Saturday, January 25, 2025
Homeఆంధ్రప్రదేశ్పేర్ని నానికి ఏపీ హైకోర్టులో ఊరట

పేర్ని నానికి ఏపీ హైకోర్టులో ఊరట

పేర్ని నానిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశం
తదుపరి విచారణ సోమవారానికి వాయిదా

వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన కేసులో పేర్ని నానిపై మచిలీపట్నం తాలూకా పీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో ఆయనను ఏ6గా పోలీసులు పేర్నొన్నారు. తనపై కేసు నమోదైన కాసేపటికే పేర్ని నాని ఏపీ హైర్టును ఆశ్రయించారు. తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా తనకు రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టులో ఆయన లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారించింది.పేర్ని నాని పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు పేర్ని నానిపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. దీంతో, పేర్ని నానికి స్వల్ప ఊరట లభించినట్టయింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు