Home Blog Page 1467

బియ్యం అక్రమాలపై సీఐడీ దర్యాప్తు

0

. ఆర్థిక పరిస్థితి మెరుగు కోసం కీలక పాలసీలు
. జలజీవన్‌ మిషన్‌ పున:ప్రారంభం
. 15న పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం
. పర్యాటక అభివృద్ధికి టూరిజం సర్క్యూట్స్‌
. తిరుపతి, వైజాగ్‌, విజయవాడ, అమరావతిలో వర్కింగ్‌ సెంటర్లు
. రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: కాకినాడ పోర్టు కేంద్రంగా పెద్దఎత్తున సాగుతున్న పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణాపై సీఐడీతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఈ అంశాన్ని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సమావేశంలో ప్రస్తావించారు. తన దృష్టికి వచ్చిన అక్రమాలను వెల్లడిరచారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ సీఐడీచే విచారణ జరిపించి బియ్యం మాఫియాను అరికడదామని హామీ ఇచ్చారు. ‘కాకినాడ పోర్టును, కాకినాడ సెజ్‌ను బలవంతంగా లాక్కున్నారు. పోర్టు లాగేసుకుని 41 శాతం కేవీ రావుకు ఇచ్చేసి 59 శాతం అరబిందోకు అప్పగించారు. ఆస్తులు గుంజుకోవడం రాష్ట్రంలో కొత్త ధోరణి అయింది. ఇంతకుముందు మనం ఎప్పుడూ ఇలాంటివి చూడలేదు. వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థలను బాగా ధ్వంసం చేశారు. వీటన్నింటిపై సీఐడీ విచారణ జరిపిద్దామని మంత్రులతో చంద్రబాబు అన్నారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో వివిధ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని, దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే దానిపై మంత్రులతో సీఎం చర్చించారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొలుసు పార్ధసారథి మీడియాకు వివరించారు. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడానికిగాను కొన్ని పాలసీలకు మంత్రిమండలి ఆమోదం తెలిపినట్లు చెప్పారు. సమావేశంలో మంత్రి నారాయణ, రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా పాల్గొన్నారు. అ ఆంధ్రప్రదేశ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్స్‌ (జీసీసీ) పాలసీ (4.0) 2024-2029కు ఆమోదం అ రాష్ట్రాన్ని నాలెడ్జ్‌ ఎకానమీకి గ్లోబల్‌ హబ్‌గా మార్చే లక్ష్యంతో ఐటీ, జీసీసీ పాలసీ 4.0 (2024-2029)కు ఆమోదం అ అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాలు ప్రపంచ వ్యాపార రంగంలో కీలకంగా మారాయి. సాంకేతిక వ్యాపార పరిభాషలో వీటిని గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) అంటారు. కొన్ని కీలక విధుల నిర్వహణకు బహుళజాతి సంస్థలు (ఎంఎన్‌సీలు) విదేశాల్లో ఏర్పాటు చేసే కేంద్రాలివి. రిమోట్‌ వర్క్‌, హైబ్రిడ్‌ వర్క్‌, కో-వర్కింగ్‌ స్పేస్‌ వంటి అత్యాధునిక సర్వీస్‌ డెలివరీ మోడళ్లను ఏర్పాటు చేయడం ఈ పాలసీ లక్ష్యమని మంత్రి తెలిపారు. నూతన ఆవిష్కరణలు, గిగ్‌ ఎకానమీ, వ్యవస్థాపకత, స్థిరమైన ఆర్థిక అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున సాంకేతిక ఆధారిత విద్యార్థులను, ప్రతిభావంతులైన వర్కు ఫోర్స్‌ను, సహాయక ప్రభుత్వ విధానాలతో సహా ఆంధ్రప్రదేశ్‌ వ్యూహాత్మక ప్రయోజనాలను ఉపయోగించుకోవడానికి ఈ విధానం దోహదపడుతుందన్నారు. అ స్వర్ణాంధ్ర విజన్‌2047లో భాగంగా రాష్ట్రం ప్రతిష్టాత్మకమైన ‘ఒకే కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త’ లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకోసం ప్రణాళిక అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
. మౌలిక సదుపాయాలను సత్వరమే సృష్టించడానికి ప్రభుత్వం కో-వర్కింగ్‌ స్పేస్‌లు, పొరుగు వర్కు స్పేస్‌లను పెద్దఎత్తున ప్రోత్సహించాలని భావిస్తున్నది. ఇందుకు ప్రోత్సాహకాలను పెద్దఎత్తున అందజేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది.
. కో-వర్కింగ్‌ స్పేస్‌ అంటే ఒక సెంటర్‌ను ఏర్పాటు చేసి… అక్కడే ఐటీ కంపెనీ, షాపింగ్‌ కాంప్లెక్సు, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఏర్పాటు చేయడం
అ తిరుపతి, వైజాగ్‌, విజయవాడ, అమరావతి తదితర పెద్ద కేంద్రాల్లో పొరుగు వర్కింగ్‌ స్పేస్‌ సెంటర్ల ఏర్పాటు, వీటికి అనుబంధంగా గ్రామాల్లో, మండలాల్లో కో-వర్కింగ్‌ స్పేస్‌ సెంటర్ల ఏర్పాటు
అ కనీసం 100 సీట్ల నుండి 10 వేల చదరపు అడుగులతో కో-వర్కింగ్‌ స్పేస్‌ సెంటర్లు అభివృద్ది పర్చే వారికి పెట్టుబడిలో 50 శాతం రాయితీ
అ వంద మందికి వర్కింగ్‌ స్పేస్‌ ఏర్పాటు చేస్తే రూ.2.00 ఆరు మాసాలకు ప్రోత్సాహకంగా ఇవ్వడం
అ ప్రతి సీటుకు రూ.1,000 చొప్పున ఆరు మాసాల్లో ప్రోత్సాహకం అందజేత
అ 5 లక్షల చదరపు అడుగుల ఫ్లోర్‌ ఏరియా పైబడిన ఐటీ క్యాంపస్‌ ఏర్పాటు చేసేవారికి పెట్టుబడిలో 50 శాతం రాయితీ
అ ‘‘ఆంధ్రప్రదేశ్‌ టెక్స్‌టైల్‌, అపెరల్‌ అండ్‌ గార్మెంట్స్‌ పాలసీ 4.0, 2024-29 ఆమోదం. రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు, ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి లక్ష్యం
అ 2024 2029 కాలంలో రాష్ట్రం నుంచి వస్త్ర ఎగుమతుల్ని బిలియన్‌ డాలర్లకు పెంచాలని లక్ష్యం
అ ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో (పీపీపీ) 5 కొత్త సమగ్ర టెక్స్‌టైల్‌ పార్కుల అభివృద్ధి
అ ఈ పార్కులను మూడు కేటగిరీలుగా విభజించి ఎంఎస్‌ఎంఈలకు 30 శాతం, మధ్య తరహా పార్కులకు 20 శాతం పెట్టుబడి రాయితీ
అ ఆంధ్రప్రదేశ్‌ మారిటైమ్‌ పాలసీ 4.0 (2024-29)కు ఆమోదం, 975 కిలో మీటర్ల పొడవైన తీర ప్రాంతాన్ని ప్రభావితం చేస్తూ ప్రపంచస్థాయి సముద్ర తీర రాష్ట్రంగా అభివృద్ది పర్చాలనే లక్ష్యంగా ఈ పాలసీ రూపొందించామని, ఈ విషయంలో గుజరాత్‌ ప్రథమ, ద్వితీయ స్థానంలో ఏపీ ఉందని మంత్రి తెలిపారు.
అ రాష్ట్రంలో ఒక మెగా షిప్‌యార్డు ఏర్పాటుకు కృషి
అ గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య శాఖకు చెందిన 24 మాసాల కాంట్రాక్టు పీరియడ్‌ గల కొన్ని తాగునీటి సరఫరా ప్రాజెక్టుల ధరల సర్దుబాటు
అ జలవనరుల శాఖ ప్రతిపాదనల మేరకు శ్రీకాకు ళం జిల్లా ఉద్దానం, వైఎస్సార్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గం, కర్నూలు జిల్లా డోన్‌
అ ప్రధాన్‌ మంత్రి ఆవాస్‌ యోజన – గ్రామీణ ప్రధాన్‌ మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌ పథకాలకు ప్రస్తుత యూనిట్‌ విలువ, పద్ధతితో కొనసాగించడానికి, పెండిరగ్‌లో ఉన్న గృహాలు పూర్తి చేయాలని నిర్ణయం
అ అర్బన్‌లో 6.41 లక్షల ఇళ్లు, గ్రామాల్లో 1.09 లక్షల ఇళ్లు పూర్తి చేయాలని నిర్ణయం
అ ఆంధ్రప్రదేశ్‌ క్రీడల పాలసీ 2024-29 సవరణల ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం
అ పర్యాటక రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు రాబట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌ క్రీడల పాలసీ 2024-29కి ఆమోదం
అ ఆంధ్రప్రదేశ్‌ టూరిజం పాలసీ 2024-2029 సమగ్ర వెర్షన్‌ ఆమోదం
అ ఆంధ్రప్రదేశ్‌ సస్టైనబుల్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ పాలసీ 4.0 (2024-29)కి ఆమోదం
అ రాజధాని అమరావతిని ఎలక్ట్రిక్‌ మొబిలిటీ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ సస్టైనబుల్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ పాలసీకి ఆమోదం
అ రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ 4.0 అమలు కోసం, ఆర్‌ఈఎఫ్‌ఎస్‌ ఫ్లోటింగ్‌కు అనుమతించేందుకు చేసిన ప్రతిపాదనకు ఆమోదం
అ ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 15న అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతిని ‘ఆత్మర్పణ దినోత్సవం’గా పాటించాలని నిర్ణయం
అ జల్‌ జీవన్‌ మిషన్‌ పున:ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించగా, రాజధాని నిర్మాణ పనులపై సీఆర్‌డీఏ సమావేశం సోమవారం తీసుకున్న నిర్ణయాలను మంత్రివర్గం ఆమోదించినట్లు మంత్రి నారాయణ తెలిపారు.

పోర్టు రాజకీయం!

0

కాకినాడకే పరిమితమా?

స్టెల్లా షిప్‌ సీజ్‌… కెన్‌స్టార్‌ షిప్‌ సంగతేంటి?
అదానీ గంగవరం పోర్టు జోలికెళ్లరేం ?

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : బియ్యం అక్రమ రవాణా దందా ఆరోపణలకు సంబంధించి కాకినాడ పోర్టులోనే కాకుండా ఇతర పోర్టులనూ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తనిఖీలు చేయాలన్న డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. ప్రధానంగా అదానీకి చెందిన గంగవరం పోర్టు ద్వారా కూడా అక్రమ బియ్యం రవాణా కొనసాగుతుందన్న విమర్శలున్నాయి. గంగవరం పోర్టుకు వెళ్లకుండా… కాకినాడ పోర్టునే పట్టుకుని పవన్‌ హడావుడీ చేయడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. రాష్ట్రంలో పరిపాలన నిష్పక్షపాతంగా జరగడం లేదనడానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానిస్తున్నాయి. కాకినాడ పోర్టు పరిశీలనకు వెళ్లిన పవన్‌… అక్కడి షిప్‌ను సీజ్‌ చేయాలంటూ అధికారులను ఆదేశించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఏపీలోని కాకినాడ, విశాఖ, గంగవరం పోర్టుల ద్వారాను, గుజరాత్‌లోని కాండ్ల పోర్టు ద్వారా విదేశాలకు పెద్దఎత్తున బియ్యం సరఫరా అవుతోంది. దీనికి ప్రభుత్వ నిఘా వ్యవస్థ లేకపోవడం, ఉన్నతాధికారుల లోపమే ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. పోర్టుల పరిధిలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. ఏ ప్రభుత్వాలు వచ్చినా అలాంటి పరిస్థితులు లేవు. కాకినాడ పోర్టు కేంద్రంగా 1995 నుంచి బియ్యం ఎగుమతులు జరుగుతున్నాయి. ఈ పోర్టును నమ్ముకొని 30 వేల మంది కార్మికులు బతుకుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో పీడీఎస్‌ బియ్యం ఆఫ్రికా దేశాలకు తరలి వెళ్లాయని, వీటి వెనుక ఓ మాజీ ప్రజాప్రతినిధి హస్తముందన్న ఆరోపణలతో పవన్‌ తనిఖీలకు ప్రాధాన్యత ఏర్పడిరది. అవి నిజమైతే…ప్రభుత్వం సీబీఐ విచారణకు అప్పగించి, బాధ్యులపై కఠిన చర్యలకు ఉపక్రమించాల్సి ఉంది. రాజకీయ ప్రయోజనాల కోసం కాకినాడ పోర్టుపై విషప్రచారం వల్ల ఎగుమతులు గుజరాత్‌లోని కాండ్ల పోర్టుకు తరలిపోతున్నాయన్న వాదనలున్నాయి. ఇప్పటికే విశాఖ, గంగవరం పోర్టుకు బియ్యం లారీలు వెళ్లిపోయాయని, కాకినాడ పోర్టు కార్మికులకు పనులు లేకుండా పోతున్నాయని సమాచారం. కాకినాడ పోర్టే కాదు… గంగవరం పోర్టు కేంద్రంగాను అక్రమ రావాణా బియ్యం దందా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అక్కడికి పవన్‌ కల్యాణ్‌ ఎందుకు వెళ్లలేకపోతున్నారని, అది అదానీది కావడమే కారణమా అంటూ విపక్షాలు నిలదీస్తున్నాయి. అన్ని పోర్టుల్లోనూ ఇదే తరహా తనిఖీలు నిర్వహించి… అక్రమ దందాకు చెక్‌ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్‌ను తనిఖీ చేసిన పవన్‌… ఆ పక్కనే ఉన్న కెన్‌స్టార్‌ షిప్‌ దగ్గరకు ఎందుకు వెళ్లలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘కెన్‌స్టార్‌’ షిప్‌లో బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారని, అది ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ వియ్యంకుడదంటూ విమర్శలు వచ్చాయి. తన శాఖ కాకపోయినా ప్రాణాలకు తెగించి ప్రజల ఆస్తిని కాపాడటానికి, షిప్‌ను తనిఖీ చేయడం కోసం సముద్రంలోకి వెళ్లిన పవన్‌ను స్వాగతిస్తూనే… ‘కెన్‌స్టార్‌’ షిప్‌ వద్దకు ఎందుకు వెళ్లలేదని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ‘స్టెల్లా’లో 36 మంది ట్రాన్స్‌పోర్టర్లు, 35 వేల టన్నుల బియ్యం ఎగుమతి చేయడానికి తెచ్చుకున్నారని తెలిసింది. పక్కనే లంగరేసి ఉన్న ‘కెన్‌స్టార్‌’లో ఒకే ఎక్స్‌పోర్టర్‌ 42 వేల టన్నుల బియ్యం నైజీరియాకు ఎగుమతి చేస్తున్నప్పటికీ దాని జోలికి వెళ్లడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇతర పోర్టులపైనా తనిఖీలు నిర్వహించాల్సిన అవసరముంది.
ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణం
సబ్సిడీ మీద పేదలకు అందిస్తున్న రేషను బియ్యం అనేక సంవత్సరాలుగా కాకినాడ పోర్టు నుంచి లక్షల టన్నుల్లో అక్రమ రవాణా అవుతున్నప్పటికీ… ప్రభుత్వాలు మౌనంగా ఉంటున్నాయి. ఏదైనా సమస్య వచ్చినప్పుడే హడావుడీ చేస్తున్నాయి. పేదలకు అందాల్సిన బియ్యం దారి తప్పి వివిధ పద్ధతుల్లో పోర్టులకు తరలిపోతున్నాయి. ఇవి రేషన్‌ షాపుల నుంచే నేరుగా వెళ్తున్నాయా? లేక పౌరసరఫరాల శాఖ ద్వారా వెళుతున్నాయా అనే దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. ఈ అక్రమ రవాణాను శాశ్వతంగా అరికట్టటానికి ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక రూపొందించాలి. ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్ట పరిచి పూర్తిగా నిఘా పెడితే ఈ అక్రమాలు ఉండవని విపక్షాలు సూచిస్తున్నాయి. బియ్యం విక్రయదారులు, కొనుగోలుదారులు, మధ్యలో ఉన్న బ్రోకర్లు ఎవరనే దానిపై సమగ్ర విచారణకు ఆదేశిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయి. రాజకీయ అవసరాల కోసం చారిత్రాత్మక కాకినాడ పోర్టుపై విష ప్రచారం సరికాదని హితవు పలుకుతున్నాయి.

అత్యంత వేగవంతమైన స్మార్ట్‌ఫోన్‌ ఐక్యూ13 విడుదల

ముంబయి : అధిక-పనితీరు గల స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ ఐక్యూ తాజాగా భారతదేశపఅత్యంత వేగవంతమైన స్మార్ట్‌ఫోన్‌ ఐక్యూ 13ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది భారతదేశంలో క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్‌ చిప్‌సెట్‌తో అమర్చబడిన మొదటి స్మార్ట్‌ఫోన్లలో ఒకటి. ఐక్యూ 13 ధర 12జీబీG256జీబీ వేరియంట్‌కు రూ.54,999 (సమర్థవంతమైనధర: రూ.51,999), 16జీబీG512జీబీ వేరియంట్‌కు రూ.59,999 (సమర్థవంతమైనధర: రూ.56,999). ఇది రెండు సొగసైన రంగులలో అందుబాటులో ఉంటుంది. అవి: లెజెండ్‌ మరియు నార్డో గ్రే. అదనంగా, ఐక్యూ 13 ప్రీ-బుకింగ్‌ డిసెంబర్‌ 05, మధ్యాహ్నం 12 గంటలకు అందుబాటులో ఉంటుంది. దాని మొదటి విక్రయం డిసెంబర్‌ 11, 2024 నుండి మధ్యాహ్నం 12 గంటలకు వివో ప్రత్యేకస్టోర్లు, ఐక్యూ ఇ-స్టోర్‌, అమెజాన్‌.ఇన్‌లలో ప్రారంభమవుతుంది. ఐక్యూ 13 వివో ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్లు, ఇతర మెయిన్‌లైన్‌ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ విస్తరణ ఐక్యూ పరికరాలను అనుభవించే, కొనుగోలు చేసే సౌలభ్యాన్ని నిర్ధారిస్తుంది.

ఐఐటీలతో హ్యుందాయ్‌ మోటార్‌ గ్రూప్‌ భాగస్వామ్యం

ముంబయి: బ్యాటరీలు, విద్యుదీకరణలో సహకార పరిశోధన వ్యవస్థను స్థాపించడానికి హ్యుందాయ్‌ మోటార్‌ గ్రూప్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీల)తో భాగస్వామ్యమైంది. ఐఐటీ విశ్వవిద్యాలయాలతో కలిసి బ్యాటరీ, విద్యుదీకరణ-సంబంధిత పరిశోధనలను సంయుక్తంగా నిర్వహించడానికి 2025 నుండి ప్రారంభమయ్యే ఐదు సంవత్సరాలలో సుమారు 7 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టాలని గ్రూప్‌ యోచిస్తోంది. కొరియా, భారతదేశం నుండి బ్యాటరీ, విద్యుదీకరణ నిపుణుల మధ్య సాంకేతిక, మానవ మార్పిడిని సులభతరం చేయడానికి, ప్రతిభను పెంపొందించడానికి, దీర్ఘకాలిక ఉపాధిని ప్రోత్సహించడానికి హ్యుందాయ్‌ సీఓఈ ఈ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ మూడు ఇన్‌స్టిట్యూట్‌లలో ఐఐటీ ఢల్లీి, ఐఐటీ బాంబే మరియు ఐఐటీ మద్రాస్‌ ఉన్నాయి. ఐఐటీ ఢల్లీిలో ఏర్పాటు చేయనున్న హ్యుందాయ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌, హ్యుందాయ్‌ మోటార్‌ గ్రూప్‌ నుండి స్పాన్సర్‌షిప్‌ల ద్వారా జరుగుతుంది.

ఐసిఐసిఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ మొబైల్‌ యాప్‌ ఐప్రు ఎడ్జ్‌కు ఆదరణ

ముంబయి: ఐసిఐసిఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, దాని సలహాదారుల కోసం ప్రత్యేకంగా అందించే మొబైల్‌ యాప్‌, ఐప్రు ఎడ్జ్‌, హెచ్‌1-ఎఫ్‌వై2025లో వారి ఉత్పాదకతలో 37% పెరుగుదలకు దారితీసింది. ఫలితంగా వారికి అధిక ఆదాయమూ వచ్చింది. ముఖ్యంగా, ఐప్రు ఎడ్జ్‌ని ఉపయోగించే 98.1% ఏజెంట్లకు అదే రోజు కమీషన్‌లు చెల్లించబడ్డాయి. ఎంపిక చేయబడిన డిస్ట్రిబ్యూటర్‌లకు అదే రోజున కమీషన్‌లను చెల్లించే మొదటి జీవిత బీమా సంస్థ, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌. కంపెనీ 2 లక్షలకు పైగా సలహాదారుల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. కంపెనీ అగ్ర సలహాదారులలో దాదాపు 61% మంది ఇప్పుడు తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడంలో సహాయపడే యాప్‌ను చురుకుగా ఉపయోగిస్తున్నారు. ఈ మొబైల్‌ యాప్‌ ఏజెంట్ల కోసం ప్రయాణంలో సైతం కార్యాలయంగా పనిచేస్తుంది.

ఘనంగా కెఎల్‌ డీమ్డ్‌ టు బి యూనివర్శిటీ 14వ స్నాతకోత్సవం

విజయవాడ: కెఎల్‌ డీమ్డ్‌ టు బి యూనివర్శిటీ తమ 14 వ వార్షిక స్నాతకోత్సవాన్ని విజయవాడ క్యాంపస్‌లో వైభవంగా జరుపుకుంది. ఇది విద్యార్థులకు, తల్లిదండ్రులకు మరియు అధ్యాపకులకు మహోన్నత సందర్భంగా నిలిచింది. ఈ సంవత్సరం, 166 పిహెచ్‌డి స్కాలర్స్‌, 604 పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులు, 3,936 అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులతో సహా 4,706 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 42 బంగారు పతకాలు మరియు 37 రజత పతకాలను కూడా ప్రదానం చేశారు. ఈ ప్రతిష్టాత్మకమైన సందర్భం కొత్త అవకాశాలకు నాంది పలుకుతున్న వేళ, సంవత్సరాల తరబడి అంకితభావం, విద్యాపరమైన స్థిరత్వం శ్రేష్ఠతకు ప్రతీకగా నిలుస్తుంది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ముఖ్య అతిథిగా హాజరైనందున, ఈ సందర్భం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది.

6 నుండి అమేజాన్‌ ఫ్యాషన్‌ ‘వార్డ్‌ రోబ్‌ రిఫ్రెష్‌ సేల్‌‘

బెంగళూరు: అమేజాన్‌ ఫ్యాషన్‌ తమ ప్రసిద్ధి చెందిన వార్డ్‌ రోబ్‌ రిఫ్రెష్‌ సేల్‌ 15వ ఎడిషన్‌ను ప్రకటించింది. ఇది డిసెంబర్‌ 6 నుండి 11, 2024 వరకు షాపర్స్‌ను ఆకర్షించనుంది. ఈ శీతాకాలం ఫ్యాషన్‌ వైభవం దుస్తులు, యాక్ససరీస్‌, బ్యూటీ, జ్యువలరీలలో విస్తారమైన స్టైల్స్‌ను వాగ్థానం చేసింది. సీజన్‌కు కావలసినవి, పండగ దుస్తులు, ప్రయాణం, పార్టీ, వెడ్డింగ్‌ స్టైల్స్‌ కోసం సేవలు అందిస్తోంది. ఈసేల్‌ అమేజాన్‌ ఫ్యాషన్‌ విస్తృతమైన ఎంపిక నుండి ప్రదర్శించబడటానికి రూపొందించబడిరది, దీనిలో దుస్తులు, బ్యూటీ, ఫుట్‌ వేర్‌, యాక్ససరీస్‌, ట్రావెల్‌ లగేజీ మొదలైన 1.2 లక్షల బ్రాండ్స్‌ నుండి 3 మిలియన్‌ స్టైల్స్‌ సహా 30 మిలియన్‌ ఉత్పత్తులకు పైగా ఉన్నాయి. ఇది తన కేంద్రీకరించబడిన ఆఫరింగ్‌ తో, వార్డ్‌ రోబ్‌ రిఫ్రెష్‌ సేల్‌ సరికొత్త పోకడలు, శాశ్వతమైన క్లాసిక్స్‌తో తమ శీతాకాలం వార్డ్‌ రోబ్స్‌ ను పునరుత్తేజం చేయడానికి వేచి ఉన్న కస్టమర్ల కోసం ఇది ఉత్తమమైన గమ్యస్థానం లక్ష్యాన్ని కలిగి ఉంది.

ఆంధ్రాలో టాటా మోటార్స్‌ విశ్వసనీయ ట్రక్కుల హవా

అమరావతి: పెద్ద ఎత్తున పెట్టుబడులు, ప్రాజెక్టులు కీలక పరిశ్రమలకు ఉత్పాదక శక్తి కేంద్రంగా మారడంతో ఆంధ్ర ప్రదేశ్‌ గణనీయమైన మౌలిక సదుపాయాల వృద్ధిని సాధిస్తోంది. ఈ వేగవంతమైన విస్తరణ నిర్మాణం, మైనింగ్‌, లాజిస్టిక్స్‌ కార్యకలాపాలలో పెరుగుదల ద్వారా గుర్తించబడిరది. ఈ రంగాలు కార్గో, నిర్మాణ సామగ్రి మొదలైన వాటి తిరుగులేని మొబిలిటీకి మద్దతు ఇవ్వడానికి నమ్మకమైన హెవీ-డ్యూటీ ట్రక్కులను డిమాండ్‌ చేస్తాయి. భారతదేశ అతిపెద్ద వాణిజ్య వాహన తయారీదారుగా టాటా మోటార్స్‌ రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పాటునందించ డంలో హెవీ-డ్యూటీ టిప్పర్లు, ట్రక్కులు, ట్రాక్టర్‌ల సమగ్ర శ్రేణితో విభిన్న మొబిలిటీ అవసరాలను తీర్చడానికి రూపొందించబడిరది. టాటా మోటార్స్‌ తన ఫ్లాగ్‌షిప్‌ ప్రైమా ప్లాట్‌ఫామ్‌లో విస్తృత శ్రేణి పరిష్కారాలను అందిస్తుంది.

అపోలో మెడికల్‌ కాలేజీ స్నాతకోత్సవం

హైదరాబాద్‌: వైద్య వృత్తిలో నిరంతర అభ్యాసనం అవసరమని ముఖ్య అతిథి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్‌ట్రోఎంటరాలజీ (ఏఐజీ) చైర్మన్‌, వ్యవస్థాపకుడు, పద్మభూషణ్‌ పురస్కార గ్రహీత డాక్టర్‌ డీ నాగేశ్వర్‌ రెడ్డి తెలిపారు. అపోలో మెడికల్‌ కాలేజీ స్నాతకోత్సవం జూబ్లీహిల్స్‌లోని ఆర్‌ఎన్‌ఆర్‌ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చేతుల మీదుగా వైద్య విద్యార్థులకు పట్టాల పంపిణీ చేశారు. వంద మంది 2018 బ్యాచ్‌ అండర్‌గ్రాడ్యుయేట్‌ విద్యార్థులు పట్టాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక వైద్య విద్యా సంస్థలలో ఒకటైన అపోలో మెడికల్‌ కాలేజ్‌ నుంచి ఉత్తీర్ణులు అవడం చాలా అదృష్టం అన్నారు. నలబై మూడు సంవత్సరాలుగా వైద్య రంగంలో ఉన్నానన్నారు. ఇప్పటికీ రోగుల నుంచి, విద్యార్థుల నుంచి, ఇంటర్నెట్‌, ఇతర వనరుల నుంచి నేర్చుకుంటున్నానని తెలిపారు. నేర్చుకోవడం చాలా ముఖ్యమన్నారు. ఎందుకంటే, ప్రపంచంలో అడుగు పెట్టినప్పుడు అనేక సవాళ్లు ఎదురవుతాయని చెప్పారు.

ముస్లిం మత పెద్ద ఇలాహి అబ్దుల్ సలాం గుండెపోటుతో మృతి

విశాలాంధ్ర ధర్మవరం: పట్టణంలోని ముస్లిం మత పెద్ద అయినా ఇలాహి అబ్దుల్ సలాం (60) గుండెపోటుతో మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ మృతుని ఇంటికి వెళ్లి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ముస్లిం సమాజ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని తెలిపారు. వీరి మరణం కుటుంబానికి తీరని లోటు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షుడు సుధాకర్, నాయకులు అబ్దుల్ మునఫ్ , మహేష్ చౌదరి, నాగూర్ హుస్సేన్, నడిమి మషీద్, అస్లాం, రాళ్లపల్లి షరీఫ్ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.