Home Blog Page 1492

వైసీపీలో వాళ్లను వదలం..పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతో ముగియనున్నాయి. ఉదయం 9 గంటలకు శాసన సభ ప్రారంభంమైంది. ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో ఈరోజు పీఏసీ కమిటీకి ఎన్నిక కానుంది. వైసీపీ నుంచి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేయడంతో ఓటింగ్ కు ఏర్పాట్లు చేశారు. ఒక్కో సభ్యుని ఎన్నికకు 20 మంది ఎమ్మెల్యేలు సంఖ్యా బలం అవసరం. అయితే ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఎన్‌ఆర్ఈజీ‌ఎస్ పై సభ్యులు అడిగిన ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమాధానం ఇచ్చారు. ఎన్ఆర్ఈజీఎస్ అనేది డిమాండ్ ఆధారిత పథకమని తెలిపారు.నైపుణ్యం లేని మ్యానువల్ పనిని చేయడానికి వయోజనులకు 100 రోజలు పనిని కల్పిస్తున్నామని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో ఈ పనులు చేపడుతున్నామని అన్నారు. ఎన్ఆర్ఈజీఎస్‌లో కొత్తగా పనికోసం నమోదు చేసుకున్న వారికి జాబ్ కార్డులు 15 రోజుల్లోగా ఇవ్వడం జరుగుతుందని వివరించారు. అయిదు కిలోమీటర్లలోపు పనిని కలిపిస్తున్నామని అన్నారు.

చర్యలు తీసుకుంటాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

అసెంబ్లీలో సభ్యలు చెప్పిన విషయాలను నోట్ చేసుకున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. రూ. 5400 కోట్ల రూపాయలు వేజ్, మెటీరియల్ కాంపౌండ్‌తో నిధులు వచ్చాయన్నారు. జగన్ ప్రభుత్వం రూ.13వేల కోట్లు దారి మళ్లించిందని. ఈ అంశంపై లోతైన విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. జాబ్ కార్డుల్లో అవకతవకలపై చర్యలు తప్పని సరిగా తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హెచ్చరించారు.

వైసీపీ ప్రభుత్వంలో ఎన్ఆర్జీఈఏస్‌ సర్వనాశనం: ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు

గ్రామీణ ప్రాంతంలో పేదల ప్రజల అభివృద్ధికి ఉపయోగపడే పథకం ఇదని తెలుగుదేశం అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. 70 నుంచి 80శాతం జాబ్ కార్డులు ఉన్నవారికి 100 దినాలు పనిని కల్పించాలని చెప్పారు. 10శాతం దాటి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 100 రోజులు పని లభించలేదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎన్ఆర్జీఈఏస్‌ను సర్వనాశనం చేశారని ఆరోపించారు. చివరకు ఇందుకు సంబంధించిన వెబ్‌సైట్లను కూడా మూసివేశారని మండిపడ్డారు. అరటికి, కొబ్బరి, కొకొ, వక్కకు ఇస్తే పనిదినాలు పెరిగే అవకాశం ఉంటుందని వివరించారు. గుర్రపుడెక్క తీసుకున్నే అవకాశం ఇస్తే పనిదినాలు పెరుగుతాయని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పేర్కొ్న్నారు.

22 శాఖల్లో ఎంతమేర బకాయి: పత్తిపాటి పుల్లారావు

ఎన్ఆర్ఈజీఎస్ గతంలో 22 శాఖలతో అనుసంధానం అయి ఉంటుందని తెలుగుదేశం చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తెలిపారు. 22 శాఖల్లో ఎంతమేర బకాయి ఉంది. వైసీపీ ఐదేళ్లుగా జీతాలు ఆపేయడం వల్ల 50 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. గతంలో శ్మశాన వాటికలకు ఎన్ఆర్ఈజీఎస్‌లో ఉండేదని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు వెల్లడించారు.

అదానీ దేశం, జగన్ ఏపీ పరువు తీసేశారు.. షర్మిల

ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త గౌతమ్ అదానీ దేశం పరువు, జగన్ ఏపీ పరువు తీసేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, అమెరికాలో గౌతమ్ అదానీ బండారం బట్టబయలవడం.. దేశానికే అవమానమన్నారు. అదానీ కేసులో జగన్‌ లంచం తీసుకున్నట్టు స్పష్టంగా ఉందన్నారు. జగన్‌ అమెరికాకు డైరెక్ట్ ఇన్‌వాల్వ్‌మెంట్‌ లేనందునే ఆరోపణల్లో జగన్‌ పేరును నేరుగా అమెరికా ప్రస్తావించలేదన్నారు.

లంచాల కోసం ప్రజలను తాకట్టుపెట్టడం దారుణం అన్నారు. ఒక్క సోలార్ ప్రాజెక్టలోనే అదానీ రూ.17 వందల కోట్లు ఇచ్చారంటే.. మిగిలిన ప్రాజెక్టుల్లోనూ ఇంకెంత లంచం ముట్టిందో అని మండిపడ్డారు. విశ్వసనీయత అనే పదానికి అర్ధం తెలుసా అని షర్మిల ప్రశ్నించారు. జగన్‌ నిర్వాకం వల్లే డిస్కంలు అప్పుల ఊబిలోకి చేరాయి అన్నారు. జగన్ విధానాలతో ప్రజలపై రూ.17 వేల కోట్ల భారం పడిందని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసారు.

అదానీతో ఒప్పందం చేసుకోలేదు.. వైసీపీ ప్రభుత్వంపై వస్తున్న వార్తల్లో నిజం లేదు: వైసీపీ

భారత్ లో సోలార్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు రూ. 2,100 కోట్లు లంచంగా ఇచ్చారంటూ అదానీతో పాటు 8 మందిపై అమెరికాలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. గత ఏపీ ప్రభుత్వాధినేతకు రూ. 1,750 కోట్లు లంచంగా ఇచ్చారని కేసులో పేర్కొన్నారు. దీనిపై వైసీపీ కేంద్ర కార్యాలయం అధికారికంగా స్పందించింది. విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో మాత్రమే వైసీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని… అదానీ గ్రూప్ తో ఏపీ డిస్కమ్ లు ఒప్పందాలు చేసుకోలేదని తెలిపింది. వైసీపీ ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఉచిత విద్యుత్ ను రైతులకు అందించాలనే లక్ష్యంతో 7 వేల మెగావాట్ల విద్యుత్ ను అత్యంత చౌకగా యూనిట్ కు రూ. 2.49 చొప్పున 2021 డిసెంబర్ 1న ఏపీ డిస్కమ్ లు ఒప్పందం చేసుకున్నాయని తెలిపింది. చంద్రబాబు అనాలోచిత విధానాలతో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల యూనిట్ ధర రూ. 5.10కి చేరిందని… ఇది డిస్కమ్ లపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని చెప్పింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు సోలార్ పార్క్ లను అభివృద్ధి చేయాలని 2020లో ప్రభుత్వం ప్రతిపాదించిందని తెలిపింది. అంతర్రాష్ట్ర విద్యుత్ ఛార్జీలను మినహాయించి యూనిట్ రూ. 2.49 చొప్పున విద్యుత్ సరఫరా చేసేందుకు సెకీ ప్రతిపాదించిందని… అదే ధరతో 25 ఏళ్ల పాటు 7 వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసేందుకు సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని వెల్లడించింది. దీని వల్ల ప్రభుత్వానికి ప్రతి ఏటా రూ. 3,700 కోట్ల మేర ఆదా అవుతుందని… 25 ఏళ్ల పాటు ఒప్పందం అమల్లో ఉండటం వల్ల రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదా అవుతుందని తెలిపింది.

ఎమ్మెల్యేల అన‌ర్హ‌త‌పై స్పీక‌ర్ దే నిర్ణ‌యం.. హైకోర్టు

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పునిచ్చింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సూచించింది. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరడంతో వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కె.పి.వివేకానంద్ లు పిటిషన్లు దాఖలు చేశారు. వీటితో పాటు దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు.

మరో వివాదంలో మంత్రి కొండా సురేఖ

తెలంగాణ‌ మంత్రి కొండా సురేఖ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కొండా సురేఖ, ఓ మహిళ మధ్య జరిగిన సంభాషణ తాలూకు వీడియో ఒక‌టి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇటీవ‌లే మాజీమంత్రి కేటీఆర్‌, నటుడు నాగార్జున ఫ్యామిలీ గురించి అభ్యంత‌రకర వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ఆమె వార్త‌ల్లో నిలిచారు. ఇప్పుడు ఆమె మాట్లాడిన వీడియో కాల్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో ఓ యువతితో సురేఖ మట్లాడుతూ… ఈ రోజు మా అందరికీ పండుగ ఉంది. బిర్యానీలు తెప్పిస్తున్నాం.. చిన్న పాప పేరు తోటి. మా టీమ్‌ టీమంతా కూడా ఇవాళ ఫుల్‌ ఎంజాయ్‌. బిర్యానీ ఉంటే బీర్‌ ఉంటది కదమ్మా పాపం. అఫీషియల్‌ సెలేబ్రేషన్‌ అంటే అఫీషియల్‌గా ఇచ్చేది. ఇక‌ అన్‌అఫీషియల్‌గా అంటే.. అన్నారు. అలాగే మరో వీడియోలో ఎవరు ఎక్కువ డ్యాన్స్‌ చేస్తే వాళ్లకు మందు ఎక్కువ అని మంత్రి చెప్ప‌డం ఉంది. అయితే ఈ వీడియోల‌ను ఎవరో సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారాయి. దీంతో కొండా సురేఖపై నేటిజన్లు మండిప‌డుతున్నారు. దేవాదాయ శాఖ మంత్రి… ఇలా బీరు బిర్యానీ పార్టీ చేసుకోవడం ఏంటని ప్ర‌శ్నిస్తున్నారు.

విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంచాలి

నూతన ఆవిష్కరణల్లో జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయికి వెళ్ళాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి

విశాలాంధ్ర -అనంతపురం : విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంచాలని, వారిలో శాస్త్రీయ విధానంలో ఆలోచన శక్తిని, నూతన ఆవిష్కరణలు చేసే సామర్థ్యాలను పెంపొందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి ఆదేశించారు. గురువారం అనంతపురం నగరంలోని శారద నగర్ లో ఉన్న జిల్లా సైన్స్ మ్యూజియంలో సమగ్ర శిక్ష మరియు విద్యాశాఖ ఆధ్వర్యంలో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ను ఏర్పాటు చేయడం జరగగా, జిల్లాలో 21 ల్యాబ్ లను మంజూరు చేయగా, అందులో 19 ల్యాబ్స్ ప్రస్తుతం పని చేయడం జరుగుతుండగా, వాటిలో 18 ప్రభుత్వ పాఠశాలల్లో, ఒక ప్రైవేట్ పాఠశాలలో ల్యాబ్స్ నడుస్తున్నాయన్నారు. నిబంధనల ప్రకారం ఆయా పాఠశాలల అటల్ టింకరింగ్ ల్యాబ్స్ నోడల్ అధికారులకు వర్క్ షాప్ నిర్వహించాలని, వారికి ప్రాథమిక శిక్షణ ఇవ్వాలని, శిక్షణ తీసుకున్న వారు వారి పాఠశాలలో మరొకరికి శిక్షణ ఇవ్వాలని, శిక్షణకు సంబంధించి షెడ్యూల్ సిద్ధం చేయాలని, నోడల్ టీచర్లతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలన్నారు. అన్ని పాఠశాలల్లో ల్యాబ్స్ కార్యకలాపాలను నిత్యం కొనసాగించాలని ఆదేశించారు. విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని కలిగించి వారిలో సైన్స్ దృక్పథాన్ని ఏర్పాటు చేయాలని, వారికి సైన్స్ ల్యాబ్ ని అందుబాటులో ఉంచాలన్నారు.
ఈ సమావేశంలో డీఈవో ప్రసాద్ బాబు, సమగ్ర శిక్ష ఏపీసి నాగరాజు, సైన్స్ ఆఫీసర్ బాలమురళీకృష్ణ, డిపిఎం నాగరాజు, ఆయా కళాశాలల హెడ్ మాస్టర్లు, ప్రిన్సిపాల్స్, తదితరులు పాల్గొన్నారు.

తపాలా ఆఫీసులో ఖాతాల కొరకు ప్రత్యేక శిబిరాలు

ఆర్ఎస్ పోస్ట్మాస్టర్ రహీమున్నిసా
విశాలాంధ్ర ధర్మవరం : తపాలా ఆపీసులో ఖాతాల కొరకు ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నామని ఆర్ఎస్ పోస్ట్మాస్టర్ ఎస్ రహీ మున్నీసా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను పొందుటకు ప్రజలకు సహకారం అందించుటలో తపాలా శాఖ ఎల్లవేళలా ముందుంటుందని తెలిపారు. సంక్షేమ పథకాల నిమిత్తమై తపాలా పీసులో కానీ లేదా బ్యాంకులో కానీ ఖాతాలకు ఎన్ పిసిఐ అనుసంధానం చేసి ఉండవలెనని తెలిపారు. ఇందు నిమిత్తమై తపాలా విచారణ సూపర్డెంట్ ఆదేశాను ప్రకారం కొత్తపేటలో గల ధర్మవరం ఆర్ఎస్.సబ్ పోస్ట్ ఆఫీస్ నందు ప్రత్యేక శిబిరాలను ఈనెల 22వ తేదీ నుండి 30 వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా ప్రజలకు తపాలా సిబ్బంది అందుబాటులో ఉండి సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

విద్యుత్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

దరఖాస్తు చేసుకున్న రైతులకు ట్రాన్స్ఫార్మర్లు, వైర్లు అందించేందుకు అధికారులు కృషి చేయాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర- అనంతపురం : విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని, దరఖాస్తు చేసుకున్న రైతులకు ట్రాన్స్ఫార్మర్లు, వైర్లు అందించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి పేర్కొన్నారు. అనంతపురం రేడియో స్టేషన్ లో గురువారం ఉదయం 7:45 గంటల నుంచి 8:15 గంటల వరకు ఆకాశవాణి ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని విద్యుత్ సమస్యల అంశంపై విద్యుత్ శాఖ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి రైతులకు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న రైతు సోదరులకు ట్రాన్స్ఫార్మర్లు, వైర్లు త్వరితగతిన అందించేందుకు జిల్లా అధికారులు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల రైతుల, ప్రజల నుండి 19 ఫోన్ కాల్స్ స్వీకరించి వారి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా చూడాలని, ఏ రైతు విద్యుత్తు సమస్య వలన పంట నష్టం జరగకుండా అధికారులంతా కలిసికట్టుగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ విద్యుత్ శాఖ అధికారులకు పలు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ బి.విన్నూత్న, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామకృష్ణ, ఏఈ భాను ప్రకాష్, జేఈ ముని రాజా, డైరెక్టర్ ఆకాశవాణి అనంతపురం నాగేశ్వరరావు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

అభ్యుదయ కాలనీ 100 కుటుంబాలు సిపిఐ లో చేరిక

కాలనీ సమస్యలపై దృష్టి సారిస్తాం సిపిఐ జిల్లా కార్యదర్శి సి. జాఫర్

విశాలాంధ్ర – అనంతపురం : అభ్యుదయ కాలనీ సమస్యలపై దృష్టి సారిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి సి. జాఫర్ పేర్కొన్నారు. నీలం రాజశేఖర్ రెడ్డి భవనం సిపిఐ జిల్లా కార్యాలయం నందు గురువారం సిపిఎం అభ్యుదయ కాలనీ 100 కుటుంబాలు సిపిఐ నగర్ సమితి ఆధ్వర్యంలో భారత్ కమ్యునిస్ట్ పార్టీ (సీపీఐ) చేరిక కండువా వేసి సిపిఐ జిల్లా కార్యదర్శి సీ.జాఫర్ ఆహ్వానించారు. ఈ సమావేశంలో సిపిఐ నగర సహా కార్యదర్శి రమణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి సీ.జాఫర్ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణ స్వామి, నగర కార్యదర్శి శ్రీరాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలు, కష్టజీవులు, కర్షకులు, కార్మికుల పార్టీ సిపిఐ అని, సుదీర్ఘ పోరాటాలు, త్యాగాలతో నిర్మితమైన ఎర్ర జెండా పార్టీకి ఎదురులేదని, మరో వందేళ్లైనా చెక్కు చెదరకుండా అజేయంగా నిలుస్తుందని, నిరంతరం సమరశీల పోరాటాలు సాగిస్తున్న సిపిఐ ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో పరిమితమైన పార్టీ కాదని స్పష్టం చేశారు. పార్టీ పటిష్ఠతకోసం శక్తివంచన లేకుండా క్రమశిక్షణతో కృషి చేస్తామన్నారు. పీడిత ప్రజల సమస్యల పరిష్కారం కోసం సిపిఐ పార్టీ ఎప్పుడు ముందుంటుందన్నారు. నగరంలో అనేక కమ్యూనిస్టు పార్టీ కాలనీ నిర్మాణంలో కమ్యూనిస్టు పార్టీ నాయకుల కృషి ఎంతో ఉందన్నారు. దౌర్జన్యపరులకు భు దళారులకు, కబ్జాదారులకు సిపిఐ పార్టీ పోరాటాలు ఎప్పుడు ముందుంటుందని రాబోయే కాలంలో అభ్యుదయ కాలనీ సమస్యలు పరిష్కరించే వైపుగా దృష్టి పెడతామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు లింగమయ్య సహాయ కార్యదర్శులు రమణయ్య అలిపిర, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సంతోష్ కుమార్, ఇన్సఫ్ నగర అధ్యక్షుడు చాంద్ బాషా, నగర కార్యవర్గ సభ్యులు మున్నా, నవ యుగ శాఖకాలనీ రాజు,నాగప్ప అభ్యుదయ కాలనీ శాఖ కార్యదర్శి లక్ష్మీనారాయణ, నాగభూషణం, పద్మ తదితరులు పాల్గొన్నారు..

ప్రపంచ ప్రిమెచ్యూరిటీ దినోత్సవం

విశాలాంధ్ర -అనంతపురం : ప్రపంచ ప్రీమెచ్యూరిటీ వారం సందర్భం గా ముఖ్య అతిథి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈబీదేవి పాల్గొన్నారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ… నెలలు నిండా కుండా పుట్టిన పిల్లలకు ఎలాంటి జాగ్రతలు తీసుకోవాలి అని వివరించారు. పుష్పగిరి కంటి ఆసుపత్రి కి సంబంధించి సూర్యప్రకాష్ సీఈఓ ,ఒపీతోమెట్రిస్ట్ హెడ్ బాలకృష్ణ ప్రేమెటురిటి ఉన్న పిల్లల్లో ఎలాంటి కంటి పరీక్షలు చేయించు కోవాలి అని వివరించారు . అనంతరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి త్వరిత చికిత్స కేంద్రము నందు రాష్ట్రీయ బాల స్వస్థ ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా కార్యక్రమ జిల్లా పర్యవేక్షణ అధికారి డాక్టర్ నారాయణస్వామి ఆధ్వర్యంలో పుష్పగిరి కంటి ఆసుత్రి కడప వారి సహకారంతో బరువు తక్కువగా పుట్టిన, నెలలు నిండక ముందే పుట్టిన పిల్లలు, మరియు గుండె లోపం, రక్తహీనత ఇతర వ్యాధులతో బాధపడుతున్న పిల్లలను సమీకరించి వారికి కంటి రెటీనా పరీక్షలను ఃరెడ్ కామ్ః అనే పరికరంతో స్క్రీన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 21 మంది పిల్లలను పరీక్షించగా ,అందులో 10 మంది పిల్లలకు సమస్య ఉన్నట్టు గుర్తించారు. వీరిని మరల రెండు వారాల తర్వాత పరీక్షించి రెటీనా మెచ్యూరిటీ పొందకపోతే వీరికి ఉచితంగా చికిత్స చేయించబడును. ఈ కార్యక్రమం డాక్టర్ మానస , డాక్టర్ దివ్య ,చిన్న పిల్లల వైద్య నిపణురాలు డా. శ్రీవిద్య, కంటి పరీక్షా నిపుణురాలు జ్ఞాన ప్రసన్న, మేనేజర్ రజిత, స్టాఫ్ నర్సు మౌనిక , సోషల్ వర్కర్ రాజేశ్వరి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు .