విశాలాంధ్ర, సీతానగరం: మండలంలోని గుచ్చిమి రైతుసేవా కేంద్రంను సందర్శించిన రాష్ట్ర పౌరసరఫరాల ఎండి మంజీర్ జిలానీ ధాన్యంకొనుగోలుపై సర్వత్రా ఆరా తీశారు. ఇదేసమయంలో అటువైపు వెళుతున్న తాన్నసీతారాంపురం గ్రామానికి చెందినరైతు మర్రాపు శ్రీరాములను ధాన్యము కొనుగోలుపై అడగడంతోపాటు డబ్బులు 24గంటలలోపు వచ్చాయా అని ప్రశ్నించారు. దీనికి రైతు తన సెల్ ఫోన్ ను చూపించి తనకు ధాన్యము తరలించిన వెంటనే డబ్బులు బ్యాంకుఖాతాలో జమ అయినట్లు తెలియజేస్తూ వచ్చినమెసేజ్ చూపించారు. ఈఏడాది ఎన్ డి ఏ ఉమ్మడి ప్రభుత్వంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేవని, ఇటు ధాన్యం కొనుగోలు కేంద్రాలు గాని అటు మిల్లర్లు గాని అదనంగా ధాన్యం తీసుకోవడం లేదని తెలిపారు. ప్రస్తుతం దాన్యం డబ్బులు 24 గంటల లోపు పడుతుండడంతో అందరూ రైతులు ఆనందంతో ఉన్నారన్నారు.రైతు పలు విషయాలు తెలియచేయడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చివరి దాన్యపుగింజవరకు సక్రమంగా కొనుగోలుతోపాటు సకాలంలో చెల్లింపులు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈకార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ ఎస్ శోభిక,సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, జిల్లా అధికారులు ,మండల అధికారులు , సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
రైతుతో ముచ్చటించిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఎండి జిలానీ
నేషనల్ అచీవ్ మెంట్ సర్వే పరీక్ష
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నౌలేకల్ లోని ప్రాథమికోన్నత పాఠశాలలోని విద్యార్థులకు బుధవారం నేషనల్ అచీవ్ మెంట్ సర్వే పరీక్ష నిర్వహించడం జరిగిందని మండల విద్యాధికారి 2 రామ్మూర్తి తెలిపారు. పెద్దకడబూరు ప్రాథమిక పాఠశాల నందు 3వ తరగతిలో 26 మంది విద్యార్థులకు, నౌలేకల్ ప్రాథమికోన్నత పాఠశాల నందు 3వ తరగతిలో 24 మంది విద్యార్థులకు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతిలో 30 మంది విద్యార్థులకు పరీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పరీక్షను విద్యార్థుల యొక్క అభ్యసన సామర్థ్యాలను అంచనా వేయడానికి మరియు అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడానికి, గుణాత్మక విద్యను అందించడానికి ఉపయోగపడుతుందని ఆయన వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొణిజేటి రోశయ్య లేని లోటు తీర్చలేనిది
ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య యువజన సంఘం రాష్ట్ర పొలిటికల్ చైర్మన్ పెనుజూరు నాగరాజు
విశాలాంధ్ర- ధర్మవరం : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కొణి జేటి రోశయ్య లేని లోటు తీర్చలేనిదని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య యువజన సంఘం రాష్ట్ర పొలిటికల్ చైర్మన్ పెనుజూరు నాగరాజు తెలిపారు. బుధవారం పట్టణంలోని పెనుజురు నాగరాజు కార్యాలయంలో కొణి జేటి రోశయ్య మూడవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోశయ్య చిత్రపటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య యువజన సంఘం, సత్య సాయి జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం, పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం సభ్యులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో రోశయ్య తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారన్నారు సుమారు 50 ఏళ్ల తన రాజకీయ జీవితంలో రోశయ్య ఎన్నో పదవులు అలంకరించాలన్నారు. తమిళనాడు గవర్నర్ గా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా, శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఇలా ఎన్నో పదవులను అలంకరించిన రోశయ్య ఆర్థిక శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక పాత్ర వహించారన్నారు. అలాంటి మహనీయుని అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలన్నారు. ప్రత్యేకించి ఆర్యవైశ్యుల ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో పెద్దన్న పాత్ర పోషించారని ఆర్యవైశ్య సంఘాల బలోపేతానికి రోశయ్య చేసిన కృషి మరువలేనిది అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యులు ఆర్వేటి కిషోర్, కర్ణాటకం ముకుంద, రాష్ట్ర ఆర్యవైశ్య యువజన సంఘం మీడియా కమిటీ సభ్యులు గ్రంధే శ్రీనివాసులు, సత్యసాయి జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు కలవల నాగ తేజ, పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు దేవతా శ్రీనివాస్,గౌరవ అధ్యక్షులు అంబటి అవినాష్, నామరాజ, నగర సంకీర్తన కమిటీ అధ్యక్షులు గోపా చంద్రకాంత్, విజయ్, రజిని, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.
మెడికవర్ఆసుపత్రికి 61.62 లక్షలుజరిమానా
-వినియోగదారుల కోర్టుతీర్పు
విశాలాంధ్ర బ్యూరో నెల్లూరు: నిర్లక్ష్యంగా శస్త్ర చికిత్స చేసి బాధితుడి కంటి చూపు కోల్పోవడానికి కారణమైన నాటి సింహపురి హాస్పిటల్, నేటిమెడికవర్ హాస్పిటల్ యాజమాన్యానికి 61.62 లక్షలు జరిమానా విధిస్తూ బుధవారం ఉమ్మడి నెల్లూరు జిల్లా వినియోగదారుల కోర్టు న్యాయమూర్తి జింకా రెడ్డి శేఖర్ తీర్పుఇచ్చారు.వివరాల్లోకి వెళితే తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకు చెందిన చెవూరు సురేష్ బాబు వృత్తిరీత్యా పంచాయతీ కార్యదర్శి. 2017 మే లో ఆసుపత్రిలో చికిత్స కోసం చేరగాఅతడిని పరీక్షించినఓ వైద్యుడు సైనసైటిస్ శస్త్ర చికిత్స చేసుకోవాలని సూచించగామే11న సెప్టో ప్లాస్టీ,మినీ ఎఫ్ఈఎస్ఎస్ శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.మే 12 నఎడమకంటికివాపువచ్చి ఎడమకంటిచూపుకోల్పోయాడు.తలకు సంబంధించిన పలు సమస్యలు కూడా తలెత్తాయి. అనంతరం చెన్నై అపోలో, బ్రెయిన్అండ్ స్పైన్ ఆసుపత్రు
ల్లో లెఫ్ట్ ఫ్రంటో-టెంపోరల్ క్రానియోటమీ, రాడికల్ ఎక్సిషన్, బయోప్సీ శస్త్ర చికిత్సలు చేసుకున్నాడు.
దీంతో బాధితుడు వినియోగదారులకోర్టునుఆశ్రయించాడు.ఆధారాలనుపరిశీలించినన్యాయమూర్తి రెడ్డి శేఖర్ సైనసైటిస్ ఆపరేషన్ అప్పుడు మెడికవర్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లనే బాధితుడు పూర్తిగా కంటి చూపు కోల్పోయాడని, పలు సమస్యలు వచ్చాయని నిర్ధారించాడు. బాధితుడు
మెడికవర్, అపోలో, బ్రెయిన్ అండ్ స్పైన్ ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్సలు,మందులు, ఇతరఖర్చులకుగానూ21,62,752లు చెల్లించినట్లు బిల్లులు సమర్పించాడు. దీంతో ఖర్చు పెట్టిన రూ.21,62,752లు, శారీరక, మానసిక వేదన ఇతర డామేజస్కు గాను బాధితుడికి 40లక్షలుమొత్తం61,62,752లు నష్ట పరిహారం చెల్లించాలని బుధవారం నెల్లూరు మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యాన్ని ఉమ్మడి నెల్లూరు జిల్లావినియో గదారులకోర్టు న్యాయమూర్తి జింకా రెడ్డి శేఖర్ఆదేశిస్తూ తీర్పు ఇచ్చారు.45 రోజుల్లో పరిహారం చెల్లించకపోతే తీర్పు వెలువడిన తేదీనుంచి 9 శాతం వడ్డీతో మొత్తాన్ని చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.తీర్పు కార్యక్రమంలో సభ్యురాలు బాలసుధ పాల్గొన్నారు.
సీతానగరం మండలంలో రాష్ట్ర పౌరసరఫరాల ఎండి మంజీర్ జిలానీ సుడిగాలి పర్యటన
అంటిపేట,గుచ్చిమి రైతుసేవాకేంద్రాల సందర్శన
తామరకండిలో ధాన్యంమిల్లుతనిఖీ
జిల్లాలో ధాన్యం కొనుగోలు పైన డబ్బులు చెల్లింపులు పై సంతృప్తి వ్యక్తం చేసిన ఎండి
ఎండికు ఘన స్వాగతం పలికిన జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్, జిల్లా మండల అధికారులు, రైస్ మిల్లర్లు
ఎండిను ఘనంగా సత్కరించిన జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్
విశాలాంధ్ర, సీతానగరం: పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతానగరం మండలంలో రాష్ట్ర పౌరసరఫరాల మేనేజింగ్ డైరెక్టర్ మంజీర్ జిలాని బుధవారంనాడు సుడిగాలి పర్యటన చేపట్టారు. ముందుగా అంటిపేట రైతు సేవాకాంద్రాన్ని సందర్శించి ధాన్యం కొనుగోలుపైన, తేమశాతం నమోదు, రైతులకు డబ్బులు చెల్లింపులు, ఇటీవల కురిసిన చిరుజల్లులకు,మబ్బులకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలపైన ధాన్యంసేకరణపై ప్రశ్నలు వేశారు. క్షేత్రస్థాయిలో రైతులగూర్చి కూడా పలు ప్రశ్నలు వేశారు. రైతుసేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు జరుగుతుందా లేదా అని ప్రశ్నించారు. అదనంగా దాన్యము తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు. రైతు సేవ కేంద్రాల సేవలపై కూడా ఆరా ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరుతుందా లేదన్న అంశాన్ని కూడా తెలుసుకున్నారు.జిల్లాలో ధాన్యం కొనుగోలు కొనుగోలు అనంతరం రైతులకు డబ్బులు చెల్లింపులు పైన, తేమశాతం పైన, రైతు సేవా కేంద్రాల ఆధ్వర్యంలో జరుగుతున్న విధానాలపై ఆయన సంతృప్తి చెందారు. 24 గంటల్లోగా డబ్బులు తమ ఖాతాలో జమ అవుతున్న విషయాన్ని రైతులు తమ సెల్ఫోన్లో మెసేజ్ ద్వారా చూపించారు. పక్కజిల్లాలో ఉండే ఫిర్యాదులపై గుచ్చిగుచ్చి ప్రశ్నించినప్పటికీ ఈజిల్లాలో లేకపోవడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.జిల్లాలోని జిల్లాలెక్టర్, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్లు, ఇతర అధికారులంతా సమన్వయంతో పని చేస్తూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ ఎస్ ఎస్ శోభికవివరించారు. ఈఎడాది ధాన్యంలో రైతు నేరుగా మిల్లును కూడా ఎంచుకునే పద్ధతిని ఏర్పాటు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఇస్తుందని రైతులు తెలిపారు. మిల్లర్లు కూడా పూర్తి సహకారం అందిస్తామని, 100 కోట్ల రూపాయలు బ్యాంకు గ్యారంటీ కడతామని తెలియజేశారు. జిల్లా అధికారుల సహకారంతోపాటు రైతులు మంచి ధాన్యాన్ని ఈఏడాది మిల్లులకు తీసుకొని వస్తున్నారని తెలిపారు. జిల్లాలో 24 గంటల్లోపు ఇంతవరకు ధాన్యం తరలించారు రైతులకు డబ్బులు పడుతున్నాయని రైతులతో పాటు అధికారులు కూడా ఆయనకు తెలియజేశారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు డబ్బులు చెల్లింపులు రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం సేకరణ తదితర అంశాల పట్ల ఎండి సంతృప్తి వ్యక్తం చేశారు. చివరివరకు ఇదేపందాను కొనసాగించాలన్నారు. రైతులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. జిల్లాకు మొదటిసారిగా విచ్చేసిన ఎండిమంజీర్ జిలానీకు జాయింట్ కలెక్టర్ ఎస్ ఎస్ శోభికా, సబ్ కలెక్టర్ శ్రీ అశుతోష్ శ్రీవాత్సవ, జిల్లా పౌర సరఫరాల అధికారులు, జిల్లా వ్యవసాయ అధికారులు, మండల అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్ తో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాబర్ట్ పాల్, జిల్లా పౌరసరఫరాల అధికారి పి .శ్రీనివాసరావు, జిల్లా మార్క్ ఫెడ్ అధికారి వై విమల, తహాశీల్దార్
అల్లువాడ ఉమామహేశ్వర రావు, మండల వ్యవసాయ అధికారి ఎస్ అవినాష్, సిఎస్డిటి రమేష్ ,తదితరఅధికారులు, గ్రామ సచివాలయాల వ్యవసాయ సహాయకులు, గ్రామ రెవిన్యూ అధికారులు,రైతులు పాల్గొన్నారు.తామరఖండిలోని శ్రీవెంకట సూర్య మోడరన్ రైస్ మిల్లును సందర్శించిన సమయంలో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఘనస్వాగతం పలికి ఆయనకు సన్మానించారు. తమ సమస్యలను పరిష్కరించాలని, 1:4 బ్యాంకు గ్యారంటీ సదుపాయాన్నీ కల్పించాలని, గతంలో రావలసిన బకాయిలు చెల్లింపులు చేయాలని విజ్ఞప్తి చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో పూర్తి సహకారం అందజేస్తామని, 100 కోట్ల బ్యాంకు గ్యారెంటీ కూడా కడతామని మిల్లర్లు తెలియజేశారు. జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ సబ్ కలెక్టర్ జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు తమతో సమావేశాన్ని నిర్వహిస్తూ ధాన్యం సేకరణపై బ్యాంకు గ్యారంటీలపై అప్రమత్తం చేస్తూ తమను చైతన్యం చేస్తున్నారని తెలిపారు.ఈకార్యక్రమంలో రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు బి .రవి కుమార్ మాస్టర్, ట్రెజరర్ గెంబలి రవికుమార్, వైస్ ప్రెసిడెంటులు ఎం.ధనుంజయనాయుడు, అక్కేనమధు కన్వీనర్ పొట్నూరు గౌరీ శంకర్రావు
కె వెంకటరాజు, వారణాసి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పౌరసరఫరాల మేనేజింగ్ డైరెక్టర్ జిలాని పర్యటన ప్రశాంతంగా ముగియడంతో జిల్లాఅధికారులు, మండలఅధికారులు మిల్లర్లు ఊపిరి పీల్చుకున్నారు.
ఈద్గా మసీదు కాంప్లెక్స్ సమస్యను జిల్లా కలెక్టర్ పారదర్శకతతో పరిష్కరించాలి
విశాలాంధ్ర -అనంతపురం : భారత కమ్యునిస్టు పార్టీ మైనారిటీ వింగ్ “ఇన్సాఫ్” నగర సమితి ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మైనారిటీ నగర ప్రధాన కార్యదర్శి ఖాజా హుస్సేన్ , గౌరవ అధ్యక్షులు అల్లి పీరా , అధ్యక్షులు చాంద్ బాషా మాట్లాడుతూ… రోడ్ వైడనింగ్ లో భాగంగా ఈద్గా మసీదు కాంప్లెక్స్ విషయంలో ఎన్.హెచ్.ఏ వారు తీసుకున్న నిర్ణయం అందరికీ తెలిసినదే అని పేర్కొన్నారు. గత సంవత్సరం ఇదే విషయమై మైనారిటీలు అందరూ కలిసి ప్రిన్సిపల్ సెక్రటరీ అనంతపురం విచ్చేసినపుడు ,మసీదు కాంప్లెక్స్ లేని పక్షంలో జరిగే నష్టాలను వారి దృష్టికి తీసుకుని వెళ్ళటం జరిగిందని పేర్కొన్నారు. వారు సానుకూలంగా స్పందించి కాంప్లెక్స్ విషయం లో పునరాలోచన చేస్తాను అని మాట ఇవ్వడం జరిగిందన్నారు. గత వైకాపా ఎంపీ తలారి రంగయ్య కి కూడా వినతి పత్రం అందజేయడంతో వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగిందన్నారు. ఈ విషయమై మంగళవారం నగరంలోని పలువురు మైనారిటీలు , కాంప్లెక్స్ లోని షాపు లో అద్దెకు ఉంటున్న వారు, ముస్లిం సంఘాలు , ఇమాము లు ఈద్గా మసీదు నందు పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగిందన్నారు.సంబంధిత అధికారులు మసీదు వద్దకు చేరుకుని పారదర్శకత చూపించకుండా కేవలం ఒకరిద్దరితో చర్చించి వారి మాటే వేదం అనుకుని వెళ్లిపోవడం జరిగిందన్నారు. అక్కడికి తమ తమ ఆలోచనలు, అభ్యర్థనలు వినిపించటానికి వచ్చిన వారితో చర్చలు జరుపలేదన్నారు. ఈ విషయం పై చాల మంది ముస్లిం నాయకులకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు. ఏక పక్ష నిర్ణయాలకు తావు ఇవ్వకుండా అన్ని ముస్లిం సంఘాలకు, అన్ని పార్టీల ముస్లిం నాయకుల మరియు అఖిల పక్ష పార్టీల నాయకుల అభిప్రాయాల స్వీకరణ కొరకు ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని , అందరినీ పిలిపించి ఈద్గా మసీదు కాంప్లెక్స్ విషయం పై నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హాజీ వలి, రహంతుల్లా , ఖాజా మొహిద్దీన్, దాదు, తదితరులు పాల్గొన్నారు .
ఘనంగా జరిగిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం
ఎంఈఓ గోపాల్ నాయక్
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని ఎల్సికేపురంలో గల భవిత దివ్యాంగుల సెంటర్లో ఎంఈఓ గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం జరుపుకున్నారు. ముఖ్యఅతిథిగా ఎంఈఓ గోపాల్ నాయక్ పాల్గొని వికలాంగుల దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులను సైకాలజీని బట్టి చదువును అందించాల్సిన బాధ్యత అందరిమీద ఉందని తెలిపారు. అదేవిధంగా విద్యార్థులకు ప్రతి వారము రెండు రోజులు ఫిజియోథెరపీ చేయించారని తెలిపారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు విధిగా విద్యార్థులకు ఫిజియోథెరపీ చేయించాలని, భవిత పాఠశాలలో విద్యను అభ్యసింపచేసేలా కృషి చేయాలని తెలిపారు. దివ్యాంగుల విద్యార్థులకు ప్రభుత్వం అనేక సౌకర్యాలను కల్పిస్తోందని, వాటిని తల్లిదండ్రులు తమ పిల్లలకు సద్వినియోగం కలిగేలా ఉపయోగించుకోవాలని తెలిపారు. దివ్యాంగ విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. తదుపరి పదవ తరగతి ఉత్తీర్ణులైనటువంటి ఇద్దరు విద్యార్థులను ఎంఈఓ తో పాటు భవిత పాఠశాల టీచర్లు సరస్వతి, మల్లికార్జున,హెచ్ఎం నాగప్ప కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భవిత పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
రమణ మహర్షి 145వ జయంతి మహోత్సవ వేడుకలు
విశాలాంధ్ర -ధర్మవరం : భగవాన్ రమణ మహర్షి వారి 145వ జయంతి మహోత్సవ వేడుకలు పట్టణంలోని మార్కెట్ యార్డ్ సమీపాన వేదం వారి తోటలో ఈనెల 17వ తేదీ మంగళవారం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ రమణ మహర్షి 20 సంవత్సరములకు ఒక పర్యాయం మాత్రమే ఇటువంటి తిథులు వస్తాయని తెలిపారు. భగవాన్ సేవకు స్పందించి అందరూ సాయం అందించండి అని తెలిపారు. అదేవిధంగా ఈనెల 13వ తేదీ శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు ఆశ్రమమునందు స్వచ్ఛమైన ఆవు నెయ్యితో అరుణాచల మహాదీపోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ దీపం 11 రోజులు పాటు నిర్విరామంగా కొనసాగుతుందని తెలిపారు. 17వ తేదీన ఆశ్రమంలో మహాగణపతి పూజ రమణ పూజా కార్యక్రమం అరుణాచల అక్షర మణిమాల భక్తి ప్రవచనాలు ప్రాకారోత్సవాలు జరుగునని తెలిపారు. అనంతరం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం కూడా ఉంటుందని తెలిపారు. కావున భక్తాదులు అధిక సంఖ్యలో వచ్చి ఈ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు తెలిపారు.
పుష్ప-2 టిక్కెట్ ధరలపై రాంగోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్
పుష్ప-2 సినిమాపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. పుష్ప-2 టిక్కెట్ ధరలను స్టార్ హోటల్‌లో ఇడ్లీతో పోల్చారు. సినిమాలు ప్రజాసేవ కోసం నిర్మించరని పేర్కొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పుష్ప-2 సినిమా టిక్కెట్ ధరలను భారీగా పెంచుకోవడానికి రెండు ప్రభుత్వాలు అనుమతించాయి. ఈ క్రమంలో ఆయన కథ రూపంలో పోస్ట్ పెట్టారు. ఃసుబ్బారావు అనే ఒకడు ఒక ఇడ్లీ హోటల్ పెట్టి, ప్లేట్ ఇడ్లీల ధరను రూ.1,000గా పెట్టాడు. సుబ్బారావు అంత ధర పెట్టడానికి కారణం… వాడి ఇడ్లీలు మిగతావాటి ఇడ్లీల కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు. కానీ కస్టమర్‌కు సుబ్బారావు ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే.. వాడు సుబ్బారావు హోటల్‌కు వెళ్లడు. అప్పుడు నష్టపోయేది సుబ్బారావు ఒక్కడే తప్ప, ఇంకెవ్వరూ కాదు.ః అంటూ స్టోరీ రూపంలో చెప్పారు.
సెవెన్ స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదని ఏడ్చినట్లు…
సుబ్బారావు ఇడ్లీల ధర సామాన్య ప్రజల అందుబాటులో లేదుః అని ఎవరైనా ఏడిస్తే, అది సెవెన్‌స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదని ఏడ్చినంత వెర్రితనమవుతుందని ఎద్దేవా చేశారు. ఒకవేళ సెవెన్‌స్టార్ హోటల్‌లో అంబియన్స్‌కి మనం ధర చెల్లిస్తున్నాంః అని వాదిస్తే, పుష్ప 2 విషయంలో ఆ సెవెన్‌స్టార్ క్వాలిటీ అనేది కూడా ఈ సినిమా అని భావించవచ్చునని అభిప్రాయపడ్డారు. డెమొక్రాటిక్ క్యాపిటలిజం అనేది క్లాస్ డిఫరెన్స్ మీదే పని చేస్తుందని, అన్ని ఉత్పత్తుల్లాగే సినిమాలు కూడా లాభాల కోసమే నిర్మించబడతాయని పేర్కొన్నారు. కానీ సినిమాలు నిర్మించేది ప్రజాసేవ కోసం కాదని రాసుకొచ్చారు. లగ్జరీ కార్లపై, విలాసవంతమైన భవనాలపై, బ్రాండెడ్ బట్టలపై ఎలాంటి ఏడుపూ ఏడవనోళ్లు సినిమా టికెట్ ధరల మీదే ఎందుకు ఏడుస్తున్నారు? వినోదం నిత్యావసరమా? ఇల్లు, తిండి, బట్టలు ఈ మూడింటి కన్నా ఎక్కువ అవసరమా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అలా అయితే ఈ మూడు నిత్యావసరాల ధరలు బ్రాండింగ్ ఉన్నప్పుడు, ఆకాశాన్ని తాకుతుంటే, ఆకాశం లాంటి పుష్ప 2 సినిమాకి ఇప్పుడు పెట్టిన రేట్లు కూడా తక్కువేనని పేర్కొన్నారు. ఎవరైనా ఇలా ఆలోచించని వారు ఉంటే పుష్ప-2 సినిమాను చూడటం మానేయాలని లేదా ధరలు తగ్గాక చూడాలని సూచించారు. మరోసారి, సుబ్బారావు హోటల్ చైన్ విషయానికొస్తే ఇడ్లీ ధర ఇప్పటికే వర్కౌట్ అయిపోయిందన్నారు. దానికి ప్రూఫ్ ఏమిటంటే సుబ్బా రావు హోటల్లో కూర్చోవడానికి కూడా చోటు ఉండటం లేదని పేర్కొంటూ… సీట్లన్నీ బుక్ అయిపోయాయని పుష్ప-2ని ఉద్దేశించి రాసుకొచ్చారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ..!
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు దాదాపు ఖరారైంది. ఈ మేరకు బిజెపి కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం 1 గంటకు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో జరగనుంది. సీఎం ఎంపిక విషయంలో మహాయుతిలో గత కొద్ది రోజులుగా ప్రతిష్టంభన నెలకొన్న సంగతి విదితమే. ముందు నుంచీ మహారాష్ట్ర బీజేపీలో కీలకంగా ఉన్న ఫడ్నవీస్ పేరే సీఎం రేసులో ప్రముఖంగా వినిపించిన సంగతి తెలిసిందే.

