విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : నవంబర్ 29, కేంద్ర ప్రభుత్వం ఐ.ఆర్.డి.ఏ ను అడ్డుపెట్టుకుని ఎల్ఐసిలో తీసుకువస్తున్న హానికరమైన పెను మార్పులను వ్యతిరేకిస్తూ డిసెంబర్ 9న విశాఖ డివిజన్ కార్యాలయం వద్ద నిర్వహించనున్న ఎల్ఐసి బీమా సంస్థ ఏజెంట్ల ధర్నా జయప్రదం చేయాలని విశాఖ డివిజన్ ఎల్ఐసి ఏజెంట్లు సంఘ అధ్యక్షుడు ఎం. నాగరాజు కోరారు. ఈ సందర్భంగా శుక్రవారం చోడవరం ఎల్ఐసి బ్రాంచి కార్యాలయం వద్ద డిసెంబర్ 9 ధర్నా గోడ పత్రిక విడుదల చేశారు. అనంతరం భీమా ఏజెంట్లు సంఘ అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ క్లా బ్యాక్ అప్ కమిషన్ నిబంధన తొలగించాలని, పాలసీదారుడు నుంచి జిఎస్టి తొలగించాలని, చిన్న ఏజెంట్ కు కూడా 2 లక్షల వరకు మెడి క్లెయిమ్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్ ఇన్సూరెన్స్ 85 సంవత్సరాల వరకు వర్తింపజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్రాంచి బీమా సంఘం అధ్యక్షులు ఎన్.మోహన్ రావు, కోశాధికారి టీ నూకరాజు, ఎన్. అప్పలనాయుడు, బ్రాంచ్ కార్యవర్గ సభ్యులు, ఏజెంట్లు పాల్గొన్నారు.