విశాలాంధ్ర –తాడేపల్లిగూడెం రూరల్ : తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ ఏర్పాటు చేసారని తహసీల్దార్ ఎం సునీల్ కుమార్ అన్నారు పెడతాడేపల్లి లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ముందుగా ఆహ్లాదకరమైన వాతావరణంలో తల్లిదండ్రులకు కబడ్డీ,ముగ్గుల పోటీలు,సాంస్కృతిక కార్యక్రమాలునిర్వహించారు అనంతరం నిర్వహించిన తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం ప్రిన్సిపల్ బి.రాజారావు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తహసీల్దార్ సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎంచుకున్న రంగంలో విజయం సాధించేవరకు కృషి పట్టుదలతో ముందుకు సాగాలన్నారు ప్రతి విద్యార్థి అన్ని సబ్జెక్టులో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించుకోవాలన్నారు, ప్రభుత్వం అందిస్తున్న విద్యా వనరులను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని అన్నారు మండల విద్యాశాఖ అధికారి హనుమ మాట్లాడుతూ విద్యార్థుల శారీరక మానసిక వికాసానికి తల్లిదండ్రుల ఆత్మీయ కలయిక ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యా ప్రణాళికతో పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు రూరల్ ఎస్సై ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి, విద్యార్థి స్థాయి నుంచే చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి, విద్యార్థులను తల్లిదండ్రులు ప్రతిరోజు గమనిస్తూ ఉండాలి ఈ కార్యక్రమంలో ఎంఈఓ 2 జ్యోతి, ఎస్ఎంసి చైర్మన్ ప్రకాష్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ ప్రతాప్ ఉపాధ్యాయులు,విద్యార్థులు తల్లిదండ్రులుసిబ్బంది పాల్గొన్నారు
హత్యాయత్నం కేసులో ఆరుగురు అరెస్టు
విశాలాంధ్ర-తాడిపత్రి (అనంతపురం జిల్లా) : గన్నెవారి పల్లి కాలనీలోని రూరల్ పోలీస్ స్టేషన్లో రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లెల వేణుగోపాల్ ప్రత్యర్థి బిజిలి రామాంజనేయులు వర్గీయుల మధ్య ఈనెల మూడవ తేదీన వరాల తోట పంప్ హౌస్ వద్ద జరిగిన గొడవలలో దండు శ్రీనివాసులు, హాజీ భాష, అజయ్ లపై వేణ తన వర్గీయులతో దాడి చేశారు. ఈ దాడిలో దండు శ్రీనివాసులు, హాజీ భాష గాయపడ్డారు. పరారీలో ఉన్న నిందితులు శివాలయం వద్ద ఉన్నారని సమాచారం మేరకు ఎస్డిపిఓ రామకృష్ణుడు ఆదేశాల మేరకు రూరల్ సీఐ శివ గంగాధర్ రెడ్డి అయిన నేను ఎస్సైలు ధరణి బాబు, కాటుమయ్య పోలీసు సిబ్బందితో కలిసి తాడిపత్రి పట్టణంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన మల్లెల నారాయణస్వామి కుమారుడు మల్లెల వేణుగోపాల్ అలియాస్ పొట్టి వేణు, వయస్సు 35 సంవత్సరాలు, శివాలయం వీధికి చెందిన చాకలి గోవిందు కుమారుడు చాకలి సురేష్ అలియాస్ గౌతమ్ వయస్సు 35 సంవత్సరాలు, షేక్ మహబూబ్ బాషా కుమారుడు షేక్ హుస్సేన్ వలి అలియా బడే, వయస్సు 27 సంవత్సరాలు, పోరాట కాలనీకి చెందిన చింతా రామకృష్ణ కుమారుడు చింత గోపీ కృష్ణనాథ అలియాస్ గోపి వయస్సు 26 సంవత్సరాలు, మెయిన్ బజార్ కు చెందిన షేక్ బాబు కుమారుడు షేక్ మహమ్మద్ హుస్సేన్ వయస్సు 33 సంవత్సరాలు, హరిజనవాడకు చెందిన బండారు వెంకట రంగయ్య కుమారుడు బండారు రామాంజినేయులు అలియాస్ అంజి, వయస్సు 23 సంవత్సరాలు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి కట్టెలు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని కోర్టుకు హాజరు పరచామని చెప్పారు.
జీవానంద పాఠశాలకు ఈటీ టెక్ ఎక్స్ ట్రయల్ బి లేజర్ స్కూల్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ కైవసం..
డైరెక్టర్లు సంజీవరెడ్డి, శ్రీకాంత్
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని జీవానంద ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలకు ఈటి టెక్ ఎక్స్ ట్రైల్ బి లేజర్ స్కూల్ ఆఫ్ ది ఇయర్ 2024-25 అవార్డు కైవసం చేసుకోవడం జరిగిందని పాఠశాల డైరెక్టర్లు సంజీవరెడ్డి, శ్రీకాంత్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మా పాఠశాల గర్వించదగిన విజయాన్ని సాధించడం మాకెంతో గర్వంగా సంతోషంగా ఉందని తెలిపారు.ఈ అవార్డు హైదరాబాదులోని హైటెక్ ఎక్స్ లో డిసెంబర్ 6న డైరెక్టర్స్ సంజీవరెడ్డి కొలసాని శ్రీకాంత్ అందుకోవడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఎన్నో వేల పాఠశాలల్లో టాప్ 25 స్టేట్ బోర్డ్ పాఠశాలలో మా సంస్థను గుర్తించి అవార్డు ప్రకటించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపారు. పాఠశాల అన్ని విభాగాల్లో ఈ ప్రత్యేక గుర్తింపు రావడానికి ప్రధాన కారణం ఎడ్యుకేషన్ డిసిప్లిన్ మాత్రమే అని, పాఠశాలలో ఎన్నో ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ చేస్తోందని అందుకు గాను ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ ఎక్సలెన్స్ అందుకోవడం జరిగిందని తెలిపారు.అలాగే బెస్ట్ అకాడమిక్ ఎక్సలెన్స్ స్కూల్ గా గుర్తింపు పొందడం పాఠశాల ఉపాధ్యాయుల అంకిత భావానికి నిదర్శనమని కొనియాడారు. ఇన్స్పిరేషనల్ లీడర్‌షిప్‌లో ఎక్సలెన్స్ మరియు లైఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ విభాగాల్లో కూడా పాఠశాలకు అవార్డు పొందినందుకు ఆనందంగా ఉందని గర్వంగా కూడా ఉందని తమ సంతోషాన్ని వ్యక్త పరిచారు. పాఠశాల ఇంత క్రమశిక్షణ గా ఉండడానికి ప్రిన్సిపాల్ దాదా ఖలందర్ కు డైరెక్టర్స్ రాధాకృష్ణ , నాగేశ్వర్ రెడ్డి కూడా కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాలకు అన్ని విధాలుగా సహకరిస్తున్న పిల్లల తల్లి తండ్రులకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.
పండుగ వాతావరణం లో మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం
విశాలాంధ్ర – కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా) : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పేరెంట్స్, టీచర్స్, సమావేశ పండుగ సందర్భంగా మండల కేంద్రమైన కొయ్యలగూడెం పట్టణం ఎస్సీ కాలనీలో ఉన్న ఎంపీపీ పాఠశాలలో అంగరంగ వైభవంగా పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. విద్యార్థినీ, విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. పాఠశాలలో ఏర్పాటుచేసిన వివిధ పోటీలలో తల్లితండ్రులు పాల్గొన్నారు. పోటీలలో గెలిచిన వారికి బహుమతులు అంద చేశారు. ఈ కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారి జే. సురేష్ బాబు, ఎస్సై చంద్రశేఖర్ సందర్శించారు. ఎస్ఎంసి చైర్మన్ పి .పద్మ, వార్డ్ నెంబర్ రవికుమార్, బొబ్బర మంగరాజు, ప్రధానోపాధ్యాయులు కోటేశ్వరరావు, సుశీల, రాజ్యలక్ష్మి, కనకమహాలక్ష్మి పాల్గొన్నారు.
విద్యార్థులు విద్యతోపాటు, క్రీడలపై ఆసక్తి చూపాలి…
విశాలాంధ్ర- ఆగిరిపల్లి: విద్యార్థులు విద్యతోపాటు క్రీడల పట్ల ఆసక్తి కలిగి ఉండాలని ఈదర ప్రధాన ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మక్కే వేణుగోపాలరావు పేర్కొన్నారు. ఈదర మండల పరిషత్ ప్రాథమిక ప్రధాన పాఠశాల నందు మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంను పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఉదయం గం.9లకు తల్లిదండ్రులను ఆహ్వానించడం తో కార్యక్రమం ప్రారంభమైంది. తల్లిదండ్రులకు విద్యార్థుల ప్రగతిని వివరించారు. తండ్రులకు టగ్ ఆఫ్ వార్,తల్లులకు రంగోలి పోటీలను నిర్వహించడం జరిగింది.పూర్వ విద్యార్థి గరిసేపల్లి రాంబాబు తన విజయగాధను తెలిపారు.సచివాలయం మహిళా పోలీస్ బండారు భవాని సైబర్ నేరాలు జరుగుతున్న విధానం,తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించడం జరిగింది. సచివాలయం వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఎస్ సుబ్బారెడ్డి మిడ్ డే మీల్స్ నాణ్యత గురించి తల్లిదండ్రులకు వివరించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రధానోపాధ్యాయులు మధ్య వేణుగోపాలరావు మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల విద్య పట్ల తగు జాగ్రత్తలు తీసుకుని పర్యవేక్షించాలని సూచించారు. విద్యా విధానంపై తల్లిదండ్రులు సలహాలు సూచనలు అందజేయాలని కోరారు.అనంతరం వచ్చిన అతిథులకు భోజనాన్ని అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని ఎం నిర్మల దేవి, పేరెంట్స్ కమిటీ చైర్మన్ వడపర్తి రమేష్,వైస్ చైర్మన్ గుర్రం నాగలక్ష్మి, అంగన్వాడి టీచర్ దిడ్డి సునీత, ఏఎన్ఎం లక్ష్మి,లలిత, అనసూర్య,పూజిత,రంగమ్మ, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే రెవెన్యూ సదస్సు యొక్క ముఖ్య లక్ష్యం.. ఎమ్మార్వో సురేష్ బాబు
విశాలాంధ్ర-ధర్మవరం : ప్రజా సమస్యల పరిష్కారమే రెవెన్యూ సదస్సు యొక్క ముఖ్య లక్ష్యము అని తహసిల్దార్ సురేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా రెవెన్యూ సదస్సులు మండల పరిధిలోని చిగిచెర్ల గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సభలో ప్రజలు, రైతుల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. అనంతరం తాసిల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలు ప్రకారం ప్రభుత్వ భూములు గాని స్థలము గాని ఎవరైనా ఆక్రమించినచో కఠిన చర్యలతో పాటు తప్పక కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. చట్టపరంగా జీవించే విధానాన్ని గ్రామ ప్రజలు అలవాటు చేసుకోవాలని తెలిపారు. రెవెన్యూ సదస్సులో ఎటువంటి సమస్యలైనా కూడా నిర్ణీత గడువు తేదీలోగా పరిష్కరించబడుతుందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తోందని, ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకొని రావాలని తెలిపారు. ప్రజల ద్వారా వచ్చిన అర్జీలపై త్వరితగతిన విచారణ చేపట్టి, ఉన్నతాధికారుల ఆదేశాను ప్రకారం పరిష్కరించబడుతుందని తెలిపారు. మొత్తం 12 దరఖాస్తులు రావడం జరిగిందని త్వరలో పరిష్కరించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సర్వే, ఎండోమెంట్ అధికారులు, వీఆర్వోలు, సర్వేయర్లు,, ఫారెస్ట్ విభాగపు అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఘనంగా అయ్యప్ప స్వామి విగ్రహ పోతా వేడుకలు.. గురు స్వామి విజయకుమార్
విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని శివానగర్లో శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామి విగ్రహ పూత వేడుకలు గురుస్వామి విజయకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా శిష్య బృందం నిర్వహించుకున్నారు. అనంతరం గురుస్వామి మాట్లాడుతూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేలాదిమంది అయ్యప్ప స్వామి మాలాధారణ భక్తాదులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. ఇటీవలే గురు స్వామి ఆధ్వర్యంలో పంచలోహ విగ్రహ తయారీకి భిక్షాటన చేసి, ధర్మవరం పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు భక్తాదుల నుండి విరివిరిగా విరాళాలు స్వీకరించారు. మొత్తం 200 కిలోల వరకు పంచలోహం వాడినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్, ఎన్డీఏ కార్యాలయ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు, బిజెపి నాయకుడు డోల రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధర్మవరం జడ్జి దెబ్బతులు స్వామివారి పూజలో కూడా పాల్గొని తమవంతుగా సహాయ సహకారాలను అందించారు. భక్తజన సందోహం నడుమ ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వామితో పాటు బండపల్లి ప్రకాష్ కలవల శివకుమార్ కలవల రాంకుమార్, వేలాదిమంది అయ్యప్ప స్వామి మాల ధారణ భక్తులు పాల్గొన్నారు.
ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి
విశాలాంధ్ర బ్యూరో -నెల్లూరు : అఖిల భారత యువజన సమాఖ్య జిల్లాముఖ్య కార్యకర్తల సమావేశం రామకోటయ్య భవన్ లో షేక్ మున్నా అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మహంకాళి సుబ్బారావు హాజరైనారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ
అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభలు శ్రీకాకుళం జిల్లా లోఫిబ్రవరి 6,7,8,9 తేదీల్లోనిర్వహించడం జరుగుతుందని తెలిపారు..పాలకుల విధానాల వల్ల దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిందని యువతకు ఉపాధి కల్పనలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనిఆరోపించారు.
2018 గ్రూప్-1 నియామకాల్లో జరిగిన అవినీతి అక్రమాలపై సీబీఐ తో ఎంక్వైరీ చేయించి హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ప్రకారం మెయిన్స్ పరీక్ష ను మరల నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.యువత
కు ఉపాధి దొరకకపోవడంతో దేశంలోప్రతి రోజు40నుంచి 45మందివరకు నిరుద్యోగులు స్వయంఉపాధి కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని నేషనల్ క్రైమ్ బ్యూరో లెక్కలు చెబుతున్నాయి అని తెలిపారు. విద్య ,వైద్యం,ఉపాధి,భారత రాజ్యాంగ ప్రాథమిక హక్కులు గాగుర్తించినా విద్య వ్యాపారంగామారిందని వైద్యంఅందరికీ అందడంలేదని చదువుకున్న నిరుద్యోగులకుఉ
పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ లో చంద్రబాబు, నారా లోకేశ్
బాపట్ల మున్సిపల్ స్కూల్ లో చంద్రబాబు, లోకేశ్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బాపట్లలో పర్యటిస్తున్నారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్ లో పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు, ఉపాధ్యాయులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రతి విద్యార్థి మార్కులు, ఐక్యూ తదితర అంశాలను ట్రాక్ చేయాలని… యూనివర్శిటీ స్థాయి వరకు ట్రాకింగ్ జరగాలని చెప్పారు. ఈ ట్రాకింగ్ వల్ల ఏ విద్యార్థికి దేనిపై ఆసక్తి ఉంది… సదరు విద్యార్థి ఏం చదివితే బాగుంటుందనే విషయం అర్థమవుతుందని అన్నారు. 9వ తరగతి నుంచి కంప్యూటర్ విద్యను బోధించాలని సూచించారు. ఈ సందర్భంగా ఒక విద్యార్థిని, ఆమె తండ్రితో చంద్రబాబు ముచ్చటించారు. విద్యార్థిని మార్క్స్ రిపోర్టును ఆయన పరిశీలించారు. ఆమె ఆసక్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత రూమ్ లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఇంకోవైపు కడప మున్సిసల్ హైస్కూల్ కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేరుకున్నారు. టీచర్స్, పేరెంట్స్ మీటింగ్ లో ఆయన పాల్గొంటున్నారు.
జయలలిత ఎస్టేట్ లో దోపిడీ కేసు.. శశికళ, పళనిస్వామిల విచారణకు అనుమతినిచ్చిన కోర్టు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తర్వాత ఆమెకు చెందిన ఎస్టేట్ లో పలు విలువైన వస్తువులు మాయమయ్యాయి. కొడనాడు ఎస్టేట్ లో జరిగిన ఈ దోపిడీ కేసులో మద్రాస్ హైకోర్టు తాజాగా సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో మాజీ సీఎం పళనిస్వామితో పాటు జయలలిత సన్నిహితురాలు శశికళను విచారించేందుకు అనుమతిచ్చింది. గతంలో వీరిని విచారించ వద్దంటూ జిల్లా కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. సీబీసీఐడీ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించి ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జయలలితకు సంబంధించిన కొడనాడు ఎస్టేట్ లో 2017 లో సెక్యూరిటీ గార్డ్ ఓం బహదూర్ హత్య జరిగింది. ఆపై ఎస్టేట్ లోని పలు విలువైన వస్తువులు కనిపించకుండా పోయాయి. ఈ కేసులో తొలుత పోలీసులు దర్యాఫ్తు జరిపినా ఫలితం లేకుండా పోయింది. కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో డీఎంకే అధికారంలోకి వచ్చాక సీఐడీకి అప్పగించింది. విచారణ చేపట్టిన సీఐడీ అధికారులు.. ఈ కేసులో ఇప్పటి వరకు 100 మందిని విచారించి 10 మందిని అరెస్టు చేశారు. సీఐడీ దర్యాఫ్తు చేపట్టిన తర్వాత పళనిస్వామి, శశికళ కోర్టును ఆశ్రయించి తమను విచారించకుండా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. దీనిపై సీఐడీ అధికారులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పళనిస్వామి, శశికళ, ఇళవరసిలను ప్రశ్నించేందుకు మద్రాస్ హైకోర్టు అనుమతి మంజూరు చేసింది.

