విశాలాంధ్ర ధర్మవరం : మండల పరిధిలోని నాగులూరు గ్రామంలో గల
రూపా రాజా పీసిఎంఆర్ పాఠశాలలో ఘనంగా గ్రీన్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులంతా ఆకుపచ్చ రంగు దుస్తులతో అలరించిన వైనం అందరిని ఆకట్టుకుంది. పాఠశాల చైర్మన్ హర్షవర్ధన్ విద్యార్థులతో కలిసి చెట్లు నాటారు.ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ హర్షవర్ధన్ మాట్లాడుతూ.సకల జీవరాశులు మానవ జాతి సుఖంగా బ్రతకాలంటే, ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవాల్సిన అవసరం మానవజాతికి ఎంతైనా ఉందని తెలిపారు.పొల్యూషన్ గ్లోబల్ వార్మింగ్ తగ్గించేందుకు ఇప్పటికైనా ఆక్సిజన్ ఎక్కువ ఉత్పత్తి చేసే చెట్లను ప్రతి ఒక్కరూ విరివిగా పెంచి వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలని తెలిపారు.లేకపోతే మానవజాతి మనగుడ ప్రశ్నార్థకమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ రూప రాజా కృష్ణ, జగదీష్, కరస్పాండెంట్ నాగమోహన్ రెడ్డి, ప్రిన్సిపల్ నరేష్ కుమార్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.
ఘనంగా గ్రీన్ డే
ఘనంగా జరిగిన గురజాడ అప్పారావు వర్ధంతి
విశాలాంధ్ర ధర్మవరం:: ప్రముఖ తెలుగు రచయిత గురజాడ వర్ధంతి వేడుకలను పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ముఖ్య అతిథులుగా గల ఐద్వా జిల్లా కార్యదర్శి నాగమణి, కళాశాల ప్రిన్సిపాల్ జేవి సురేష్ బాబు ఆధ్వర్యంలో జరుపుకున్నారు. తదుపరి విద్యార్థులతో సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి అని,గురజాడ ప్రజలందరికీ అర్థమయ్యేలా వాడుక భాషలో కన్యాశుల్కం పూర్ణమ్మ ,దిద్దుబాటు ఇలా అనేక రచనలు చేశారన్నారు. కొన్ని సంవత్సరాల క్రితమే దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని తన రచనల ద్వారా మహాద్భుతంగా రాసిన వ్యక్తి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నామాల నాగార్జున, జిల్లా ఉపాధ్యక్షులు కనుమ దామోదర్, హరి కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
రోగులకు సేవ చేయుట దైవ సేవతో సమానం.. కన్వీనర్ నామా ప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం:బీ రోగులకు సేవ చేయుట దైవ సేవతో సమానమని శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు సహాయకులకు ఆసుపత్రి వైద్యులు, నర్సులు చేతుల మీదుగా 360 మంది రోగులకు, సహాయకులకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సేవా కార్యక్రమానికి సేవాదాత (విరాళాధాత) గా శ్రీ సత్య సాయి సేవా సమితి వారే నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. మానవసేవే మాధవసేవ అన్న పుట్టపర్తి బాబా వారి ఆదేశాను, ఆశీస్సులు ప్రకారం ఈ కార్యక్రమాన్ని కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తుండడం మాకెంతో సంతృప్తిరి ఇస్తోందని తెలిపారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా స్వీట్లు కూడా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలకు ఆసక్తి కలవారు సెల్ నెంబర్ 9966047044 గాని 9030444065కు గాని సంప్రదించవచ్చునని తెలిపారు. తదుపరి ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ మాధవి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మా ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు, సహాయకులకు ,గర్భిణీ స్త్రీలకు ఇటువంటి సేవా కార్యక్రమం నిర్వహించడం గర్వించదగ్గ విషయమని, ఇది స్ఫూర్తిగా నిలుస్తోందని తెలిపారు. తదుపరి ఆసుపత్రి తరఫున శ్రీ సత్య సాయి సేవా సమితి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 27 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.
సీఎం చంద్రబాబుకు మెమెంటోను అందజేసిన జెసి అష్మిత్ రెడ్డి
విశాలాంధ్ర-తాడిపత్రి (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబును తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డి శనివారం రాయదుర్గం నియోజకవర్గంలోని నేమకల్లులో ఎన్టీఆర్ భరోసా ఫించన్ కానుక పంపిణీలో సీఎం చంద్రబాబు నాయుడును కలిసి మెమెంటోను అందజేశారు. అనంతరం నియోజకవర్గం లోని పలు సమస్యలు, అభివృద్ధి పనుల గూర్చి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.
విద్యుత్ మీటర్ రీడర్లు కు ఎస్క్రో అకౌంట్ ద్వారా జీతాలు చెల్లించాలి–ఏఐటియూసి
విశాలాంధ్ర నెల్లూరుటౌన్: విద్యుత్ మీటర్ రీడర్లు కు ఎస్క్రో అకౌంట్ ద్వారా జీతాలు చెల్లించాలని సిఎండి ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయాలనిఎస్ ఈ ఆఫీస్ వద్ద నిరసన చేపట్టిన విద్యుత్‌మీటర్ రీడర్ల సంఘం ఎస్ ఈని కలిసి వినత పత్రం ఇవ్వడంజరిగినది.ఎస్పిడిసిఎల్ మీటర్ రీడర్లకు ఎస్క్రో అకౌంట్ ద్వారా సెప్టెంబర్ వేతనాలు చెల్లించాలని ఎస్ ఈ కి ఉత్తరవలుజారీచేసినకాంట్రా
క్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని తక్షణమే చర్యలు తీసుకోవాల
ని మీటర్ రీడర్స్ విద్యుత్ భవనంవద్ద నిరసనకార్యక్రమం చేపట్టారు. వీరి నిరసనకు
ఎస్ఈ స్పందిస్తూ నెలలోపు మీటర్ రీడర్స్ కు ఎస్క్రో అకౌంట్ ద్వారా వేతనాలు అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినారు.ఈ కార్యక్రమంలో ఏఐటియూసి జిల్లా కార్యదర్శి శంకర్ కిషోర్,మీటర్ రీడర్స్ ప్రధాన కార్యదర్శి హజరత్ వలి, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కృష్ణ ,మీటర్ రీడర్స్ కోశాధికారి బాలకృష్ణ , వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటసుబ్బయ్య ,రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.
ఒకే నెలలో రెండు సార్లు పించన్లు ఇచ్చిన ఘనత టీడీపీదే…
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ఒకే నెలలో రెండోసారి పింఛన్లు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుందని టీడీపీ సీనియర్ నాయకులు ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు ఏసేపు అన్నారు. శనివారం మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ రాఘవేంద్రరెడ్డి ఆదేశాల మేరకు మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామంలో ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు ఏసేపు, కంబదహాల్ గ్రామంలో టీడీపీ గ్రామ అధ్యక్షులు మునెప్పలు పింఛన్లు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకేనెలలో రెండవసారి పింఛన్లు పంపిణీ చేయడం లబ్ధిదారులకు ఎంతో సంతోషకరమైన విషయం అన్నారు. గత వైసీపీ పాలనలో ఒకటో తేదీ ఆదివారం వస్తే మూడో తేదీన పింఛన్లు ఇచ్చే వారన్నారు. ఇప్పుడు ఆ సమస్య లేకుండా ఒకరోజు ముందే పింఛన్లు పంపిణీ చేసి లబ్ధిదారుల కళ్లల్లో కూటమి ప్రభుత్వం ఆనందం చూస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
టీజీపీఎస్‌సీ కొత్త ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్‌సీ) చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. ఈ నియామకాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శనివారం ఆమోదించారు. ప్రస్తుత ఛైర్మన్ ఎం. మహేందర్ రెడ్డి పదవీ కాలం డిసెంబర్ 3తో ముగియనుంది. అందుకే కొత్త ఛైర్మన్ నియామకానికి ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నెల 20 వరకు దరఖాస్తులు స్వీకరించగా, 45 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. వారిలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, వివిధ వర్సిటీల ప్రొఫెసర్లు కూడా ఉన్నారు. చివరికి బుర్రా వెంకటేశం పేరును సీఎం ఎంపిక చేసి, నియామక ఫైల్‌ను గవర్నర్‌కు పంపగా ఆయన ఆమోదించారు.ఇక బుర్రా వెంకటేశం 1968 ఏప్రిల్ 10న తెలంగాణలోని జనగామ జిల్లాలో జన్మించారు. 1995 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన… రాజ్‌భవన్ సెక్రటరీ, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా పని చేశారు.ఆయన ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సర్వేల్ గురుకుల పాఠశాలలో చదువుకున్నారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు కలెక్టర్ అయ్యారంటూ బుర్రా వెంకటేశం గురించి పలు వేదికలపై ప్రస్తావించారు.
మరికొన్ని గంటల్లో తీరాన్ని తాకనున్న ఫెంగల్ తుపాను..
చెన్నైలో కుండపోత.. విమానాల రద్దు
ఫెంగల్ తుపాను ఈ సాయంత్రం తీరం దాటనున్న నేపథ్యంలో తమిళనాడు రాజధాని చెన్నై సహా పొరుగున ఉన్న పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కరైకల్, పుదుచ్చేరి సమీపంలోని మహాబలిపురం సమీపంలో తుపాను తీరాన్ని దాటే అవకాశం ఉంది. భారీ వర్షాలు జీవనాన్ని అతలాకుతలం చేశాయి. చెన్నై విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే పలు లోకల్ రైళ్ల సర్వీసులు కూడా నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన కారణంగా తమిళనాడులోని ఏడు తీర ప్రాంతాల్లో ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీచేసింది. తుపాను పుదుచ్చేరి తీరాన్ని తాకే సమయంలో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. భారీ వర్షం కారణంగా చెన్నై ఎయిర్‌పోర్టులో పది విమానాల రాకపోకలు రద్దయ్యాయి. విమానాలను రద్దు చేసినట్టు ఇండిగో ప్రకటించింది. అబుదాబి నుంచి చెన్నై రావాల్సిన ఇండిగో విమానం ను బెంగళూరుకు మళ్లించారు. సబర్బన్ పరిధిలోని అన్ని లోకల్ రైళ్ల సర్వీసులను కుదించారు. చెన్నై, తిరువళ్లూర్, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోం చేసుకోవాలని సూచించింది. చెన్నైతోపాటు సమీపంలోని చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు, మయిలదుతురై, నాగపట్టణం, తిరువూరు వంటి డెల్టా జిల్లాల్లో ఈ ఉదయం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రధాన రోడ్లపై ప్రజా రవాణాను ప్రభుత్వం నిలిపివేసింది. తమిళనాడు వ్యాప్తంగా 2,220 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 500 మందిని వాటిలోకి తరలించారు.
వారణాసి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం
కాలి బూడిదైన 200 వాహనాలు
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి కాంట్ రైల్వే స్టేషన్‌లోని వాహనాల పార్కింగ్ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు 200 ద్విచక్ర వాహనాలు కాలి బూడిదయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసు శాఖ అధికారులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్‌పీ), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్), స్థానిక పోలీసు బృందంతో పాటు 12 ఫైర్ బ్రిగేడ్ వాహనాలతో మంటలను ఆర్పేశారు. అయితే, ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని సమాచారం. కాగా, షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనలో దగ్ధమైన ద్విచక్ర వాహనాల్లో ఎక్కువ భాగం రైల్వే ఉద్యోగులవేనని అధికారులు చెప్పారు. రెండు గంటల పాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.

