Wednesday, December 11, 2024
Homeఆంధ్రప్రదేశ్సహకార వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి

సహకార వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి

జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ
విశాలాంధ్ర అనంతపురం : సహకార వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పేర్కొన్నారు. గురువారం అనంతపురం నగరంలోని జిల్లా సెంట్రల్ బ్యాంక్ లో 71వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా సహకార జెండాను జెసి ఎగురవేసి, సహకార గీతంపాడి.. సహకార ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 71వ అఖిల భారత సహకార వారోత్సవాలను నిర్వహించడం జరుగుతోందని, వికసిత్ భారత్ నిర్మాణంలో సహకార సంఘాల పాత్ర ఎంతో ముఖ్యమైనదన్నారు. జిల్లాలో సహకార సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. ఈనెల 14వ తేదీన సహకార మంత్రిత్వశాఖ నూతన కార్యక్రమాల ద్వారా సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయాలని, 15వ తేదీన సహకార సంఘాలలో నూతన ఆవిష్కరణలు, సాంకేతికత మరియు సుపరిపాలన, 16వ తేదీన వ్యవస్థాపకత, ఉపాధి కల్పన మరియు నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడంలో సహకార సంఘాల పాత్ర, ఈనెల 17వ తేదీన సహకార సంస్థలు వ్యాపార ప్రాయోజిత సంస్థలుగా రూపాంతరం చెందడం, 18న సంఘాల మధ్య సహకారాన్ని పెంపొందించటం, 19న మహిళలు, యువత మరియు బలహీన వర్గాల కొరకు సహకార సంఘాలు, 20న సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో, మెరుగైన ప్రపంచ నిర్మాణంలో సహకార సంస్థల పాత్ర అనే రోజువారి కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఓ అరుణకుమారి, డిసిసిబి సీఈవో సురేఖారాణి, డీఎల్సిఓ ప్రభాకర్ రెడ్డి, బ్యాంకు మరియు సహకార సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు