Home Blog Page 1465

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి అరెస్ట్‌

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. తన విధులకు భంగం క‌లిగించార‌ని బంజారాహిల్స్‌ సీఐ ఫిర్యాదు మేర‌కు గచ్చిబౌలి పోలీసులు కౌశిక్‌ రెడ్డిని కొండాపూర్‌లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్‌ రెడ్డి అరెస్టుతో ఆయన నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఆయనను పరామర్శించడానికి వెళ్లిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హరీశ్‌ రావు, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, కొత్త ప్రభాకర్‌ రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, రాకేశ్‌ రెడ్డి సహా పలువురు బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బీఆర్‌ఎస్‌ నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీస్టేషన్‌కు తరలించారు. అనంతరం కౌశిక్‌ రెడ్డిని అరెస్టు చేశారు. ఆయ‌న‌ను కూడా గచ్చిబౌలి పీఎస్‌ తరలిస్తున్నారు. కాగా, బుధ‌వారం త‌న ఫోన్‌ను సీఎం రేవంత్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ శివ‌ధ‌ర్ రెడ్డి ట్యాప్ చేస్తున్నారంటూ కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పీఎస్‌కు వెళ్లారు. అయితే, ఆయ‌న వెళ్లేస‌రికి ఏసీపీ అక్క‌డి నుంచి వెళ్లిపోవ‌డంతో త‌న అనుచ‌రుల‌తో క‌లిసి కౌశిక్ రెడ్డి హంగామా చేశారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌పై ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు కావ‌డం జ‌రిగింది. ఇవాళ ఆయ‌న‌ను అరెస్ట్ చేశారు.

ఎంపీ విజ‌య‌సాయిరెడ్డిపై లుక్ ఔట్ స‌ర్క్యుల‌ర్‌

వైసీపీ సీనియ‌ర్ నేత‌, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డిపై లుక్ ఔట్ స‌ర్క్యుల‌ర్ జారీ అయింది. కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్, కాకినాడ సెజ్‌లోని రూ. 3600 కోట్ల విలువైన వాటాల‌ను క‌ర్నాటి వెంకటేశ్వ‌ర‌రావు (కేవీ రావు) నుంచి గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో బ‌ల‌వంతంగా లాక్కోవ‌డంపై ఆయ‌న‌ ఫిర్యాదు మేర‌కు సీఐడీ కేసు న‌మోదు చేసింది. దీంతో విజ‌య‌సాయితో పాటు ఆయ‌న అల్లుడు శ‌ర‌త్ చంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిపై లుక్ ఔట్ స‌ర్క్యూల‌ర్ జారీ చేశారు. భ‌య‌పెట్టి అత్య‌ధిక శాతం షేర్ల‌ను అర‌బిందో సంస్థ ప‌రం చేశార‌నేది వీరిపై ప్ర‌ధాన అభియోగం.

నేడు ముంబయికి ఏపీ సీఎం చంద్రబాబు

మహారాష్ట్ర కొత్త సీఎంగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారోత్సవానికి హజరయ్యేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు బయలుదేరి వెళుతున్నారు. ముంబయిలోని అజాద్ గ్రౌండ్‌లో మహా ముఖ్యమంత్రిగా మూడోసారి ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీఏ నేతలు హజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి హజరయ్యేందుకు సీఎం చంద్రబాబు ఈ రోజు మధ్యాహ్నం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ముంబయి చేరుకోనున్నారు.

ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత చంద్రబాబు ముంబయి నుంచి విమానంలో నేరుగా విశాఖపట్నానికి చేరుకుంటారు. రాత్రి విశాఖలో బస చేయనున్నారు. విశాఖలో రేపు జరగనున్న డీప్ టెక్నాలజీ సమ్మిట్ 2024కు ఆయన హజరుకానున్నారు. ఈ సదస్సు తర్వాత విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అధారిటీ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు.

వైభవోపేతంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

0

. కైకలూరులో శ్రీసంతాన నాగేంద్ర విగ్రహ ప్రతిష్ట….
. భారీ అన్న సమారాధన…
. పోటెత్తిన భక్తజనం…

విశాలాంధ్ర – కైకలూరు : స్థానిక శ్రీసంతాన నాగేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఎంత వైభవపీతంగా జరిగింది.స్వాంప్ డ్రెయిన్ కాలువ గట్టుపై వెలసిన శ్రీస్వామివారి ఆలయ పునర్నిర్మాణ ప్రతిష్ట మహోత్సవాలు సోమవారం ప్రారంభమైన విషయం విధితమే.దీనిలో భాగంగా బుధవారం
శ్రీగణపతి,శ్రీనాగబంద,శ్రీమయూర వాహన సహిత శ్రీసంతాన నాగేంద్ర,శిఖర ప్రతిష్ట కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ పుల్లేటికుర్తి భోగేశ్వర శర్మ శిష్య బృందం గణపతి శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.ముందుగా నిర్వహించిన వివిధ హోమాల పూర్ణాహుతి అనంతరం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్య శాంతి కల్యాణం జరుగగా తదుపరి భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వాహకులు చావలి శంకర్ శాస్త్రి ఆధ్వర్యంలో చేపట్టారు.పరిసర గ్రామాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ అడవి కృష్ణ,స్థానిక జూనియర్ సివిల్ జడ్జి ఎం. శివకిరణ్,ఎంపీపీ అడవి కృష్ణ, న్యాయవాదులు గురజాడ ఉదయ శంకర్, వడ్లాని శ్రీరామచంద్రమూర్తి,పి.పవన్ కాంత్, శ్రీరామలింగేశ్వర స్వామి ధర్మకర్త ఉప్పులూరి ముత్తం రాజు శర్మ, ఉత్సవ కమిటీ సభ్యులు పశీడ్రంగి కనకదుర్గ ప్రసాద్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

11న డీ.ఈ.ఓ. కార్యాలయాల ఎదుట యుటిఎఫ్ నిరసన ప్రదర్శన

విశాలాంధ్ర- ధర్మవరం ; విద్యాశాఖ అధికారుల అసమ్మద్ద నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈనెల 11న డీఈఓ కార్యాలయం ఎదుట యుటిఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శెట్టిపి జయచంద్రారెడ్డి సుధాకర్ లు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాడ్య ఫెడరేషన్ రాస్ట్ర శాఖ పిలుపు మేరకు శ్రీ సత్య సాయి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్మవరం లోని ఉప విద్యాశాఖధికారి కార్యాలయంనందు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కలవడం జరిగింది అని తెలిపారు. గత ప్రభుత్వ పరిపాలనకు, ఈ ప్రభుత్వ పరిపాలనకు పెద్దగా తేడా లేదనే విధంగా విద్యాశాఖ అధికారుల నిర్ణయాలు ఉంటున్నాయని ఆరోపించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆమిదాలగొందిలో పనిచేస్తున్న ప్రధానోపాద్యాయులు జాబేజ్ సస్పెండ్ గాని, పాఠశాలల పని వేళలను 5 గంటల వరకూ పెంపు విషయం కావచ్చు గాని, పదో తరగతి పరీక్షలకు సంసిద్ధత పేరుతో విడుదల చేసిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ గాని, ముఖ్యంగా కొన్ని మండలాల్లో 10 శాతం నుంచి ఉపాధ్యాయులు సెలవులు పెట్టరాదని మండల విద్యాశాఖ అధికారులు అత్యవసర సందర్భాల్లో కూడా సెలవులు మంజూరు చేయడం లేదు అని మండిపడ్డారు. అనారోగ్యం పడిన వారికి సైతం సెలవులు మంజూరు చేయకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళనకు గురి అవుతున్న విషయం గాని, ఆదే విధంగా ఇప్పటికే విద్యార్థుల అపార్ నమోదు విషయంలో ఉపాధ్యాయులు పలు ఇబ్బందులు పడుతున్నారు అని, దీని వల్ల బోదనకు ఆటంకం కలుగుతున్నది అని వాపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో 100 రోజుల యాక్షన్ ప్లాన్ లో ఆదివారాలు, పండుగ దినాల్లో సైతం పని చేయాలంటూ ఇచ్చిన ఉత్తర్వుల పట్ల గాని ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ అసంబద్ధ నిర్ణయాలు ఉపాధ్యాయులను తీవ్ర ఆందోళనకు మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నాయి అని, విద్యాశాఖ అసంబద్ధ నిర్ణయాలను రద్దు చేయాలని డిమాండ్ తో ఆంధ్ర ప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ శ్రీ సత్యసాయి జిల్లా శాఖ నిరసన ప్రదర్శనలు చేపట్టడం జరిగిందని వారు తెలిపారు. అందువలన ఈనెల 11వ తేదీ కొత్తచెరువు జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శనలు చేస్తూ తదుపరి ఈనెల 16వ తేదీన రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శనలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. తదుపరి వ్రాతపూర్వక నోటీసును డీఈవో కిష్టప్పకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. కావున విద్యాశాఖ నిర్ణయాలను పునః సమీషించాలని, ఒత్తడి లేని వాతావరణంలో ఉపాధ్యాయులు స్వేచ్ఛగా పనిచేసే విధంగా అధికారులు నిర్ణయాలు ఉండాలని వారు తెలిపారు. లేదు యెడల మా పోరాటాన్ని మరింత ఉధృతం చేయగలమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ మేరీ వర కుమారి, జిల్లా కార్యదర్శి లతా దేవి, నాయకులు రామకృష్ణ నాయక్, హరికృష్ణ, లక్ష్మయ్య, రాం ప్రసాద్, రామాంజనేయులు సాయి గణేష్, బిల్లే రామాంజనేయులు, హరిశంకర్, వెంకట కిషోర్, బాలగుండ్ల ఆంజనేయులు, నాగేంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు భద్రత ట్రాఫిక్ నియమాలపై అవగాహన సదస్సు..

కరస్పాండెంట్ నిర్మల జయచంద్ర రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని కాకతీయ విద్యా నికేతన్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రత ట్రాఫిక్ నియమాలపై అవగాహన కోసం దృశ్యాత్మక కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని పాఠశాల కరస్పాండెంట్ నిర్మల జయచంద్ర రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రోడ్డుపై నడిచేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించడం వలన జరిగే ప్రమాదాలు గూర్చి హెల్మెట్ వాడకం వలన జరగబోయే ప్రమాదాలను ఎలా అరికట్టవచ్చో విద్యార్థులకు వివరించడం జరిగిందని తెలిపారు. తదుపరి రోడ్డు భద్రత ట్రాఫిక్ నియమాల గూర్చి దృశ్యాత్మకంగా చూపించడం జరిగిందని తెలిపారు. తద్వారా విద్యార్థులలో పూర్తి అవగాహన వస్తుందని వారు తెలిపారు. అదేవిధంగా ట్రాఫిక్ నియమాలకు సంబంధించిన గుర్తులు గూర్చి వివరించడం జరిగిందన్నారు. వాహనాలు వేగంగా నడపడం వలన జరిగే ప్రమాదాల గురించి, ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి కూడా విద్యార్థులకు కళ్లకు కట్టినట్లు చూపించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు సూర్య ప్రకాష్ రెడ్డి, పద్మ, ఉపాధ్యాయ, బోధనేతర బృందం, పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పంటల బీమా పథకం పై రైతులకు అవగాహన

విశాలాంధ్ర -వలేటివారిపాలెం : పొలం పిలుస్తుంది కార్యక్రమం వలేటివారిపాలెం మండలంలోని వలేటివారిపాలెం మరియు అంక భూపాలపురం గ్రామంలో మండల వ్యవసాయ అధికారి ఎం హేమంత్ భరత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పంటల బీమా పథకం కు సంబంధించి టాటా ఏఐజి ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధి రామరాజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ పంటలకు భీమా చేయించుకోవడం వలన తుఫాన్లు, కరువు, అకాల వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దిగుబడి నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించటం జరుగుతుంది ఎంపిక చేసిన పంటలను సాగు చేస్తూ నిర్ణీత సమయంలో ప్రీమియం చెల్లించి నమోదు చేసుకున్న కవులు రైతుతో సహా రైతులందరికీ కూడా ఈ బీమా పథకం లో చేరటానికి అర్హులు. నెల్లూరు జిల్లాకి 5 పంటలుకు నోటిఫై చేయటం జరిగింది వాటి యొక్క ప్రీమియం వివరములు వరి ఎకరాకు 168 రూపాయిలు, మినుములు 38 రూపాయలు, శనగ పంటకు 56 రూపాయలు పెసర పంటకు 36 రూపాయలు వేరుశెనగకు 60 రూపాయలు ప్రీమియం చెల్లించినట్లయితే పంటల బీమా పథకం మనకు అర్హులవుతారు వరి కి తప్ప మిగిలిన అన్ని పంటలకు ఈనెల 15 డిసెంబర్ చివరి తేదీ వరికి మాత్రం 31 డిసెంబర్ చివరి తేదీ అని తెలియజేశారు ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ ఇన్సూరెన్స్ కట్టుకోదలిచిన రైతులు మీ సమీప గ్రామ సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ ద్వారా గాని కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్ సీ ) లో గానీ లేక పోస్ట్ ఆఫీసుల ద్వారా వారి యొక్క ఆధార్, భూమి పత్రము కౌలు రైతు అయితే కౌలు కార్డు, బ్యాంక్ పాసు పుస్తకం జిరాక్స్ మరియు వ్యవసాయ సహాయకుల ద్వారా ధృవీకరణ పత్రము సంబంధించిన పత్రములు సమర్పించి ఆన్లైన్ ద్వారా ప్రీమియం చెల్లించి తక్షణ రసీదు పొందవచ్చు బ్యాంకు నందు రుణం తీసుకున్న రైతులకు సూచించిన సేవింగ్స్ బ్యాంక్ ఖాతాకు పరిహారము ఆన్లైన్ ద్వారా జమ చేయడం జరుగుతుంది మీ గ్రామ సచివాలయం పరిధిలోని రైతు సేవ కేంద్రం లోని గ్రామ వ్యవసాయ మరియు ఉద్యానవన సహాయకులను సంప్రదించవలసినదిగా కోరడమైనది. ఈ కార్యక్రమంలో ఉద్యానవన సహాయకులు పి నాగరాజు మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.

జగనన్న కాలనీలో దొంగలించిన ఇటుకలు, కంకరను రికవరీ చేయాలి

0

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామ శివారులో ఉన్న జగనన్న కాలనీలో ఇటుకలు, ఇసుక, కంకరను దొంగలించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి బొగ్గుల నరసన్న డిమాండ్ చేశారు. బుధవారం ఆయన జగనన్న కాలనీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న బేస్ మెంట్ లో ఉపయోగించిన ఇటుకలు, ఇసుక, కంకరను దొంగతనానికి గురైనట్లు ఆయన తెలిపారు. నిర్మాణాలను అసంపూర్తిగా వదిలేయడంతోనే అధికారుల పర్యవేక్షణ, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే దొంగతనాలు జరిగాయన్నారు. కావున తక్షణమే జిల్లా ఉన్నతాధికారులైన కలెక్టర్, హౌసింగ్ పీడీ, డీఈ స్పందించి జగనన్న కాలనీలో దొంగలించిన ఇటుకలు, ఇసుక, కంకరను రికవరీ చేసి చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

విజయవంతంగా శ్రీసంతాన నాగేంద్రస్వామి ప్రతిష్ట మహోత్సం…

0

విశాలాంధ్ర – కైకలూరు:కైకలూరు పట్టణంలో శ్రీసంతాన నాగేంద్రస్వామి ఆలయ పునర్నిర్మాణ ప్రతిష్ట మహోత్సవాలు ఈనెల 2వ తేదీ నుండి నేటి వరకు నిర్వహించామని ఆలయ ధర్మకర్త చావలి శంకర శాస్త్రి తెలియజేశారు.కైకలూరు మార్కెట్ యార్డ్ ఎదురుగా ఉన్న శ్రీఆంజనేయస్వామి గుడి వెనుక కాలువ గట్టు నుండి దాన గూడెం వెళ్లే రహదారిలో వెలసిన శ్రీస్వామివారి ఆలయ పునర్నిర్మాణ ప్రతిష్టా కార్యక్రమాన్ని త్రయహ్నిక దీక్షతో ప్రారంభించి శ్రీగణపతి,శ్రీసంతాన నాగేంద్రస్వామి, శిఖర,నాగబంధ, మయూర వాహన ప్రతిష్ట కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. బుధవారం ఉదయం 8.46 నిమిషాలకు ప్రతిష్టా కార్యక్రమం జరిగిందని అనంతరం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల శాంతి కళ్యాణం,అఖండ అన్న సమారాధన చేపట్టినట్లు పేర్కొన్నారు.

ఉప్పరపల్లి పొలంలోని నకిలీ పట్టలతో పేద ప్రజలను మోసం చేసిన నాగభూషణం, ఈడిగ వెంకటేష్లను కఠినంగా శిక్షించాలి

సిపిఐ నగర కార్యదర్శి ఎన్ శ్రీరాములు
విశాలాంధ్ర అనంతపురం : ఉప్పరపల్లి పొలం 194-8, 215 సర్వే నంబర్ ఇంటి పట్టాలిప్పిస్తా మనీ, నకిలి పట్టాలు సృష్టించి ఏకంగా తాసిల్దార్ సంతాకాలు మరియు సీల్ లను ముద్రించి పేద ప్రజలను నిలువునా మోసగించిన కురుగంట గ్రామానికి చెందిన ఎస్.నాగభూషణం, ఈడిగ వెంకటేషలను తక్షణం అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ, ఈ రోజు అనంతపురము రూరల్ తాసిల్దార్ కార్యాలయం నందు బాధిత ప్రజల తరుపున సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు, నకిల పట్టలు మంజూరు చేసిన మోస- గా ఉప్పరపల్లి పొలంలోని నకిలీ పట్టలతో పేద ప్రజలను మోసం చేసిన ఎస్. నాగభూషణం, ఈడిగ వెంకటేష్లను కఠినంగా శిక్షించాలి… అరెస్ట్ చేయాలి… పెద ప్రజలకు న్యాయం చేయాలి.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి ఎన్.శ్రీరాములు మాట్లాడుతూ.. ఉప్పరపల్లి పోలంలో ఇంటి పట్టాలు ఇప్పిస్తామని దాదాపు. 200 మంది పేదలతో వేలు డబ్బులు వసూలు చేసిన నకిలీ పట్టాల మోసగాళ్లు ఎస్ నాగభూషణం ఈడిగ వెంకటేశులపై గతంలోనూ అనేక మంది ప్రజలు రెవిన్యూ అధికారులకు పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. పత్రికల్లో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయని గుర్తు చేశారు.చివరికి తాసిల్దార్ సంతకం, దానికి సంబంధించిన సీల్ సైతం ఫోర్జిని చేసి నకిలీ పట్టాలు తయారుచేసి వాటిని డబ్బులు అమ్ముకున్నారు. ఇంతవరకు వారిపై చర్యలు తీసుకోకపోవడం దారుణం అన్నారు.గతంలో ఎమ్మార్వో మోహన్ కి నకిలీ పట్టాల ఫోర్జరీ పై పోలీసులు ఫిర్యాదు చేశారని ఇంతవరకు వారిపై చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది అన్నారు. సిపిఐ నాయకులు శ్రమించి బాధితులతో శ్రీ రామాంజనేయులు కి రక్ష15,000 శివాకి 35000 భాషకి 40 రూపాయలు, షేక్ష 21000 కిషోర్ కి 14,500, జయంతికి 25 వేల వరకు మేరా నాగభూషణంతో ఇప్పిచ్చామని చెప్పడం జరిగింది. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులు ఇలాంటి వారిపై కఠినం చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో బాధితులు పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలిపారు. అనంతరం రూరల్ ఎంఆర్ఓ సీనియర్ అసిస్టెంట్ యోగేంధర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సహాయ కార్యదర్శి రమణ సంతోష్ సిపిఐ నగర్ కార్యవర్గ సభ్యులు ప్రసాద్ సుందర్రాజు జయలక్ష్మి చాంద్ భాషా మున్నా ఇన్సాఫ్ నగర కార్యదర్శి ఖజా బాధితులు పాల్గొన్నారు..