Home Blog Page 1462

డూండీ రాకేష్ నూ కలిసిన ఆర్య వైశ్య ప్రముఖులు

ఏ కొండూరు : ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ ను ఏ కొండూరు మండలానికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు టిడిపి నేతలు కలిసి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్య కుటుంబాల్లో పేద మధ్యతరగతి వారికి విద్య ఉపాధి అవకాశాలను కల్పించే విధంగా కృషి చేయాలని అదేవిధంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా ప్రతి ఆర్యవైశ్య కుటుంబానికి సబ్సిడీపై బ్యాంకు రుణాలు మంజూరు అయ్యేవిధంగా కృషి చేయాలని వారు సూచించారు
ఈ కార్యక్రమంలో దర నాగేశ్వర రావు జి వేంకట రామ రావు తదితరలు పాల్గొన్నారు

జన సైనికుడికి ఆర్థిక సహాయం అందజేత

0

విశాలాంధ్ర -ఆస్పరి (కర్నూలు జిల్లా) : అనారోగ్యంతో బాధపడుతున్న జనసైనికుడు హనుమంతుకు రూ. 25 వేల 600 రూపాయలు ఆర్థిక సహాయాన్ని శుక్రవారం జనసేన పార్టీ మండల కన్వీనర్ అరవింద్, ఏపీ కురువ కార్పొరేషన్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల పరిధిలోని హలిగేర గ్రామానికి చెందిన జన సైనికుడు హనుమంతు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న ఆలూరు జనసేన పార్టీ ఇంచార్జి తెర్నేకల్ వెంకప్ప ఆదేశాల మేరకు హనుమంతు కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయంగా రూ.25,600 అందజేయడం జరిగిందన్నారు. ఆపదలో ఉన్న వారికి సాయం చేసిన వారే నిజమైన జనసైనికులు అని కొనియాడారు. కుటుంబానికి అండగా ఉంటాం అంటూ విరాళాలు అందించిన జనసైనికులకు, అభిమానులకు పేరు పేరున నా హృదయపూర్వక అభనందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల నాయకులు శివ, సోమశేఖర్, శ్రీను, రంజిత్, మహదేవ్, హనుమేష్, వీరేష్, విష్ణు, అనిల్, అంజి, సురేష్, ప్రసాద్, వినోద్, ప్రకాష్, రంగ కార్యకర్తలు పాల్గొన్నారు.

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్

0

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అని జైభీమ్ ఎమ్మార్పీఎస్ మండల కార్యదర్శి మంచోది దుబ్బన్న, అధ్యక్షులు ఆదాము, ఇంచార్జీ మంచోది రవి కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులో జైభీమ్ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహామేదావి ప్రపంచ జ్ఞాని న్యాయ కోవిదుడు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఎన్నో కష్టాలు, అవమానాలను, అంటరానితనాలను ఎదుర్కొని ఉన్నత చదువులు చదివారన్నారు. నాలాంటి అవమానం తన జాతి బిడ్డలకు జరగకూడదని పోరాటం చేశారని గుర్తు చేశారు. సమాజంలో అట్టడుగున ఉన్న అణగారిన వర్గాల కోసం రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించి వారి అభ్యున్నతికి బాటలు వేశారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ మహానుభావుని ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగు జాడలలో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జైభీమ్ ఎమ్మార్పీఎస్ నాయకులు యేసు, కిరీటి, పవన్, పేతురు, చిన్న, రవి తదితరులు పాల్గొన్నారు.

భూ రీసర్వేలో ఇబ్బందులు పడ్డాం…సరిచేయండి

అనంతపురం జిల్లా

రెవెన్యూ అధికారులకు రైతుల వినతి
విశాలాంధ్ర-రాప్తాడు : గత ప్రభుత్వ హయాంలో గ్రామంలో అరకొరగా భూ సర్వే చేసినా రైతులకు నేటికీ సర్వే నెంబర్లు కేటాయించలేదని, ఆన్లైన్లో 1-బి, అడంగల్ కూడా రావడంలేదని పలువురు రైతులు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. బొమ్మేపర్తి గ్రామంలో శుక్రవారం తహశీల్దార్ పి.విజయకుమారి, రీసర్వే డీటీ కృష్ణ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యాయి. ఆర్డీఓ కేశవనాయుడు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రూప్లా నాయక్ ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. గ్రామాల్లో నిర్వహించే ఈసదస్సుల్లో రైతులు, భూ యజమానుల ధ్రువపత్రాలు పరిశీలించి సరిగ్గా ఉన్నాయో లేదో చూసి పరిష్కరించటానికి తోడ్పడతాయన్నారు. ప్రజల నుండి రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారినికి చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. రెవెన్యూ శాఖతోపాటు సర్వే, రిజిష్ట్రేషన్‌, ఇతర విభాగాల నుండి వచ్చే అవకాశం ఉన్నందున ఆయా శాఖల సమన్వయంతో సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. గ్రామంలోని భూసమాచారం రికార్డులను అందుబాటులో ఉంచామని రైతులు, ఇతర భూ యజమానులు వారి రికార్డులతో సరిచూసుకొని ఏమైనా తేడాలుంటే అక్కడిక్కడే పరిష్కరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో సబ్ రిజిస్ట్రార్ ఇస్మాయిల్, ఆర్ఐ కరుణాకర్, వీఆర్ఓలు సాయికుమార్, మనోజ్, సర్వేయర్ ఖలందర్, సర్పంచ్ ఆనందరెడ్డి, తెలుగు యువత రాజశేఖర్ రెడ్డి, తిరుపతిరెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, ఉజ్జినప్ప, ఎర్రిస్వామి, తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ ఆశయాలను అనుసరిద్దాం….

0

అంబేద్కర్ కమ్యూనిటీ భవన నిర్మాణానికి 180 గజాలు మంజూరు…

ఎమ్మెల్యే బడేటి చంటి….

విశాలాంధ్ర -ఏలూరు: నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను అనుసరించాలని శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) పిలుపునిచ్చారు.శుక్రవారం నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో , అంబేద్కర్ యువజన సంఘం గౌరవాధ్యక్షులు జాలా బాలాజీ పర్యవేక్షణలో స్థానిక నవాబ్ పేట వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే బడేటి చంటి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ సామాజిక వ్యవస్థ ఆధారంగా నిరుపమాన అధ్యయనంతో జాతీయ ఉద్యమంలో ప్రజల ఆకాంక్షలను ప్రతిబంబించే రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ ఆలోచనలు ఉన్నతమైనవి అన్నారు.మానవ,అంతరాలు లేని కోసం,దోపిడీ పీడనలు లేని వ్యవస్థ నిర్మాణం ఆయన చేసిన కృషి మరువలేనిది అన్నారు. అంబేద్కర్ ఆశయాలు, సిద్ధాంతాలు, సమాజ హితమైనవి అన్నారు. ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడని, ఆయన జీవిత చరిత్రను తెలుసుకోవడం మన అందరి బాధ్యత ఆయన జీవిత చరిత్ర కూడా రాజ్యాంగ బద్ధమైనదే అందుకే అన్ని పార్టీల వారు ఏకకంఠంతో అంబేద్కర్ దూరమై ఆరు దశాబ్దాలు దాటినా మనం జయంతి, వర్ధంతి కార్యక్రమాలు జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా దశాబ్దాల కాలంగా అన్యాక్రాంతమైన ప్రభుత్వ స్థలం 180 గజాలను అశేష అంబేద్కర్ అభిమానులు, నాయకుల హర్షద్వానాల మధ్య అంబేద్కర్ కమ్యూనిటీ భవన నిర్మాణానికి మంజూరు చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్.సి. కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, కో ఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, జాలా సుమతీ బాలాజీ,స్థానిక కార్పొరేటర్
బొద్దాని అఖిలప్రియ,టిడిపి మూడవ డివిజన్ అధ్యక్షులు
చనపతి వెంకటరమణ,రుప్పా రాంబాబు,దాలి త్రిమూర్తులు,శంకర్రావు,యు.రూపేష్,ఎస్.కె. మున్ని,వీరా బత్తిన అనిత, యేసు,జ్వాల అనురాధ,టి మణి,తేలు వెంకట సాయి, నాని,వీరా బత్తిన రాజేష్, ప్రకాష్ యూత్, టిడిపి నాయకులు,దళిత నాయకులు పాల్గొని నివాళులర్పించారు.

అసమానతలు లేని సమాజం కోసం పరితపించిన మహానేత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్…

0

ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్

విశాలాంధ్ర ప్రతినిధి-ఏలూరు:అసమానతలు లేని సమాజం కోసం అనునిత్యం పరితపించిన మహానేత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఒక ప్రకటనలో కొనియాడారు. ఏలూరు శాంతినగర్ లోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, కార్యాలయం సిబ్బంది అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగానికి ప్రాణం పోసిన మహా మేధావి భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు. కార్యక్రమానికి హాజరైన ఎస్.సి. కార్పొరేషన్ ఫైనాన్స్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.అంబేద్కర్ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం,అభివృద్దే ధ్యేయంగా సమర్థవంతమైన పాలన చేస్తున్నట్లు ఆంజనేయులు తెలిపారు.కార్యక్రమంలో మాజీ ఎంపీపీ లంకపల్లి మాణిక్యాలరావు,ఏలూరు నగర ఎస్.సి. సెల్ అధ్యక్షుడు పెద్దడా వెంకటరమణ, టిడిపి ఐదో డివిజన్ ఇన్ ఛార్జ్ దొడ్డిగర్ల సుభా మల్లిక్, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

ధర్మవరం నందు రూ.35 కోట్ల విలువైన మెగా హ్యాండ్‌లూమ్ క్లస్టర్‌ ఏర్పాటు

ఎంపీడీవో సాయి మనోహర్
విశాలాంధ్ర- ధర్మవరం : ధర్మవరంలో 35 కోట్ల విలువైన మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరం ప్రధాన కేంద్రంగా జాతీయ చేనేత అభివృద్ధి పథకం కింద రూ.35 కోట్ల విలువైన మెగా హ్యాండ్‌లూమ్ క్లస్టర్‌ మంజూరు చేయబడింది అని అన్నారు.ఇది ధర్మవరం చేనేత రంగానికి గొప్ప ఆశీర్వాదం అని,ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ఇలాంటి ప్రాజెక్ట్‌ ధర్మవరంలో ప్రారంభం,ఇది మన అందరికి గర్వకారణం అని తెలిపారు.ఈ క్లస్టర్‌, 5 నుంచి 10 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటూ చేస్తారని ఇది నోడల్ సెంటర్‌గా పని చేస్తుంది అని తెలిపారు. తదుపరి మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో పంచాయతీ సెక్రటరీలు, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకు బేస్‌లైన్ సర్వేపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు.. ఈ సర్వే ఆధారంగా వివరమైన ప్రాజెక్ట్ నివేదిక ఈ క్లస్టర్ కు రూపొందించబడుతుంది అని తెలిపారు. ఈ సమావేశానికి కేంద్ర టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖకు చెందిన విశ్వజిత్ , జి. నాగేశ్వరరావు , టెక్నికల్ సూపర్‌వైజర్‌లు , హ్యాండ్‌లూమ్ అసిస్టెంట్ డైరెక్టర్ హాజరై బేస్‌లైన్ సర్వేపై శిక్షణ ఇవ్వడం జరిగింది అన్నారు. తదుపరి ఎంపీడీవో ఈ ప్రాజెక్ట్ మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇది ధర్మవరం చేనేత రంగానికి ప్రాచీన గౌరవాన్ని పునరుద్ధరిస్తుందని, పట్టు పరిశ్రమకు మరింత కీర్తి ని తీసుకొస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.రాబోయే అభివృద్ధి కి ఇది మొదటి ఘట్టం గా తెలిపారు.

ప్రజా సమస్యల్ని ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లిన పరిటాల శ్రీరామ్

విశాలాంధ్ర -ధర్మవరం ; నియోజకవర్గంలోని పలు ప్రజా సమస్యల్ని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ ఆర్డీవో మహేష్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్డీవో ముందు నియోజకవర్గ సమస్యలను వివరిస్తూ, వెంటనే న్యాయం చేయాలని వారు కోరడం జరిగింది. ఇందులో భాగంగానే ఆర్ఓబి కోసం ఇల్లు కోల్పోయిన వారికి పూర్తి స్థాయిలో పరిహారం ఇప్పించాలని, హిందూ ముస్లిం స్మశాన వాటికల సమస్యలను పరిష్కరించాలని, పెద్దకోట్ల గ్రామస్తులకు న్యాయం చేయాలని వారు తెలిపారు.. ఇందులో ప్రధానంగా కదిరి రైల్వే గేట్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద నిర్మాణం కోసం ఇళ్లు కోల్పోయిన బాధితులకు సరైన పరిహారం అందలేదు అని తెలిపారు. గతంలో ఈ అంశంలో బాధితుల పక్షాన తాను చెడ్డ పరంగా పోరాడడం జరిగిందని తెలిపారు.తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ పనులు ప్రారంభం కావడంతో బాధితులు తమకు పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు అని తెలిపారు. ఇళ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ నేటి ధరల ప్రకారం పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ధర్మవరంలోని హిందూ స్మశాన వాటిక, ముస్లింలకు చెందిన ఖబరస్తాన్ సమస్యల్ని కూడా ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు. ఖబరస్తాన్ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించడంతో పాటు వర్షపు నీరు లోపలికి రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. హిందూ స్మశాన వాటిలో కూడా సమస్యలు ఎక్కువగా ఉన్నాయని.. స్థలం కూడా చాలా తక్కువగా ఉందని వివరించారు. పట్టణ సమీప ప్రాంతంలో హిందూ స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని తెలిపారు. వీటిన్నింటిపై తహసీల్దార్ ను పిలిపించి ఆర్డీఓ చర్చించారు. సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై నివేదికలు సిద్ధం చేయాలని తెలిపారు. మరోవైపు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద ముంపుకు గురి అయిన తాడిమర్రి మండలం పెద్దకోట్ల గ్రామస్తులకు సరి అయిన పరిహారం దక్కలేదని విషయాన్ని కూడా తెలపడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన పరిహారంలో తమకు అన్యాయం జరిగిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం ఆడివో మహేష్ స్పందిస్తూ అన్ని అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి న్యాయం చేసే విధంగా తాను కృషి చేస్తానని పరిటాల శ్రీరామ్కి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, బాధితులు పాల్గొన్నారు.

అయ్యప్ప ఆలయమునకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ విరాళం..

అధ్యక్షులు అంకె రామాంజనేయులు
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని అయ్యప్ప దేవాలయమునకు అయ్యప్ప స్వామి బంగారు విగ్రహ పూతకు గాను ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షులు అంకె రామాంజనేయులు సభ్యులు నవకుమార్ వేణు తుకారాం నవీన్ లు కలిసి తమవంతుగా అయ్యప్పకు రూ.31,000 రూపాయలను విరాళంగా ఆలయ ట్రస్ట్ కు అందజేశారు. అనంతరం ట్రస్టు వారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వారికి కృతజ్ఞతలను తెలియజేస్తూ, ఆలయములో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.

దివ్యాంగులకు ప్రత్యేక నోడల్ పాయింట్ ఏర్పాటు.. ఎంపీడీవో సాయి మనోహర్

విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఇకనుంచి దివ్యాంగులకు ప్రత్యేకంగా నోడల్ పాయింట్ కేంద్రమును ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన రాష్ట్రంలో దివ్యాంగులు అన్ని ప్రభుత్వ రంగాలలో ప్రతిభ ఘనపరుస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. అందుకనే మన ధర్మారం మండలంలో కూడా దివ్యాంగులకు సమస్యలను పరిష్కరించుటలో నా వంతుగా కృషి చేస్తానని తెలిపారు. కావున మండల పరిధిలో ఉన్నటువంటి దివ్యాంగులకు సామాజిక ఆర్థిక ఇతర సమస్యలు ఏవైనా ఉన్నచో అర్జీ ద్వారా తెలపవచ్చునని తెలిపారు. మీ అర్జీని ఏ రోజుకు ఆ రోజు విచారణ జరిపి సాధ్యమైనంత వరకు పరిష్కరించేందుకు కూడా తాను కృషి చేస్తానని తెలిపారు. ఇందుకు ప్రత్యేక అధికారిని కూడా నియమించడం జరిగిందని, తప్పనిసరిగా దివ్యాంగులకు న్యాయం జరిగే విధంగా తాను కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. దివ్యాంగులు అభివృద్ధి బాటలో నడిపినప్పుడే సుస్థిర అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని మండలంలోని దివ్యాంగుల అందరూ కూడా తప్పనిసరిగా సద్వినియోగం చేసుకొని, తమ సమస్యలను పరిష్కారం చేసుకొని, సుఖవంతమైన జీవితమును గడపాలని వారు కోరారు.