రైతు భరోసా, భూమిలేని పేదలకు నగదు, కొత్త రేషన్ కార్డు, టూరిజం పాలసీపై చర్చించే అవకాశం
ఇళ్ల నిర్మాణానికి సబ్సిడీ రేటుతో ఇసుక, సిమెంట్, స్టీల్ సరఫరా చేసే అంశంపై చర్చ
వచ్చే జనవరి 4న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆ రోజున సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. రైతు భరోసా, భూమిలేని పేదలకు నగదు, కొత్త రేషన్ కార్డులు, టూరిజం పాలసీపై చర్చించే అవకాశముంది. సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కేబినెట్ సమావేశంలో రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. కొత్త రేషన్ కార్డులకు ఆదాయ పరిమితి, దరఖాస్తుల స్వీకరణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులకు సబ్సిడీ రేటుతో ఇసుక, సిమెంట్, స్టీల్ సరఫరా చేయాలనే ప్రతిపాదనపై కేబినెట్ చర్చించే అవకాశముంది. అలాగే విద్యుత్ కమిషన్, బీసీ డెడికేటెడ్ కమిషన్, ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికపై చర్చించనున్నారు. యాదగిరిగుట్ట దేవాలయానికి టీటీడీ తరహా బోర్డును ఏర్పాటు చేసే దిశగా కేబినెట్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది.
జనవరి 4న తెలంగాణ కేబినెట్ సమావేశం
RELATED ARTICLES