లాయర్ బాలసుందరి, ఎం ఎల్ ఎస్ ఏ లక్ష్మీదేవి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎన్జీవో హోం లో హైకోర్టు ఆదేశాల మేరకు కోర్టు జడ్జిల ఆదేశాల మేరకు డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సులను లాయర్ బాలసుందరి, ఎమ్మెల్యే లక్ష్మీదేవి, పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాఫిక్ నియమ నిబంధనలను డ్రైవర్లు తప్పనిసరిగా పాటించాలని, అట్లు పాటించని యెడల కఠిన చర్యలు చట్టపరంగా తీసుకోబడును అని తెలిపారు. కార్మికుల హక్కులు, ఇన్సూరెన్స్లు, ఈస్ట్రన్ కార్డ్స్, లేబర్ ఆక్ట్ ,ఉచిత న్యాయ సహాయం, మండల న్యాయ సేవా కమిటీ మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ సంస్థ వారు న్యాయ సహాయమును అందిస్తారని తెలిపారు. కానిస్టేబుల్ శివానంద మాట్లాడుతూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించినప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండవని తెలిపారు. కావున డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని తెలిపారు.
డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు..
అమర జవాన్లకు ఆదర్శ పార్కులో నివాళులు..
ఆదర్శ సేవా సంఘం, ఆదర్శ పార్కు కమిటీ.
విశాలాంధ్ర ధర్మవరం;; ఈనెల ఏడవ తేదీన మన భారత సైన్యం పాకిస్తాన్ ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసి మన దేశ ఆపరేషన్ సింధూర ద్వారా సైనిక సత్తా నిరూపించడం జరిగిందని ఆదర్శ సేవా సంఘం సంఘ అధ్యక్షులు భీమిశెట్టి కృష్ణమూర్తి గౌరవాధ్యక్షులు చెన్నాసూరి ప్రకాష్ కార్యదర్శి నాగార్జున తెలిపారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర ద్వారా సైనిక సత్తా చూపడం పట్ల వారు సంఘీభావాన్ని ప్రకటించారు. అంతకుమునుపు అమరవీరులకు వారు నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారత సైనికులు పాకిస్తాన్ ఉగ్రవాదుల శిబిరాలను ఆపరేషన్ సింధూర ద్వారా విజయవంతం తో ధ్వంసం చేయడం మొట్టమొదటి విజయము అని వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మారుతి, కుమార్, నాగభూషణం ,ప్రభాకర్ గుప్తా, నాగరాజు, సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి పౌరుడూ దేశ భద్రతకు భాగస్వామి కావాలి
–ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు
హరీష్ బాబు నేతృత్వంలో ధర్మవరంలో బీజేపీ ర్యాలీ
విశాలాంధ్ర -ధర్మవరం; పట్టణంలో మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ద్వారా దేశ భద్రత కోసం భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ను ప్రజలకు వివరించి, దేశభక్తి భావాలను ప్రోత్సహించారు. ర్యాలీ సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ, భారత సైన్యం సాహసోపేతంగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటింది అని తెలిపారు. ఈ విజయాన్ని ప్రజలతో పంచుకోవడం మా బాధ్యత, అని అన్నారు. అలాగే, దేశ భద్రత కోసం ప్రతి పౌరుడు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, యువత, మహిళలు, వృద్ధులు సహా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ర్యాలీ సమయంలో జాతీయ జెండాలు పట్టుకుని జై హింద్, భారత్ మాతా కీ జై వంటి నినాదాలు చేశారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీ ప్రజల్లో దేశభక్తి భావాలను రేకెత్తించింది. ర్యాలీ ముగింపు సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ, భారత సైన్యం సాహసోపేతంగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటింది అని,
ఈ విజయాన్ని ప్రజలతో పంచుకోవడం మా బాధ్యత, అని అన్నారు. అలాగే, దేశ భద్రత కోసం ప్రతి పౌరుడు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీ ద్వారా ధర్మవరం ప్రజలు దేశ భద్రతపై తమ మద్దతును వ్యక్తపరిచారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో దేశభక్తి భావాలను పెంపొందించేందుకు బీజేపీ కృషి చేస్తుందని వారు తెలిపారు.
అమరవీరుడు మురళి నాయక్ మృతికి శ్రీవాణి విద్యా సంస్థలు దిగ్బ్రాంతి
విశాలాంధ్ర -అనంతపురం :అమరవీరుడు మురళి నాయక్ మృతికి శ్రీవాణి డిగ్రీ పీజీ కళాశాల సీఈఓ పి. సుధాకర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కె. హెచ్. వనజమ్మ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ వై నాగరాణిలు గురువారం దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
నిన్న రాత్రి పాకిస్తాన్ భారత్ మధ్య జరిగిన యుద్ధంలో దేశం కోసం వీరమరణం పొందిన సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పుట్టగుండ్లపల్లి తండా శ్రీరాం నాయక్ కుమారుడు మురళి నాయక్ మన దేశం కోసం వీరమరణం పొందారన్నారు. ఎం మురళి నాయక్ 2019 -2022 విద్యాసంవత్సరాలలో బీకాం శ్రీ వాణి కళాశాల లో పూర్తి చేశాడని, ఈ మూడేళ్ల వ్యవధిలో యన్ సి సి కార్యక్రమాలలో చురుకుగా ఉంటూ, స్పోర్ట్స్ లో కూడా చాలా బహుమతులు గెల్చుకోవడం జరిగిందన్నారు. డిగ్రీ మూడవ సంవత్సరంలో ఆర్మీలో స్థానాన్ని సంపాదించి అతని తల్లిదండ్రులతో పాటు కాలేజీ ఉపాధ్యాయులు తోటి విద్యార్థులను ఆశ్చర్య పరిచాడని పేర్కొన్నారు. కానీ దురదృష్టవశాత్తు నిన్న రాత్రి ఘటనలో తెలుగు జవాన్ మురళి నాయక్ మరణించడం చాలా బాధాకరం అని ,ఇటువంటి యువ కిశోరం ను కోల్పోవటం భరత మాతకు తీరని లోటని అన్నారు. కళాశాల అతని మృతి పట్ల తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. అతని వీరమరణం పట్ల అధ్యాపకులు ఏ. సుధీర్ రెడ్డి,ఎన్ సి సి కోఆర్డినేటర్లు రామస్వామి నాయక్, నర్మదా, సి. ముత్యాలప్ప, కొండన్న, నర్సా నాయుడు, స్వర్ణలత, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు అతనికి అతని కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
కురుబ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
కురుబ సంఘం, యువజన ఉద్యోగుల సంఘం
విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణ, గ్రామీణ ప్రాంతాలలోని కురుమ కులానికి చెందిన పదవ తరగతి, ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేస్తామని యువజన ఉద్యోగుల సంఘం వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతి లో 500 మార్కులు పైబడిన వారు, ఇంటర్మీడియట్ లో 900 మార్కులు పైబడిన విద్యార్థులు మే నెల20వ తేదీ లోపల కుల ధ్రువీకరణ పత్రము, మార్కుల జాబితా జిరాక్స్ లను యశోదమ్మ ,వకీలు పెద్దయ్య కురుబ కళ్యాణమండపం, ధర్మవరం చిరునామాకు అందజేయాలన్నారు. అదేవిధంగా ఐఐటి ఇంజనీరింగ్, నీట్ ఎంబిబిఎస్ నందు సీట్లు సాధించిన విద్యార్థులు, గ్రూప్ వన్, గ్రూప్ టు తదితర ప్రభుత్వ ఉద్యోగం సాధించిన వారందరికీ సన్మానం నిర్వహించబడును అని తెలిపారు. (మా ద్వారా సమాచారం ఇచ్చిన వారికి మాత్రమే) మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 990 8387330 లేదా 9491867165కు గాని 9440808732 కు సంప్రదించాలని తెలిపారు.
జమ్మూలో ఉద్రిక్తత.. మూడు ప్రత్యేక రైళ్లు నడపనున్న రైల్వే
భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ లోని సరిహద్దు గ్రామాల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పాక్ బలగాలు కాల్పులు జరపడం, దాడులకు తెగబడుతుండడంతో ప్రజలు భయం గుప్పిట్లో జీవిస్తున్నారు. దాడులు మరింత తీవ్రం కావచ్చనే భయంతో జమ్మూ నుంచి బయటి ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే, బస్ స్టేషన్లలో రద్దీ నెలకొంది.
జమ్మూ ప్రజల ఆందోళనల నేపథ్యంలో రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. జమ్మూ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారి కోసం మూడు సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. జమ్మూ, ఉధంపూర్ ల నుంచి ఢిల్లీకి ఈ రైళ్లు నడుస్తాయని పేర్కొంది. దేశ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు, ప్రయాణికుల డిమాండ్ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
దేశంలోకి చొరబాటుకు యత్నం.. 7గురు టెర్రరిస్టులు హతం
భారత సైన్యం కొడుతున్న దెబ్బలకు పాకిస్తాన్‌కు చుక్కలు కనిపిస్తున్నాయి.తాజాగా, ఇండియాలోకి చొరబడ్డానికి ప్రయత్నించిన 7 గురు టెర్రరిస్టులను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంతం చేసింది. శుక్రవారం పాక్ రేంజర్ల సాయంతో 7 గురు టెర్రరిస్టులు జమ్మూకాశ్మీర్‌లోని సాంబ సెక్టార్‌లోకి చొరబడ్డానికి ప్రయత్నించారు. అలర్టైన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వారిని కాల్చిపడేసింది.
ఆపరేషన్ సిందూర్ కారణంగా 100 మంది దాకా టెర్రరిస్టులు బలయ్యారు. దీంతో పాకిస్తాన్ తట్టుకోలేకపోయింది. భారత్‌ను దెబ్బ తీయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. నిన్న 15 చోట్ల సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. చైనా మిస్సైల్స్, డ్రోన్లతో రెచ్చిపోయింది. భారత సైన్యం వాటిని ధ్వంసం చేసి పడేసింది. ఈ నేపథ్యంలోనే మరోసారి లైన్ ఆఫ్ కంట్రోల్ పొడువునా పాకిస్తాన్ రేంజర్లు దాడులకు పాల్పడ్డారు. మిలటరీ స్టేషన్లను ఇతర నగరాలను టార్గెట్ చేస్తూ మిస్సైల్స్, డ్రోన్లను ప్రయోగించారు. భారత సైన్యం వారి ప్రయత్నాలను సమర్ధవంతంగా తిప్పికొట్టింది.
యుద్ధం ఆపేలా ప్రోత్సహించే ప్రయత్నం మాత్రమే చేయగలము : అమెరికా
భారత్, పాకిస్తాన్ యుద్ధంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యుద్ధం మధ్యలో మేము కలుగజేసుకోము. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పరిస్థితులు చక్కబడాలని ఆశిస్తున్నాము. రెండు దేశాలను యుద్ధం ఆపమనే స్థితిలో అమెరికా లేదు. యుద్ధం ఆపేలా ప్రోత్సహించే ప్రయత్నం మాత్రమే చేయగలము. మధ్యలో కలుగు జేసుకుని యుద్ధం ఆపమనడం మా పని కాదు అని అన్నారు.
రక్షణ, భద్రతా ఆపరేషన్లపై ప్రత్యక్ష ప్రసారాలు వద్దు
దేశంలోని అన్ని మీడియా సంస్థలకు కీలక హెచ్చరిక చేసిన కేంద్ర రక్షణ శాఖ
కేంద్ర సమాచార, ప్రసార శాఖ నుంచి మీడియాకు ఆదేశాలు
దేశ రక్షణ, భద్రతా దళాల కార్యకలాపాలకు సంబంధించిన వార్తల ప్రసారంపై కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఇటువంటి సున్నితమైన అంశాల ప్రత్యక్ష ప్రసారాలు,సన్నిహిత వర్గాల సమాచారంః అంటూ రాసే కథనాల విషయంలో అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మీడియా సంస్థలకు సూచించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అన్ని మీడియా ఛానెళ్లు, వార్తా సంస్థలు, సోషల్ మీడియా వినియోగదారులకు ఒక సలహా ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు గత నెలలో విడుదల చేసిన మార్గదర్శకాలను పునరుద్ఘాటించింది.
జాతీయ భద్రత దృష్ట్యా, రక్షణ కార్యకలాపాలు లేదా భద్రతా దళాల కదలికలకు సంబంధించి ఎలాంటి రియల్ టైమ్ కవరేజీ, దృశ్యాల ప్రసారం లేదా ఃసన్నిహిత వర్గాల సమాచారంః ఆధారిత వార్తలను ప్రచురించవద్దని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సమస్యాత్మక సమాచారం ముందుగానే బయటకు పొక్కితే, అది శత్రు మూకలకు అనుకూలంగా మారే ప్రమాదం ఉందని, తద్వారా సైనిక చర్యల సమర్థతకు, సిబ్బంది భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
గతంలో కార్గిల్ యుద్ధం, ముంబై ఉగ్రదాడులు (26/11), కాందహార్ విమాన హైజాక్ వంటి సంఘటనల సమయంలో మీడియా కవరేజీ వల్ల జాతీయ ప్రయోజనాలకు అనుకోని ప్రతికూల పరిణామాలు ఎదురయ్యాయని కేంద్రం గుర్తుచేసింది. జాతీయ భద్రతను కాపాడటంలో మీడియా, డిజిటల్ వేదికలు, వ్యక్తులు కీలక పాత్ర పోషిస్తారని, చట్టపరమైన బాధ్యతలతో పాటు, మనందరి చర్యలు కొనసాగుతున్న ఆపరేషన్లకు లేదా మన బలగాల భద్రతకు ఆటంకం కలిగించకుండా చూడటం నైతిక బాధ్యత అని పేర్కొంది.
కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (సవరణ) నిబంధనలు, 2021లోని రూల్ 6(1)(జూ)ని అన్ని టీవీ ఛానెళ్లు తప్పనిసరిగా పాటించాలని గతంలోనే సూచించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నిబంధన ప్రకారం, ఁభద్రతా దళాలు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నప్పుడు, ఆ ఆపరేషన్ పూర్తయ్యే వరకు ప్రభుత్వం నియమించిన అధికారి ఇచ్చే నిర్దిష్ట వ్యవధుల్లోని సమాచారాన్ని మాత్రమే ప్రసారం చేయాలి, ప్రత్యక్ష ప్రసారాలకు అనుమతి లేదుఁ అని స్పష్టం చేసింది.
ఇటువంటి ప్రసారాలు కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (సవరణ) నిబంధనలు, 2021కి విరుద్ధమని, అలాంటి వాటిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. అందువల్ల, జాతీయ భద్రత దృష్ట్యా అన్ని టీవీ ఛానెళ్లు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు, భద్రతా దళాల కదలికలకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాలను చేయవద్దని సూచించింది. ఆయా కార్యకలాపాలు ముగిసే వరకు ప్రభుత్వం నియమించిన అధికారి ద్వారా ఎప్పటికప్పుడు అందించే సమాచారానికే మీడియా పరిమితం కావాలని కోరింది.
ఈ విషయంలో అన్ని వర్గాలు అప్రమత్తత, సున్నితత్వం, బాధ్యతతో వ్యవహరించాలని, దేశ సేవలో అత్యున్నత ప్రమాణాలను పాటించాలని విజ్ఞప్తి చేసింది.
దేశంలో ఇంధన కొరత అంటూ మరో ఫేక్ ప్రచారం
భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ సోషల్ మీడియాలో పలు ఫేక్ న్యూస్ వైరల్ గా మారుతున్నాయి. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే ఈ పోస్టులపై ప్రభుత్వం, సంబంధిత సంస్థలు ఎప్పటకప్పుడు స్పందిస్తూ వాస్తవాలు వెల్లడిస్తున్నాయి. పొరుగు దేశంతో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత ఏర్పడిందంటూ తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దేశవ్యాప్తంగా చమురు నిల్వల్లో కొరత ఏర్పడిందని, పెట్రోల్ డీజిల్ నిల్వలు తక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తల్లో వాస్తవం లేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ స్పష్టం చేసింది. తమ వద్ద సరిపడా నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకుల్లోనూ ఆయిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. ఆయిల్ సరఫరా వ్యవస్థ సజావుగా పనిచేస్తోంది. ఇంధనం విషయంలో ఎవరికీ ఎలాంటి ఆందోళన ఆందోళన అక్కర్లేదు. పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్ద క్యూ కట్టాల్సిన పనిలేదు. బంకుల వద్ద అనవసర రద్దీని నివారించి, మెరుగైన సేవలు అందించేందుకు మాకు సహకరించండి అంటూ ఇండియన్ ఆయిల్ ఓ ప్రకటన విడుదల చేసింది.
పాక్-భారత్ ఉద్రిక్తతలు.. సీఏ పరీక్షలు వాయిదా
దేశవ్యాప్తంగా సీఏ పరీక్షలు వాయిదా పడ్డాయి. భారత్, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో సీఏ మే 2025 పరీక్షలను వాయిదావేస్తున్నట్లు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. మే 9 నుంచి 14 వరకు జరగాల్సిన సీఏ ఇంటర్మీడియట్, ఫైనల్, పోస్ట్ క్వాలిఫికేషన్ పరీక్షలను వాయిదా వేస్తున్నామని, పరీక్షల షెడ్యూల్‌ను త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. పూర్తి సమాచారం కోసం పరీక్షకు నమోదుచేసుకున్న అభ్యర్థులు ఐసీఏఐ వెబ్‌సైట్ icai.org. చూడవచ్చని తెలిపింది.
కాగా, షెడ్యూల్ ప్రకారం సీఏ పరీక్షలు మే 2 నుంచి 14 వరకు జరగాల్సి ఉంది. గ్రూప్ 1 అభ్యర్థులకు సీఏ ఇంటర్ పరీక్ష మే 3, 5, 7 తేదీల్లో, గ్రూప్ 2 పరీక్షలు మే 9, 11, 14 తేదీల్లో జరగాల్సి ఉంది. ఇందులో భాగంగా గ్రూప్ 1 ఫైనల్ ఎగ్జామ్ 2, 4, 6 తేదీల్లో నిర్వహించగా, గ్రూప్ 2 పరీక్ష మే 8, 10, 13 తేదీల్లో జరగాల్సి ఉంది. అనంతరం జరుగనున్న పరీక్షలు ప్రస్తుతం వాయిదా పడ్డాయి. ఇంటర్‌కు సంబంధించిన పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఫైనల్ ఎగ్జామ్ పేపర్లు 1 నుంచి పేపర్ 5 వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం5 గంటల వరకు, పేపర్ 6 మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు.