Monday, December 9, 2024
Homeజిల్లాలుఅనంతపురంరాష్ట్ర బడ్జెటులో చేనేతకు మొండి చెయ్యి

రాష్ట్ర బడ్జెటులో చేనేతకు మొండి చెయ్యి

ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎన్ శ్రీరాములు

విశాలాంధ్ర అనంతపురం : రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన బడ్జెట్లో చేనేత కార్మికులకు తీవ్రమైన అన్యాయము జరిగిందని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎన్ శ్రీరాములు తీవ్రంగా ఖండించారు. గురువారం సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ శ్రీరాములు మాట్లాడుతూ… 2లక్షల 94 వేల కోట్ల రూపాయల రాష్ట్ర బడ్జెట్లో అనేక రంగాలకు గత ప్రభుత్వము బడ్జెట్లో కంటే ఈ బడ్జెట్లో అదనముగా కేటాయింపులో చేసిన వ్యవసాయం తరువాత మన దేశములోనే చేనేత పరిశ్రమ రెండవ స్థానంలో ఉన్నది అనే విషయాన్ని అందరికీ తెలిసిందే అన్నారు. ఇప్పటికే చేనేతకు అనేక విధానాల వలన తీవ్రమైన సంక్షోభము ఎదుర్కొంటుందన్నారు. ఒకప్పుడు అనంతపురం ఉమ్మడి జిల్లాలో 1 లక్ష 76 వేల మంది చేనేత కార్మికులు వీటి సంబంధించిన ఉపారుత్తులవారు దాదాపు 3 లక్షలకు పైగా జీవించేవారు అని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వలన జిల్లాలో పవర్ లూమ్స్ రావడమువలన, చేనేత రకాలను నేయడము జరుగుతోందన్నారు. దీనివలన వాటికి తోడు ప్రభుత్వాల సంక్షేమ పథకము అన్నియు పూర్తిస్థాయి అందకపోవడంతో తీవ్రస్థాయిలో చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకొంటున్న పట్టించుకొకపోవడము చేనేత కార్మికులు చేసుకొన దురదృష్టకరమన్నారు. గత ప్రభత్వము నేతన్న నేస్తము పధకమునకు 198 కోట్లు ఇస్తు వార్షిక బడ్జెట్లో కనీసము 200 కోట్ల కేటాయిస్తే కనీసము 1000 కోట్లు కేటాయించాలి అన్ని సంఘాలను కలుపుకొని అందులో కూడ తెలుగునాడు చేనేత కార్మిక సంఘము కూడ అందోళనలో చేయడం జరిగిందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి, లోకేష్ ఎన్నిక సందర్భములో మా కూటమి గెలిస్తే నేతన్న నేస్తము 24 వేలకు బదులుగా 30 వేలు ఇస్తామని ఉచిత విద్యుత్తు 200 యూనిట్లు అమలు చేస్తామని చేనేత కార్మికులు నేసిన చీరలు మార్కెటింగ్ కల్పిస్తామన్నారు. ముడిసరుకుల పట్టు, నూలకు రాయితీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని 90% సబ్సిడితో మగ్గము పరికరాలను అందిస్తామని వాగ్దానం చేయడం జరిగిందన్నారు . కూటమి ప్రభుత్వము ఏర్పాడిన తర్వాత నిన్న బడ్జెట్లో చేనేతను అదుకోవలసిన పోయి కనీసము ఊస ఎత్తిన పరిస్థితి చేనేత కార్మికులకు దాపరించడము చాలా దారుణం అన్నారు. రాష్ట్రంలో వందల సంఖ్యలో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులను మనము చూస్తూనే ఉన్నామని పేర్కొన్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారిన చేనేత కార్మికులకు తలరాతలు మారలేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము 2000 కోట్లు కేటాయించి చేనేత కార్మికులకు నేతన్న నేస్తము బదులుగా ఎన్నికల ప్రచారములో 30 వేల రూపాయలను ఇచ్చి గతములోవున్న సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నారు. నేసిన చీరలను మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించి రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులను ఆదుకోవాలని ఎ.పి. చేనేత కార్మిక సంఘం డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గోవిందు, మధు, రాధాకృష్ణ, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు