Friday, January 10, 2025
Home Blog Page 20

ట్రంప్ అండగా ఉంటారని నమ్ముతున్నాం: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ

కొత్త సంవత్సరం సందర్భంగా ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడేళ్లుగా తమ దేశంపై రష్యా దురాక్రమణ జరుపుతోందని… రష్యాను తాము కచ్చితంగా అడ్డుకుని తీరుతామని చెప్పారు. శాంతి అనేది తమ దేశానికి బహుమతిగా రాదనే విషయం తమకు తెలుసని అన్నారు. రష్యాను ఎదుర్కొని శాంతిని సాధించేందుకు గట్టిగా పోరాడతామని చెప్పారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్న డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ కు అన్ని విధాలా అండగా ఉంటారని ఆశిస్తున్నానని జెలెన్ స్కీ అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ దురాక్రమణను ట్రంప్ ఆపుతారని నమ్ముతున్నానని చెప్పారు. మరోవైపు, పుతిన్ కు అనుకూలంగా ట్రంప్ వ్యవహరిస్తారని చాలా మంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ట్రంప్ తమకు సహకరిస్తారంటూ జెలెన్ స్కీ వ్యాఖ్యానించడం గమనార్హం.

డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్‌!: ప్రభాస్ వీడియో సందేశం

0

డ్రగ్స్‌కు నో చెప్పాలని పిలుపు
డ్రగ్స్‌కు ఎవరైనా బానిసలైతే అధికారులకు సమాచారమివ్వాలని సూచన

సినీ నటుడు ప్రభాస్ డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా ఓ ప్రచార వీడియోను విడుదల చేశారు. ఁమన కోసం బ్రతికేవాళ్లు ఉన్నారు… ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్ఁ అంటూ వీడియోలో సందేశం ఇచ్చారు. రేపు జనవరి 1 కాబట్టి ఈరోజు రాత్రి ఈవెంట్స్ ఉంటాయి. ఇలాంటి సమయంలో ఓ సందేశంతో ప్రభాస్ వీడియో వచ్చింది. లైఫ్‌లో మనకు బోల్డన్ని ఎంజాయ్‌మెంట్స్ ఉన్నాయి… కావాల్సినంత ఎంటర్టైన్‌మెంట్ ఉంది… అలాగే మనల్ని ప్రేమించే మనుషులు… మన కోసం బ్రతికే మనవాళ్లు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్?ఁ అంటూ వీడియోను విడుదల చేశారు. డ్రగ్స్‌కు నో చెప్పండి… అలాగే మీకు తెలిసిన వాళ్లు ఎవరైనా డ్రగ్స్‌కు బానిసలైతే తెలంగాణ ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ (87126 71111)కు ఫోన్ చేయాలని ఆ వీడియోలో సూచించారు. డ్రగ్స్‌కు బానిసైన వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు.

జనవరి 4న తెలంగాణ కేబినెట్ సమావేశం

0

రైతు భరోసా, భూమిలేని పేదలకు నగదు, కొత్త రేషన్ కార్డు, టూరిజం పాలసీపై చర్చించే అవకాశం
ఇళ్ల నిర్మాణానికి సబ్సిడీ రేటుతో ఇసుక, సిమెంట్, స్టీల్ సరఫరా చేసే అంశంపై చర్చ
వచ్చే జనవరి 4న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆ రోజున సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. రైతు భరోసా, భూమిలేని పేదలకు నగదు, కొత్త రేషన్ కార్డులు, టూరిజం పాలసీపై చర్చించే అవకాశముంది. సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కేబినెట్ సమావేశంలో రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. కొత్త రేషన్ కార్డులకు ఆదాయ పరిమితి, దరఖాస్తుల స్వీకరణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులకు సబ్సిడీ రేటుతో ఇసుక, సిమెంట్, స్టీల్ సరఫరా చేయాలనే ప్రతిపాదనపై కేబినెట్ చర్చించే అవకాశముంది. అలాగే విద్యుత్ కమిషన్, బీసీ డెడికేటెడ్ కమిషన్, ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికపై చర్చించనున్నారు. యాదగిరిగుట్ట దేవాలయానికి టీటీడీ తరహా బోర్డును ఏర్పాటు చేసే దిశగా కేబినెట్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది.

డాక్టరేట్ అవార్డు గ్రహీతకు సన్మానం

విశాలాంధ్ర- తనకల్లు : తనకల్లు మండలానికి చెందిన చెరుకూరు గంగులయ్య తను చేస్తున్న సేవలకు రెండవసారి ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులుగా ఎన్నికై డాక్టరేట్ పట్టా పొందడంతో లేపాక్షి లోని ఆర్ జే హెచ్ ఫంక్షన్ హాల్ నందు వృద్ధ అనాధాశ్రమం వారు ప్రజా సంఘాలు శ్రేయోభిలాషులు తదితరులు కలిసి ఘన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గుడిబండ ప్రిన్సిపాల్ ప్రసాద్ రాష్ట్రీయ హిందూ పరిషత్ గొల్లపల్లి నాగేంద్ర మానవ హక్కుల పరిరక్షణ సంస్థ వారు గిన్నిస్ బుక్ రికార్డు చంద్రబాను తదితరులు హాజరై ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన సేవలను ఇలాగే కొనసాగించి ఇంకా అత్యున్నత స్థానానికి చేరుకోవాలని ఎందరికో ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు 148 మంది కలిసి గంగులయ్య ఆయన సతీమణి రాజమ్మను దుశ్యాలువాతో పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు అనంతరం చతుర్వేది భక్తి నాట్యమండలి వారిచే ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి వృద్ధ ఆశ్రమం అధినేత మంజులమ్మ సంపంగి గోవర్ధన్ శివకుమార్ కోటకొండ కిష్టప్ప సుబ్బరాయుడు హెచ్ఎం నాగరాజు ధర్మవరం రామాంజనేయులు గుమ్మగుట్ట ఈశ్వరయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఓవైపు మహిళా కూలీగా, మరోవైపు ఎమ్మెల్యే హోదాలో ప్రజా సేవకురాలిగా సునీత

విశాలాంధ్ర-రామగిరి : పచ్చని పొలాల మధ్య వరినాట్లు వేసే మహిళా కూలీగా మారి ఒకవైపు, ప్రజా సేవకురాలిగా మరోపక్క గ్రామాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి పింఛన్లు అందజేస్తూ ఎమ్మెల్యే పరిటాల సునీత గడిపారు. చెన్నేకొత్తపల్లి మండలం హరియాన్ చెరువు గ్రామంలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు అందజేశారు. అనంతరం రామగిరిలో వ్యవసాయ పొలాల్లో మహిళలు వరినాట్లు వేస్తుండటంతో వారితో కలసి మడిలో దిగి కూలీలతో వరినాట్లు వేస్తూ సందడిగా గడిపారు. పింఛనుదారులైన రైతు కూలీలకు పింఛన్లు అందజేశారు. ప్రతి నెల ఇంటి వద్దకే వచ్చి పింఛన్లు ఇస్తున్నారా ఎవరైనా సచివాలయానికి వచ్చి తీసుకెళ్లాలని చెబుతున్నారా అని లబ్ధిదారులతో ఆరా తీయగా
చంద్రబాబు సీఎం అయిన తర్వాత ప్రతి నెల ఒకటో తేదిన ఇంటి వద్దకే వచ్చి వేతనంలా పింఛన్లు అందిస్తున్నారని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ కృష్ణమ్మ నీటితో వ్యవసాయ పొలాలు పులకిస్తున్నాయని, అలాంటి చోటికి వచ్చి కూలీలకు పింఛన్లు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. మాట ఇస్తే అది నిలబెట్టుకునే ప్రభుత్వం ఇది అని, సూపర్ సిక్స్ పథకాల్లో కీలకమైన పింఛన్ల పెంపు తొలి నెలలోనే అమలు చేశామన్నారు. గతంలో మాదిరి పార్టీలు చూడకుండా అర్హత ఉంటే ఎవరికైనా పింఛన్లు ఇస్తున్నామన్నారు. ఎవరైనా మహిళలు భర్తను కోల్పోతే అదే నెల నుంచి వితంతు పింఛన్ ఇస్తున్నామన్నారు. తమ ప్రభుత్వ పనితీరు మీద వైసీపీ నాయకులు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రజల్లో కనిపిస్తున్న ఆనందమే మా పనితీరుకి అద్దం పడుతుందని ఎమ్మెల్యే అన్నారు.

పారదర్శకంగా పి ఎం టి , పి ఈ టి పరీక్షలు

విశాలాంధ్ర -అనంతపురం : అనంతపురం నగరంలోని నీలం సంజీవరెడ్డి మైదానంలో 2 వ రోజు కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య ( పి ఎం టి , పి ఈ టి ) పరీక్షలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ పి.జగదీష్ స్వీయ పర్యవేక్షణలో పారదర్శకంగా పీఎంటీ , పి ఈ టీ పరీక్షలు కొనసాగాయి. సిసికెమేరాల పర్యవేక్షణలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా పకడ్బంధీగా ఈ పరీక్షలు జరిగాయి. మంగళవారం తెల్లవారుజామునే అభ్యర్థులు స్థానిక నీలం సంజీవరెడ్డి మైదానం చేరుకున్నారు. అభ్యర్ధులకు మొదటగా సర్టిఫికెట్స్ పరిశీలించారు. ఆతర్వాత… బయోమెట్రిక్ తీసుకున్నారు. తదనంతరం ఎత్తు, చాతీ వంటి ఫిజికల్ మెజర్ మెంట్స్ నిర్వహించారు. అనంతరం …పరీక్షలలో భాగంగా 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్ జంప్ పరీక్షలు నిర్వహించారు. దేహ దారుఢ్య పరీక్షల దగ్గర ఎక్కడ కూడా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఆధునిక ఆర్ ఎఫ్ ఐ డి కంప్యూటరైజ్డ్ టెక్నాలజితో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈ ప్రక్రియ యావత్తు పారదర్శకంగా జరిగేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించారు. జిల్లా ఎస్పీ అక్కడే ఉంటూ స్వీయ పర్యవేక్షణ చేశారు. ఎదైనా సమస్యల పై అప్పీల్ చేసుకునే వారు రిక్విజేసేన్ రాసి ఇచ్చి జనవరి 17 వ తేదిన అప్పీలుకు రావాలని సూచించారు. జిల్లా ఎస్పీతో పాటు అదనపు ఎస్పీలు డి.వి.రమణమూర్తి, ఇలియాజ్ బాషా (ఏ.ఆర్ ), పలువురు డీఎస్పీలు, సి.ఐ లు, ఆర్ ఐ లు, ఎస్సైలు, ఆర్ ఎస్ ఐ లు, జిల్లా పోలీసు కార్యాలయం సిబ్బంది, ఐటి కోర్ టీం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు జిల్లా ఎస్పీ పి.జగదీష్

విశాలాంధ్ర -అనంతపురం : అనంతపురం జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ పి.జగదీష్ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఏడాదిలో జిల్లాలోని రైతులు, శ్రామికులు, కర్షకులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు, పిల్లలు, విద్యార్థులు, తదితర అన్ని వర్గాల ప్రజలు ఆయు:రారోగ్య, సుఖశాంతులతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో కొత్త లక్ష్యాలు ఎంచుకుని అభివృద్ధిపథాన నడావాలని పిలుపునిచ్చారు. జిల్లా ప్రజలు ప్రశాంతంగా జీవించాలని… ప్రజలకు ఏ కష్టం, ఇబ్బంది వచ్చినా మీ వెంటే ఉంటామన్నారు. ప్రజలు కూడా పోలీసుశాఖతో సహకరించాలని కోరారు.

గోదావరి- కృష్ణ నదుల అనుసంధానాన్ని సిపిఐ స్వాగతిస్తుంది

నదుల అనుసంధానికి ప్రాజెక్టులో ప్రైవేట్ భాగస్వాములను సరైంది కాదు

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్

విశాలాంధ్ర అనంతపురం ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదించిన నదుల అనుసంధానంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాకుండా ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రైవేట్ భాగస్వాములను పిలవడం సరైనది కాదని వారిని అనుమతించరాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి జగదీష్, జిల్లా కార్యదర్శి సి జాఫర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డి జగదీష్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదించిన నదుల అనుసంధాల కార్యక్రమాన్ని సిపిఐ స్వాగతిస్తోందన్నారు. గోదావరి నుంచి కృష్ణ, కృష్ణ నుంచి బొల్లాపల్లి, బొల్లాపల్లి నుంచి బనకచర్లకు కూడా గోదావరి జలాలను తరలించడం జరుగుతుందని సీఎం తెలియజేయడం జరిగిందన్నారు. పోలవరం నుంచి 300 టీఎంసీ గోదావరి నీటిని సీఎం ప్రతిపాదన చేస్తూ ప్రాజెక్టులకు రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. దీనికి సుమారు 90 వేల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పడం జరిగిందన్నారు. గోదావరి నుంచి కృష్ణ వరకు కృష్ణ నుంచి బోళ్ల పల్లి నుండి బనకచర్లకు, బనకచర్ల రిజర్వాయర్ నుంచి రాయలసీమ ప్రాంతాలలో సాగునీటి ప్రాజెక్టులకు సాగునీటిని అందించడానికి వీలు అవుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాకుండా ప్రాజెక్టు నిర్మాణానికి ప్రైవేట్ భాగస్వాములను పిలవడం సరైనది కాదన్నారు. దేశంలో ఎక్కడా కూడా నదుల అనుసంధానంలో ప్రైవేట్ భాగస్వామ్యం లేదన్నారు. ప్రైవేట్ భాగస్వాములను ప్రోత్సహిస్తే వా రు డబ్బు ధ్యేయంగా పనిచేస్తారన్నారు. నేషనల్ రోడ్ పై టోల్ గేట్ పెట్టినట్లు నీటికి కూడా మీటర్లు పెట్టి డబ్బులు పెట్టవలసి వస్తుందన్నారు. ప్రైవేట్ భాగస్వాములు త్రాగునీరు, సాగునీటి నిర్మాణంలో అడుగుపెడితే రైతాంగానికి, ప్రజలకు నష్టం కలుగుతుందన్నారు. ప్రైవేట్ భాగస్వామ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకూడదని కోరుతున్నామన్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి సామాన్యులకు రోజు రోజుకు కష్టతరంగా పరిస్థితులు మారుతున్నాయని, దీనిపై టిటిడి బోర్డు అధ్యయనం చేసి సామాన్య భక్తులకు సర్వదర్శనం త్వరగా జరిగేటట్లు చూడాలని కోరుతున్నాం. . బ్రేక్ దర్శనాల పేరుతో ఆంధ్ర ,తెలంగాణ ఎంపీ ,ఎమ్మెల్యేలకు బ్రేక్ దర్శనాలు కల్పించడం సంతోషంగా ఉందన్నారు. వెంకటేశ్వర స్వామిని సామాన్య భక్తులు దర్శించుకోవడం కష్టతరంగా మారింది అన్నారు. సామాన్య ప్రజల సర్వ దర్శనంలో దర్శించుకోవడానికి దాదాపు 28 గంటల నుంచి 48 గంటలు పడుతుందన్నారు. ఇంత కష్టపడి వచ్చిన సామాన్య భక్తులు కూడా ఎల్ (ఎల్ 2) దర్శనాలు చేసుకునే విధంగా టీటీడీ నిర్ణయాలు తీసుకోవాలని కోరుచున్నామన్నారు. అదేవిధంగా 300 రూపాయలు టికెట్ తీసుకున్న భక్తులకు కూడా తిరుమల లో వసతి సౌకర్యం కల్పించాలన్నారు.
ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శిలు పి. నారాయణస్వామి, సి. మల్లికార్జున, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, నగర కార్యదర్శి శ్రీరాములు, నగర సహాయ కార్యదర్శి అలిపిర తదితరులు పాల్గొన్నారు.

మాదాసి కురువలను ఎస్సీ జాబితా నుంచి తొలగించాలి

0

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మాదాసి, మాదారి కురువలను ఎస్సీ జాబితా నుంచి తొలగించాలంటూ మంగళవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు ఆనంద్ చైతన్య మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు మహాదేవ మాదిగ మాట్లాడుతూ బీసీ జాబితాలో ఉన్న మాదాసి, మాదారి కురువలకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు ఎలా ఇస్తారని వారు ప్రశ్నించారు. జిల్లాలో మాదాసి, మాదారి కురువలు అసలు లేరన్నారు. మాదాసి, మాదారి కురువ పేరుతో గ్రామాలలో ఎలాంటి సామాజిక వివక్షకు గురికాని బీసీ (బి) వరుస సంఖ్య 11లో ఉన్న కురుబలు అక్రమంగా కుల ధృవీకరణ పత్రాలు పొంది ఎస్సీ కులగణన జాబితాలో వారి పేర్లు నమోదు కావడంతో ఎస్సీ వర్గీకరణ నిర్వీర్యమై ఎస్సీ 59 ఉప కులాలకు తీరని అన్యాయం జరుగుతుందని వారు మండిపడ్డారు.ఎస్సీ ఉపకులాలపై నియమించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జే. సి. శర్మ ఏకసభ్య కమిషన్ ఆంధ్రప్రదేశ్ లో మాదాసి, మాదారి కురువలు లేరని 2020 లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినప్పటికీ వారికి కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని జీఓ ఇవ్వడం విచారకరమన్నారు. తక్షణమే కులగణన జాబితా నుంచి మాదాసి, మాదారి కురువలను తొలగించాలని, జాబితాలో తప్ఫులను సరిదిద్దేందుకు వేగంగా చర్యలు తీసుకోవాలని, ఉప కులాల అభ్యంతరాల స్వీకరణకు మరో పది రోజులు గడువు పెంచాలని డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ శ్రీనాథ్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల నాయకులు జంబన్న, చిన్న రాముడు మాదిగ, సంసోను మాదిగ, శాంతిరాజు మాదిగ, దేవదాసు మాదిగ, సలోమోను మాదిగ, మార్కు మాదిగ, జైపాల్ మాదిగ, నాగేష్ మాదిగ, బొజ్జప్ప మాదిగ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి చేస్తుంటే ఓర్వ‌లేక‌పోతున్నారు

వైసిపిపై విరుచుకుప‌డ్డ చంద్ర‌బాబు
కూటమి గెలిస్తే ఏమీ చేయలేరంటూ కొంతమంది అబద్ధపు ప్రచారాలు సాగించారని, ప్రస్తుతం రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుంటే వారు ఓర్వలేకపోతున్నట్లు సీఎం చంద్రబాబు అన్నారు. అలాగే రాష్ట్ర ప్రజలు టీడీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించారని, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏమైనా చేయగలరని నిరూపించారన్నారు. తాను కష్టపడేది కేవలం ఐదు కోట్ల ప్రజల కోసమే నన్న చంద్రబాబు, సీఎం హోదాలో తాను సాదాసీదాగా వచ్చానన్నారు. పల్నాడు జిల్లా యల్లమంద లో ఏర్పాటు చేసిన గ్రామ సభలో చంద్రబాబు మాట్లాడుతూ, ప్రజల కష్టాల్లో భాగం పంచుకోవడానికే తాను ఇక్కడికి వచ్చానని అన్నారు. ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా పనులు చేయించాలనేదే తన తపన అని పేర్కొన్నారు. తాను పర్యటనలకు వచ్చినా, పరదాలు కట్టలేదన్నారు. కాఫీ పెట్టడం పెద్ద కష్టం కాదని ఆడవాళ్లు ఉద్యోగం చేసి వస్తే భర్త కాఫీ పెడితే ఇద్దరూ తాగొచ్చు కదా అంటూ చంద్రబాబు అనగానే, సభలో నవ్వులు విరౠశాయి. గత ఐదేళ్లు ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంద‌ని పేర్కొన్నారు. కనీసం నవ్వలేని పరిస్థితి లో ప్ర‌జ‌లున్నార‌న్నారు.. కానీ ఇప్పుడు ప‌రిస్థితి మారింద‌ని, మీ ఆశీర్వాదంతో అధికారంలోకి వ‌చ్చిన తాము పించ‌ను పెంచి ఇప్పుడు ఇంటింటికీ వచ్చి అందిస్తున్నామ‌ని చెప్పారు.. ఇంటి వద్ద కాకుండా ఆఫీస్ లో పించ‌న్ అంద‌జేస్తే అధికారుల‌కు మెమో ఇస్తామ‌ని హెచ్చ‌రించారు.