Thursday, December 12, 2024
Homeజిల్లాలుకర్నూలుఒకే నెలలో రెండు సార్లు పించన్లు ఇచ్చిన ఘనత టీడీపీదే...

ఒకే నెలలో రెండు సార్లు పించన్లు ఇచ్చిన ఘనత టీడీపీదే…

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ఒకే నెలలో రెండోసారి పింఛన్లు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుందని టీడీపీ సీనియర్ నాయకులు ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు ఏసేపు అన్నారు. శనివారం మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ రాఘవేంద్రరెడ్డి ఆదేశాల మేరకు మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామంలో ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు ఏసేపు, కంబదహాల్ గ్రామంలో టీడీపీ గ్రామ అధ్యక్షులు మునెప్పలు పింఛన్లు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకేనెలలో రెండవసారి పింఛన్లు పంపిణీ చేయడం లబ్ధిదారులకు ఎంతో సంతోషకరమైన విషయం అన్నారు. గత వైసీపీ పాలనలో ఒకటో తేదీ ఆదివారం వస్తే మూడో తేదీన పింఛన్లు ఇచ్చే వారన్నారు. ఇప్పుడు ఆ సమస్య లేకుండా ఒకరోజు ముందే పింఛన్లు పంపిణీ చేసి లబ్ధిదారుల కళ్లల్లో కూటమి ప్రభుత్వం ఆనందం చూస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు