ స్టేషన్వారినియస్పిఅభినందించారు.

ఎమ్మెల్యేలను గెలిపించుకోలేని జగన్.. ప్రతిపక్ష హోదా అడగడం సిగ్గుచేటు: షర్మిల

తన అన్న, వైసీపీ అధినేత జగన్ పై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష హోదాకు అవసరమైనంత మంది ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకోలేని జగన్… ప్రతిపక్ష హోదా అడగడం సిగ్గుచేటని అన్నారు. అసెంబ్లీకి వెళ్లని జగన్ కు ఎమ్మెల్యే పదవి ఎందుకని ప్రశ్నించారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం జగన్, కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ఏం చేశారని నిలదీశారు. ఇలాంటి నాయకులను ఎన్నుకునే ముందు ప్రజలు ఆలోచించుకోవాలని అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కడప స్టీల్ ప్లాంట్ కేవలం శంకుస్థాపనలకే పరిమితమయిందని షర్మిల అన్నారు. పేదల కోసం, కడప ప్రాంతం అభివృద్ధి కోసం వైఎస్సార్ దీన్ని తీసుకొచ్చారని చెప్పారు. ఈ ప్లాంట్ ద్వారా 25 వేల మందికి ప్రత్యక్షంగా, లక్ష మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే అవకాశం ఉందని అన్నారు. వైఎస్ చనిపోయిన తర్వాత వచ్చిన నాయకులందరూ కడప స్టీల్ ప్లాంట్ ఊసే లేకుండా చేశారని విమర్శించారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ కూడా కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని విస్మరించారని షర్మిల దుయ్యబట్టారు. మూడేళ్లలో స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టి తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటానని ఆస్కార్ లెవెల్లో జగన్ డైలాగులు చెప్పారని ఎద్దేవా చేశారు. పదేళ్లుగా కడప ఎంపీగా ఉన్న అవినాశ్ రెడ్డి స్టీల్ ప్లాంట్ కోసం పార్లమెంటులో ఏం చేశారని నిలదీశారు. స్టీల్ ప్లాంట్ కేవలం శంకుస్థాపనలకే పరిమితమయిందని అన్నారు. ఇది శంకుస్థాపనల ఫ్యాక్టరీగా, టెంకాయలు కొట్టే ప్రాజెక్ట్ గా మారిందని చెప్పారు. ఃచేయాలి చెల్లి పెళ్లి మళ్లీ మళ్లీః అన్నట్టుగా తయారయిందని ఎద్దేవా చేశారు. మీడియా టెంకాయలు కొట్టి నిరసన వ్యక్తం చేశారు.

ఉదయాన్నే పోలింగ్ బూత్ కు వచ్చి ఓటేసిన ప్రముఖులు..

0

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ ముంబయిలో పోలింగ్ బూత్ లకు సెలబ్రెటీలు క్యూ కట్టారు. ఉదయాన్నే వచ్చి ఓటు వేసి వెళుతున్నారు. భారత రత్న, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఆయన భార్య అంజలి, కూతురు సారా టెండూల్కర్ బాంద్రాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేయడం మనందరి బాధ్యత అని, ముంబైకర్లు అందరూ తప్పకుండా ఓటు వేయాలని సచిన్ కోరారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, సోనూ సూద్, ఫర్హాన్ అక్తర్, రితేశ్ దేశ్ ముఖ్, జెనీలియా తదితర సినీ ప్రముఖులు ముంబైలో ఓటు వేశారు. ఇటీవల హత్యకు గురైన నేత బాబా సిద్దిఖీ కుమారుడు జీశాన్ సిద్దిఖీ బాంద్రా ఈస్ట్ లోని ఓ పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతిసారి తండ్రితో కలిసి ఓటు వేసేవాడిని, కానీ ఈసారి ఒంటరిగా వచ్చానంటూ జీశాన్ భావోద్వేగానికి గురయ్యారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

వాలంటీర్లే లేరు.. వాళ్లకు జీతాలు ఎలా చెల్లించాలి?: మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి

వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదన్న మంత్రి
2023 ఆగస్ట్ నుంచి వాలంటీర్ల వ్యవస్థ ఉనికిలో లేదని వ్యాఖ్య
ఎన్నికలకు ముందు వాలంటీర్లతో రాజీనామాలు చేయించారన్న మంత్రి

ఏపీలో వాలంటీర్ల కథ ముగిసిందనే చెప్పుకోవాలి. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను రెన్యువల్ చేయలేదని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ఆ వ్యవస్థ కనుమరుగైపోయిందని అన్నారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నించిందని బాలవీరాంజనేయస్వామి తెలిపారు. కానీ, లేని వాలంటీర్లకు జీతాలు ఎలా ఇవ్వాలని ప్రశ్నించారు. వాలంటీర్లు విధుల్లో ఉంటే వారిని కొనసాగించేవాళ్లమని చెప్పారు. 2023 ఆగస్ట్ నుంచి వాలంటీర్ల వ్యవస్థ ఉనికిలో లేదని తెలిపారు. ఎన్నికలకు ముందు వారితో రాజీనామా చేయించారని… ప్రస్తుతం రాష్ట్రంలో వాలంటీర్లు లేరని చెప్పారు.

2023 ఆగస్ట్ వరకు వాలంటీర్లను కొనసాగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చిందని… 2023 సెప్టెంబర్ లో వారిని కొనసాగించే జీవో ఇవ్వలేదని తెలిపారు. వారిని కొనసాగిస్తున్నట్టు జీవో ఇచ్చిఉంటే వారి జీతాలను కూడా పెంచేవాళ్లమని చెప్పారు. అయితే, వాలంటీర్ల వ్యవస్థపై తమకు విశ్వాసం ఉందని ఆయన చెప్పడం గమనార్హం. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వాలంటీర్ల గురించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన ఈమేరకు స్పష్టతనిచ్చారు.

మళ్లీ పుంజుకున్న బంగారం, వెండి ధరలు..

బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి మళ్లీ షాక్ ఎదురైందని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా తగ్గిన ఈ రేట్లు, ఇప్పుడు మళ్లీ పుంజుకున్నాయి. ప్రస్తుత రోజుల్లో చాలా మంది ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీపావళి, పెళ్లిళ్ల సీజన్ ముందు భారీగా పెరిగిన ఈ ధరలు తర్వాత తగ్గుముఖం పట్టాయి. కానీ నిన్నటి నుంచి మాత్రం వీటి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. భౌగోళిక రాజకీయ సంఘటనలు, ఆర్థిక పరిస్థితులు, డిమాండ్, సరఫరా వంటి అనేక కారణాల వల్ల ఈ ధరలు మారుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు (బుధవారం) ఉదయం 6.25 నిమిషాల నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 760 పెరిగి రూ.77,080కు చేరుకుంది.

నేటి బంగారం ధరలు

ఈ నేపథ్యంలో ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 77,230కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 70,810కి చేరింది. హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 77,080కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70,660కి చేరుకుంది. ఇదే సమయంలో వెండి ధరలు కూడా కిలోకు రూ. 2,200 పెరగడం విశేషం. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్స్, 22 క్యారెట్స్)

ముంబైలో రూ. 77,080, రూ. 70,660

ఢిల్లీలో రూ. 77,230, రూ. 70,810

హైదరాబాద్‌లో రూ. 77,080, రూ. 70,660

విజయవాడలో రూ. 77,080, రూ. 70,660

వడోదరలో రూ. 77,130, రూ. 70,710

కోల్‌కతాలో రూ. 77,080, రూ. 70,660

చెన్నైలో రూ. 77,080, రూ. 70,660

బెంగళూరులో రూ. 77,080, రూ. 70,660

పూణేలో రూ. 77,080, రూ. 70,660

కేరళలో రూ. 77,080, రూ. 70,660

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)

ఢిల్లీలో రూ. 91,600

ముంబైలో రూ. 91,600

హైదరాబాద్‌లో రూ. 101,100

సూరత్‌లో రూ. 91,600

తిరుపతిలో రూ. 101,100

విజయవాడలో రూ. 101,100

వడోదరలో రూ. 91,600

పాట్నాలో రూ. 91,600

అహ్మదాబాద్‌లో రూ. 91,600

కేరళలో రూ. 101,100

చెన్నైలో రూ. 101,100

కోల్‌కతాలో రూ. 91,600

సర్వీస్ ఇనాం భూములకు హక్కులు కల్పించే దిశగా నిర్ణయం తీసుకుంటాం: ఏపీ మంత్రి అనగాని

ఏపీలో సర్వీస్ ఇనాం భూములకు హక్కులు కల్పించే దిశగా త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నట్టు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. వృత్తి పనుల వారికి గతంలో సర్వీస్ ఇనాం భూములు కేటాయించారు. లబ్ధిదారులు ఆ భూములను సాగు చేసుకోవడం తప్ప వాటిపై వారికి ఎలాంటి హక్కులు లేవు. ఆ భూములపై వారికి హక్కులు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో జరగబోయే కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సర్వీస్ ఇనాం భూములు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్షన్నర ఎకరాలు ఉండొచ్చని మంత్రి తెలిపారు. నగరాలు, పట్టణాల్లో 40 నుంచి 50 గజాల్లో కట్టుకున్న ఇళ్లలో కొన్ని 22ఏ నిషేధ జాబితాలో ఉన్న విషయంపై మాట్లాడుతూ ఆ సమస్య ఎక్కడెక్కడ ఏ మేరకు ఉందో ఎమ్మెల్యేలు తమ దృష్టికి తీసుకురావాలని… తాము పరిశీలన చేసి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.