హెడ్మాస్టర్ సుజాత
విశాలాంధ్ర ధర్మవరం:: రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు పట్టణంలోని జీవనజ్యోతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో విద్యార్థిని ఎస్. అతికా ఎంపికైనట్లు హెడ్మాస్టర్ సుజాత తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్టోబర్ నెల 28వ తేదీన అనంతపురంలోని ఇండోర్ స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారు నిర్వహించిన జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో ఉత్తమ ప్రతిభను ఘనపరచడం జరిగిందని, తదుపరి అక్కడ రాష్ట్రస్థాయి అండర్-14 టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. ఎంపికైన విద్యార్థి ఈనెల 30వ తేదీ నుండి డిసెంబర్ ఒకటో తేదీ వరకు కర్నూలు జిల్లాలోని నంద్యాల డిఎస్ఏ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం హెడ్మాస్టర్ సుజాత తో పాటు ఉపాధ్యాయ, బోధనేతర, తల్లిదండ్రులు, పాఠశాల కమిటీ, పాఠశాల విద్యార్థులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.
రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు జీవన్ జ్యోతి పాఠశాల విద్యార్థిని ఎంపిక..
వ్యవసాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే ఇంటూరి భేటీ
విశాలాంధ్ర- వలేటివారిపాలెం : కందుకూరు నియోజకవర్గం లోని 5 మండలాల వ్యవసాయ అధికారులతో శుక్రవారం ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అధికారులతో రైతులకు ఎరువులు సకాలంలో అందించాలని, వ్యాపారస్తులు ఎరువులను ఎమ్మార్పీ ధరకు మాత్రమే విక్రయించాలని, ఎక్కువ ధరలకు విక్రయించకుండా కఠినంగా వ్యవహరించాలని సూచించారు.ఆర్.బి.కె కేంద్రాల్లో రైతులకు సరిపడా ఎరువులు నిల్వ ఉంచాలని అధికారులను ఇంటూరి నాగేశ్వరరావు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడి అనసూయ మరియు మండల వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు
పాఠశాల అభివృద్ధికి దాతృత్వం చాటిన ప్రధానోపాధ్యాయురాలు
విశాలాంధ్ర పెనుకొండ : మండల పరిధిలోని రాంపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్న గుంటిపల్లి ఇందిరాదేవి ,తమ పని చేసిన పాఠశాలకు పిల్లలకు ఉపయోగపడే విధంగా ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలని ఉద్దేశంతో పాఠశాలకు 1.20 లక్షల రూపాయలు తన సొంత సొమ్మును వెచ్చించి పాఠశాలకు అవసరమైన స్టేజ్ నిర్మాణము చేపట్టారు, తమ భర్త భీమినేని శ్రీరాములు, రిటైర్డ్ ఎంఈఓ తనకు ఎంత గానో సహకరిస్తూ నా యొక్క కోరికను నేను పని చేస్తున్న పాఠశాలకు మన యొక్క జ్ఞాపకార్థం విద్యార్థులకు ఉపయోగపడే విధంగా స్టేజి నిర్మాణం చేపట్టాలని కోరగానే వెంటనే స్పందించి ఎంతగానో సహకరించారని, మా పిల్లలు యతీంద్ర చౌదరి ,పూర్ణిమ, ఇద్దరూ బాగా చదివి సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడి సంతోషంగా ఉన్నారని మేము కూడా గ్రామీణ విద్యార్థుల కోసం వారు కూడా చదువులలో బాగా రాణించాలని ఉద్దేశంతో ప్రభుత్వ బడులలో సౌకర్యాలు చేయాలని ఉద్దేశంతో ఈ స్టేజి నిర్మాణం చేపట్టామని శ్రీరాములు ,ఇందిరా దేవి,తెలిపారు.
ధర్మవరం మండలం లో అపార్ 66 శాతము నమోదు… ఎంఈఓ రాజేశ్వరి దేవి
విశాలాంధ్ర ధర్మవరం:: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అపార్ అనే పథకంలో ధర్మవరం పట్టణము రూరల్, ఎంఈఓ పరిధిలోని అన్ని మండలాలలో గల ప్రైవేటు, ప్రభుత్వ ,పాఠశాలలు, జూనియర్ కళాశాలలో ఈనెల 28వ తేదీ నాటికి 66 శాతము నమోదు కావడం జరిగిందని ఎంఈఓ రాజేశ్వరి దేవి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరం మండలం నందు మొత్తం 171 పాఠశాలలు కళాశాలలో నర్సరీ నుండి ఇంటర్మీడియట్ వరకు పట్టణము ,గ్రామీణ ప్రాంతాలలో గల ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు లో మొత్తము విద్యార్థులు 33,856 మంది కలరని తెలిపారు. అపార్ నమోదు ప్రక్రియ అక్టోబర్ 28వ తేదీన ప్రారంభమై ఈ నెల అనగా నవంబర్ 28వ తేదీ నాటికి 22,424 అపార్ ఐడి జనరేషన్ పూర్తి కాగా, ఇంకనూ 11,432 మంది పెండింగ్ లో ఉన్నారని తెలిపారు. ఈ పెండింగ్ ని కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. మా పరిధిలో ప్రభుత్వ పాఠశాలలో 101, ప్రైవేట్ పాఠశాలలు 63, ప్రభుత్వ కళాశాలలు రెండు ప్రైవేటు కళాశాలలో 5 కలవని తెలిపారు. ప్రతి విద్యార్థికి యూటీసీ ప్లస్ నందు అపార్ ఐడి జనరేషన్ పూర్తి చేస్తున్నామని, అపార్ ఐడి ద్వారా విద్యార్థి యొక్క విద్యా విషయాలు డిజి లోకేర్ సిస్టం ద్వారా పొందుపరుస్తున్నామని తెలిపారు. నర్సరీ నుండి పీజీ వరకు విద్యార్థికి ఒకే ఐడి కార్డు ఉంటుందని తెలిపారు. ప్రతి విద్యార్థికి యుటిఎస్ ప్లస్ నందు అపార్ ఐడి జనరేషన్ పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు. పాఠశాలలు కళాశాలల యొక్క హెడ్మాస్టర్లకు ప్రిన్సిపాల్ లకు కరెస్పాండెంట్లకు ఫాలోఅప్ చేస్తున్నామని తెలిపారు. ఎప్పటికప్పుడు దినవారి నివేదికను కలెక్టరేట్కు, స్థానిక ఆర్డిఓ కు పంపడం జరుగుతుందని తెలిపారు.
ధర్మవరం రెవెన్యూ డివిజన్లో అపార్ ప్రక్రియ 70.71 శాతము నమోదు.. ఆర్డీవో మహేష్
విశాలాంధ్ర ధర్మవరం: ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఏడు మండలాలలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కొరకు ప్రవేశపెట్టిన అపార్ అనే ప్రక్రియ ధర్మవరం డివిజన్లో ఈనెల 28వ తేదీ నాటికి 70.71 శాతము నమోదు కావడం జరిగిందని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్లోని ఏడు మండలాలలో అపార్ నమోదు ప్రక్రియలో భాగంగా తాడిమర్రి మండలం 79.5 శాతము, కనగానపల్లి మండలం 75.9, బత్తలపల్లి మండలం 74.9, రామగిరి మండలం 67.7, ముదిగుబ్బ 66.7, చెన్నై కొత్తపల్లి 65.3, ధర్మవరం మండలం 64.9 శాతం నమోదు కావడం జరిగిందని తెలిపారు. మొత్తం డివిజన్ పరిధిలో 70.71 శాతము నమోదు కావడం జరిగిందన్నారు. ఈ నివేదికలను జిల్లా కలెక్టరేట్ కూడా పంపడం జరిగిందని, ఇంకనూ మిగిలిన వాటిని త్వరిత గతిన పూర్తి చేయాలన్న ఆదేశాలను ఆయా మండల అధికారులకు తెలియజేయడం జరిగిందని తెలిపారు.
పురపాలక సంఘమునకు చెల్లించవలసిన పనులను వెంటనే చెల్లించండి..
మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం : పురపాలక సంఘమునకు చెల్లించవలసిన అన్ని పనులను వెంటనే చెల్లించి మునిసిపల్ ఆదాయ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024-25 సంవత్సరమునకు సంబంధించిన పాత బకాయిలు వసూలు చేయు నిమిత్తం సచివాలయ సిబ్బందితోపాటు కార్యాలయ సిబ్బంది,వార్డుల యందు వసూలు నిమిత్తం తిరుగుతున్నందున, పన్ను చెల్లింపు దారులు, సచివాలయ సిబ్బందికి పురపాలక సంఘ సిబ్బందికి సహకరించి పనులు చెల్లించాలని వారు తెలిపారు. ఆస్తి పన్నులు, నీటి కులాయి పన్నులు, ఖాళీజాగా పన్నులు కట్టి తప్పనిసరిగా రసీదు పొందాలని తెలిపారు. అంతేకాకుండా ఒక సంవత్సరము పైబడి ఉన్న వారి యొక్క నీటి కొళాయి కనెక్షన్, ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా తొలగించడమే కాకుండా, ఏపీ మున్సిపాలిటీ చట్టం ప్రకారం చర్యలు గైకొంటామని తెలిపారు. పన్ను చెల్లింపు దారులు ఆన్లైన్లో కానీ,మున్సిపల్ ఆఫీసు నందు గాని, ఎల్పీ సర్కిల్ నందు గల సచివాలయం వద్ద గాని పార్థసారథి నగర్-2 సచివాలయం వద్ద గాని చెల్లించవచ్చునని తెలిపారు. కావున పట్టణంలోని ప్రజలందరూ కూడా సకాలంలో పన్నులు చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పడాలని వారు కోరడం జరిగిందని తెలిపారు.
పార్లమెంట్ మార్చ్ విజయవంతం
విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్
పార్లమెంట్ మార్చ్ లో పి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర
విశాలాంధ్ర ధర్మవరం: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ,ఏపీ కి ప్రత్యక హోదా విభజనహామీలు అమలు చేయాలనీ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అధిక ధరలు తగ్గించాలని పేదరికం నిర్మూలించాలని కోరుతూ రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ,ఆర్ ఎస్ పి మరియు పి ఎస్ యు విద్యార్ధి సంఘం సెంట్రల్ కమిటీల ఆధ్వర్యంలో నవంబర్ 28 వ తేది దేశ రాజధాని ఢిల్లీలోజరిగిన పార్లమెంటు మార్చ్ విజయవంతంగా జరిగిందని పి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు మంజు నరేంద్ర , సుబ్బారాయుడుతెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్యక్రమం లో ఆర్ ఎస్ పి అగ్రనాయకత్వం పాల్గొన్నారు 2014లో మేకింగ్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అనిచెప్పి దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తే , ప్రతి సంవత్సరం కోటి ఉద్యోగాలు కల్పించి,పేదరికానీ నిర్ములన చేస్తామని, అధిక ధరలు నియంత్రించి పేదలకు అందుబాటులోకి తెస్తామని ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది అన్నారు.అధికారం చేపట్టిన 10 సంవత్సరాలు పూర్తి అయినా విభజన హామీలు అమలు చేయలేకపోవడం దారుణం అన్నారు. అలాగే ఉద్యోగ కల్పనకోసం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయకపోగా వున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పి లక్షలాది మంది ఉద్యోగులను రోడ్డున పడే విధంగా చేయడం అన్యాయం అన్నారు. సెయిల్ ఆధ్వర్యంలో కడప ఉక్కు పరిశ్రమ నిర్మించాలని ,అలాగే రాష్ట్రవ్యాప్తంగా వివిధ పరిశ్రమల అభివృద్ధి కోసంగాని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పనకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించాలని కోరారు. కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పై వత్తిడి తెచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పన కోసం, ధరలు నియంత్రణ కోసం,భవిష్యత్ లో పెద్ద ఎత్తున ఉద్యోమాలు చేస్తామని అన్నారు ఈకార్యక్రమంలో ఆర్ ఎస్ పి పి ఎస్ యు నాయకులు కళ్యాణ్, శ్రీనివాసులు, నందకిషోర్, గునవారన్, నరసింహ, భాస్కర్, గోపి రాంచరణ్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.
విశాఖ డైరీ రైతులకు పాలు రేటు పెంచాలి …
ఏ.పి.రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు డిమాండ్ …
విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : నవంబర్ 29, పాడి రైతుల నుండి సేకరిస్తున్న పాలుకు విశాఖ డైరీ ధర పెంచాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు డిమాండ్ చేస్తున్నారు. చోడవరం వెంకయ్య గారి పేట పాల కేంద్రం వద్ద శుక్రవారం పాలు ధర పెంపుకై పాడి రైతులతో రైతు సంఘం
జిల్లా
కార్యదర్సిరెడ్డిపల్లి భారీ నిరసనలు చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ రోజుల్లో పాలు రేటు, నీరు రేటు ఒక్కటిగా ఉన్నాయని అన్నారు. పశు గ్రాసం, దాణా రేట్లు పెరిగిపోవడంతో పాడి పరిశ్రమ నిర్వీర్యం అవుతుందన్నారు. పాడి రైతు నుండి సేకరించే పాలుకు విశాఖ డైరీ ధర పెంచాలని, పాడి పరిశ్రమను రైతాంగాన్ని అన్ని విధాల ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పాలు రేటు పెంపుదలపై విశాఖ డైరీ యాజమాన్యం నిర్ణయం తీసుకునే వరుకు ఏ.పీ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. దీనిపై పాలకులు, అధికారులు తక్షణమే స్పందించి పాడి రైతులు సరఫరా చేసే పాలుకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ డిసెంబర్ 9 ధర్నా జయప్రదం చేయండి …..
విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : నవంబర్ 29, కేంద్ర ప్రభుత్వం ఐ.ఆర్.డి.ఏ ను అడ్డుపెట్టుకుని ఎల్ఐసిలో తీసుకువస్తున్న హానికరమైన పెను మార్పులను వ్యతిరేకిస్తూ డిసెంబర్ 9న విశాఖ డివిజన్ కార్యాలయం వద్ద నిర్వహించనున్న ఎల్ఐసి బీమా సంస్థ ఏజెంట్ల ధర్నా జయప్రదం చేయాలని విశాఖ డివిజన్ ఎల్ఐసి ఏజెంట్లు సంఘ అధ్యక్షుడు ఎం. నాగరాజు కోరారు. ఈ సందర్భంగా శుక్రవారం చోడవరం ఎల్ఐసి బ్రాంచి కార్యాలయం వద్ద డిసెంబర్ 9 ధర్నా గోడ పత్రిక విడుదల చేశారు. అనంతరం భీమా ఏజెంట్లు సంఘ అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ క్లా బ్యాక్ అప్ కమిషన్ నిబంధన తొలగించాలని, పాలసీదారుడు నుంచి జిఎస్టి తొలగించాలని, చిన్న ఏజెంట్ కు కూడా 2 లక్షల వరకు మెడి క్లెయిమ్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్ ఇన్సూరెన్స్ 85 సంవత్సరాల వరకు వర్తింపజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్రాంచి బీమా సంఘం అధ్యక్షులు ఎన్.మోహన్ రావు, కోశాధికారి టీ నూకరాజు, ఎన్. అప్పలనాయుడు, బ్రాంచ్ కార్యవర్గ సభ్యులు, ఏజెంట్లు పాల్గొన్నారు.
టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం
విశాలాంధ్ర -వలేటివారిపాలెం.తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం చేసుకోవడం కార్యకర్తలకు ఓ భరోసా అని కాకర్లపాలెం డీలర్ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నల్లబోతుల కొండలరావు అన్నారు.శుక్రవారం వలేటివారిపాలెం మండలం చుండి పంచాయతీ లోని కాకర్లపాలెం గ్రామంలో కందుకూరు శాసన సభ్యులు ఇంటూరి నాగేశ్వర రావు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నల్లబోతుల కొండలరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు .ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం లో ఏ పార్టీ కి లేని కార్యకర్తల బలం ఒక్క తెలుగుదేశం పార్టీ కి మాత్రమే ఉందని అన్నారు.కావున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలుసభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో టిడిపి యువ నాయకులు, రేషన్ షాపు డీలర్ నల్లబోతుల కొండలరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నల్లబోతుల అంకయ్య, మాజీ డీలర్ బోడా రమణయ్య, నల్లబోతుల జయచంద్ర తోబాటు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

