Wednesday, February 5, 2025
Home Blog Page 150

పేకాట స్థావరంపై పోలీసులు దాడు లు

10మంది అరెస్ట్–రూ.59, 100 నగదు స్వాధీనం… వన్ టౌన్ సిఐ నాగేంద్రప్రసాద్

విశాలాంధ్ర ధర్మవరం:: రాబడిన సమాచారం మేరకు, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో దుర్గమ్మ గుడి వెనక భాగాన పేకాట ఆడుతున్న స్థావరంపై వన్టౌన్ సిఐ నాగేంద్రప్రసాద్ తన సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పదిమందిని అరెస్టు చేసి, రూ.59,100 లా నాగదును స్వాధీనం చేసుకొని, జూదరులపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం కోర్టుకు తరలించినట్లు సిఐ తెలిపారు.

ఆకట్టుకున్న ధర్మవరం రాకింగ్ స్టార్స్ డాన్స్ అకాడమీ నృత్య ప్రదర్శనలు

రాకింగ్ స్టార్ డాన్స్ అకాడమీ డాన్స్ మాస్టర్ లోకేష్ కు భారత్ బుక్ ఆఫ్ రికార్డు 2024 కైవసం
విశాలాంధ్ర ధర్మవరం : హైదరాబాద్ రవీంద్ర భారతి ఆడిటోరియం లో భారత్ ఆర్ట్స్ సమస్త వారు, బాలోత్సవ్ చిల్డ్రన్స్ డే సెలెబ్రేషన్స్ వేడుకలు అంగరంగ వైభావంగా జరిగాయి.. ఈ కార్యక్రమం ఆహ్వానం కొరుకు ధర్మవరం రాకింగ్ స్టార్స్ డాన్స్ అకాడమీ విద్యార్థులు పాల్గున్నారు.. ఈ సందర్బంగా డాన్స్ మాస్టర్ లోకేష్ మాట్లాడుతూ.. భారత్ ఆర్ట్స్ వారు నిర్వహించిన బలోస్తావ్ చిల్డ్రన్స్ డే వేడుకలుకు రవీంద్ర భారతి ఆర్ట్స్ వారు మమ్మల్ని ఆహ్వానించునందుకు మాకు ఎంతో సంతోషం ఉందని, అలాగే మా అకాడమీ చేసిన నృత్యలు అందర్నీ ఎంత గానో ఆకట్టుకోవడం జరిగిందని తెలిపారు.ఈ నాట్య ప్రదర్శన లో, , సోనీ,తన్మాయ్,శ్రావణి వందన, , శిరీష్ , దిలీప్ , కావ్య, సునీల్ ఈ నాట్య ప్రదర్శన లో పాల్గొన్నారు అని తెలిపారు.అనంతరం నృత్య ప్రదర్శన చేసిన అందరికి రవీంద్ర భారతి సంస్థ వారు , అలాగే సీనియర్ యాక్టర్స్ దివ్య వాని , జబర్దస్త్ ఆర్టిస్ట్స్ చేతుల మీదుగా శాలువాతో ఘనంగా సత్కరించారు అని తెలిపారు. తదుపురిగా డాన్స్ మాస్టర్ లోకేష్ కు భారత్ బుక్ ఆఫ్ రికార్డు అవార్డును సంస్థ వారు అందజేయడం జరిగిందన్నారు. డాన్స్ మాస్టర్ లోకేష్ మాట్లాడుతూ కళ అంటే ధర్మవరం, ధర్మవరం అంటేనే కళ అనే ధర్మవరశీ లో ఎందరో నాట్యం మీద ఆసక్తితో ఉన్నారని వారిని అన్నివిధాలుగా తీర్చాధిద్దాడమే తన లక్ష్యం అని, అలాగే నాట్యం నేర్చుకోవాలి అని ఆసిక్తితో ఉన్నవారికి పేద పిల్లలకు నా వంతుగా ఉచితంగా డాన్స్ నేర్పిస్తారని తెలియచేసారు.. అలాగే నా తల్లి తండ్రులు కి నా పాదాభివందనలు నన్ను ఈ అవార్డు వచ్చేలా ఎంత గానో కృషి చేసిన నా విద్యార్థులకు,నాతోటి స్నేహితుడు డాన్స్ మాస్టర్ ముందు ఉండి నడిపించిన అస్లాం కి కృతజ్ఞతలు తెలియచేసారు.

మౌలానా ముస్తాక్ అహ్మద్ కి అభినందన వెల్లువ

విశాలాంధ్ర ధర్మవరం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ గా మౌలానా ముస్తాక్ అహ్మదును నియమించడం పట్ల ముస్లిం మైనారిటీ సంక్షేమం వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా పట్టణములోని నోమాని, ముద్రస ఏ కాసి పుల్ ఉలూమ్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ సయ్యద్ ఉమర్ ఫారూఖ్ వారు ముస్తాక్ అహ్మద్ కు తమ అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో మౌలానా ముస్తాక్ అహ్మద్ మరిన్ని పదవులను అధిరోహిస్తూ ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం కృషి చేయాలని వారు తెలిపారు.

పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ యొక్క ముఖ్య లక్ష్యం..

అధ్యక్ష, కార్యదర్శులు జయసింహ, నాగభూషణం
విశాలాంధ్ర ధర్మవరం : పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ యొక్క ముఖ్య లక్ష్యం అని అధ్యక్షులు బి. జయసింహ, కార్యదర్శి డి. నాగభూషణ ,కోశాధికారి వై.సుదర్శన్ గుప్తా,ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి, క్యాంపు చైర్మన్ గట్టు హరినాథ్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) లో ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోటరీ క్లబ్ వివిధ రూపాలలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో సేవలను అందిస్తూ పేద ప్రజల మన్ననలను పొందుతుండడం మాకెంతో సంతోషాన్ని ఇస్తోందని తెలిపారు. అంతేకాకుండా పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కూడా నడుస్తోందని తెలిపారు. ఈ కంటి ఆపరేషన్ల వైద్య శిబిరం రోటరీ క్లబ్బు ,శంకరా కంటి ఆసుపత్రి- బెంగళూరు, జిల్లా అంధత్వ నివారణ సంస్థ- శ్రీ సత్య సాయి జిల్లా వారి సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు గోరకాటి పుల్లమ్మ, కీర్తిశేషులు గోరకాటి పెద్దారెడ్డి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు గోరకాటి ప్రమీలమ్మ గోరకాటి రఘునాథరెడ్డి వ్యవహరించడం పట్ల క్లబ్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ శిబిరానికి వచ్చిన పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన ప్రతి పేదవానికి ఉచిత వైద్యం, ఉచిత ఆపరేషన్లు, ఉచిత రవాణా సౌకర్యం, ఉచితంగా అద్దాలను కూడా పంపిణీ చేస్తున్నట్టు వారు తెలిపారు. ఈ శిబిరంలో 145 మంది కంటి రోగులు పాల్గొనగా అందులో 96 మందికి ఆపరేషన్కు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఆపరేషన్లు చేయించుకున్న వారందరూ కూడా మీ యొక్క ఆపరేషన్లు రోటరీ క్లబ్ ద్వారా నిర్వహించామన్న సమాచారాన్ని ప్రతి ఒక్కరు తెలియజేయాలని తెలిపారు. నేటి ఈ శిబిరానికి విశేష స్పందన రావడం పట్ల అందరికీ రోటరీ క్లబ్ వారు హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేశారు. అంతేకాకుండా నేత్రదానమును కూడా ప్రతి ఒక్కరూ అవసరమైన సమయంలో చేయాలని వారు తెలిపారు. అలా నేత్రదానం చేస్తే రెండు జీవితాలలో వెలుగులు నింపుతారని తెలిపారు. అనంతరం డాక్టర్ రాధిక తో పాటు దాతలను కూడా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పల్స్ పోలియో చైర్మన్ రత్నశేఖర్ రెడ్డి, రమేష్ బాబు, శివయ్య ,కొండయ్య ,శ్రీనివాసుల రెడ్డి, బండారు వెంకటచలం, మనోహర్ గుప్తా, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని సంజయ్ నగర్ లో గల బిఎస్సార్ బాలుర ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం అత్యంత వైభవంగా పూర్వ విద్యార్థులు నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు రాఘవేంద్ర, శివరాం, నాగార్జున, నరేంద్ర మాట్లాడుతూ2003-04 సంవత్సరపు బ్యాచ్కు సంబంధించిన తాము 90 మంది ఒకే చోట కలవడం ఎంతో సంతోషాన్ని ఉత్సాహాన్ని ఇస్తోందని తెలిపారు. ఆనాటి తీపి గుర్తులను జ్ఞాపకం చేసుకుంటూ తిరిగి గురువులను కలవడం ఒక అపూర్వ సంఘటనగా ఉందని వారు తెలిపారు. నేడు పూర్వ విద్యార్థుల ఆయన మేము గురువులు తల్లిదండ్రుల ఆశీస్సుల మేరకు వారి వారి స్థాయిలలో జీవితంలో స్థిరపడడం జరిగిందని తెలిపారు. ఏది ఏమైనా గురువులను మరోసారి ఒకే వేదిక మీద కలవడం మాకు చక్కటి ఉత్సాహంతోపాటు గర్వంగా ఉందని తెలిపారు. 90 మంది విద్యార్థులు వేదిక మీద ఆనాటి పాఠశాలలో తాము నేర్చుకున్న జ్ఞాపకాలను వారు మాట్లాడారు. తదుపరి పాఠశాల హెచ్ఎం రాంప్రసాద్, మాజీ హెడ్మాస్టర్ శ్రీనివాసులురెడ్డి, డ్రిల్ మాస్టర్ లక్ష్మీనారాయణ, సైన్స్ టీచర్ సంజీవయ్య, ఆంగ్లం టీచర్ శ్రీనివాసులు ఘనంగా సత్కరించారు. త్వరలో మా పూర్వ విద్యార్థుల తరఫున పాఠశాలకు తగిన సహాయ సహకారాలను తప్పక అందిస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 90 మంది పూర్వ విద్యార్థులు పాల్గొని ఈ సమ్మేళన విజయవంతం చేశారు.

మనోబంధు సేవలను విస్తరిస్తాం.. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ

విశాలాంధ్ర -ధర్మవరం : మనోబంధు ఫౌండేషన్ సంస్థను ఇండియన్ రెడ్ క్రాస్ ద్వారా విస్తరించడం విస్తరించడం జరుగుతుందని డాక్టర్ సత్య నిర్ధారణ, డాక్టర్ నరసింహులు, శ్రీ సత్య సాయి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ పోలా ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో స్వచ్ఛంద సంస్థలతో సమావేశములో కార్యాచరణ ప్రణాళిక పై చర్చలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మనోబంధు సేవలను విస్తరించడానికి కార్యక్రమ ప్రణాళికలను సంసిద్ధం చేస్తున్నట్లు వారి తెలిపారు. మానసిక బాధితుల పునరావాసం కల్పించడానికి ఏపీలోని అన్ని జిల్లాలలోనూ స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములు చేయడానికి మనోబంధు ఫౌండేషన్ కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షతన సత్య నిర్ధారణ నిర్వహించారు. తదుపరి వివిధ స్వచ్ఛంద సంస్థలతో ముఖాముఖిని కూడా నిర్వహించడం జరిగిందని తెలిపారు. రహదారి మానసిక బాధితులకు పునరావాస కార్యక్రమాలు నిర్వహించేలా ఉత్తేజాన్ని కలిగించడం జరిగిందని తెలిపారు. డిసెంబర్ మూడవ తేదీన ధర్మవరంలోని పోలా ఫంక్షన్ హాల్లో విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా మనోబంధు కవిత శీర్షికను ఏర్పాటు చేశామని తెలిపారు. అదేవిధంగా మనో బంధు కన్వీనర్ గా వీరే శ్రీరాములు ఎంపిక కావడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే, పరిష్కార దిశలో అందరూ నడవాలని తెలిపారు. తదుపరి గుంతకల్ నుండి రాధా మహిళా మండలి తులసి భాయ్ కూడా మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అన్న దృక్పథంతో అందరూ వెళ్లాలని తెలిపారు. అనంతపురం పాస్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు రామప్ప మాట్లాడుతూ ఈనెల 14వ తేదీ రాయచోటి లో జరిగే స్వచ్ఛందల సంస్థల సమావేశంలో మరింత చర్చించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అదేవిధంగా జాతీయస్థాయిలో వీటిని పరిచయం చేయడానికి కడప నగరంలో డిసెంబర్ 8వ తేదీన సామాజిక చైతన్య సంస్థ వారిచే ప్రజాసంఘాల స్వచ్ఛంద సంస్థల నేషనల్ వర్క్ షాప్ లో తెలియజేస్తామని తెలిపారు. అనంతరం కరపత్రాలను విడుదల చేశారు.మానసిక బాధితుల యొక్క సమాచారం ఎవరికైనా తెలిసి ఉంటే శ్రీరాములు సెల్ నెంబర్ 73308004832 తెలాపాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజు, తులసి బాయ్, రామప్ప, రోటరీ క్లబ్ నరేందర్ రెడ్డి, జయసింహ, వేణుగోపాల్, రమేష్, జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నియోజకవర్గంలో 70 దరఖాస్తులు. తాసిల్దార్ సురేష్ బాబు

విశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరం నియోజకవర్గంలో ధర్మవరం రూరల్, అర్బన్, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాలలో ఓటర్ నమోదు కార్యక్రమంలో 70 దరఖాస్తులు రావడం జరిగిందని ధర్మవరం ఎమ్మార్వో (ఎఫ్ఎసి) సురేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్డిఓ మహేష్ ఆదేశాల మేరకు రెండవ రోజు ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇందులో రెండవ రోజున నియోజకవర్గంలో ఫారం -6 లో 43, ఫారం-7 లో 11, ఫారం-8 లో 16 వెరసి 70 దరఖాస్తులు రావడం జరిగిందని తెలిపారు. ఈ ప్రత్యేక నమోదు కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిందని తెలిపారు. తదుపరి ఎమ్మార్వో సురేష్ బాబు వివిధ పోలింగ్ నమోదు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బందికి తగిన సూచనలను తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈడిటి ఈశ్వరయ్య, ఎన్నికల సీనియర్ అసిస్టెంట్ రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్120వ జయంతి వేడుకలు……

విశాలాంధ్ర- పామిడి (అనంతపురం జిల్లా) : పామిడి పట్టణం నందు మౌలానా అబుల్ కలాం ఆజాద్ 120వ జయంతిని సోమవారం సిపిఐ పార్టీ సీనియర్ నాయకుడు కె.రహీం ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి మొదటి విద్యా మంత్రిగా పనిచేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గౌరవార్థం ఈ దినోత్సవాన్ని జరుపుతున్నామన్నారు. ఆయన 1888 నవంబర్ 11న అఫ్ఘానిస్తాన్లోని మక్కాలో జన్మించారు. భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్సీ)కు అతి పిన్న వయస్కుడైన ఆజాద్ అధ్యక్షుడుగా గుర్తింపు పొందారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ దూరదృష్టి కారణంగానే దేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఏర్పడి, ఉన్నత విద్యకు అత్యున్నత మార్గం ఏర్పడింది. ఆజాద్ దేశంలో ఉన్నత విద్యకు ఊపిరిపోసిన మహనీయునిగా అభివర్ణించారు.దేశ స్వాతంత్య్ర సముపార్జన, దేశ నిర్మాణంలో ఆజాద్ సహకారం అపారమైనదని చెబుతుంటారు. అతనిని స్వతంత్ర భారతదేశ ప్రధాన వాస్తుశిల్పిగానూ అభివర్ణిస్తుంటారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో విద్యా రంగంలో ఆయన చేసిన కృషిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని దేశమంతటా జరుపుకుంటారు. 1920లో ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో జామియా మిలియా ఇస్లామియా స్థాపనకు ఏర్పడిన కమిటీలో ఆజాద్ కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత 19345 యూనివర్సిటీ క్యాంపస్ లను న్యూఢిల్లీకి మార్చడంలో ప్రముఖ పాత్ర పోషించారని తెలిపారు. ఈ కార్యక్రమంలోకె.రహీం, బి కే రహీం,తేల్ బాషా, డాబాబాబా,షేక్షా,వళి, రజక్,ఆర్మీ రఫీ, అల్లా,బషీర్, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు

రైతాంగం సమస్యలు పై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి ….

– చోడవరం తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసిన ఏ.పి.రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు …

– నకిలీ పురుగు మందులు, ఎరువులు దుకాణదారులు పై తక్షణమే చర్యలు తీసుకోవాలి…

– పెట్టుబడి సహాయం, సాగునీటి వనరులు అభివృద్ధి పరచి, అన్నదాతను అన్ని విధాలా ఆదుకోవాలి …

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.11.11.2024ది. అపరిష్కృతంగా ఉన్న రైతాంగం సమస్యలపై తక్షణమే స్పందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, చోడవరం తహసీల్దార్ పి.రామారావుకు సోమవారం ఏ.పి.రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు సోమవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ ఆదేశాలు మేరకు పరిష్కారానికి నోచుకోని రైతాంగం సమస్యలను మండల స్థాయి అధికారులు ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ప్రైవేటు దుకాణాల్లో అధిక ధరలకు అమ్ముతున్నారని, వీరివలన పంటలు నష్టంతో బాటు, పెట్టుబడులు ఎక్కువై రైతన్నలు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారని తెలిపారు. ప్రైవేటు ఎరువులు, పురుగు మందులు దుకాణాలపై అధికారులు తనిఖీలు కరువయ్యాయని, దీంతో ఎరువులు దుకాణదారులు ఆగడాలు ఎక్కువయ్యాయని తెలిపారు. నకిఃలీలః పై ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు. రైతాంగం పై సవతి తల్లి ప్రేమ చూపుతున్న కూటమి ప్రభుత్వం అధికారం రాక ముందు ఒక మాట, అందలమెక్కాక ఒక మాట ఆడుతూ రైతు కుటుంబాల జీవితాలతో ఆడుకుంటున్నారని అన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ పెట్టుబడులు ఎక్కువై రైతాంగం నానా ఇబ్బందుల్లో వున్నను, నేటికీ ప్రభుత్వ సహాయం అందక దిక్కుతోచని స్థితిలో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది అని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు సుజల స్రవంతి పూర్తి చేసి అభివృద్ధి చర్యలు చేపట్టాలన్నారు. సాగునీటి చెరువులు క్రింద లక్షలు ఎకరాలు సారవంతమైన భూములుండగా, సాగు నీరందక వర్షాధారంగా మాత్రమే పంటలు పండి0చాల్సి వస్తోందన్నారు. ఉత్తరాంధ్ర లో ఎన్ని సాగునీటి వనరులు వున్నప్పటికీ వాటి అభివృద్ది పై పాలకులు, ప్రభుత్వ అధికారులు తగిన శ్రద్ద చూపకపోవడంతో ఖరీఫ్ లో పంటలు ఎండిపోతున్నాయి అన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ప్రధాన చెరువులు, గెడ్డ వాగులు తదితర సాగునీటి వనరులను అభివృద్ది చేస్తే రెండు పంటలు పండి సస్య శ్యామలం అవుతాయని తెలిపారు. అధికార కూటమి ప్రభుత్వం పెద్దలు, పాలకులు, ఇరిగేషన్ అధికారులు తక్షణమే ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులు అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. రైతాంగం సమస్యలు పై స్పందించని ప్రభుత్వానికి అన్నదాతల ఆక్రోశానికి బలి కాక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం సభ్యులు, వ్య.కా.సం. సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అసెంబ్లీ సమావేశాలు బుధవారానికి వాయిదా

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు వాయిదా పడ్డాయి. బుధవారానికి తిరిగి ప్రారంభమవుతాయి. రేపు ఏపీ అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. బుధవారం సమావేశమై బడ్జెట్ పై చర్చించనున్నారు. రేపు ఉదయం పదకొండు గంటలకు ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. అదే సమయంలో రేపు మధ్యాహ్నం కూటమి శాసనసభ పక్ష సమావేశం జరుగుతుంది. మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే కూటమి పార్టీల శాసనసభ సభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. అందరూ విధిగా హాజరు కావాలని పార్టీ నుంచి ఆదేశాలను జారీచేశారు.