Saturday, January 11, 2025
Home Blog Page 23

నూతన సంవత్సరాన్ని మద్యంతో ప్రారంభించవద్దు..

జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఆడిట్ కన్వీనర్ సాకే భాస్కర్ పిలుపు
విశాలాంధ్ర ధర్మవరం ; 2025 నూతన సంవత్సరాన్ని మధ్యముతో ప్రారంభించవద్దని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ఆడిట్ కన్వీనర్ సాకే భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని సూర్య హై స్కూల్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కొత్త సంవత్సరములు సరదాగా ప్రారంభించిన దురాలవాట్ల ప్రభావం చాలా కాలం ఉంటుందని, కావున వాటికి దూరంగా ఉండాలని తెలిపారు. ప్రభుత్వం తెలిపిన మేరకు పాఠశాలల్లో కళాశాలలో గంజాయి, మాదకద్రవ్యాలు అమ్ముతున్నారని మీరు వాటి జోలికి వెళ్ళకూడదని వారు తెలిపారు. పిల్లల్లో నైతిక విలువలను పెంచడానికి ప్రవచన కారులను సలహాదారులుగా కూడా పెట్టుకుంటున్నారని తెలిపారు. తదుపరి జనవిజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు, జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి హరి మాట్లాడుతూ అక్టోబర్ 16న 3,300 మద్యం దుకాణాలను పర్మిషన్ ఇస్తే డిసెంబర్ 9 నాటికి అంటే 55 రోజుల్లో 4, 677 కోట్ల రూపాయలు మద్యం అమ్మకాలు ఆంధ్ర రాష్ట్రంలో జరిగాయన్నరు. ఒకప్పుడు నెల్లూరులో ప్రారంభమైన సారా వ్యతిరేక పోరాట వెనుక జన విజ్ఞాన వేదిక ఉంది అని వారు గుర్తు చేశారు. కానీ ప్రభుత్వాలు కుట్ర మూలంగా అది నిర్వీర్యం అయిపోయిందని బాధను వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం మాదకద్రవ్యాలని వాడకూడదు అంటుందే గానీ మద్యం కూడా అదే కోవలికి వస్తుందన్న విషయాన్ని మర్చిపోవడం దురదృష్టకరమని తెలిపారు. మధ్యము మాదకద్రవ్యాలకు అలవాటు పడకూడదని తెలిపారు. మన కుటుంబంలో ఒకరో ఇద్దరో తాగే వారు ఉంటే, పిల్లల చదువు, ఆహారం పిల్లలలో ఉండే నిరాశ, నిర్లి ప్రతా ఇవన్నీ పరిశీలించాలన్నారు. మద్యం అలవాటు కావడం వలన హత్యలు, గొడవలు, ప్రమాదాలు, మరణాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్న పిల్లల వైద్యులు డాక్టర్ విక్రాంత్, డాక్టర్ సుధాకర్ రావు, జెవివి నాయకుడు బాలగంగాధర నాయక్, రామకృష్ణ, లక్ష్మీనారాయణ బాబు, లక్ష్మీనారాయణ రెడ్డి ,లోకేష్, నరేంద్రబాబు, సురేష్ ,మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

చదువుతోపాటు కరాటే విద్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది..

కరాటే మాస్టర్ ఇనాయత్ భాష
విశాలాంధ్ర ధర్మవరం;; విద్యార్థులందరూ కూడా చదువుతోపాటు కరాటే విద్య కూడా నేర్చుకొని మంచి జీవితాన్ని గడపాలని కరాటే మాస్టర్ ఇనాయత్ భాష తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని కొత్తపేట పురపాలక బాలికల ఉన్నత పాఠశాలలో బెల్ట్ గ్రేడింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాంగల్య సిల్క్స్ జింక పురుషోత్తము, సీనియర్ బ్లాక్ కలర్స్ హశ్విక, అబూబకర్ పాల్గొన్నారు. అనంతరం వీరి చేతులు మీదుగా కరాటే విద్యార్థులకు బెల్టు, ఎల్లో, ఆరెంజ్,గ్రీన్,బ్లూ పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆత్మ రక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతోపాటు కరాటే కూడా నేర్పించాలని తెలిపారు. ఇటువంటి అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

రైలు ప్రయాణికులకు భోజనపు ప్యాకెట్లు పంపిణీ…

శ్రీ సత్య సాయి సేవా సమితి కన్వీనర్ నామా ప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం;; పాడేరు నుంచి పుట్టపర్తికి వస్తున్న 210 మంది సేవాదళ్ మందికి ధర్మవరం రైల్వే స్టేషన్లో శ్రీ సత్య సాయి సేవా సమితి గాంధీనగర్ కన్వీనర్ నామ ప్రసాద్ ఆధ్వర్యంలో భోజనపు ప్యాకెట్లతోపాటు వాటర్ ప్యాకెట్లను కూడా వారు పంపిణీ చేశారు. అనంతరం నామా ప్రసాద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సేవాదాతగా శేషాచారి నిర్వహణ పట్ల వారు కృతజ్ఞతలు తెలియజేశారు. పుట్టపర్తి బాబా ఆశీస్సులతో పుట్టపర్తికి వెళ్లే భక్తాదులకు వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించడం మాకెంతో సంతోషాన్ని ఇస్తుందని తెలిపారు. అనంతరం స్టేషన్ మాస్టర్ నరసింహా నాయుడు మాట్లాడుతూ శ్రీ సత్య సాయి సేవ సమితి వారు చేస్తున్న సేవలు అనన్యమైనవని, అందరికీ స్ఫూర్తినిస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకొని మానవతా విలువలను పెంచాలని తెలిపారు. పేద ప్రజలను ఆదుకోవడంలో లేదా సేవా కార్యక్రమాన్ని అందించడంలో ఉన్న తృప్తి మరెక్కడ లభించదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పదిమంది సమితి సభ్యులు పాల్గొన్నారు.

పేర్ని నాని భార్య జయసుధకు మరోసారి నోటీసులు

పేర్ని నాని భార్య జయసుధ పేరిట గోడౌన్
గోడౌన్ నుంచి బియ్యం మాయం అయినట్టు గుర్తింపు
పెరిగిన షార్టేజికి అదనంగా రూ.1.67 కోట్లు చెల్లించాలని తాజా నోటీసులు

గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో మాజీ మంత్రి పేర్ని నాని అర్ధాంగి జయసుధకు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. తొలుత 185 మెట్రిక్ టన్నుల బియ్యం మాయం అయ్యాయంటూ రూ.1.68 కోట్ల జరిమానా విధించారు. ఆ తర్వాత మరిన్ని బస్తాల బియ్యం మాయమైనట్టు గుర్తించారు. మొత్తమ్మీద గోడౌన్ నుంచి 378 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైనట్టు తేల్చారు. ఈ క్రమంలో, పెరిగిన షార్టేజికి కూడా జరిమానా చెల్లించాలంటూ జయసుధకు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ నోటీసులు జారీ చేశారు. అదనంగా మరో రూ.1.67 కోట్లు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

అగ్ని ప్రమాద కుటుంబాలకు రెడ్ క్రాస్ సొసైటీ చేయూత

విశాలాంధ్ర- సంతకవిటి/రాజాం (విజయనగరం జిల్లా ): సోమవారం ఉదయం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, విజయనగరం,శ్రీకాకుళం జిల్లా శాఖ వారు సిరిపురం గ్రామం, సంతకవిటి మండలం నందు అగ్ని ప్రమాద బాధితులకు రెడ్ క్రాస్ సహాయ సామగ్రి అయిన కిచెన్ సెట్లు, టారపలిన్ షీట్స్, దోమతెరలు, చీరలు, తువ్వాలు, ఉన్ని దుప్పట్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలోని పి జగన్మోహన్ రావు, రెడ్ క్రాస్ రాష్ట్ర వైస్ చైర్మన్, ద్వారా పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో సంతకవిటి మండలం తాసిల్దార్ సత్యం, కొల్ల అప్పలనాయుడు, గట్టి భాను, విజయనగరం రెడ్ క్రాస్ ప్రతినిధులైన కొత్త సాయి ప్రశాంత్ కుమార్, పెంకి చైతన్య కుమార్, గోవిందరాజులు, సత్య రామ్, సుధాకర్ గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు…

బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌

ఈ నెల 4న పుష్ప‌2 ప్రీమియ‌ర్ షో సంద‌ర్భంగా సంధ్య థియేట‌ర్‌లో జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న, న‌టుడు అల్లు అర్జున్ అరెస్ట్ వివాదంపై తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు. ఈరోజు మంగ‌ళిగిరిలో జ‌న‌సేనాని మీడియాతో చిట్‌చాట్‌లో ఆయ‌న‌ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారని ప‌వ‌న్ పేర్కొన్నారు.ఁబ‌న్నీ విష‌యంలో తెర ముందు, వెనుక ఏం జ‌రిగిందో నాకు తెలియ‌దు. ఇలాంటి ఘ‌ట‌న‌ల్లో పోలీసుల‌ను త‌ప్పుప‌ట్ట‌ను. చ‌ట్టం అంద‌రికీ స‌మానమే. పోలీసులు త‌ప్ప‌కుండా భ‌ద్ర‌త గురించి ఆలోచిస్తారు. థియేట‌ర్ స్టాఫ్ అల్లు అర్జున్‌కు ముందు చెప్పి ఉండాల్సింది. ఆయ‌న కూర్చున్నాక చెప్పి తీసుకెళ్లాల్సింది. చెప్పినా ఆయ‌న‌కు ఆ అరుపుల్లో స‌రిగా వినిపించ‌క‌పోవ‌చ్చు. అల్లు అర్జున్ త‌ర‌ఫున బాధిత కుటుంబం వ‌ద్ద‌కు ముందే వెళ్లి ఉండాల్సింది. చిరంజీవి కూడా గ‌తంలో ఫ్యాన్స్‌తో క‌లిసి థియేట‌ర్‌లో సినిమాలు చూసేవారు. కానీ, ఆయ‌న ముసుగు వేసుకుని ఒక్క‌రే థియేట‌ర్‌కు వెళ్లేవారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కింది స్థాయి నుంచి వ‌చ్చిన గొప్ప నాయ‌కుడు. వైసీపీ విధానాల త‌ర‌హాలో అక్క‌డ ఆయ‌న వ్య‌వ‌హ‌రించ‌లేదు. ఆ రాష్ట్రంలో బెనిఫిట్ షోలు, టికెట్ ధ‌ర‌ల పెంపున‌కు అవ‌కాశం ఇచ్చారుఁ అని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పుకొచ్చారు.

బీహార్ లో విద్యార్థులు, పోలీసుల మధ్య గొడవ.. ప్రశాంత్ కిశోర్‌పై కేసు

0

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, ఆయన పార్టీ జన్‌సురాజ్ నేతలు, కొన్ని కోచింగ్ సెంటర్ల యజమానులు, మరో 700 మంది గుర్తుతెలియని ఆందోళనకారులపై బీహార్‌లో కేసు నమోదైంది. అనధికారికంగా గుమికూడటం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం వంటి అభియోగాలు వారిపై నమోదయ్యాయి. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో 70వ కంబైన్డ్ కాంపిటెటివ్ ఎగ్జామ్‌ను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థులు పాట్నాలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గాంధీ మైదాన్ వద్ద సమావేశమైన వారంతా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశం కావాలని భావించారు. విద్యార్థుల ఆందోళనకు ప్రశాంత్ కిశోర్ మద్దతు ప్రకటించారు. వారి మార్చ్‌లో ఆయన కూడా పాల్గొన్నారు. విద్యార్థుల ప్రతినిధులు చీఫ్ సెక్రటరీని కలుస్తారని ప్రకటించారు. కానీ, విద్యార్థులు మాత్రం సీఎంను తప్ప మరెవరినీ కలిసేది లేదని తేల్చి చెప్పారు. దీంతో ఇది పోలీసు చర్యకు దారితీసింది. ఆ తర్వాత అది హింసాత్మకంగా మారింది. పోలీస్ లౌడ్ స్పీకర్లను విరగ్గొట్టిన ఆందోళనకారులు కలెక్టర్లు, పోలీసు అధికారులతో గొడవకు దిగారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కేనన్లు ఉపయోగించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆందోళనకారులు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు, నిరసనకారులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ వాయిదా

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటకు, రేవతి మరణానికి కారణమయ్యారనే కేసులో పోలీసులు హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. కౌంటర్ దాఖలు చేయాలంటూ నాంపల్లి కోర్టు చిక్కడపల్లి పోలీసులకు సూచించింది. ఈ కేసులో పోలీసులు అల్లు అర్జున్ ను ఏ11 నిందితుడిగా చేర్చారు. తాజాగా అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై సోమవారం కోర్టు విచారణ చేపట్టింది. పోలీసులు దాఖలు చేసిన అఫిడవిట్ ను పరిశీలించింది. బెయిల్ కోసం అల్లు అర్జున్ న్యాయవాదులు, ఇవ్వొద్దని పోలీసుల తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలను విన్న కోర్టు.. జనవరి 3న తీర్పు వెలువరిస్తామని చెబుతూ కేసును వాయిదా వేసింది.

గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్.. 43 మంది మృతి

హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఉత్తర గాజాలోని హమాస్ చివరి కమాండ్ కంట్రోల్‌గా భావిస్తున్న కమల్ అద్వాన్‌ ఆసుపత్రిపై నిన్న ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) భీకర దాడులు జరిపింది. అలాగే, జబాలియా, హోనస్, లాహియా ప్రాంతాల్లోనూ దాడులకు దిగింది. ఈ దాడుల్లో మొత్తంగా 43 మంది మృతి చెందారు. ఆసుపత్రిపై జరిగిన దాడిలో 20 మంది హమాస్ ఫైటర్లు హతమయ్యారు. అలాగే, వైద్యులు, వైద్య సిబ్బంది సహా 240 మందిని నిర్బంధించింది. బందీల్లో ఆసుపత్రి డైరెక్టర్ అబూ సాఫియా కూడా ఉన్నారు. బందీల కళ్లకు గంతలు కట్టి ఆసుపత్రి ప్రాంగణంలో కూర్చోబెట్టడంతోపాటు, ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న వారిని పెడరెక్కలు విరిచికట్టి అర్ధనగ్నంగా కూర్చోబెట్టిన వీడియోలు, ఫొటోలను స్థానిక మీడియా ప్రచురించింది. కాగా, హమాస్‌ అతిపెద్ద కమాండ్ కంట్రోల్ ఈ ఆసుపత్రిలోనే ఉందని, అక్కడి నుంచే ఇజ్రాయెల్‌పై దాడులకు వ్యూహరచన చేస్తున్నట్టు ఇజ్రాయెల్ ఆర్మీ అనుమానిస్తోంది. తాజాగా బందీలుగా పట్టుబడిన వారిలో ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న దాడిచేసిన ఉగ్రవాదులు కూడా ఉన్నారని, షకీద్ బెటాలియన్‌కు చెందిన హమాస్ ఫైటర్లు వీరిలో ఎక్కువమంది ఉన్నారని ఐడీఎఫ్ ప్రకటించింది. కాగా, ఆసుపత్రిలోని నిజమైన రోగులను చికిత్స కోసం సురక్షితంగా ఇండోనేషియా ఆసుపత్రికి తరలించినట్టు వివరించింది.

అమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి గ్రహీత జిమ్మీ కార్టర్ మృతి..

అమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి గ్రహీత జిమ్మీ కార్ట‌ర్ (100) క‌న్నుమూశారు. కార్టర్ జార్జియాలోని ప్లెయిన్స్‌లో ఉన్న‌ తన నివాసంలో ఆయ‌న తుదిశ్వాస విడిచినట్లు కార్ట‌ర్‌ ఫౌండేషన్ తెలిపింది. కాగా, ఆయ‌న 1977 నుంచి 1981 వరకు యూఎస్‌కి 39వ అధ్య‌క్షుడిగా ప‌నిచేశారు.ఁనా తండ్రి నాకు మాత్రమే కాదు, శాంతి, మానవ హక్కులు, నిస్వార్థ ప్రేమను విశ్వసించే ప్రతి ఒక్కరికీ హీరోఁ అని ఆయ‌న కుమారుడు చిప్ కార్టర్ తెలిపారు. 1924 అక్టోబ‌ర్ 1న జ‌న్మించిన జిమ్మీ కార్ట‌ర్‌.. ఈ ఏడాది త‌న వందో బ‌ర్త్‌డేను ఘ‌నంగా జ‌రుపుకున్నారు. ఇక ఆయ‌న యూఎస్ అధ్య‌క్షుడిగా ప‌నిచేసి, వందేళ్లు జీవించిన వ్య‌క్తిగానూ నిలిచారు. అధ్య‌క్షుడిగా తన సింగిల్ టర్మ్‌లో మానవ హక్కులు, సామాజిక న్యాయం వంటి అంశాల‌పై కార్టర్ నిబద్ధతతో ఉన్నారు. ఇజ్రాయెల్-ఈజిప్ట్ మధ్య క్యాంప్ డేవిడ్ అకార్డ్స్ అని పిలిచే శాంతి ఒప్పందం ఏర్పడడంలో మధ్యవర్తిత్వం వ‌హించారు. ఇక 1980లో ఆయ‌న ప‌ద‌వీకాలంలో ఇరాన్‌లో బందీగా ఉన్న‌ 52 మంది అమెరికన్లను విడిపించ‌డంలో విఫలయత్నం అనేది మాయనిమచ్చగా మిగిలిపోయింది. అదే ఏడాది నవంబరులో రిపబ్లికన్ పార్టీకి చెందిన‌ రోనాల్డ్ రీగన్ ఎన్నికలలో కార్టర్‌ను ఓడించారు. అధ్యకుడిగా దిగిపోయిన త‌ర్వాత‌ 1982లో ఃకార్టర్ సెంటర్‌ఃను స్థాపించారాయ‌న‌. సామాజిక, ఆర్థిక న్యాయాన్ని ప్రోత్సహించడానికి అవిశ్రాంతంగా శ్ర‌మించిన కార్ట‌ర్‌కు 2002 నోబెల్ శాంతి బహుమతి వ‌రించింది. న్యాయం, ప్రేమ వంటి ప్రాథమిక క్రైస్తవ సిద్ధాంతాలు తన అధ్యక్ష పదవికి పునాదిగా నిలిచాయని ప‌లు సంద‌ర్భాల్లో ఆయ‌న చెప్పారు. నేవీ ఉద్యోగిగా, గ‌వ‌ర్న‌ర్‌గా, అధ్యక్షుడిగా అన్నింటికీ మించి ఓ మాన‌వ‌తావాదిగా ప్రంప‌చానికి జిమ్మీ కార్ట‌ర్ సుప‌రిచితులు. కాగా, ఆయ‌న భార్య రోసలిన్ (96) 2023 నవంబర్ 19న మరణించారు.