Thursday, December 5, 2024
Homeజిల్లాలుఅనంతపురంకనకదాస విగ్రహానికి ఘన నివాళులు

కనకదాస విగ్రహానికి ఘన నివాళులు

మంత్రి ఎస్.సవిత
విశాలాంధ్ర -అనంతపురం : శ్రీ భక్త కనకదాస రాష్ట్రస్థాయి జయంతోత్సవాలలో భాగంగా సోమవారం అనంతపురం నగరంలోని గుత్తి రోడ్డులో ఉన్న కనకదాస విగ్రహానికి రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌలి శాఖ మంత్రి ఎస్.సవిత పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం, హిందూపురం ఎంపీలు అంబిక లక్ష్మీనారాయణ, బీకే.పార్థసారథి, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, రాష్ట్ర బి.సి.వెల్ఫేర్ ప్రిన్సిపాల్ సెక్రటరీ పోలా భాస్కర్, ఐఏఎస్, రాష్ట్ర బీసీ వెల్ఫేర్ సంచాలకులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్.ఏ.మల్లికార్జున ఐ.ఏ.ఎస్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి తదితరులు కనకదాస విగ్రహానికి పుష్పమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీమతి ఎస్.సవిత మాట్లాడుతూ శ్రీ భక్త కనకదాస జయంతోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. రాష్ట్రస్థాయి కనకదాస జయంతోత్సవాల కార్యక్రమాన్ని ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేశామన్నారు. శ్రీ భక్త కనకదాస అందరికీ దశ, దిశ నిర్దేశం చేశారని, అందరూ సంఘటితంగా పోరాడితే మనం ఏదైనా సాధించగలమని చెప్పి కీర్తనల ద్వారా ఊరూరా తిరిగి ప్రతి ఒక్కరినీ చైతన్యవంతం చేశారన్నారు. ప్రతి ఒక్కరూ దేవుని దర్శనం చేసుకోవాలనే ధ్యేయంగా ఆయన మార్గనిర్దేశం చేశారన్నారు. అధికారికంగా కనకదాస జయంతిని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. కురుబ కులంలో కనకదాసు జన్మించడం గొప్ప వరంగా భావిస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా హిందూపురం ఎంపీ బీకే.పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అధికారికంగా కనకదాస రాష్ట్రస్థాయి జయంతోత్సవాలను జరుపుకుంటున్నామన్నారు. శ్రీ భక్త కనకదాస యుగ పురుషుడని, కురుబ కులానికి వన్నెతెచ్చిన వ్యక్తి అని, ఆయన అడుగుజాడల్లో తామంతా నడిచేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, వెనుకబడిన తరగతుల సహకార సంఘాల నాయకులు, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు