Home Blog Page 1499

వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను పరిష్కరించండి

జిల్లా వైద్యానికి శాఖ అధికారి ఈ. బి. దేవి కి ఏపీ హంస నాయకుల వినతులు

విశాలాంధ్ర- అనంతపురం : వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న వివిధ క్యాడర్ల సిబ్బంది సమస్యల గురించి అనంతపురం జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖలో వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న అన్ని కేడర్ల ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఈ బి దేవికి ఏ పి హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎండి షఫీ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. వేణుగోపాల్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… జీవో నెంబర్ 143 మరియు 32లను రద్దు చేసి రీడిప్లాయిమెంట్ రద్దు చేయాలన్నారు. గ్రామ సచివాలయాలు మరియు వార్డు సచివాలయాల్లో పనిచేయుచున్న ఏ.ఎన్.ఎంలకు వైద్య ఆరోగ్య శాఖ విధులకు మాత్రమే కేటాయించి, ఇతర విధులను రద్దు చేయాలన్నారు. ఎన్. హెచ్. యమ్ ఉద్యోగులు ఎఫ్ ఆర్ ఎస్ ఆధారంగా కోత విధించిన జీతాలను వెంటనే మంజూరు చేయాలని ఎఫ్ ఆర్ ఎస్ ఆధారిత కాకుండా జీతాలు ఇవ్వాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో పని చేయుచున్న ఏ.ఎన్.ఎంలకు సూపర్వైజర్లకు, ల్యాబ్ టెక్నీషియన్లకు,ఫార్మసిస్ట్‌లకు స్టాఫ్ నర్సులకు, యూనిఫామ్ అలవెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వార్డు సచివాలయాలు మరియు గ్రామ సచివాలయాల్లో పని చేస్తున్న ఏ.ఎన్‌.ఎంలకు వెంటనే ప్రమోషన్ ఇవ్వాలన్నారు.
పి.హెచ్. సిలలో లబోరేటరి 63 రకాల పరీక్షలు పరీక్షలు చేయడానికి తగిన ఇన్‌ఫ్రాస్ట్రాక్షర్ కల్పించాలి.ప్రతి పి.హెచ్‌.సికి,ల్యాబ్‌లకు రిఫ్రిజిరేటర్ వెంటనే సప్లై చేయాలన్నారు. జిల్లాలో క్యాడర్‌లో పని చేస్తున్నా అన్ని క్యాడర్ లకు సంబంధిశీచి సీనియార్టీ జాబితాను వెంటనే విడుదల చేయాలని ఖాళీగా ఉన్న పోస్టులను ప్రమోషన్ ద్వారా వెంటనే భర్తీ చేయాలన్నారు. ప్రతి పి.హెచ్‌.సికి కావాలసిన
అన్ని రకాల రిజిస్ట్‌లను వెంటనే సప్లయి చేయాలని డిమాండ్ చేశారు. పట్టణ ఆరోగ్య కేంద్రాలలో ల్యాబ్ కు సంబందించి తగిన ఇన్‌ఫ్రాస్ట్రాక్షర్ కల్పించాలన్నారు. వైద్య సిబ్బందిపై యాపులు ఒత్తిడి తగ్గించాలన్నారు.వైద్య సిబ్బందిపైసెలవుల గురించి క్లారిఫికేషన్ ఇవ్వాలన్నారు. జిల్లా లోని వైద్య సిబ్బందికి క్షేత్రస్థాయి పర్యటన చేయుటకు గాను ఎఫ్. టీ. ఏ లు మరియు టీ. ఏ బిల్లులు చేయాలన్నారు.
పై సమస్యలు పరిష్కరించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారికి డిమాండ్ తో కూడిన పత్రాన్నీ ఇవ్వడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో సిటీ యూనిట్ అధ్యకుడు కుళ్ళయి బాబు, కార్యదర్శి భక్తర్ అలీ, ఉపాధ్యక్షులు రవీంద్ర, ఈశ్వరయ్య, గిరిధర్ రెడ్డి, సింగనమల తాలూకా అధ్యక్షుడు నల్లప్ప ఆర్గనైజింగ్ సెక్రెటరీ మహేంద్ర బాబు ,, లోకేశ్వర్ రెడ్డి, నూరి పర్వీన్, సుదర్శన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

0

విశాలాంధ్ర – కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా) : 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా, స్థానిక శాఖ గ్రంథాలయంలో గ్రంథ పాలకురాలు యు. రాముడు ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు, చదరంగం , వకృత్వ పోటీలను నిర్వహించారు. ముందుగా స్పందన స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు బలుసు నాగేశ్వరరావు మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా వారి యొక్క చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విద్యార్థిని విద్యార్థులకు వారి యొక్క జీవిత చరిత్రను నాగేశ్వరరావు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ బి జి శేఖర్, రాధాకృష్ణమూర్తి, సిరాజ్, గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

రంగుల కోసం రూ.101 కోట్లు ఖర్చు చేశారు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

మండలి సమావేశాలకు హాజరైన పవన్
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు శాసనమండలి సమావేశాలకు హాజరయ్యారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ సచివాలయాలకు రంగుల అంశంపై మండలిలో ఆయన సమాధానమిచ్చారు.గతంలో సచివాలయాలకు రంగులు వేసేందుకు, వేసిన రంగులు తొలగించేందుకు రూ.101.81 కోట్లు ఖర్చు చేశారని వెల్లడించారు. రంగులు వేసేందుకు రూ.49.8 కోట్లు… రంగులు తొలగించేందుకు 52.73 కోట్లు ఖర్చు చేసినట్టు వివరించారు. ఇతర కార్యాలయాలకు కూడా రంగులు వేశారని, ఆ ఖర్చును సంబంధిత శాఖలు తెలియజేస్తాయని పవన్ తెలిపారు. హైకోర్టు ఆదేశాలతో పార్టీ రంగులు తొలగించి నిర్దేశిత రంగులు వేయడం జరిగిందని పేర్కొన్నారు.

కామన్ డంపింగ్ యార్డుల ఏర్పాటుకు చర్యలు

గ్రామాల్లో డంపింగ్ యార్డులపైనా శాసనమండలిలో చర్చ జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జవాబిచ్చారు. గ్రామాల్లో చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల నిర్వహణకు నిధులు ఇచ్చామని వెల్లడించారు. 15వ ఆర్థిక సంఘం నిధులను సంపద సృష్టి కేంద్రాలకు కేటాయించామని తెలిపారు. చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించేలా ఆదేశాలు ఇచ్చామని వివరించారు. గ్రామాలు స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు. డంపింగ్ యార్డు కోసం గ్రామాల్లో స్థల సేకరణ కష్టంగా ఉందని, డంపింగ్ యార్డుల సమస్యను కచ్చితంగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. 10 నుంచి 12 గ్రామాలకు కలిపి కామన్ గా డంపింగ్ యార్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు పవన్ కల్యాణ్ వెల్లడించారు.

వ‌రల్డ్ సిఓపిడి డే


డాక్టర్ యశోవర్ధన్ మంగిశెట్టి
కన్సల్టెంట్ క్లినికల్

విశాలాంధ్ర- అనంతపురం : ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది సిఓపిడి గురించి అవ‌గాహ‌న లేకుండా తీవ్ర‌మైన ఇబ్బందులు పడుతున్నారని డాక్టర్ యశోవర్ధన్ మంగిశెట్టి కన్సల్టెంట్ క్లినికల్, ఇంటర్వెన్షనల్ పల్మోనాలజిస్ట్ డ అలర్జీ స్పెషలిస్ట్ కిమ్స్ సవీర మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ సిఓపిడి వ‌ల్ల ఇబ్బంది ప‌డుతున్న‌వారు ఎవ‌రు ? ఈ వ్యాధి గురించి ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.
సిఓపిడి అంటే ఏమిటి? క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సిఓపిడి) అనేది ఊపిరితిత్తుల నుండి వాయుప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. అలాగే ఊపిరితిత్తుల పరేన్చైమా (అల్వియోలీ) మరియు రక్త నాళాల నాశనం/నష్టం క‌లిగిస్తుంది. ఊపిరితిత్తులు కాలక్రమేణా మరింత దెబ్బతినడంతో, శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. సిఓపిడి అనే పదం దీర్ఘకాలిక బ్రోన్కైటిస్ (బ్రోన్చియల్ ట్యూబ్స్ యొక్క వాపు) మరియు ఎంఫిసెమా (గాలి సంచులకు నష్టం) కూడా కలిగి ఉంటుంది.
సిఓపిడి ఎంత సాధారణమైనది? ఇది ప్రమాదకరమా?
సిఓపిడి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరణాలకు మూడవ ప్రధాన కారణం మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తక్కువ-ఆదాయ దేశాలలో మరణాలు సర్వసాధారణం. ప్రపంచంలో ప్రస్తుతం 384 మిలియన్ల సిఓపిడి కేసులు ఉన్నాయి. రాబోయే సంవత్సరాల్లో సిఓపిడి భారం పెరుగుతుందని అంచనా వేయబడింది. ఏటా దాదాపు 30 లక్షల మంది మరణిస్తున్నారు.
ప్రపంచ సిఓపిడి డే మరియు దాని థీమ్ ఏమిటి?
ప్రతి సంవత్సరం నవంబర్ 3వ బుధవారం ప్రపంచ సిఓపిడి దినోత్సవంగా అవగాహన కార్యక్రమాలు చేపడతారన్నారు. ఈ సంవ‌త్స‌రం ప్రపంచ సిఓపిడి దినోత్సవం యొక్క 2024 థీమ్ ఁమీ ఊపిరితిత్తుల పనితీరును తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఁ ప్రపంచ సిఓపిడి దినోత్సవం నవంబర్ 20న జరుగుతుంది. ఈ సంవత్సరం థీమ్ ఊపిరితిత్తుల పనితీరును కొలిచే ప్రాముఖ్యతను హైలైట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది, దీనిని స్పిరోమెట్రీ అని కూడా పిలుస్తారన్నారు. స్పిరోమెట్రీ అనేది నిర్ధారణకు ఒక సమగ్ర సాధనం అయినప్పటికీ సిఓపిడి, ఇది జీవితాంతం ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కొలవడానికి కూడా ఉపయోగపడుతుందన్నారు.

రాష్ట్రంలో పెరుగుతున్న చలి తీవ్రత..

0

కోహిర్‌లో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రత

రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నది. దీంతో పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో రాష్ట్రంలో సింగిల్‌ డిజిట్‌ ఉష్ణోగ్రతలు నమోదవడం ఇదే మొదటిసారి.రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నది. దీంతో పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో రాష్ట్రంలో సింగిల్‌ డిజిట్‌ ఉష్ణోగ్రతలు నమోదవడం ఇదే మొదటిసారి. రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, ఆదిలాబాద్‌, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో 10 నుంచి 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇక హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో 12.4 డిగ్రీలు, బీహెచ్‌ఈఎల్‌లో 12.8 డిగ్రీలు, ఇబ్రహీంపట్నం, మంగల్‌పల్లిలో 11.4 డిగ్రీలు, దక్షిణ హైదరాబాద్‌లో 13 నుంచి 15 డిగ్రీలు, కోర్‌ సిటీలో 17 నుంచి 19 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న ఎనిమిది రోజులు వాతావరణం ఇలాగే ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

వివేకా హత్య కేసులో కీలక పరిణామం… అవినాశ్ రెడ్డికి సుప్రీం నోటీసులు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. సునీత తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. వివేకా హత్యకు సంబంధించి మొదటి నుంచి జరిగిన పరిణామాలను లూథ్రా సీజేఐ బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. అవినాశ్ రెడ్డి ఈ కేసులో ఎనిమిదో నిందితుడిగా ఉన్నారని, ఈ కేసుకు సంబంధించి అతడు కీలకమైన వ్యక్తి అని వెల్లడించారు. అంతేకాకుండా, ఈ కేసులో అప్రూవర్ గా మారిన వ్యక్తిని (దస్తగిరి)… శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి జైలుకు వెళ్లి బెదిరించారని సిద్ధార్థ లూథ్రా సీజేఐ బెంచ్ కు తెలియజేశారు. ఒక ప్రైవేటు డాక్టర్ గా ఉన్న వ్యక్తి జైలులోకి వెళ్లి సాక్షులను బెదిరించే ప్రయత్నం చేశారని వివరించారు.

చైతన్యరెడ్డి రెగ్యులర్ గా జైలుకు వెళ్లి ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు చేస్తుంటారా? అని జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశ్నించగా… చైతన్యరెడ్డి రెగ్యులర్ గా జైలుకు వెళ్లే డాక్టర్ కాదని, నిబంధనలకు విరుద్ధంగా జైలులోకి వెళ్లారని లూథ్రా బదులిచ్చారు. ఈ నేపథ్యంలో అవినాశ్ రెడ్డి, చైతన్యరెడ్డిలను ప్రతివాదులుగా చేర్చాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.

వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం అవినాశ్ రెడ్డి, చైతన్యరెడ్డిలను ప్రతివాదులుగా చేర్చేందుకు అంగీకరించింది. ఈ క్రమంలో వారిద్దరికీ నోటీసులు జారీ చేసింది. అనంతరం, ఈ కేసు తదుపరి విచారణను వచ్చే ఏడాది మార్చి మొదటి వారానికి వాయిదా వేసింది.

అక్రమ వలసలపై తగ్గేదేలేదంటున్న ట్రంప్..

అవసరమైతే నేషనల్ ఎమర్జెన్సీకి సిద్ధమని ట్రంప్ సంకేతాలు

అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని వెనక్కి పంపించేందుకు అవసరమైతే నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించేందుకూ సిద్ధమని డొనాల్డ్ ట్రంప్ సంకేతాలిచ్చారు. ఇటీవలి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ట్రంప్.. వచ్చే జనవరి 20న ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలోనే తన క్యాబినెట్ మినిస్టర్లను, సలహాదారులను ట్రంప్ ఎన్నుకుంటున్నారు. కీలక పోస్టుల్లో తనకు నమ్మకస్తులను, సమర్థులను నియమిస్తున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా తాను ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని వెతికిపట్టుకుని వారి వారి దేశాలకు పంపించనున్నట్లు ట్రంప్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇందుకోసం అవసరమైతే బోర్డర్ సెక్యూరిటీ అంశంపై జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించేందుకూ సిద్ధమని వెల్లడించాయి. నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించి, సైనిక బలగాల సాయంతో మాస్ డిపోర్టేషన్ చేపట్టనున్నట్లు పేర్కొన్నాయి. అమెరికాలోకి అక్రమ మార్గాల ద్వారా చేరుకుని, అధికారుల కళ్లుగప్పి దేశంలోనే ఉంటున్న వారిని పట్టుకుని వెనక్కి పంపించాలని ట్రంప్ నిర్ణయించారు. అదేసమయంలో మెక్సికో బోర్డర్ నుంచి అక్రమంగా అమెరికాలోకి అడుగుపెట్టే మార్గాలను మూసివేయనున్నట్లు తెలిపారు. బోర్డర్లలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి అక్రమ వలసలను అడ్డుకుంటామని పేర్కొన్నారు.

దేశంలోని అక్రమ వలసదారులను తిరిగి పంపించేందుకు నేషనల్ ఎమర్జెన్సీ విధించేందుకు సిద్ధమవుతున్నట్లు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ాట్రూత్ సోషల్్ణ లో ఓ పోస్టు కూడా పెట్టారు. దీంతో అమెరికాలోకి అక్రమ పద్ధతుల్లో ప్రవేశించి ఉంటున్న వారిలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

పవన్ కల్యాణ్ కు ఊరట.. క్రిమినల్ కేసును ఎత్తివేసిన కోర్టు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు గుంటూరు స్పెషల్ కోర్టు పెద్ద ఊరటను కలిగించింది. ఆయనపై గతంలో నమోదైన క్రిమినల్ కేసును కోర్టు ఎత్తివేసింది. వాలంటీర్లను ఉద్దేశించి గతంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది జులై 9న ఏలూరులో నిర్వహించిన వారాహి సభలో ఆయన ప్రసంగిస్తూ ఈమేరకు ఆరోపించారు. ఇంట్లో మగవాళ్లు లేని సమయంలో వెళ్తున్నారని, దండుపాళ్యం బ్యాచ్ మాదిరి తయారయ్యారని, వాలంటీర్ వ్యవస్థలో జవాబుదారీతనం లేదని ఆయన అన్నారు. దీంతో కడప, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన కొందరు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పవన్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ఆదేశిస్తూ అదే నెల 20న అప్పటి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఆదేశాలిచ్చారు. నేరుగా ప్రభుత్వమే ఆదేశించడంతో గుంటూరు జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుంటూరు కోర్టులో ఫిర్యాదు చేశారు. పవన్ పై 499, 500 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదయింది.

ఈ కేసుపై పవన్ కల్యాణ్ హైకోర్టును కూడా ఆశ్రయించారు. మరోవైపు, గుంటూరు కోర్టు తాజా విచారణలో… పవన్ పై తాము ఫిర్యాదు చేయలేదని వాలంటీర్లు తెలిపారు. ఆ సంతకాలు తమవి కాదని చెప్పారు. దీంతో కేసును ఎత్తివేస్తూ గుంటూరు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శరత్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు.

ఢిల్లీలో 500కు చేరుకున్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్..

బయటకు రావాలంటేనే భయపడుతున్న ప్రజలు
రోజురోజుకు క్షీణిస్తున్న గాలి నాణ్యత


దేశరాజధాని ఢిల్లీలో గాలిలో నాణ్యత రోజురోజుకు క్షీణిస్తోంది. మంగళవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (గాలి నాణ్యత సూచిక) ఏకంగా 494కు పెరిగింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. ఈ నేపథ్యంలో స్ట్రిక్ట్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ)-4 ఆంక్షలు అమలు చేస్తున్నారు. గాలి నాణత్య సూచీ 450కు తగ్గినా సరే తమ అనుమతి లేకుండా ఆంక్షలు ఎత్తివేయవద్దని అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈ ఉదయం గాలి నాణ్యత సూచీ ఏకంగా 500 మార్కును చేరుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న స్టేజ్-4 ఆంక్షల ప్రకారం.. నిత్యావసరాలతోపాటు ఎల్ఎన్‌జీ, సీఎన్‌జీ, బీఎస్-6 డీజిల్, ఎలక్ట్రిక్ వాహనాలు మినహా ఇతర ట్రక్కులు, వాహనాలు నగరంలోకి ప్రవేశించేందుకు అనుమతి లేదు. ఢిల్లీ వెలుపల రిజిస్టర్ అయిన తేలికపాటి వాణిజ్య వాహనాలకు కూడా అనుమతి లేదు. అయితే, అవి ఎలక్ట్రిక్ వాహనాలు అయితే మాత్రం అనుమతిస్తారు. నిర్మాణ పనులు, పబ్లిక్ ప్రాజెక్టులను పూర్తిగా నిలిపివేశారు. పొగమంచు దట్టంగా కురుస్తున్నప్పటికీ రైలు సర్వీసులు కొనసాగుతున్నాయి. అయితే, 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా, కాలుష్యం కారణంగా 9 రైళ్లను రీషెడ్యూల్ చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి… ఏపీలోని ముంచింగిపుట్టులో 9 డిగ్రీలు

ఏపీ, తెలంగాణలలో చలి తీవ్రత పెరిగింది. సోమవారం ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఉన్నట్టుండి చలి పెరిగింది. హైదరాబాద్ తో పాటు సిటీ శివార్లలో టెంపరేచర్ 12 డిగ్రీలకు పడిపోయింది. దీంతో నగర వాసులు వణికిపోతున్నారు. ఉదయం వేళల్లో స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. వృద్ధుల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. చలికి వారు బయటకు అడుగుపెట్టలేకపోతున్నారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ లోని ముంచింగిపుట్టులో ఈ సీజన్ లోనే తొలిసారిగా సింగిల్ డిజిట్ టెంపరేచర్ నమోదైంది. సోమవారం రాత్రి 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీని చలి వణికిస్తోంది. ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. పాడేరులో 12 డిగ్రీలు, మినుములూరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్ లో వంజంగి గుట్టలకు పర్యాటకుల రద్దీ పెరుగుతోంది. సూర్యోదయం సమయంలో అక్కడి పకృతి సోయగాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వెళుతున్నారు.