Home Blog Page 1507

విద్యార్థినిలకు భోజన పంపిణీ నా అదృష్టంగా భావిస్తాను..

.
విశాలాంధ్ర- ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినిలకు తన వంతుగా భోజన పంపిణీ చేయడం నా అదృష్టంగా భావిస్తానని లాయర్ గుంటప్ప తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో గత కొన్ని సంవత్సరాలుగా కళాశాల చైర్మన్ బండి వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడుస్తోంది. ఇందులో భాగంగానే లాయర్ గుంటప్ప తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం విరాళంగా నగదును ఇచ్చి, భోజన పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పట్టణంలోని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని అధ్యక్షులు చిన్న తంబి చిన్నప్ప తెలిపారు. 430 మంది బాలికలకు స్వయంగా లాయర్ గుంటప్ప చైర్మన్ వేణుగోపాల్ స్వయంగా వడ్డించారు. అనంతరం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ లాయర్ గుంటప్పకు, కళాశాల చైర్మన్ బండి వేణుగోపాలకు, ప్రిన్సిపాల్ లక్ష్మీకాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.

నేత్రదానం చేసిన వృద్ధుడు. విశ్వదీప సేవా సంఘం

విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని శాంతి నగరకు చెందిన మచ్చా వెంకటేశ్వర్లు (74) మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు విశ్వదీప సేవా సంఘమునకు సమాచారం అందించగా, వారు కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించి కుటుంబ సభ్యుల అంగీకారము తో నేత్రదానమును స్వీకరించారు. జిల్లా అంతత్వ నివారణ సంస్థ, హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి టెక్నీషియన్ శ్రీకాంత్ ద్వారా నేత్రాలను స్వీకరించడం జరిగిందని వారు తెలిపారు. నేత్రదానానికి సహకరించిన దాత యొక్క కుమారులు రాంబాబు, తేజ మూర్తి, కూతురు సువర్ణ, అల్లుడు విజయ సారధి కు విశ్వ దీప సేవా సంఘం వారు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమములో ఉపాధ్యక్షులు శేఖర్ రెడ్డి ,వెంకటేష్, రఘు, మాధవ, అక్కులప్ప తదితర సభ్యులు పాల్గొన్నారు.

విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

విశాలాంధ్ర-తాడిపత్రి (అనంతపురం జిల్లా) : మండలంలోని నగరూరు గ్రామం జడ్పీ పాఠశాలో ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసినట్లు ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు కౌసర్ బేగం తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు సవేరా, లలిత, సువర్చల, ప్రశాంతి పాల్గొన్నారు.

పంచాయతీల అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీఓ జయరాముడు ఆధ్వర్యంలో, ఎంపీపీ శ్రీ విద్య అధ్యక్షతన గురువారం పంచాయతీల అభివృద్ధి, ప్రణాళికలు2025-26 సంబంధించి సర్పంచులు, ఎంపిటిసిలు, విఓఏలు, డిజిటల్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణా కార్యక్రమం జరిగింది. ముందుగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ సాయికుమార్ మాట్లాడుతూ గ్రామ పంచాయితీల్లో ప్రణాళికాబద్ధమైన కార్యాచరణతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని సూచించారు. ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేసి గ్రామ పంచాయతీలకు వస్తున్న నిధులు, గ్రామ పంచాయతీల ఆదాయ వనరులను కలుపుకొని చేపట్టాల్సిన పనులను రూపొందించుకోవాలని తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ముత్తమ్మ, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయితీ కార్యదర్శులు, వివోఏలు, డిజిటల్‌ అసిస్టెంట్స్‌ పాల్గొన్నారు.

పది లో ప్రతిభావంతులకు నగదు అందజేత

విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం టెన్త్‌ పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రతిభావంతులకు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మూలింటి రాధమ్మ, జిల్లా కేడీసీసీ మాజీ డైరెక్టర్ మూలింటి రాఘవేంద్రల చేతుల మీదుగా నగదు అందజేశారు. గురువారం జడ్పీ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయురాలు విజయ కుమారి ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ముందుగా జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాధమ్మ, రాఘవేంద్ర దంపతులు మాట్లాడుతూ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఇతర విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని, విద్యార్థులు తమ లక్ష్య సాధనకోసం కృషిచేయాలన్నారు. ప్రతిభకు మార్కులు మాత్రమే ప్రామాణికం కాదని, వారి ప్రతిభకూడా ముఖ్యమేనని తెలిపారు. అనంతరం గత సంవత్సరం పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన స్కూల్ టాపర్ ప్రశాంతికి 5వేలు, రవికి 3వేలు, లక్ష్మీకి 2వేలు సర్పంచ్ దంపతులు అందజేశారు. వచ్చే ఏడాది కూడా టాపర్స్‌కు నగదు పురస్కారం కొనసాగిస్తామని, మరింత ఎక్కువ మంది పురస్కారాలను అందుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం హెడ్మాస్టర్ విజయకుమారి, ఉపాధ్యాయులు సర్పంచ్ దంపతులను శాలువా, పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ డైరెక్టర్ సంజన్న, టిడిపి యూత్ నాయకులు సతీష్ కుమార్, మారేష్, ఉపాధ్యాయులు, పీఈటి ఆనంద్, విద్యార్థులు పాల్గొన్నారు.

సహకార వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి

జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ
విశాలాంధ్ర అనంతపురం : సహకార వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పేర్కొన్నారు. గురువారం అనంతపురం నగరంలోని జిల్లా సెంట్రల్ బ్యాంక్ లో 71వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా సహకార జెండాను జెసి ఎగురవేసి, సహకార గీతంపాడి.. సహకార ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 71వ అఖిల భారత సహకార వారోత్సవాలను నిర్వహించడం జరుగుతోందని, వికసిత్ భారత్ నిర్మాణంలో సహకార సంఘాల పాత్ర ఎంతో ముఖ్యమైనదన్నారు. జిల్లాలో సహకార సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. ఈనెల 14వ తేదీన సహకార మంత్రిత్వశాఖ నూతన కార్యక్రమాల ద్వారా సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయాలని, 15వ తేదీన సహకార సంఘాలలో నూతన ఆవిష్కరణలు, సాంకేతికత మరియు సుపరిపాలన, 16వ తేదీన వ్యవస్థాపకత, ఉపాధి కల్పన మరియు నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడంలో సహకార సంఘాల పాత్ర, ఈనెల 17వ తేదీన సహకార సంస్థలు వ్యాపార ప్రాయోజిత సంస్థలుగా రూపాంతరం చెందడం, 18న సంఘాల మధ్య సహకారాన్ని పెంపొందించటం, 19న మహిళలు, యువత మరియు బలహీన వర్గాల కొరకు సహకార సంఘాలు, 20న సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో, మెరుగైన ప్రపంచ నిర్మాణంలో సహకార సంస్థల పాత్ర అనే రోజువారి కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఓ అరుణకుమారి, డిసిసిబి సీఈవో సురేఖారాణి, డీఎల్సిఓ ప్రభాకర్ రెడ్డి, బ్యాంకు మరియు సహకార సిబ్బంది పాల్గొన్నారు.

శివస్వాముల కోసం బోరు వేయించిన సర్పంచ్

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని దొడ్డిమేకల గ్రామ శివారులో ఎమ్మిగనూరు ప్రధాన రహదారి పక్కన పాదయాత్రతో వెళ్లే శివస్వాముల కోసం గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ 40 వేల రూపాయల తన సొంత నిధులతో గురువారం బోరు వేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ దొడ్డిమేకల మీదుగా సుదూర ప్రాంతాల నుంచి శివస్వాములు శ్రీశైలానికి పాదయాత్ర ద్వారా వెళతారని, అన్నదాన కార్యక్రమం కొరకు వారి అవసరతను దృష్టిలో ఉంచుకొని బోరు వేయించినట్లు ఆయన వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెహ్రూ జయంతి వేడుకలు

విశాలాంధ్ర ఉరవకొండ ( అనంతపురం జిల్లా) : భారత ప్రథమ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు గురువారం ఉరవకొండ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రానంతరం సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా పనిచేసే పంచవర్ష ప్రణాళికలను తీసుకువచ్చి దేశ అభివృద్ధి లో కీలకపాత్ర నెహ్రూ వహించారని తెలిపారు. శాంతియుత పాలన అందించడంలో నెహ్రూ ముందున్నారని, నేటి యువతకు ఆయన ఆదర్శం అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సోనియా శీనా, అబ్బాస్, బ్యాళ్ల ప్రసాద్ సోయాబ్,చంద్ర, ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

57వ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం

విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : 57వ గ్రంథాలయ వారోత్సవాలను మండల కేంద్రంలోని గ్రంథాలయంలో గురువారం ఘనంగా ప్రారంభించారు. ముందుగా బాలల దినోత్సవం సందర్భంగా నెహ్రూ, వారోత్సవాల్లో భాగంగా దాడిచర్ల హరిసర్వోత్తమరావు చిత్రపటానికి జిల్లా కేడీసీసీ మాజీ డైరెక్టర్ మూలింటి రాఘవేంద్ర, ఆలూరు మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ సంజన్న లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రంథాలయాధికారి విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయం లోని పుస్తకాలను చదివి జ్ఞానాన్ని పెంచుకోవాలని, ప్రతిరోజు గ్రంథాలయానికి వచ్చి పుస్తకం పఠనం, వార్తాపత్రికలు చదవడం వలన విజ్ఞానవంతుల వుతారని తెలిపారు. నెహ్రు ప్రధానమంత్రిగా దేశానికి చేసినసేవలు, గ్రంథాలయాల ప్రాధాన్యం గురించి వివరించారు. ఈ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా వివిధ పాఠశాలలో 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు వ్యాసరచన పోటీలు మరియు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు వారోత్సవాలు ముగింపు సందర్భంగా 20వ తేదీ ప్రముఖులచే బహుమతి అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ నరేష్ ఆచారి, నోబుల్ స్కూలు ఉపాధ్యాయులు జంషూర్ వలి, టిడిపి యూత్ నాయకులు సతీష్ కుమార్, మారేష్, పాఠకులు హనుమంత రెడ్డి, నరసింహులు, ఆంజనేయులు, నరసప్ప, విద్యార్థులు పాల్గొన్నారు.

గ్రంథాలయాలు విజ్ఞానానికి భాండాగారాలు

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : గ్రంథాలయాలు విజ్ఞానానికి భాండాగారాలు అని సర్పంచ్ రామాంజనేయులు అన్నారు. గురువారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గ్రంథాలయ అధికారిణి ఆశాజ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ రామాంజనేయులు హాజరయ్యారు. ముందుగా బాలల దినోత్సవం సందర్భంగా నెహ్రు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞానానికి నిలయాలని అన్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండా గ్రంథాలయానికి వచ్చి పుస్తకాలు చదువుకోవాలన్నారు. గ్రంథాలయంలో దినపత్రికలతో పాటు విద్యార్థులకు అవసరమయ్యే పుస్తకాలు లభిస్తాయని ఉపయోగించుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శివన్న, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు.