Thursday, February 6, 2025
Home Blog Page 144

ఆశ వర్కర్స్ సమస్యలపై జరిగే ధర్నాను విజయవంతం చేయండి

విశాలాంధ్ర -పెనుకొండ (శ్రీ సత్య సాయి జిల్లా) : ఆశ వర్కర్స్ కు కనీస వేతనం 26, 000వేలు రూపాయలు, ప్రభుత్వ ఉద్యోగులగా గుర్తించాలని 18వ తేదీన జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కమిటీపిలుపు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్, మాట్లాడుతూ ఆశ వర్కర్స్ సమస్యలు పరిష్కారం కోసం ఫిబ్రవరి 8వ తేదీన చలో విజయవాడ, కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆనాటి వైసీపీ ప్రభుత్వం స్పందించి ఫిబ్రవరి 9వ తేదీన రాష్ట్ర నాయకత్వంతో అధికారులు చర్చలు జరపడం జరిగింది ఆ సందర్భంగా కుదిరిన ఒప్పందాలకు జీవోలు సర్కులర్లు ఇవ్వాలని నూతన కమిటీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కి అనేక రూపాలలో వినతి పత్రాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు ,ఆశ వర్కర్స్ కు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని సాధారణ మెటర్నటీ లీవులు ఇవ్వాలని రాజకీయ అధికారులు వేధింపులు ఆపాలని ఆశలకు సంబంధం లేని పనులు చేపించకూడదని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ,ఇవ్వాలని గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం ఈనెల 18వ తేదీన సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ నాయకురాలు పుల్లమ్మ, సుమంగళి,రాజేశ్వరి, అలివేలమ్మ, తులసి, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

విద్యారంగ సమస్యల మీద 18న మహాధర్నా జయప్రదం చేయండి

విశాలాంధ్ర పెనుకొండ ( శ్రీ సత్య సాయి జిల్లా) : పెండింగ్ లో ఉన్న విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు బడ్జెట్‌లో కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ, విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 18న విజయవాడ ధర్నాచౌక్‌లో జరిగే మహాధర్నా జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి హర్షకుమార్ ,పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హర్షకుమార్ , మాట్లాడుతూ విద్యాదీవెన, వసతిదీవన బకాయిలు రూ.3,480కోట్ల విడుదలకు ప్రభుత్వం తాత్సర్యం చేస్తుందని అన్నారు. ఇప్పటికే ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పలుమార్లు విన్నవించిన ప్రభుత్వం జాప్యం చేస్తూ కల్లబొల్లి మాటాలు చెప్తుందని వాపోయారు. అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్‌లో కేటాయింపులలో పెండింగ్ బకాయిల గురించి మాట్లాడకపోవడం హేయమైనచర్య. విద్యార్దులు ఫీజులు చెల్లించలేక పడరాని పాట్లు పడుతున్నారన్నారు. ఫీజులు చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతులు ఇస్తామని యాజామాన్యాలు విద్యార్ధులపై ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 84 లక్షల మంది విద్యార్ధులకు రూ.12,600 కోట్లు కావాలి. కానీ రూ.5,387.03 కోట్లే బడ్జెట్‌లో కేటాయించారు. దీనితో తల్లికి వందనంపై ఉన్న అనుమానాలు పెరిగాయని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అమలుపై స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. జీఓ నెం:77ను అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రద్దు చేస్తామని చెప్పి వాటి ఊసెత్తడంలేదన్నారు.
ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని గత ప్రభుత్వం రద్దు చేసిందని వెంటనే పున:ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. మెస్‌ చార్జీలు రోజుకి మెస్‌బిల్లు రూ.100కి పెంచి నెలకు రూ.3,000 ఇవ్వాలని డిమాండ్‌ చేసారు. ఈ నెల 18న విజయవాడ ధర్నా చౌక్‌లో మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధులు కదలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి హర్షకు మార్,సాయికృష్ణ, భరత్, ఫయాజ్, అజయ్,అనిల్,మంజు,మహేష్,చందు పాల్గొన్నారు.

నాటు సారా, మత్తు పదార్థాలు ప్రాణాంతకాలు …

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా): చోడవరం ఎక్సైజ్ ప్రొహిబిషన్ స్టేషన్ పరిధిలో కె.కోటపాడు మండలం కొరువాడ గ్రామంలో చోడవరం ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె.వి పాపు నాయుడు ఆధ్వర్యంలో నాటు సారా, మత్తు పదార్థాలు వాడకం, అమ్మకంపై శుక్రవారం అవగాహన కల్పించారు. నాటు సారా ప్రాణాలకు హాని చేస్తాయని, గ్రామ ప్రజలు ఎవరూ కూడా నాటు సారాయి తయారు చేయడం, సేవించడం అమ్మకం చేయకూడదని, చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలియజేశారు. నాటు సారా తయారుచేసే 25 మందిని గుర్తించి, గ్రామ పెద్దల సమక్షంలో నాటు సారా తయారీ మరియు అమ్మకాలు చేసే వారితో ఇక పైనుండి ఎప్పుడూ కూడా నాటు సారాయి అమ్మకముగాని తయారీ గాని చేయమని ప్రతిజ్ఞ చేయించారు. సారా తయారీదారులను తహసిల్దార్ వద్ద బైండోవర్ చేస్తామని తెలిపారు. అదే విధంగా గ్రామ ప్రజలకు నాటు సారాయి తాగడం వలన కలిగే ఆరోగ్య సమస్యల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కొరువాడ గ్రామ సర్పంచ్ నారాయణమూర్తి, ఎంపీటీసీ అచ్చి బాబు, గ్రామ కార్యదర్శి, మహిళా సంరక్షణ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

బి.ఎన్. రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలి…

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : చోడవరం నియోజకవర్గంలో బి.ఎన్ రోడ్డు మరమ్మత్తు పనులు తక్షణమే చేపట్టాల్సిందిగా స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు శుక్రవారం అసెంబ్లీలో కోరారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎమ్మెల్యే రాజు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వెంకన్నపాలెం నుండి నర్సీపట్నం వరకు రోడ్డు అద్వానంగా ఉందని తెలిపారు నియోజకవర్గంలో రోడ్లపై గుంతలు పడటంతో ప్రజలు ప్రయాణికులు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. బి.ఎన్. రోడ్డు మరమ్మత్తు పనులకు చర్యలు చేపట్టాల్సిందిగా ఆర్. అండ్ బి మంత్రిని అయ్యన్నపాత్రుడు ఆదేశించారు.

రాష్ట్ర బడ్జెటులో చేనేతకు మొండి చెయ్యి

ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎన్ శ్రీరాములు

విశాలాంధ్ర అనంతపురం : రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన బడ్జెట్లో చేనేత కార్మికులకు తీవ్రమైన అన్యాయము జరిగిందని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎన్ శ్రీరాములు తీవ్రంగా ఖండించారు. గురువారం సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ శ్రీరాములు మాట్లాడుతూ… 2లక్షల 94 వేల కోట్ల రూపాయల రాష్ట్ర బడ్జెట్లో అనేక రంగాలకు గత ప్రభుత్వము బడ్జెట్లో కంటే ఈ బడ్జెట్లో అదనముగా కేటాయింపులో చేసిన వ్యవసాయం తరువాత మన దేశములోనే చేనేత పరిశ్రమ రెండవ స్థానంలో ఉన్నది అనే విషయాన్ని అందరికీ తెలిసిందే అన్నారు. ఇప్పటికే చేనేతకు అనేక విధానాల వలన తీవ్రమైన సంక్షోభము ఎదుర్కొంటుందన్నారు. ఒకప్పుడు అనంతపురం ఉమ్మడి జిల్లాలో 1 లక్ష 76 వేల మంది చేనేత కార్మికులు వీటి సంబంధించిన ఉపారుత్తులవారు దాదాపు 3 లక్షలకు పైగా జీవించేవారు అని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వలన జిల్లాలో పవర్ లూమ్స్ రావడమువలన, చేనేత రకాలను నేయడము జరుగుతోందన్నారు. దీనివలన వాటికి తోడు ప్రభుత్వాల సంక్షేమ పథకము అన్నియు పూర్తిస్థాయి అందకపోవడంతో తీవ్రస్థాయిలో చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకొంటున్న పట్టించుకొకపోవడము చేనేత కార్మికులు చేసుకొన దురదృష్టకరమన్నారు. గత ప్రభత్వము నేతన్న నేస్తము పధకమునకు 198 కోట్లు ఇస్తు వార్షిక బడ్జెట్లో కనీసము 200 కోట్ల కేటాయిస్తే కనీసము 1000 కోట్లు కేటాయించాలి అన్ని సంఘాలను కలుపుకొని అందులో కూడ తెలుగునాడు చేనేత కార్మిక సంఘము కూడ అందోళనలో చేయడం జరిగిందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి, లోకేష్ ఎన్నిక సందర్భములో మా కూటమి గెలిస్తే నేతన్న నేస్తము 24 వేలకు బదులుగా 30 వేలు ఇస్తామని ఉచిత విద్యుత్తు 200 యూనిట్లు అమలు చేస్తామని చేనేత కార్మికులు నేసిన చీరలు మార్కెటింగ్ కల్పిస్తామన్నారు. ముడిసరుకుల పట్టు, నూలకు రాయితీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని 90% సబ్సిడితో మగ్గము పరికరాలను అందిస్తామని వాగ్దానం చేయడం జరిగిందన్నారు . కూటమి ప్రభుత్వము ఏర్పాడిన తర్వాత నిన్న బడ్జెట్లో చేనేతను అదుకోవలసిన పోయి కనీసము ఊస ఎత్తిన పరిస్థితి చేనేత కార్మికులకు దాపరించడము చాలా దారుణం అన్నారు. రాష్ట్రంలో వందల సంఖ్యలో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులను మనము చూస్తూనే ఉన్నామని పేర్కొన్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారిన చేనేత కార్మికులకు తలరాతలు మారలేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము 2000 కోట్లు కేటాయించి చేనేత కార్మికులకు నేతన్న నేస్తము బదులుగా ఎన్నికల ప్రచారములో 30 వేల రూపాయలను ఇచ్చి గతములోవున్న సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నారు. నేసిన చీరలను మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించి రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులను ఆదుకోవాలని ఎ.పి. చేనేత కార్మిక సంఘం డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గోవిందు, మధు, రాధాకృష్ణ, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

రూ.10 లక్షల కోట్ల అప్పు ఎక్కడుందంటున్నారు… రండి చూపిస్తా: సీఎం చంద్రబాబు

ఏపీ అప్పులపై సీఎం చంద్రబాబు నేడు అసెంబ్లీలో ప్రకటన చేశారు. మాట్లాడితే రూ.10 లక్షల కోట్ల అప్పు ఎక్కడుందని అంటున్నారని, మేమేదో తప్పు చెప్పాం అన్నట్టుగా మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా వైసీపీ నేతలపై మండిపడ్డారు. రాష్ట్ర అప్పులపై ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ చాలా స్పష్టంగా చెప్పారని వెల్లడించారు. ఈ సందర్భంగా ఏపీ అప్పుల వివరాలను చంద్రబాబు సభకు వివరించారు.

ప్రభుత్వ అప్పు- రూ.4,38,728 కోట్లు
పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ (ఉద్యోగస్తుల డబ్బు)- రూ.80,914 కోట్లు
కార్పొరేషన్ల అప్పులు- రూ.2,48,677 కోట్లు
పౌర సరఫరాల కార్పొరేషన్ అప్పు- రూ.36,000 కోట్లు
విద్యుత్ రంగం- రూ.34,267 కోట్లు
అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్స్ స్కీమ్ లు (కాంట్రాక్టర్లకు బకాయిలు)- రూ.1,13,244 కోట్లు
ఇప్పటికిప్పుడు ఉద్యోగులకు ఇవ్వాల్సింది- రూ.21,980 కోట్లు
నాన్ కంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్- రూ.1,191 కోట్లు…
ఇవన్నీ కలిపితే రూ.9,74,556 కోట్లు ఇప్పటివరకు తేలిన అప్పులు… అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

ఇంకా తవ్వితే ఎంత వస్తుందో నాకు తెలియదు అని వ్యాఖ్యానించారు. దివాలా తీశాం అని ప్రకటిస్తే… మా అప్పు కూడా ఉందని అందరూ వస్తుంటారని… తాము అలా చెప్పడంలేదని, గుంభనంగా ఏం చేయాలో అదే చేస్తున్నాం అని పేర్కొన్నారు.

ఇప్పుడు తాను చెప్పిన అప్పులు తప్పు అని ఎవరైనా అంటే… రండి… లెక్కలు చూపిస్తా అని చంద్రబాబు సవాల్ విసిరారు. ఆ లెక్కలు చూపించిన తర్వాత గుంజీళ్లు తీయిస్తా అని హెచ్చరించారు. ప్రజా జీవితాన్ని దుర్వినియోగం చేయొద్దు… పిల్ల చేష్టలు వద్దు… లెక్కలు లెక్కలే… ఈ లెక్కలను ఎవరూ మార్చలేరు అని స్పష్టం చేశారు.

ఢిల్లీని కమ్మేసిన పొగమంచు

చలికాలం మొదలుకావడంతో ఢిల్లీలో పొగమంచు రోజు రోజుకు ఎక్కుఅవుతుంది. వాతావరణంలో పెరిగిన కాలుష్యంతో కలిపిన ఈ పొగమంచు పర్యావరణానికి ముప్పును కలిగిస్తోంది. దట్టమైన పొగమంచుతో నగరం నిండిపోవడంతో వాహనదారులకు విజిబిలిటీ గణనీయంగా తగ్గింది, దీనివల్ల రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. విమాన సర్వీసులు, రైళ్లు కూడా ఆలస్యం అవుతున్నాయి.

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (జూజదీ) ప్రకారం.. ఆనంద్ విహార్ ప్రాంతంలో వాయు నాణ్యతా సూచిక (AూI) 473గా నమోదైంది. ఇది అత్యంత ప్రమాదకర స్థాయికి చేరిందని తెలిపింది. శుక్రవారం ఉదయం పొగమంచు కారణంగా విజిబిలిటీ పూర్తిగా తగ్గిపోయింది. దీని ఫలితంగా రోడ్లపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 9 గంటల సమయంలో కూడా సూర్యుడు కనిపించకపోవడం, విజిబిలిటీ సున్నాకి చేరుకోవడం, వాతావరణం మరింత దారుణంగా మారినట్లు తెలుస్తోంది.

ఈ పరిస్థితులు ఢిల్లీ విమానాశ్రయం ఆపరేషన్లపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. ఫ్లైట్ రాడార్ 24 ప్రకారం.. 300కి పైగా విమానాలు ఆలస్యమవుతున్నాయి. మరికొన్ని దారిమళ్లించలసి వస్తుంది. ఢిల్లీలోకి రావాల్సిన 115 విమానాలు, ఢిల్లీలోనుండి బయలుదేరాల్సిన 226 విమానాలు సగటున 17 నుంచి 54 నిమిషాల ఆలస్యంతో నడుస్తున్నాయి. రైళ్లు కూడా ఈ పొగమంచు ప్రభావంతో ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇది ప్రయాణికుల కోసం మరింత ఇబ్బందికరంగా మారింది.

ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పెరిగిన పంట కాల్చే ప్రక్రియ, పారిశ్రామిక ఉద్గారాలు, వాహనాల కాలుష్యం పొగమంచుకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు చలికాలం గాలుల తక్కువ వేగం వల్ల పొగమంచు కురుస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడే వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

మ‌ళ్లీ ముద్ర‌గ‌డ లేఖ‌ల ప‌ర్వం..చంద్ర‌బాబు టార్గెట్ గా ఉత్త‌రం

కాకినాడ ఉ కొంతకాలం తన లేఖలకు గ్యాప్ ఇచ్చిన వైసీపీ నేత, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభరెడ్డి మరోసారి లెటర్లు రాయడం షురూ చేశారు. నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు నేడు లేఖ రాశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అందులో ప్రస్తావించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులు ఎత్తేయడం మీకు తగునా? అని ప్రశ్నించారు. సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి అని ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోకపోవడం అన్యాయం అని పేర్కొన్నారు. అలాగే రెడ్‌బుక్‌ను ఉద్దేశిస్తూ లేఖలో పలు ఆరోపణలు చేశారు. సూపర్ సిక్స్ హామీల అమలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా సాధనపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. దొంగ సూపర్ సిక్స్ హామీలు తలుచుకుంటే భయమేస్తుందన్నారు. ప్రజల దృష్టి మరల్చడానికి పనిచేస్తున్నారని విమర్శించారు. అమాయకులను జైల్లో పెట్టి కొట్టించకూడదంటూ ముద్రగడ సూచనలు చెబుతూ లేఖ రాశారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేకే.. సోషల్ మీడియా కేసులు, రెడ్ బుక్ వేధింపులు అంటూ లేఖలో ఆరోపణలు గుప్పించారు.

కార్తిక పౌర్ణమి శోభ .. భక్తులతో పోటెత్తిన శైవ క్షేత్రాలు

కార్తిక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శైవ క్షేత్రాలు భక్తులతో సందడిగా మారాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు పోటెత్తారు. సముద్ర, నదీతీరాలలో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకున్నారు. అమరావతిలో కృష్ణమ్మ చెంత మహిళలు దీపాలను వెలిగించి తెప్పలు వదిలారు. సూర్యలంక, చీరాల, చినగంజాం, పెదగంజాం, మచిలీపట్నం సముద్ర తీరాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు స్నానాలు ఆచరించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీశైలంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల్లో మహిళలు 365 ఒత్తులతో కార్తిక దీపాలను వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. ద్రాక్షారామం, కోటప్పకొండ, శ్రీకాళహస్తి, మహానంది తదితర పుణ్యక్షేత్రాల్లో భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు.