మంత్రి ఎస్.సవిత
విశాలాంధ్ర -అనంతపురం : శ్రీ భక్త కనకదాస రాష్ట్రస్థాయి జయంతోత్సవాలలో భాగంగా సోమవారం అనంతపురం నగరంలోని గుత్తి రోడ్డులో ఉన్న కనకదాస విగ్రహానికి రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌలి శాఖ మంత్రి ఎస్.సవిత పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం, హిందూపురం ఎంపీలు అంబిక లక్ష్మీనారాయణ, బీకే.పార్థసారథి, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, రాష్ట్ర బి.సి.వెల్ఫేర్ ప్రిన్సిపాల్ సెక్రటరీ పోలా భాస్కర్, ఐఏఎస్, రాష్ట్ర బీసీ వెల్ఫేర్ సంచాలకులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్.ఏ.మల్లికార్జున ఐ.ఏ.ఎస్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి తదితరులు కనకదాస విగ్రహానికి పుష్పమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీమతి ఎస్.సవిత మాట్లాడుతూ శ్రీ భక్త కనకదాస జయంతోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. రాష్ట్రస్థాయి కనకదాస జయంతోత్సవాల కార్యక్రమాన్ని ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేశామన్నారు. శ్రీ భక్త కనకదాస అందరికీ దశ, దిశ నిర్దేశం చేశారని, అందరూ సంఘటితంగా పోరాడితే మనం ఏదైనా సాధించగలమని చెప్పి కీర్తనల ద్వారా ఊరూరా తిరిగి ప్రతి ఒక్కరినీ చైతన్యవంతం చేశారన్నారు. ప్రతి ఒక్కరూ దేవుని దర్శనం చేసుకోవాలనే ధ్యేయంగా ఆయన మార్గనిర్దేశం చేశారన్నారు. అధికారికంగా కనకదాస జయంతిని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. కురుబ కులంలో కనకదాసు జన్మించడం గొప్ప వరంగా భావిస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా హిందూపురం ఎంపీ బీకే.పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అధికారికంగా కనకదాస రాష్ట్రస్థాయి జయంతోత్సవాలను జరుపుకుంటున్నామన్నారు. శ్రీ భక్త కనకదాస యుగ పురుషుడని, కురుబ కులానికి వన్నెతెచ్చిన వ్యక్తి అని, ఆయన అడుగుజాడల్లో తామంతా నడిచేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, వెనుకబడిన తరగతుల సహకార సంఘాల నాయకులు, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
కనకదాస విగ్రహానికి ఘన నివాళులు
మున్సిపల్ స్కూల్ స్వీపర్లు, వాచ్‌మెన్లకు బకాయి ఉన్న 7 నెలల వేతనాలు వెంటనే చెల్లించాలి
ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ ) జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ గౌడ్
విశాలాంధ్ర- అనంతపురం : అనంతపురము నగరపాలక సంస్థలోని మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ ) జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ గౌడ్ డిమాండ్ చేశారు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ ) ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా రాజేష్ గౌడ్ మాట్లాడుతూ… నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు అవసరానికి తగ్గట్టుగా పనిమూట్లు ఇవ్వాలన్నారు,చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను విధుల్లోకి తీసుకొని వారికి రావాల్సిన ఈ పి ఎఫ్ ,ఈ ఎస్ ఐ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలన్నారు,ఇంజనీరింగ్ కార్మికులకు వేతనాలు తక్కువ ఇస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి వస్తున్న సంక్షేమ పథకాలు పోయిన ప్రభుత్వం నిలుపుదల చేసింది ఈ ప్రభుత్వం తిరిగి ఇవ్వాలన్నారు,ఇంజనీరింగ్ కార్మికులకు బకాయి ఉన్న 2011 సం,,లోని 9 నెలల ఈ పి ఎఫ్ సొమ్మును కార్మికుల ఖాతాల్లో జమచేయాలన్నారు, మున్సిపల్ స్కూల్స్ లో పనిచేస్తున్న స్వీపర్లుడవాచ్మెన్ల కు బకాయి ఉన్న 7 నెలల వేతనాలు వెంటనే ఇస్తూ నేరుగా కార్మికుల ఖాతాల్లోకి వేతనాలు జమచేయాలన్నారు. నగర జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలన్నారు. కార్మికుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించారని లేనిపక్షంలో ఉద్యమానికి శ్రీకారంచుడతామన్నారు,
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి కృష్ణుడు,Aూ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చిరంజీవి, నాయకులు వేణుగోపాల్,రఫీ,అసేన్,లక్ష్మిదేవి,తిమ్మప్ప,నారాయణస్మామి,సాయి తదితరులు పాల్గొన్నారుౌ
రుద్రంపేట పంచాయతీ సచివాలయం వద్ద సి పి ఐ ధర్నా
విశాలాంధ్ర అనంతపురం అనంతపురం రుద్రంపేట పంచాయతీ, చంద్రబాబు నగర్ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శాఖ ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేదలకు.2. సెంట్లు స్థలం ఇళ్ల నిర్మించడానికి రూ 5.లక్షలు. ఇసుక.స్టీలు ఉచితంగా ఇవ్వాలని కోరుతూ దాదాపుగా 200 మంది.సచివాలయం రెండు వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి పంచాయతీ కార్యదర్శి హిదై తుల్లా కి అర్జీలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర నాయకులు రామకృష్ణ పిలుపుమేరకు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా.నగర సహాయ కార్యదర్శి అల్లిపీర నగర కార్యవర్గ సభ్యులు రామయ్య, వరలక్ష్మి, చంద్రబాబు నగర్ సిపిఐ శాఖ కార్యదర్శి ఖాజా మొహినిద్దీన్ . సహాయ కార్యదర్శి నరసింహులు, కార్యవర్గ సభ్యులు. మదర్ సాబ్. ఆటో బాషా. మెకానిక్ నాగరాజు. సాదిక్ .సిపిఐ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఏపీ సి యూ లో యువ మంథన్ విద్యార్థి మోడల్ పార్లమెంట్
విశాలాంధ్ర-అనంతపురం : ఆంధ్ర ప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో యువ మంథన్ విద్యార్థి మోడల్ పార్లమెంట్ యూజీసీ యువ మంథన్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాయంలో యూత్ పార్లమెంట్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య పోషకులుగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్. ఎ. కోరి వ్యవహరించగా, డీన్ ఆచార్య సి. షీలారెడ్డి కార్యక్రమ పోషకులుగా వ్యవహరించారు. విద్యార్థి సంక్షేమ శాఖ డీన్ ఆచార్య జి. రామ్ రెడ్డి గౌరవ అతిథిగా పాల్గొన్నారు. వివిధ విభాగాలకు చెందిన 50 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… నిజమైన పార్లమెంటులో ప్రధానంగా జరిగే ప్రమాణ స్వీకారం, సంస్మరణ సూచనలు, క్వశ్చన్ అవర్, కాలింగ్ అటెన్షన్ డ శాసన కార్యకలాపాలు వంటి అనేక అంశాలను ప్రతిబింబించే విధంగా మోడల్ యూత్ పార్లమెంట్ నిర్వహించారన్నారు . విద్యార్థినీ విద్యార్థులలో ఆధునిక పార్లమెంట్ పట్ల ఒక చక్కని అవగాహన కార్యక్రమం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడిందన్నారు. డాక్టర్ బ్రజ రాజ్ మిశ్రా, డాక్టర్ సందీప్ ల నిర్వహణలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.
చిత్రలేఖనం వక్తృత్వ పోటీలతో ఏకాగ్రత సాధ్యం
అనంతపురం జిల్లా
-హెచ్ఎం సాంబశివుడు
విశాలాంధ్ర-రాప్తాడు : చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలతో విద్యార్థుల్లో ఏకాగ్రత సాధ్యమని హెచ్ఎం సాంబశివుడు తెలిపారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా లైబ్రేరియన్ వీరనారాయణరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం రాప్తాడు హై స్కూల్ విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్, క్రీడా పోటీలు నిర్వహించారు. హెచ్ఎం మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే వివిధ రకాల పోటీల్లో పాల్గొనడం వల్ల నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నారు. ఉపాధ్యాయులు పి.రామాంజినేయులు, శ్రీహరి, బి.సాయిప్రసాద్, పి.లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
దైవ చింతనలతో గొప్ప కావ్యాలను రచించిన తత్వవేత్త భక్త కనకదాస
విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : దైవ చింతనలతో గొప్ప కావ్యాలను రచించిన తత్వవేత్త భక్త కనకదాస అని కురుబ కుల బాంధవులు అన్నారు. భక్త కనకదాస జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నందున సోమవారం రాప్తాడులో ఆయన విగ్రహానికి కురుబలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కర్ణాటక రాష్ట్రంలో ప్రాముఖ్యత కలిగిన కవి భక్త కనకదాస కన్నడ నాట గొప్ప కవి అన్నారు. కర్ణాటక రాష్ట్రం ఉడిపి దేవాలయంలో కనకదాసకు శ్రీకష్ణుడు దర్శనభాగ్యం కల్పించినట్లు చెప్పుకుంటారన్నారు. రాష్ట్ర సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా కనకదాస జయంతి కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ రామాంజినేయులు, ఆర్ఐ కరుణాకర్ కనకదాస విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలి
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ఇంటి నిర్మాణానికి లబ్ధిదారులకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలంటూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం పెద్దకడబూరులోని స్థానిక సచివాలయం ఎదుట సిపిఐ, బిఎంకేయు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, బిఎంకేయు మండల కార్యదర్శి కుమ్మరి చంద్ర, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు గ్రామాల్లో 1.5సెంటు, పట్టణాలలో సెంటు చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఇచ్చే ఒక సెంటు స్థలం పేదల నివాసానికి ఏ మాత్రం సరిపోదని భారత కమ్యూనిస్టు పార్టీ ఆనాడే వైసీపీ ప్రభుత్వానికి చెప్పినప్పటికీ ఖాతార్ చేయకుండా నాటి ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్లి ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పటికీ పేదలు ఆ స్థలాల పట్ల సుముఖత చూపడం లేదన్నారు. పైగా ఇంటి నిర్మాణానికి ఇచ్చే ఆర్థిక సహాయం కూడా కేవలం 1.80 లక్షలు మాత్రమే ప్రకటించారని, ఈ సొమ్ముతో పునాదులు కూడా పూర్తి కావన్నారు. ఎన్నికల ముందు టిడిపి తాము అధికారంలోకి వస్తే గ్రామాలలో పేదలకు 3 సెంట్లు, పట్టణాలలో 2 సెంట్లు స్థలం ఇస్తామని హామీ ఇచ్చారని వెంటనే మాట నిలబెట్టుకోవాలని డిమాండ్లతో సిపిఐ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇంటి సమస్యలు ఉన్న లబ్ధిదారుల ద్వారా సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ వినోద్ కు వినతిపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిక్కన్న, రెక్కల గిడ్డయ్య, నాగిరెడ్డి, శ్రీరాములు, మదర్ సాబ్, అర్జున్, రంగస్వామి, ఆంజనేయ తదితరులు పాల్గొన్నారు.
ఇళ్లులేని పేద ప్రజలకు ఇంటి స్థలాలు వెంటనే మంజూరు చేయాలి
సీపీఐ జిల్లా కార్యదర్శి సీ.జాఫర్ డిమాండ్
విశాలాంధ్ర- అనంతపురం : సీఎం చంద్రబాబు నాయుడు పేద ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం పట్టణంలోని పేద ప్రజలకు 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు 3 సెంట్ల స్థలం ఇవ్వాలని అనంతపురం జిల్లా సోములదొడ్డి పంచాయతీ సచివాలయంలో సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ లబ్ధిదారులతో ఆందోళన కార్యక్రమం నిర్వహించి పంచాయతీ సెక్టరీ హరి ప్రియ కి నివాస స్థలల అర్జీ అందచేశారు.
ఈ కార్యక్రమానికి ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సంతోష్ కుమార్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం సచివాలయాల దగ్గర ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. అనంతపురం జిల్లా నివాస స్థల లబ్ధిదారులు 30 లక్షలు మంది పైగా ఉన్నారని ఎన్నికలకు ముందు ఎన్ డి ఏ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు మేము అధికారంలోకొస్తే పేదలకు పట్టణాలలో రెండు సెంట్లు, గ్రామాలలో మూడు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలు చొప్పున ఇస్తామని అధికారంలోకి వచ్చారన్నారు. గత జగన్ ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి ఇచ్చే ఆర్థిక సహాయం ఏ మాత్రం సరిపోక ఇచ్చిన పట్టాలలో స్థలం ఎక్కడుందో తెలియని కారణంగా, కట్టిన ఇల్లు నిరుపయోగంగా మారాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్మాణానికి నాలుగు లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించడానికి స్వాగతిస్తున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సిమెంటు, ఇసుక, ఇటుక, ఇనుము, కంకర సామాగ్రి ధరలు పెరిగిన రీత్యా ఐదు లక్షలకు పెంచి గృహ నిర్మాణానికి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో నిర్లక్ష్యం చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు . ఈ కార్యక్రమంలో రూరల్ మండల కార్యదర్శి సహాయ కార్యదర్శి నరేష్ సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఈశ్వరయ్య, శాంతి సంఘం కన్వీనర్ ఇమామ్, నవీక కాలనీ కార్యదర్శి రాజు, ప్రకాష్ నగర్ సుగుదేవ్, నగర్ కార్యదర్శి జిలాన్, సోమల దొడ్డి కాలనీ కార్యదర్సి నర్సింలు తదితరులు పాల్గొన్నారు
9,13వ డివిజన్ సచివాలయం వద్ద సిపిఐ ధర్నా
విశాలాంధ్ర -అనంతపురం: సిపిఐ ఆధ్వర్యంలో 9వ డివిజన్ 13వ సచివాలయం దగ్గర ధర్నా పేదలకు గ్రామాలలో 3 సెంట్లు పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఇంటి నిర్మాణాం కోసం ఐదు లక్షలు చొప్పున మంజూరు చేయవలసి కోరుతున్నాం సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాఖ కార్యదర్శి జమీర్ భాష అధ్యక్షత నిర్వహించగా ముఖ్యఅతిథి గా ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వక అధ్యక్షులు సి లింగమయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలు ఇళ్ల స్థలాలు లేక పక్కా ఇండ్లు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారని కష్టజీవులకు రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పట్టణంలో 2 సెంట్లు గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు ఇచ్చి ప్రజలను ఆదుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినక జగనన్న ఇచ్చిన ఒక సెంటు స్థలం బాత్రూం కట్టుకుంటే గాని చాలదని చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగిందన్నారు. పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పక్కా ఇళ్ల నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి కృష్ణదేవరాయ నగర్ సహాయ కార్యదర్శి రజియా చేతి వృత్తిదారుల సమాఖ్య జిల్లా నాయకులు బండి వెంకట రాముడు, ఆదినారాయణ, స్థానిక నాయకులు భాష తదితరులు పాల్గొన్నారు
మణిపూర్ లో మళ్లీ మంటలు..
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మరోసారి రగులుతోంది. కుకీలు, మైతేయీ తెగల మధ్య జరుగుతున్న గొడవల్లో ఈ నెల 7 నుంచి నేటి వరకు 19 మంది చనిపోయారు. భద్రతా బలగాల పహారాలో కొంతకాలం దాడులు ఆగినా.. తాజాగా మరోసారి హింస చెలరేగింది. రెండు తెగలకు చెందిన ప్రజలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ దమనకాండను కొనసాగిస్తున్నారు. ఈ నెల 7న హమర్ ట్రైబ్ కు చెందిన ఓ 31 ఏళ్ల మహిళను దుండగులు దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. ఆపై మృతదేహాన్ని లోపల ఉంచి ఇంటికి నిప్పంటించారు. చనిపోయిన మహిళ కుకీ తెగకు చెందిన టీచర్, ముగ్గురు పిల్లల తల్లి.. ఈ దారుణానికి పాల్పడింది మైతేయీ మిలిటెంట్లేనని కుకీలు ఆరోపిస్తున్నారు. ఈ దారుణం తర్వాత మైతేయీ యువకుడు ఒకరు హత్యకు గురయ్యాడు. ఆపై మరో కుకీ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు చంపేసి నదిలో పడేశారు. ఈ క్రమంలోనే సీఆర్పీఎఫ్ బలగాల దాడిలో పది మంది కుకీ తెగకు చెందిన యువకులు చనిపోయారు. వారంతా మిలిటెంట్లేనని మైతేయీలు ఆరోపిస్తుండగా.. గ్రామ రక్షక దళమని కుకీలు చెబుతున్నారు. ఈ ఘోరం జరిగిన రోజే జిరిబామ్ గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో ఆరుగురు అదృశ్యమయ్యారు. ఇందులో ముగ్గురు మహిళలతో పాటు రెండేళ్ల వయసున్న ఓ చిన్నారి కూడా ఉన్నారు.
కనిపించకుండా పోయిన ఈ ఆరుగురిలో ముగ్గురి మృతదేహాలను అడవిలో గుర్తించడంతో జిరిబామ్ లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత రోజుకో మృతదేహం చొప్పున స్థానిక నదిలో కొట్టుకు వచ్చాయి. ఇది చూసి మైతేయీలు ఆగ్రహంతో రగిలిపోయారు. మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ పూర్వీకుల నివాసంతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రుల నివాసాలపై దాడులు చేశారు. ఇళ్లల్లోని ఫర్నీచర్ ను బయటకు తెచ్చి నిప్పంటించారు. సీఎం బీరేన్ సింగ్ అల్లుడి ఇంటిపైనా నిరసనకారులు దాడులు చేశారు. ఆదివారం మైతేయీ సంఘాల నేతలు సమావేశమై రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 24 గంటల్లో ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.