పేర్ని నానిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశం
తదుపరి విచారణ సోమవారానికి వాయిదా
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన కేసులో పేర్ని నానిపై మచిలీపట్నం తాలూకా పీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో ఆయనను ఏ6గా పోలీసులు పేర్నొన్నారు. తనపై కేసు నమోదైన కాసేపటికే పేర్ని నాని ఏపీ హైర్టును ఆశ్రయించారు. తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా తనకు రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టులో ఆయన లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారించింది.పేర్ని నాని పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు పేర్ని నానిపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. దీంతో, పేర్ని నానికి స్వల్ప ఊరట లభించినట్టయింది.
పేర్ని నానికి ఏపీ హైకోర్టులో ఊరట
పింఛను లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి కాఫీ తయారు చేసిన చంద్రబాబు..
ఒకటో తేదీకి ఒకరోజు ముందుగానే ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లను అందిస్తోంది. ఈ ఉదయం నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. 63,77,943 మంది లబ్ధిదారులకు పింఛన్ల కోసం రూ. 2,717 కోట్లను విడుదల చేసింది. ఈ ఉదయం నుంచి ఇప్పటి వరకు 90 శాతం మందికి పింఛన్లను పంపిణీ చేశారు. పల్నాడు జిల్లా యలమందలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. శారమ్మ అనే వితంతువు ఇంటికి వెళ్లి పింఛన్ నగదురు అందించారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆమె భర్త చనిపోయాడు. వారి కుటుంబ పరిస్థితి గురించి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఇంటర్ చదువుతున్న శారమ్మ కూతురుకి నీట్ కోచింగ్ ఇప్పించాలని అధికారులకు సూచించారు. సెల్ ఫోన్ షాపు పెట్టుకుంటానన్న ఆమె కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ. లక్ష రుణం, మరో రూ. 2 లక్షలు సబ్సిడీగా ఇప్పించాలని అధికారులను ఆదేశించారు. మరో లబ్ధిదారుడు ఏడుకొండలు ఇంటికి వెళ్లిన చంద్రబాబు… వారి ఇంట్లో స్వయంగా కాఫీ తయారు చేశారు. ఏడుకొండలు కుటుంబ సభ్యులకు కాఫీ అందించారు. ఆ తర్వాత పెన్షన్ అందించారు.
రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు 12 రోజుల రిమాండ్
మచిలీపట్నం సివిల్ సప్లైస్ గోడౌన్ నుంచి పెద్ద ఎత్తున రేషన్ బియ్యం మాయం అయిన కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయింది. ఈ కేసులో ఏ 1గా ఉన్న మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని అర్ధాంగి పేర్ని జయసుధకు న్యాయస్థానంలో ఊరట లభించింది. ఈమెకు న్యాయస్థానం నుంచి ముందస్తు బెయిల్ లభించిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో తదుపరి నిందితులుగా ఉన్న గోడౌన్ మేనేజర్ మానస తేజ, పౌరసరఫరాల శాఖ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, రైస్ మిల్లు యజమాని బొర్రా ఆంజనేయులు, లారీ డ్రైవర్ మంగరాజులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను సోమవారం రాత్రి మచిలీపట్నంలోని స్పెషల్ మొబైల్ జడ్జి ముందు హజరుపర్చగా.. వీరికి న్యాయమూర్తి 12 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నిందితులను పోలీసులు మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు.
ఏపీలో శరవేగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
పల్నాడు జిల్లా యల్లమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం
ఏపీలో ఈరోజు ఉదయం నుంచి శరవేగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది. రాష్ట్రంలోని 63,77,943 మందికి పింఛన్ల పంపిణీ కోసం కూటమి ప్రభుత్వం రూ. 2,717 కోట్లు విడుదల చేసింది. కొత్త సంవత్సరం నేపథ్యంలో ప్రభుత్వం 31వ తేదీనే పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. జనవరి 1వ తేదీకి ముందే పేదల ఇళ్లల్లో పింఛను డబ్బు ఉండాలని ఒక రోజు ముందుగానే పంపిణీ కార్యక్రమం చేపట్టింది సర్కార్. దీనిలో భాగంగా ఇవాళ ఉదయం నుంచి ఇప్పటి వరకు 83.45 శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఉదయం 10 గంటల సమయానికి 53,22,406 మందికి రూ. 2,256 కోట్లు పంపిణీ చేశారు. లబ్దిదారుల ఇళ్లను జియో ట్యాగింగ్ చేసి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు పరిశీస్తున్నారు. ఇళ్ల వద్దే పింఛన్లు ఇస్తున్నారా? లేదా? అనే విషయాన్ని జియో ట్యాగింగ్ ద్వారా అధికారులు తెలుసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి ఇంటి వద్దనే పింఛన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో జియో ట్యాగింగ్ విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు మరికొద్దిసేపట్లో పల్నాడు జిల్లా యల్లమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయ కమిటీ చైర్మన్గా చెన్నం శెట్టి జగదీష్ ప్రసాద్ ఎంపిక…
ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు
శుభాకాంక్షలు తెలియజేసిన ఆలయ ఈవో వెంకటేశులు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం కమిటీకి అడ్ హక్ కమిటీ చైర్మన్గా చెన్నం శెట్టి జగదీష్ ప్రసాద్ ను ఎంపిక చేసినట్లు ఆలయ ఈవో వెంకటేశులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలోని అర్చకులు కొనేరాచార్యులు, మకరంద బాబు, భాను ప్రకాష్ చెన్నం శెట్టి జగదీష్ ప్రసాద్ దంపతులకు ఆలయ ఈవో ఆధ్వర్యంలో స్వాగతం పలికి, వారి పేరిటన ప్రత్యేక అర్చనలు పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ జనవరి 10వ తేదీన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను వైభవంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ప్రతి వ్యక్తి దైవభక్తి కలిగి ఉండాలని, దైవత్వంతోనే కుటుంబంలో సుఖశాంతులు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి: మున్సిపల్ కమిషనర్ రామప్పలనాయుడు
విశాలాంధ్ర. విజయనగరం జిల్లా.రాజాం
రాజాం మున్సిపాలిటీ కమిషనర్ జె.రామప్పలనాయుడు ఆదేశాల మేరకు సానిటరీ ఇన్స్పెక్టర్ చేగుంట హరిప్రసాద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలో ఆదర్శనగర్, మాదిగవీధి సచివాలయాల పరిధిలో సోమవారం నాడు శానిటేషన్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. వార్డులో ఉన్న ప్రతి వీధిలో చెత్తాచెదారాలు తీయించి, బ్లీచింగ్ జల్లించడం చేశారు. గత కొన్ని రోజుల క్రితం కురిసిన వర్షాలు కారణంగా దోమలు చేరి అంటు రోగాలు ప్రబలకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టామని కమిషనర్ తెలిపారు. ప్రతిరోజు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రెండు సచివాలయాలు చొప్పున ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సానిటరీ సెక్రటరీలు, సానిటరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పి జి ఆర్ ఎస్ )కు74 పిటీషన్లు
విశాలాంధ్ర అనంతపురం : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పి జి ఆర్ ఎస్ ) జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు. పోలీస్ కానిస్టేబుళ్ల అభ్యర్థులకు ఈవెంట్స్ జరుగుతుండటంతో జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆ ప్రక్రియను స్వీయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈనేపథ్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు ప్రజల నుండీ పిటీషన్లు స్వీకరించారు. జిల్లా నలమూలల నుండీ విచ్చేసిన ప్రజల నుండీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 74 పిటీషన్లు వచ్చాయి. భార్యాభర్తల గొడవలు, కుటుంబ సమస్యలు, రస్తా వివాదాలు, తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం మహిళా పి.ఎస్ సి.ఐ వెంకటేశులు, తదితరులు పాల్గొన్నారు.
హంద్రీ-నీవా రెండవ దశ కాలువకు కాంక్రీటు వేసే పనుల పై రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు, అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ శివ నారాయణ శర్మ ఎఫ్ ఏ సి కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్ వినతు లు
విశాలాంధ్ర -అనంతపురం : హంద్రీ-నీవా రెండవ దశ కాలువకు కాంక్రీటు వేసే పనుల పై రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు, అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శివ నారాయణ శర్మ ఎఫ్ ఏ సి కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్ సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హంద్రీ-నీవా కాలువ కర్నూలు, ఉమ్మడి అనంతపురము జిల్లాలో కృష్ణాజలాలు ప్రవహిస్తున్నందువల్ల లక్షలాది ఎకరాలకు నీరు అందుతుందన్నారు . ఈ జిల్లాల్లో హంద్రీ-నీవ కాలువ నీటి ద్వారా భూగర్భజలాలు పెరిగి, బోర్లు రీఛార్జ్ అవుతున్నాయి అన్నారు. రైతులు లక్షలాది ఎకరాల్లో పంటలు సాగుచేసుకొని వారి జీవనాన్ని మెరుగుపరచుకొంటున్నారు అని పేర్కొన్నారు. హంద్రీ-నీవా రెండవ దశ (సెకండ్ ఫేజ్) లో కాంక్రీటు కాలువ ఇరువైపులా అడుగు భాగాన కూడా వేయాలని ప్రభుత్వం నిర్ణయించి నిధులు కూడా మంజూరు చేసిందన్నారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు, రైతుసంఘాల నాయకులు తీవ్రమైన ఆందోళనకు గురి అవుతున్నారన్నారు. భవిష్యత్తులో కాలువకు కాంక్రీటు వేస్తే భూగర్భజలాలు పెరగవని తద్వారా బోర్లన్నీ ఎండిపోతాయని పంటలు పండించేందుకు అవకాశం లేకుండా పోతుందని ఆందోళన చెందుతున్నారు అని పేర్కొన్నారు. ఉమ్మడి అనంతపురము జిల్లాలో 3 లక్షల50 వేలు ఎకరాలకు డిస్ట్రిబ్యూటరీల ద్వారా సాగునీరు అందించాల్సి ఉందన్నారు. కానీ ప్రభుత్వం పిల్లకాలువల నిర్మాణం చేపట్ట లేదని కనీసం ఇప్పుడు కాలువలో ప్రవహించే నీటి ద్వారానైనా భూగర్జజలాలు పెరిగి బోర్లు రీఛార్జ్ అవుతాయన్నారు. రైతుల భవిష్యత్తు అంధకారమౌతుంది అని పేర్కొన్నారు. కాంక్రీట్ పనులు జరిగేటప్పుడు రాజకీయ పక్షాలు, రైతుసంఘాలు, మేము అందరము ఏకమై అడ్డుకోవాల్సి వస్తుందన్నారు. రైతుల్లో నెలకొన్నటువంటి భయాందోళనలు తొలగించుటకు రైతుసంఘాల సలహాలు తీసుకొనుటకు ఒక అఖిలపక్ష సమావేశాన్ని మీ ఆధ్వర్యంలో నిర్వహించాలని కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సి. మల్లికార్జున, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి. రామకృష్ణ, ఏఐటియుసి నాయకులు వికే కృష్ణుడు, జి. చిరంజీవి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలి
సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ డిమాండ్
అనంతపురం : అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలి సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ డిమాండ్ చేశారు. సోమవారం వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ ఎస్యుసిఐసి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి క్లాక్ టవర్ గాంధీ విగ్రహం వరకు వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు అభ్యుదయ వాదులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు సిపిఎం నగర కార్యదర్శి రామిరెడ్డి అధ్యక్షత వహించగా సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్, సిపిఎం రాష్ట్ర నాయకులు ఓబుల్ కొండారెడ్డి సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి నాగరాజు, ఎస్యుసిఐసి రాఘవేంద్ర, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు పి. నారాయణస్వామి, సి. మల్లికార్జున ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ మాట్లాడుతూ… అంబేడ్కర్,అంబేడ్కర్,అంబేడ్కర్! అంబేడ్కర్!’ అనడం ఇప్పుడు కొందరికి ఒక ఫ్యాషన్ అయింది. అదే, దేవుడి పేరుని అన్నిసార్లు పలికితే, ఏడు జన్మలవరకూ వాళ్ళకు స్వర్గం దొరుకుతుంది అని డిసెంబరు 17న రాజ్యసభలో హోం మంత్రి అమిత్ షా
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర అమిత్ షాను తక్షణమే కేంద్ర మంత్రివర్గం నుండి భర్తరఫ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు నిరసనలకు పిలుపునివ్వడం జరిగిందన్నారు . రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాల అయిన సందర్భంగా పార్లమెంటులో రాజ్యాంగంపై జరుగుతున్న చర్చలో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అవమానించేలాగా మాట్లాడటం బాధాకరమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్లు కేటాయించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ను ఆ వర్గాలు దేవుడిగానే పరిగణిస్తున్నాయి అన్నారు. అట్టడుగు కులానికి చెందిన ఓ వ్యక్తి అత్యున్నత మేధో శ్రమతో ఉన్నత స్థాయికి వచ్చిన అంబేడ్కరును సాక్షాత్తు ఓ కేంద్ర మంత్రి అవమానించినట్టు దుమారం చెలరేగుతుంటే ఆ వర్గాల ఓట్ల కోసమైనా ఈ ఎన్డీఏ ప్రభుత్వం వైఎస్ఆర్సిపి రెండు పార్టీలు మాట వరసకైనా ఖండించక పోవడం విచారకరమన్నారు. వెనుకబడిన కులాల కోసం వారి కోసం పాటుబడిన సంస్కర్త డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం అన్న దేశ ప్రజలన్న ప్రజాస్వామ్యం అన్న అమిత్ షా కు గౌరవం లేదని, అంబేడ్కర్ ఆశయాలను ఆచరించేది మేమంటే, మేం’ అని పోటీలు పడి చెప్పుకునే ఇరు పక్షాల తీరు రాష్ట్ర ప్రజలకు అంతుబట్టకుండా ఉంది రాజ్యాంగాన్ని నిర్మించడంలో భాగంగానే అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. అమిత్ షాక్ కేంద్ర మంత్రిగా కొనసాగే హక్కు లేదని తక్షణమే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు లింగమయ్య, రమణయ్య, సంతోష్ కుమార్, పద్మావతి, అల్లిపీర సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకట్ నారాయణ, అధ్యక్షులు పార్వతి, ప్రసాద్, సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు ఏల్లుట్ల నారాయణస్వామి, మున్ ఆఫ్, నాగప్ప, ఏఐవైఎఫ్ నగర అధ్యక్ష కార్యదర్శులు ఆనందు, శ్రీనివాస్, నగర నాయకులు రాంబాబు, సురేంద్ర, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
కందుకూరు వాసవి క్లబ్బుల ఆధ్వర్యంలో విద్యా సామాగ్రి అందజేత
విశాలాంధ్ర -వలేటివారిపాలెం : చేయిచేయి కలుపుదాం ఆపదలో ఉన్నవారిని ఆదుకుందాం అంటూ కందుకూరు పట్టణంలోని వాసవిక్లబ్ లెజెండ్స్ వారి ఆధ్వర్యంలో నలదలపూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో చదువుతున్న పేద విద్యార్థులకు నోటు పుస్తకములు అందజేయడం జరిగింది.మరియు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి జీవిత చరిత్ర మీద వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి వెండి డాలర్లు బహుమతిగా అందజేశారు. సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బీరకాయల మాధవరావు మాట్లాడుతూ కందుకూరు వాసవిక్లబ్స్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు వారి విద్యాభివృద్ధికి అవసరమైన వస్తువులు పంపిణీ చేయడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా వాసవి క్లబ్ లెజెండ్స్ ప్రెసిడెంట్ సేవా హ్రుదయ డాక్టర్ రవ్వా శ్రీనివాసులు(ఎల్ ఐ సి ఏజెంట్) మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కూడా విద్యార్థి దశనుండే సేవాభావం కలిగి ఉండాలని బాగా చదువుకొని చదువుకున్న పాఠశాలకు, విద్య నేర్పిన గురువులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోట వెంకటేశ్వర్లు ( వాసవి క్లబ్ జోన్ చైర్ పర్సన్ ), పాఠశాల ఉపాధ్యాయులు,ఎస్ ఎం సీ చైర్మన్ చెరుకూరి చెంచు పున్నయ్య తదితరులు పాల్గొన్నారు.