Thursday, December 5, 2024
Homeజిల్లాలుపది లో ప్రతిభావంతులకు నగదు అందజేత

పది లో ప్రతిభావంతులకు నగదు అందజేత

విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం టెన్త్‌ పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రతిభావంతులకు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మూలింటి రాధమ్మ, జిల్లా కేడీసీసీ మాజీ డైరెక్టర్ మూలింటి రాఘవేంద్రల చేతుల మీదుగా నగదు అందజేశారు. గురువారం జడ్పీ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయురాలు విజయ కుమారి ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ముందుగా జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాధమ్మ, రాఘవేంద్ర దంపతులు మాట్లాడుతూ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఇతర విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని, విద్యార్థులు తమ లక్ష్య సాధనకోసం కృషిచేయాలన్నారు. ప్రతిభకు మార్కులు మాత్రమే ప్రామాణికం కాదని, వారి ప్రతిభకూడా ముఖ్యమేనని తెలిపారు. అనంతరం గత సంవత్సరం పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన స్కూల్ టాపర్ ప్రశాంతికి 5వేలు, రవికి 3వేలు, లక్ష్మీకి 2వేలు సర్పంచ్ దంపతులు అందజేశారు. వచ్చే ఏడాది కూడా టాపర్స్‌కు నగదు పురస్కారం కొనసాగిస్తామని, మరింత ఎక్కువ మంది పురస్కారాలను అందుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం హెడ్మాస్టర్ విజయకుమారి, ఉపాధ్యాయులు సర్పంచ్ దంపతులను శాలువా, పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ డైరెక్టర్ సంజన్న, టిడిపి యూత్ నాయకులు సతీష్ కుమార్, మారేష్, ఉపాధ్యాయులు, పీఈటి ఆనంద్, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు