Saturday, November 30, 2024
Homeతాజా వార్తలురూ.10 లక్షల కోట్ల అప్పు ఎక్కడుందంటున్నారు… రండి చూపిస్తా: సీఎం చంద్రబాబు

రూ.10 లక్షల కోట్ల అప్పు ఎక్కడుందంటున్నారు… రండి చూపిస్తా: సీఎం చంద్రబాబు

ఏపీ అప్పులపై సీఎం చంద్రబాబు నేడు అసెంబ్లీలో ప్రకటన చేశారు. మాట్లాడితే రూ.10 లక్షల కోట్ల అప్పు ఎక్కడుందని అంటున్నారని, మేమేదో తప్పు చెప్పాం అన్నట్టుగా మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా వైసీపీ నేతలపై మండిపడ్డారు. రాష్ట్ర అప్పులపై ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ చాలా స్పష్టంగా చెప్పారని వెల్లడించారు. ఈ సందర్భంగా ఏపీ అప్పుల వివరాలను చంద్రబాబు సభకు వివరించారు.

ప్రభుత్వ అప్పు- రూ.4,38,728 కోట్లు
పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ (ఉద్యోగస్తుల డబ్బు)- రూ.80,914 కోట్లు
కార్పొరేషన్ల అప్పులు- రూ.2,48,677 కోట్లు
పౌర సరఫరాల కార్పొరేషన్ అప్పు- రూ.36,000 కోట్లు
విద్యుత్ రంగం- రూ.34,267 కోట్లు
అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్స్ స్కీమ్ లు (కాంట్రాక్టర్లకు బకాయిలు)- రూ.1,13,244 కోట్లు
ఇప్పటికిప్పుడు ఉద్యోగులకు ఇవ్వాల్సింది- రూ.21,980 కోట్లు
నాన్ కంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్- రూ.1,191 కోట్లు…
ఇవన్నీ కలిపితే రూ.9,74,556 కోట్లు ఇప్పటివరకు తేలిన అప్పులు… అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

ఇంకా తవ్వితే ఎంత వస్తుందో నాకు తెలియదు అని వ్యాఖ్యానించారు. దివాలా తీశాం అని ప్రకటిస్తే… మా అప్పు కూడా ఉందని అందరూ వస్తుంటారని… తాము అలా చెప్పడంలేదని, గుంభనంగా ఏం చేయాలో అదే చేస్తున్నాం అని పేర్కొన్నారు.

ఇప్పుడు తాను చెప్పిన అప్పులు తప్పు అని ఎవరైనా అంటే… రండి… లెక్కలు చూపిస్తా అని చంద్రబాబు సవాల్ విసిరారు. ఆ లెక్కలు చూపించిన తర్వాత గుంజీళ్లు తీయిస్తా అని హెచ్చరించారు. ప్రజా జీవితాన్ని దుర్వినియోగం చేయొద్దు… పిల్ల చేష్టలు వద్దు… లెక్కలు లెక్కలే… ఈ లెక్కలను ఎవరూ మార్చలేరు అని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు